అయిదవ సారి అమెరికా ప్రయాణం లో పదనిసలు
సుమారు నెలన్నర కిందట మయ అమ్మాయి విజయలక్ష్మి మయ ఇద్దరికి అమెరికా ప్రయాణం టికెట్లు కొని ఆశ్చర్య పరచింది .అప్పటి నుంచే ప్రయాణం ఏర్పాట్లు మొదలు .అయితే వారం ముందుదాకా ఎవరికీ చెప్పలేదు .శ్రీ హేవలంబి ఉగాది వేడుకలనాడు సరసభారతి సమావేశం లో 26-3-17 న అందరికి తెలియ జేశాం
ఏప్రిల్ 1 శనివారం మేమిద్దరం మయ మనవడు చర ణ్ కారులో బయల్దేరి హైదరాబాద్ కు మధ్యాహ్నంమయ ఆపెద్డబ్బాయి శాస్త్రి ఇంటికి చేరామ్. మర్నాడు నేను మయ అబ్బాయి శాస్త్రి మనవడు కాబ్ లో బయల్దేరి ఓల్డ్ బోయిన్ పల్లి లో మయ అక్కా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకొని బాచుపల్లి లో మయ రెండో అబ్బాయి శర్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉన్న మల్లంపేట శ్రీ ఆంజనేయ స్వామి పక్కనే ఉన్న శివాలయం దర్శించి మియాపూర్ వెళ్ళి మయ అమ్మాయి వాళ్ళ ఫ్లాట్ చూసి శర్మా వాళ్ళ ఇంట్లో భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకొని శాయ్ంత్రం నాలుగుకు బయల్దేరి మల్లాపూర్ చేరామ్ .
5 వ తేదీ బుధవారం శ్రీ రామ నవమి రాత్రి 12 గం లకు శాస్త్రి బాస్ బామ్మర్ది గారి కారులో అందరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరి ,బాగెజ్ అప్పగించి వీల్ ఛైర్ సహాయం తో హాయిగా తెల్లవారుజామున (6) ఎమిరేట్స్ ఫ్లైట్ లో బయల్దేరి దుబాయ్ ఉదయం చేరామ్ .రెండు గంటల తర్వాత న్యూ యార్క్ ఫ్లైట్ లో 14 గంటలు ప్రయాణించి 6 వ తేదీ మధ్యాహ్నం రెండున్నరకు న్యూ యార్క్ చేరామ్ .అప్పటికే విపరీతం గేయా వర్షం పది ఆగింది సాయంత్రం 5 గం ల శార్లెట్ ఫ్ఫ్లైట్ కేన్సిల్ అయింది .ఆదివారం దాకా లేవన్నారు .ఎవరిదో ఫోన్ సహాయంతో మయ అమ్మాయికి ఫోన్ చేసి విషయం చెప్పాం .అప్పటికప్పుడు ఎమిరేట్స్ వాళ్ళతో మాట్లాడి వాషింగ్టన్ డిసీకి టికెట్లు మార్పిస్తే ఆ విమానం రాత్రి 10 గం లకు బయల్దేరాల్సింది నాలుగు గంటలు లేట్ అయి రాత్రి 3 గంటలకు బయల్దేరి నాలుగున్నరకు చేరింది .మా అమ్మాయి మా మనవడు శంకల్ప్ ను తీసుకొని రాత్రి 9 కి బయల్దేరి 600 మైళ్ళు డ్రైవ్ చేసి దీసి లీ తెల్లవారు జామున 3 కు చేరింది .సామాను కలెక్ట్ చేసుకొని అందరం అయిదున్నర కు బయల్దేరామ్ . మలీ 600 మైళ్ళు డ్రైవ్ చేసి అంటే రాను పోను 1200 మైళ్ళు అంటే 1800 కిలో మీటర్లు డ్రైవ్ చేసింది మయ అమ్మాయి .దారిలో మానవాడిని యూనీ వర్సిటీలో దింపి ఇంటికి చేరే సరికి మధ్యాహ్నం రెండు .స్నానాదికాలు పూర్తి చేసి భోజనం చేసే సరికి 3 .కాసేపు రెస్ట్ తీసుకొని టెక్చిన సామానౌు అంతా సర్ది రాత్రి భోజనం 10 అయింది .అంటే న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ లో దాదాపు 12 గంటలు పడి ఉన్నాం .హైదరాబాద్ నుంచి టెక్చుకున్నవి తిన్నాం కనుక సరిపోయింది .లేకపోతే మయ పని ఖాళీ .24 గంటల్లో అమెరికా రావాల్సిన వాళ్ళం 36 గంటలకు చేరామ్ .ఇదొక కొత్త అనుభవం .అయితేనేం రెండు మహానగరాలు న్యూయార్క్ ంవాషింగ్టన్ లను విహంగా వీక్షణం చేసే వీలు కలిగింది రాత్రి వెలుగుల్లొ.అన్దుకె ఇది ´రెండు మహానగరాల కధ ;;అన్నాను -మీ దుర్గాప్రసాద్ -కాంప్ -శార్లెట్ -అమెరికా -10-4-17