బ్రాహ్మణ రాజాధి రాజు -గౌతమీ పుత్ర శాతకర్ణి -కొన్ని విశేషాలు
మౌర్య చక్ర వర్తి అశోకుని మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని పూరిస్తూ మొదటి ఆంద్ర దేశాన్ని స్థాపించి క్రీ పూ 225 నుంచి క్రీ శ 225 వరకు అంటే 450 ఏళ్ళు అప్రతిహతంగా పరిపాలించిన వారు శాతవాహనులు ఆరు వేల నియోగి బ్రాహ్మణులని అంటారు .ఇందులో ముఖ్యడు గౌతమీపుత్ర శాతకర్ణి క్రీ శ 78 నుండి 102 వరకు పాలించాడు .ఇతనికి ”నివర్తిత చతుర్వర్ణ సంకరస్య ”అంటే నాలుగు వర్ణాలలో సంకారాన్ని నివారించినవాడు అనే బిరుదు ఉండేది అని అతని తల్లి గౌతమీ బాలశ్రీ మహారాష్ట్రలోని నాశిక్ వద్ద వేయించిన శాసనం లో పేర్కొన్నది .ఆయన ”ఆగమానాం నిలయస్య ”అంటే వేదాలకు నిలయమైనవాడు అని ”ఏక బ్రాహ్మణస్య ”అంటే ఏకైక బ్రాహ్మణుడని ”ద్విజకుల వర్ధనుడని ,,”వర్ణాశ్రమ ధర్మ పరిత్రాత”అని బిరుదులు పొందాడు .వీరి వంశం లో పాలించిన రాజులు 30 మంది .వీరినే సాతవాహనులు లేక శాతవాహనులు అంటారు . ఇది వంశనామం .శాతకర్ణి వీరి గోత్రనామం అని ఖండవల్లి లక్ష్మీ రంజనం గారు అన్నారు .అంటే అప్పటికే బ్రాహ్మణ కులం విస్తృతంగా వ్యాపించి ఉందని గ్రహించాలి . ఇదే శాసనం లో బాలశ్రీ తనకొడుకు గౌతమీపుత్ర శాతకర్ణి -నహుషుడు ,నాభాగుడు ,దిలీపుడు ,బలరాముడు ,కేశవుడు ,రాముడు ,అర్జునుడు వంటి పురాణ పురుషులకు దీటైన వాడు అని రాయించింది .అంటే ఆపస్తంబుడికాలం లోనో కొద్దిగా అటూ ఇటూగానో పురాణాలు రచించటం పూర్తయి బాగా ప్రాచుర్యం పొందాయని భావించవచ్చు .అని ఈశాసనం వలన అర్థమౌతోంది .
శ్రీముఖుని కుమారుడే గౌతమీ పుత్ర శాతకర్ణి . మొదటి శాతకర్ణి అంటారు .యితడు ఎన్నెన్నో క్రతువులు చేసినట్లు చారిత్రిక ఆధారాలున్నాయి . అందులో ”అగ్న్యాధేయ ,అ నారంభణీయ ,భగలా దశరాత్ర , గర్గ త్రిరాత్ర ,గవామాయన ,అప్త్యూర్యామ ,అంగిరసాయన ,శత త్రిరాత్ర ,చందోమ పవమాన ,త్రిరాత్రి మొదలైన క్రతువులు ,అశ్వ మేధ ,రాజ సూయ మొదలైన యాగాలు ఉన్నాయి .. ఇతని భార్య నాగానిక నానాఘాట్ లో వేయించిన శాసనం లో తాను ”దీక్ష వ్రత యజ్ఞ సుందరయా ”అంటే దీక్ష వ్రతం లో యజ్ఞం చేసిన సౌందర్య వతిని ”అని ”యజ్ఞ హుత ధూపన సుగంధాయ ”అంటే యజ్ఞ సమయం లో వెలువడిన ధూపాలు వదిలిన సుగంధాలుకల పరిమళ ”అని చెప్పుకున్నది .కనుక ఈ జంట బిడ్డ ”వేదశ్రీ ”సార్ధక నమ ధేయుడు అయ్యాడు ..ఈ వంశం లోనే యజ్ఞశ్రీ శాతకర్ణి సుప్రసిద్ధుడు .అనగా ఆకాలానికే వేదాలు సుప్రసిద్ధం ,యజ్ఞాలు బాగా జరిగేవి అని స్పష్టం .
శాతవాహన రాజ్యపాలన క్రీ పూ 225లోనే ప్రారంభం అయినా ,శాతవాహన శకం గౌతమీపుత్ర శాతకర్ణి విజయరాజ్య పాలన తోనే అంటే క్రీ శ 78 తోనే ప్రారంభమైంది .ప్రాచీన భారత దేశం లో రెండే రెండు శకాలున్నాయి. మొదటిది క్రీ పూ 58 నుండి ప్రారంభమైన విక్రమాదిత్య శకం కాగా రెండవది క్రీ శ 78 నుంచి ప్రారంభమైన శాలివాహన శకం .శాలివాహన శకం బ్రాహ్మణ పరంగా గుర్తింపు పొందిన శకం .సియాం కాంబోడియాలలో శాలివాహన శకం ప్రాచుర్యం లో ఉందని సుప్రసిద్ధ చారిత్రిక పరిశోధకులు శ్రీ బి యెన్ శాస్త్రి గారు ”ఆంధ్రుల సాంఘిక చరిత్రలో ”రాశారు .
కాళిదాసమహాకవి రఘువంశం లో 13 వ సరిగా 34 వ శ్లోకం లో శాతకర్ణి అనే బ్రాహ్మణ ఋషి ప్రస్తావన ఉన్నది .ఆయన సంతతివారే శాతవాహనులై ఉండవచ్చు నాని డా మారేమండ రామా రావు గారు ”సాత వాహన సంచిక ”’లో అభిప్రాయం పడ్డారు .
సరే శాతవాహనులు బ్రాహ్మణులే నో డౌట్ .అయితే ఏ శాఖ ?నియోగులు అన్నది లోకనానుడి .ఐతే అప్పటికి నియోగి వైదీకి భేదాలు ఏర్పడలేదు .ఈ భేదాలు 11-12 శతాబ్దాలలో వచ్చి ఉండచ్చు .
ఆంద్ర దేశాన్ని పాలించిన ఇక్ష్వాకులు కూడా బ్రాహ్మణులే .మొదటి ఇక్ష్వాకు మహా రాజు చాంతమూల మహారాజు మాఠరీ గోత్ర సంభవ అయిన ఒక విప్ర కన్య ను పెళ్లి చేసుకోవటం వలన వీరు బ్రాహ్మణులే అని బి.యెన్ శాస్త్రి గారు తేల్చారు.అతడు అగ్నిష్టోమ యాగం చేశాడు బ్రాహ్మణులే దీన్ని చేస్తారు .క్షత్రియులు చేసేదాన్ని ”జ్యోతిష్టోమయాగం ”అంటారు . ఆంధ్రాను క్రీ శ 270-285 లో ఏలిన బృహత్పలాయనాలు కూడా బ్రాహ్మణులే . వీరి రాజధాని కృష్ణాజిల్లా ఘంటసాల కు 20 మైళ్ళ దూరం లోని కోడూరు . ఆతర్వాత క్రీ శ 300-440 వరకు పాలించిన ఆనంద గోత్రీయులూ బ్రాహ్మణులే .గోత్రనామమే వీరి వంశనామం .. వీరు విశ్వామిత్రుని సంతతికి చెందిన శాలంకాయన వంశీకులు అనే వాదం ఉంది . బృహత్పలాయనులు ఆనంద గోత్రీకులు పల్లవులలాగానే పేరు చివర ”వర్మ ”పెట్టుకున్నారు . కనుక పల్లవులూ బ్రాహ్మణులేనన్నారు .”సాన్ లన్ క్రోన్ ”అనే ఒక శాలంకాయన రాజు బర్మాలోని ఐరావతీ నదీ ప్రాంతాన్ని పాలించినట్లు తెలుస్తోంది .వీరివలననే బర్మాలో బౌద్ధం వ్యాపించింది అని జర్నల్ ఆన్ ఓరియంటల్ రీసెర్చ్ చెబుతోంది .
”భరద్వాజస గోత్రాణాం పల్లవానాం ”అని పల్లవులు చాటుకున్నారు . తాము అశ్వత్ధామ ,మదన అనే అప్సరస కు జన్మించామని ఒక గాథలో తెలిపారు .భరద్వాజుని కుమారుడు ద్రోణుడు ,అతడికొడుకే అశ్వత్ధామ కనుక పల్లవులూ బ్రాహ్మిన్సే .వీరిలో శివ స్కంద వర్మ (క్రీ శ 310-335 )హిరగడ గళ్లి శాసనం లో అగ్నిష్టోమ ,వాజపేయి ,అశ్వమేధ యాగాలు చేసినట్లు తెలియ జేస్తోంది
పల్లవ వంశ స్థాపకుడైన వీర కూర్చ వర్మ పదవ రాజ్య సంవత్సరం లో మైదవోలు లో వేయించిన శాసనం లో తాము బ్రాహ్మణులమని భరద్వాజ గోత్రీకులమని తెలియ జేశాడు . ఇక్కడా ఎక్కడా నియోగి వైదిక శబ్దాలు కాన రాలేదు .
మన దేశం లోనే కాక ఇతర దేశాలనూ బ్రాహ్మణులు రాజ్యమేలారు .బర్మాలో పూనన్ రాజ్యాన్ని పాలించిన మొదటి రాజవంశం ”కౌండిన్య సోమ వంశం ‘గోదావరి ప్రాంతం నుంచి వచ్చిన కౌండిన్యుడు అనే బ్రాహ్మణుడు పుమాన్ లోని సోమా అనే యువతిని పెళ్ళాడి ఈ వంశ స్థాపకు డయ్యాడు అని మారేమండ వారు తెలియ జేశారు .క్రీ శ . 657 లో వియత్నాం దేశం లో రుద్రవర్మ ,క్రీ శ 781 లో కంపూచియా అంటే ఒకప్పటి కాంబోడియా లేక కాంభోజ దేశం పాలించిన ఒకటవ జయవర్మ సైతం బ్రాహ్మణుడే .
ఆచార్య నాగార్జునుడు విదర్భ బ్రాహ్మణుడు. బసవేశ్వరుడు బ్రాహ్మణుడు బ్రహ్మనాయుడి పలనాటి సేనాని అనపోతరాజు బ్రాహ్మణుడు .కాకతీయ రుద్రమ దేవి సేనాని బెండపూడి అన్నయ బొమ్మన్ .కాళిదాసు ,పాణిని చాణక్యుడు ,బాణభట్టు నోబెల్ లారీయేట్లు నేటి రవీంద్రనాధ టాగోర్ ,సివి రామన్ ,ఎస్ చంద్ర శేఖర ,నవలా కారుడు శరత్ ,బంకిం ,సత్యజిత్ రే ,స్వాతంత్ర సమరయోధుడు మంగళ్ పాండే ,రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ రాధా కృష్ణన్ ,గిరి ,వెంకట్రామన్ శంకర్ దయాళ్ శర్మ ప్రణబ్ ముఖర్జీ ,ప్రధానులు నెహ్రు ,మొరార్జీ ,వాజపేయి ,పి వి నరసింహారావు ,ముఖ్యమంత్రులు మమతాబెనర్జీ శీలా దీక్షిత్ మంత్రులు సుష్మాస్వరాజ్ అరుణ్ జైట్లీ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి నందన్ నీలేకని , కిరణ్ మజుందార్ , విజయ్ మాల్యా మొదలైన దిగ్గజాలందరు బ్రాహ్మణులే ..
ఆధారం -అమెరికాలో మా అల్లుడుఅవధాని కొని సేకరించి భద్ర పరచిన డా పాలకోడేటి సత్యనారాయణ రావు గారి రచన – సంక్షిప్త బ్రాహ్మణ చరిత్ర ”
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా