´వరద ´లో తేలి (రి )న తేట ఊట -2
8-బైరాగి -తెనాలి రత్నా టాకీసులో బైరాగి ఒకసారి కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారిని విమర్శిస్తూ ´మనమంతా వర్ణాశ్రమ వ్యవస్థను విచ్చేదించాలని చూస్తుంటే త్రిపురనేని ప్రతికూలం లోనూ మరో వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రవేశ పెట్టె ప్రయత్నం చేస్తున్నాడు ´అన్నాడు .బైరాగి మొదటికవిత-´నగరమ్ము న పన్నగమ్ము -నదీ నదమ్ముల విపద్రవమ్ము -చిర పరిచిత పాంధులారా-పతిత జీవ బంధులారా ´ఇది అచ్చు కాలేదు .అతని ´నూతిలో గొంతుకలు ´మంచి పేరు పొందింది .ఎందులోనూ స్థిరంగా ఉండలేక పోయాడు దరిద్రం బాగా పీడించింది .ఢిల్లీలో వరద ను రైలు ఎక్కించమని కోరి ఎక్కుతూ ´రైలు నించి దిగటం సులభం -ఎలా దిగామో తెలియదు -మళ్ళీ ఎక్కడమే బాధ ´అన్నాడు నవ్వుతూ .అదే ఆఖరి నువ్వేమో .
శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ´ప్రబుద్ధాంధ్ర ´పత్రిక నడిపారు .దాని సాలు సరి చందా ఒక్క రూపాయ .కనీసం 10 మందినైనా రోజూ చందా దారులుగా చేర్పించేవారు .దొరక్కపోతే భోజనం మానేసేవారు .
9-కొంపెల్ల జనార్దనరావు -తూ గో జి .గంగలకుర్రు స్వగ్రామం .స్వయం గా ఇంగిలీషు నేర్చాడు ఆంగ్లేయ కాల్పనిక కవులంటే ఇష్టం భారతి లో సబ్ ఎడిటర్ .ఆదర్శ పత్రిక పెట్టాలని ఉబలాటం .తో ´ఉదయిని ´పెట్టి మొదటి సంచిక తెచ్చాడు . గూడవల్లి రామ బ్రహ్మం గారి ´ప్రజామిత్ర ´లో వేలూరి శివరామ శాస్త్రిగారు దాన్ని చెణుకులు పేరుతో తూర్పారబట్టారు . నిరుత్సాహపడ్డాడు కొంచెం కొంపెల్ల ..ఆర్ధిక బాధలేకాక క్షయ రోగం బాధించింది .ఎందరికో ఎన్నో ఉత్తరాలు రాసేవాడు .అదులో కవిత్వమూ చిలికేవాడు –
´సతత నూతన మృదువిలాస ప్రభాత -తావక మనోజ్ఞ లాస్య సందర్శనమున -నాడు భావాలు మధుర గానమ్ము సలిపె -ప్రక్రుతి ఆనంద తన్మ యత్వమున మునిగి ´-ఏది చూసిన యెద గుబాలించు వలపు ´అన్నాడు ..´నేనొక మహాత్ముడిని అవుతున్నాను .ఆ మహత్వానికి నిలిచే రాత రాయలేక పోతున్నాను ´అని బాధ పడ్డాడు .అతని ఆయుష్షు అల్పం ఆశయాలు అనంతం అన్నాడు వరద ..
10- గిరాం మూర్తి -విజయనగరం లో బుర్రా శేషగిరిరావు ´ఆంధ్ర భారతీ తీర్ధ ´సంస్థ స్థాపించారు ఇంగిలీషు లో దీనికి ´ఆంధ్రా రీసెర్చ్ యూని వర్సిటీ ´అని పేరుపెట్టారు ..రాజా విక్రమ దేవా వర్మ ఛాన్సలర్ బుర్రా వైస్ ఛాన్సలర్ .స్నాతకోత్సవం విశాఖ ఏ వి యెన్ కాలేజీ లో జరిపారు . పండితులంతా వచ్చారు .రెండవ రోజు బిరుదు ప్రదానం చేశారు .జాషువాకు ´కవితా విశారద ´ఇచ్చారు .
గిడుగువారు ´చెవికి సీనా రేకు తో చేసిన గొట్టాన్నీ పెట్ట్టు కొని విన్నారు .వరద ´తపో భంగం ´నాటిక రాసి చదివాడు .గిడుగు మెచ్చి ´నేను తలపెట్టిన ఉద్యమం సఫలమైంది .ఈ చిరంజీవి రచన విన్నారుకదా .ఎంత సహజంగా వ్యావహారిక భాషని వాడి చూపించాడు !మీరు చేస్తున్న సన్మానం నా పాండిత్య కృషికి కాక నా ఉద్యమాన్నీ గుర్తించడం వలన చేస్తున్నారు ..గౌరవాన్ని తిరస్కరించటానికే వచ్చాను .కానీ ఈ చిరంజీవి నాటకం చదివాక స్వీ కరించటానికి నిర్ణయించుకున్నాను ´అన్నారు కరతాళ ధ్వనుల మధ్య ..గిడుగుకు ´మహోపాధ్యాయ ´బిరుదు ప్రదానం చేశారు .
అప్పుడు ఇంటర్ లో స్వర్ణ పతకం ఉండేది .దివాకర్ల వెంకటావధానిగారు వరద దాన్ని సాధించాలని ప్రోత్సహించేవారు .కానీ గిడుగుమాట విని వరద వ్యాకరణం రాయనని చెప్పి గిడుగు గారిపై భక్తిని ప్రదర్శించాడు .. పంతులు గారి వాక్పటిమ అమోఘం వెయ్యి మంది జనానికి కూడా వినబడేట్లు అనర్గళంగా ఉపన్య సించేవారు.
ఒక సారివరద గిడుగును ´విశ్వనాధ ,రాయప్రోలు లను వ్యావహారిక భాషలో రాయమని మీరు ఎందుకు చెప్పరు?´అని అడిగితె ఆయన -´వ్యవహారికం అంటే ముందుగా మనం విజ్ఞాన వ్యాప్తికోసం కృషి చేయాలి .కవిత్వం కాదు .ఎందులోనన్నా రాసుకో .నాకు అభ్యంతరం లేదు .చదివేవాళ్ళు చదువుతారు లేకపోతె లేదు .ఇతర సాధనాలకు మాత్రం వ్యావహారికం తప్పదు .సాహిత్యం లో కధలకి నాటకాలకి వ్యావహారికమే ఉండాలి అని నా ఆశయం ´అన్నారు ..
11-సెట్టి లక్ష్మీ నరసింహం – సెట్టి మేస్టారుగా ప్రసిద్ధులు .హైస్కూల్ హెడ్ మాస్టర్ చేసి రిటైరయ్యారు . ఉద్యోగం లో ఉండగానే ´శృంగార పంచకం ´అనే బూతు పద్య సంకలనం తెచ్చారు .కమిటీ వాళ్ళు ఉద్యోగం లోంచి తీసేసే ప్రయత్నం చేస్తుంటే తానె రాజీనామా ఇచ్చారు .లా చదివి లాయర్ అయ్యారు
ఆయన మృచ్ఛకటిక నాటకాన్ని వసంత సేన నవలగా రాశారు . విక్రమ దేవ వర్మకు ముఖ్య స్నేహితులు . శెట్టి మాస్టారు వందలాది చాటువులు శృంగార పద్యాలు రాశారు -అందులో ఒకటి –
´ముప్పది యేండ్లు నాకు ఐదు -మూడవ ఏడుది మాదు చెల్లి -మీ మిప్పుడు పూటకూళ్ళ నుతి -కెక్కినారము దబ్బ కాయాయో -చెప్పుడు నిమ్మ కాయో తమ -చిత్తము వచ్చిన నుండు ,రాత్రికి0 -దప్పక రండ నున్ నవ వితంతు వొకర్తుక బాటసారులన్ ´
12- జాషువా -శ్రీ శ్రీకి జాషువా అంటే పడేదికాదు . ఆయన ఫిరదౌసి గాథా పద్యం తెలుగులో అరుదైనకావ్యం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా