గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
103-ధ్రువ చరిత్ర కావ్య రచయిత -కానరాది విఠలోపాధ్యాయ (1910
కానరాది విఠలోపాధ్యాయ 1910లో కర్ణాటక కానరాది లో సుబ్బలక్ష్మీ అమ్మ సుబ్రహ్మణ్య ఉపాధ్యాయ లకు జన్మించాడు .ఉడిపి సంస్కృతకాలేజిలో శ్రీనివాస భట్టు వద్ద సంప్రదాయ విధానం లో స్సంస్కృతం చదివాడు .ధ్రువ చరిత్రం ,ప్రహ్లాద చంపు ఆయన సంస్కృత రచనలు .కన్నడం లో గోపాల దండకం ,మంగళాష్టకం రాశాడు . ధ్రువ చరిత్రం 15 ఆశ్వాసాల కావ్యం .ధ్రువుడు కుబేరునితో చేసిన వీరోచిత పోరాటాన్ని చక్కగా చిత్రించాడు .ధ్రువుని ప్రజారంజకపాలన అతను నక్షత్రమవ్వటం తో సమాప్తం .కావ్యం ఆధ్యాత్మిక వీర రసకావ్యం .రెండు విషయాలను చక్కగా నిర్వహించాడు .ఋగ్వేదం లోని -ధ్రువాద్యోర్ ధృవ పృధ్వీ ధ్రువ శ్చ పర్వతఇమే -ధృవం విశ్వం ఇదం జగద్ ధ్రువో రాజా విశా మయం -ధ్రువ0 తే రాజా వరుణో ధృవం దే వొ బృహస్పతిహ్ -ధృవంతే ఇంద్రాచా గ్నిశ్చ రాష్ట్రం ధార్యతాం ధృవం ;;అనే మంత్ర భావార్ధాలను కావ్యం లో నిక్షిప్తం చేశాడు .కాళిదాస భవ భూతులలాగానే శ్రీ తో కావ్యారంభం చేశాడు –
‘’శ్రియం త్రయా ప్రతి ప్రజా శాంతికారణం -ధ్రువస్య పదాంబు జయోర్ హృది –
నిధాయ బాఢ0 కరవాని వందనం-గురుస్త్రై లోకస్య భారతి పతేహ్.’’
చక్కని సుభాషితాలు చెప్పాడు -ప్రాక్తేర్ యువ జనస్యహి లుబ్ధా ,గుణవతః సకలం హాయ్ గుణాన్వితం ‘’
భక్తితో ఊగిపోయేట్లు రచన చేశాడు కవి -’’జగన్నిదానం హరిమాదిదేవమ్ -జగన్నివాసం ప్రలయే ప్యనంతం -జగద్గ్రశాన్తం రమయా లసంతం -జగన్నివాన్తారం అహం నమామి ‘’
8 వ ఆశ్వాసం లో చిత్రకావ్య విధానాలన్నీ గుప్పించాడు .ధ్రువుని తీవ్ర తపస్సును దాన్ని భగ్నం చేయటానికి జంతువులు చేసిన విఫలప్రయత్నాలను నిర్జర ఏకాంత అరణ్య సౌందర్యాన్ని బహు చక్కగా వర్ణించాడు .శాంతరసం తోకావ్యం భాసించి చారిత్రాత్మకంగా నిలిచింది .ప్రహ్లాద చంపు ను భక్తి భావ బంధురం గా శార్దూల మాలిని స్రగ్ధర ,వంశస్థ స్వాగత ,వసంతతిలక ,భుజంగ ప్రయాత పృథ్వి ,వియోగిని ,ప్రహర్షిణి శా లిని ,స్రగ్విణి ,హర్షిణి ,,రదోద్ధత మున్నగు ఛందస్సులతో రసప్లా వితం చేశాడు .నిజమైన భక్తుడుగా ఉపాధ్యాయ తనకవిత్వాన్ని దైవానికి అంకితం చేసి ధన్యజీవి అయ్యాడు
104- ధ్వన్యను కరణ కవి-కె నంజుండ ఘనపాఠి -(1910)
కార్ణాటక లోని కూడలి లో 5-8-1910 న నంజుండ జన్మించాడు .లక్ష్మీదేవి కృష్ణ ఘనపాఠి తలిదండ్రులు .సంస్కృత సాహిత్యం అద్వైత వేదాంతం లలో విద్వాన్ అయ్యాడు .వేదాన్ని ఆమూలాగ్రం అధ్యయనం చేశాడు .భద్రావతిలోని భద్ర సంస్కృతకాలేజిలో సంస్కృతం బోధించాడు .శృగేరి ద్వారకా ,కూడలి పీఠాధిపతులచే సన్మానాలు పొందాడు .గౌరీకళ్యాణం భక్త మయూరధ్వజ చరిత్రం అనే రెండుఖండకావ్యాలు సంస్కృతం లో రాశాడు .
గౌరీ కళ్యాణం శతకకావ్యం .దేవతా స్తుతి చేశాక గిరిజా దేవి కళ్యాణ మండపానికి రావటానని గొప్పగా వర్ణించాడు .ధ్వన్యనుకరణ ను అమోఘంగా నిర్వహించాడు –
‘’ఝాన జిహానాత్ కరణ నూపురాద్య -సుమాల్య వస్త్రాభనైర్ ఉపేతా -సుమంగళీ సంస్తుత దివ్య శీ లా – మన్దమ్ శివా ప్రాప వివాహ వేదిం ‘’
నముల్ ప్రత్యయాన్ని అద్భుతంగా ప్రయోగిస్తూ -భోజం భోజం భక్ష్య భోద్యాని నిత్యం -పాయం పాయం పాయసాదిన్ సుపే యన్-దర్శం దర్శం దైవతా శైవ లీలాః -భారం భారం శైలరాజం సాసాంసుహ్’’
జైమిని భారత అశ్వ మే ద పర్వం లోని మయూరధ్వజ చరిత్రలో వేద వేదాంత సాహిత్యాల త్రివేణీ సంగమంగా రచించాడు సంప్రదాయాన్ని చక్కగా పాటించి భారతీయ ఆధ్యాత్మిక ఆముష్మిక విలువలకు ఎత్తిన పతాకగా తీర్చి దిద్దాడు
105-కవి శేఖర హెచ్ .వి నారాయణ శాస్త్రి -(1910)
కర్ణాటక హళ్లి మైసూర్ లో వెంకటరామ నవధ్వని ,తిమ్మామ్ బికల కు 19 10 లోఆగస్టు 15 న నారాయణ శాస్త్రి జన్మించాడు .బెంగళూర్ చామ రాజేంద్ర కాలేజ్ నుంచి సంస్కృత సాహిత్య రత్న పొంది ,అక్కడే లెక్చరర్ అయ్యాడు శ్రీశైల జగద్గురువులచేత కవిశేఖర బిరుదును కర్ణాటక ప్రభుత్వ పురస్కారాన్ని పొందాడు .సంస్కృతం లో శ్రీశైల జగద్గురు చరిత ,శ్రీనాచరమ్మా విజయం,శ్రీ కృష్ణ భిక్ష ,గుణ పరీక్షణం ,,సోదర స్నేహ నాటకాలు ,శ్రీ విద్యారణ్య కదా తరంగిణి కావ్యం ,శ్రీ లక్ష్మీ కేశవ సుప్రభాతం ,కర్ణాటక మహిమ్న స్తోత్రం ,కాశీ విష్వఈశ్వర సుప్రభాతం రాశాడు .
శ్రీ నాచ రమ్మ విజయం -ఇది సాంకేతి బ్రాహ్మణ చరిత్ర .వారి పుట్టుపూర్వత్తరాలు నివాసం మొదలైనవి చారిత్రిక ఆధారంగా రాశాడు .ఇందులోతమిళనాడుకు చెందిన నాచారమ్మ అనే సదాచార మహిళా కద ఉన్నది .ఆమె విజయనగర రాజ్యస్థాపకులైన శ్రీ విద్యారణ్య స్వామి సమ కాలికురాలు . నాచారమ్మ సాక్షాత్తు సరస్వతీ దేవి అవతారం .ఆమె విద్వత్తుకు అసూయ చెందిన ఆనాటి బ్రాహ్మణ పండితులను చూసి తమిళనాడునుండి కర్ణాటకకు భర్తతో సహా వెళ్లి స్థిరపడింది .ఆమెను అక్కడివారందరూ దేవీ సమానంగా భావించి ఆరాధించారు .అనేక సంఘటనలను అత్యంత రమణీయంగా శాస్త్రి వర్ణించి కావ్య గౌరవం కలిగించాడు .
గురు పరీక్షణం -5 అంకాల నాటకం .కట్నాలు కానుకలు ,లంచాలు నిరుద్యోగం లపై రాశాడు .నాలుగవ అంకం లో ఆత్మహత్య ఉంది .హాస్య వ్యంగ్యాలను దట్టించి రాశాడు .చిదంబర అనే జ్యోతిష్యుని వికటంగా చిత్రించాడు .అతని మాటలు – ఘ్రాణం పాతుం నశ్యా దేవ -నశ్యం జాతం ఘ్రాణా దేవ -ఉదరం జాతం కోఫీమ్ -కోఫీ జాతా ఉదరం గన్తుమ్ ‘’సంస్కృతం పై గొప్పనమ్మకం తో నాటకం రాశాడనిపిస్తుంది .విదేశీ సంస్కృతీ వ్యామోహాన్ని బాగా ఎండగట్టిన నాటకం
శ్రీ విద్యారణ్య కథా తరంగిణి 14 తరంగాల కావ్యం .విద్యారణ్యస్వామి బహుముఖీన ప్రతిభకు పట్టం కట్టిన రచన .కధావతరణం కర్ణాటక వర్ణనం మాధవ జననం విజయనగర నిర్మితి మొదలైన అధ్యయాలు న్నాయి తాను చెప్పిన ప్రతివిషయాన్ని అదో సూచికలతో సమర్ధించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా