వీక్లీ అమెరికా -2 (9-4-17 నుండి 16-4-17 వరకు )

వీక్లీ అమెరికా -2   (9-4-17 నుండి 16-4-17 వరకు )

 

9వ తేదీ సోమవారమ్ వరకు ఒకటవ ఎపిసోడ్ లో రాసేశాను . ఆ సోమవారం సాయంత్రం కేరీ నుంచి డా యల్లాప్రగడ రామ మోహనరావు గారు ఫోన్ చేసి మాట్లాడిన వివరాలూ అందులో రాశాను .ఆ తరవాత మాసా చూసెట్స్ లోని ఆస్టిన్ నుంచి శ్రీ డొక్కా రామ భద్ర ఫోన్ చేశారు .దాదాపు నాలుగేళ్లు అయింది ఆయన ఫోన్ లో మాట్లాడి .  అపర అన్న పూర్ణ నిరతాన్న ప్రదాత శ్రీమతి డొక్కా సీతమ్మగారి ముని మనవాడిగారి అబ్బాయి అంటే ఇని మనవడు ఇక్కడ సాఫ్ట్ వేర్ లో పనిచేస్తున్నారు .ఒకసారి ఇద్దరం ఫ్లాష్ బాక్ కి వెళ్లాం .సుమారు నాలుగేళ్లక్రితం చాగంటి వారి ప్రవచనాలతో డొక్కా సీతమ్మగారి వితరణ గురించి మరోమారు విని సరసభారతి తరఫున విద్యార్థులకు ఆమె జీవితం అన్నదానం పై వ్యాసరచన ఏర్పాటు చేసాం . దీన్ని నెట్ ద్వారా ను మా మిత్రుడు శ్రీ కోసూరి ఆదినారాయణ ద్వారా తెలుసుకున్న రాంగారు నాకు ఫోన్ చేసి అభినందించటం  తాము అమెరికాలో ఆమె పై కార్యక్రమాలు చేస్తున్నామని ,కానీ ఆమె పుట్టిన గడ్డ ఆంధ్రాలో మేము చేయటం సంతోషంగా ఉందని మాకేదైనా ఆర్ధిక సాయం కావాలంటే చేస్తామని చెప్పారు .మాకు ఏ రకమైన సాయం వద్దని ఆమె మీద గౌరవం తో చేస్తున్నామని చెప్పాను ఆయన వదలకుండా అయితే పేద విద్యార్ధులకు సీతమ్మగారి పేరుమీద స్కాలర్షిప్ లు ఇద్దాం డబ్బు పంపిస్తాను అనగానే సరే నని మూడు హై స్కూళ్ళ  హెడ్ మాస్టర్ లకు తెలియజేసి పద వ తరగతి లో బాగా చదువుతూ ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్ధులపేర్లను నిష్పక్ష పాతం గా విమర్శలకు అతీతంగా తయారు చేసి పంపని చెప్పాం అలాగే ముగ్గురు అమ్మాయిలూ ముగ్గురు అబ్బాయిలు లను సెలక్ట్ చేసి రామ్ గారు పంపిన 10 వేల  రూపాయలు అందరికి సమానంగా ఇవ్వాలని నిర్ణయించి మరో కార్యక్రమం ఏర్పాటు చేసాం .దీనికి రామ్ గారి తలిదండ్రులు శ్రీ డొక్కా సూర్యనారాయణగారు శ్రీమతి లలితకుమారి ?గారు హైదరాబాద్ నుంచి వచ్చారు .ఆరోజంతా జోరన వాన .సాయంత్రం కాస్త తెరిపిచ్చింది మా ఇంటికి ముందు ఆ దంపతులు వచ్చి కాఫీ త్రాగి అందరం శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం చేరాం . శ్రీ గుంట క వేణు గోపాల రెడ్డి తో పానుగంటివారి హాస్యం పై ప్రసం గింపజేసి ఆతర్వాత శ్రీ డొక్కా దంపతుల చేతులమీదుగా విద్యార్థినీ విద్యార్ధులకు ఒక్కొక్కరికి 1667 రూపాయలు సమానంగా అందజేశాము . ఆ దంపతులకు  రామభద్రగారికి సరసభారతిపుస్తకాలు రెండు సెట్లు శ్రీ సువర్చలాన్జనేయస్వామి ఫోటోజ్ఞాపిక ఇచ్చి ఆలయ మర్యాదలతో సత్కరించాం వారిద్దరూ పరమానందం పొంది వారిమాటలలో సభా ముఖంగా వ్యక్తం చేశారు . ఆ తర్వాత ఒక సారి రామ్ గారు ఫోన్ చేశారు అని   జ్ఞాపకం సరసభారతి మెయిల్స్ అన్నీ వారికి పంపేవాడిని ఒక్కోసారి రిప్లై ఇచ్చేవారు .ఆ తర్వాత గాప్ వచ్చింది . ‘’మహిళా మాణిక్యాలు ‘’పుస్తకం రాసి ప్రచురించినప్పుడు మొదటివ్యాసంగా డొక్కా సీతమ్మగారిదే వేసాం .దీనికి స్పాన్సర్ శ్రీ మైనేని గోపాల కృష్ణగారని వారి శ్రీమతి శ్రీమతి సత్యవతి గారికి అంకితమిచ్చామని దీని ఆవిష్కరణ విజయ వాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి గారు చేశారని ఆ రోజు ప్రపంచ ప్రముఖ ఈల విద్వావంసులు  శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ గారు తమ బృందం తో వచ్చి రెండు గంటల సేపు కచేరీ చేసి గాంధర్వ లోకాలకూ తేలించారని ఒక్క సారి జ్ఞాపకానికి వచ్చింది . బహుశా సరసభారతి తప్ప ఆంద్ర దేశం లో ఏ సాహిత్య సంస్ధ సీతమ్మగారిపై ఏ కార్యక్రమం జరపలేదని ఆ అదృష్టం మాకే దక్కిందని చెప్పుకున్నాం .

ఇప్పడు రామభద్ర గారు ఫోన్ చేసి మాట్లాడినదానిలో మన మెయిల్స్ అన్నీ రెగ్యులర్ గా చదువుతున్నామని చెప్పారు వారి తలిదండ్రులు అట్లా0 టలో తమ్ముడు శ్రీ ఫణి గారి దగ్గర ఉంటున్నారని మేనెలలో ఆస్టిన్ వస్తారని అప్పుడు ‘’మా బడి ‘’కార్యక్రమం నిర్వహిస్తామని అట్లా0టా లో తమ్ముడు తెలుగు కార్యక్రమాలు చేస్తూ ఉంటారని చెప్పి మా ప్రోగ్రామ్ సంగతి అడిగారు .ఇంకా ఏమీ ఆలోచించ లేదని కార్తీ కి శ్రీ రామమోహనరావు గారు వచ్చి తీసుకు వెడతామని ఫోన్ చేశారని చెప్పాను ఆస్టిన్ ఆలోచన ఉంటె స్వాగతం అన్నారు అక్కడే మా ఆదినారాయణ గారి అమ్మాయి మా అమ్మాయి పాలిటెక్నీక్ క్లాస్ మేట ఉన్నది .

మైనేనిగారు పంపిన వరద కవనకుతూహలం వరద కాలం చదివేశాను ..దానిపై ‘’వరదలో తేలి (రి )న తేట ఊట రాయటం ప్రారంభించి 7 ఎపిసోడ్లు మహాదాత దహదం ‘’లక్ష్మీనారాయణపై ఒక ఆర్టికల్ రాశాను .   ..మేనల్లుడు శాస్త్రి మంగళవారం కాలిఫోర్నియా నుంచి ఫోన్ చేయి తాము యూరప్ వెళ్లి ముందురోజు రాత్రికే వచ్చామని మా ప్రయాణం లో  పదనిసలు చదివానని చెప్పాడు . బిజెపి అధ్యక్షుడు అమిత్ షా  యెన్ డి  ఏలోని 32 పార్టీల వారిని సంప్రదించి రాష్ట్ర పటి ఉపరాష్ట్ర పతి  పదవికి ప్రధాని మోడీ ప్రకటించేపేరును ఆమోదించేట్లు చేశాడని వార్త చదివాను . అద్దాడలో   శిష్యురాలైన కోడూరి పావనికి ఫోన్ చేసి మాట్లాడా వాళ్ళు ఒక రెండునెలలో ఉన్నచోటి నుండి మారాల్సి రావచ్చునని చెప్పింది పిల్లలతో మాట్లాడించింది చక్కగా తెలుగులో మాట్లాడారు ఆ అమ్మాయి చదువులోనేకాక సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా చాలా ముందు ఉండేది మంచిపిల్ల .

 రమణ ఎమ్యెల్సీ రాజేంద్ర తో తిరుపతి వెళ్లానని అక్కడ శివప్రసాద్ గారు కనిపించి మాట్లాడారని చెప్పాడు ఒంటిమిట్ట కూడా చూసి ఇంటికి వచ్చాడు . మా కొడాక్ కెమెరా ను దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో తీసేసుకొని విడిగా పాక్ చేసి  డెస్టి నేషన్ లో కలెక్ట్ చేసుకోమని చెప్పారు అంటే షార్లెట్ అనుకొన్నాను న్యూయార్క్ లోనే తీసుకోవాలిట మా బాగేజ్ తో పాటు కనిపించలేదు 12 ఏళ్ళనుండి వాడుతున్నాం కదా పొతే పోయిందని కున్నా .కానీ ఎమిరేట్స్ వాళ్ళు ఫోన్ చేసి న్యూయార్క్ లో కెమెరాఉంద ని డెమరేజ్ కట్టి తీసుకోమని విజ్జికి ఫోన్ చేస్తే మా వాళ్ళు 15 గంటలు ఎయిర్ పోర్ట్ లో పడిఉన్నారు ఎవరూ వాళ్లకు ఆ సంగతి చెప్పలేదుకనుక మీరే మీ ఖర్చులతో   షార్లెట్ కు పంపమని చెప్పింది సరే అన్నారట .

 గురువారం మధ్యాహ్నం చరణ్ కు ఫోన్ చేసాం ఫస్టియర్ రిజల్ట్స్ వచ్చాయి 60 శాతం మార్కులు వచ్చాయని చెప్పాడు . మనగుడి’’ బడ్డీ బుడ్డి ‘’పెళ్లి కుదిరిందని మే 17 న ధార్మిక భవనం లో పెళ్లి అని రమణ మెసేజ్ పెట్టాడు  చాలామంచి వాడు కార్తీకమాసం లో దీపాలంకరణకు బొమ్మలు వేయటం దీపాలు అలంకరించటం గుడిని జాగ్రత్తగా కాపాడటం లో అత్యంత విశ్వాసంగా ఉంటున్నాడు .వాడితోపా టు సహకరించినవారికి అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి .ఇక మిగిలింది శ్రీదేవి ,ఇంకో అమ్మాయి చంద్ర శేఖరరావు గారి అబ్బాయి ఉన్నారు .స్వామి అనుగ్రహంతో  వాళ్ళ పెళ్లిళ్లు కూడా త్వరలో జరగాలి ..రాత్రి భాను చంద్ర సుమన్ ల ఇంటర్వ్యూలను యు ట్యూబ్ లో చూశాం బాగున్నాయి దాపరికం లేకుండా మాట్లాడారు . గురువారం సాయంత్రం స్పీడ్ పోస్ట్ లో ఎమిరేట్స్ వాళ్ళు పంపిన కొడాక్ కెమెరా నాకు క్షేమంగా చేరింది బుజ్జిముండ ఇప్పటికి ఎన్ని వేల  ఫోటోలు తీసిందో లెక్క లేదు ..ఈ విషయాన్ని మైనేనిగారికి ‘’విడ్డూరం ‘’అని రాస్తే జవాబుగా ‘’విడ్డూరాతి విడ్డూరం ‘’అని రాశారు . .రాత్రి సుడిగాడు సినిమా చూసాం మొదట్లో బానే ఉన్నది .

 సాయంత్రం వేలూరి పవన్ భార్య రాధ వచ్చారు . కెమెరా సంగతి చెబితే అందులోని మెమరికార్డ్ లాక్ అయిందని చెప్పి తీసి పని చేసేట్లు చేశాడు .శతకత్రయం వాళ్లకు ఇచ్చాను .అవధాని గారి శిష్యులు వచ్చి ఆయనవద్ద వేదం నేర్చుకున్నారు రాత్రి విజ్జి స్నేహితురాలు గోసుకోండ వారమ్మాయి వచ్చి పలకరించింది .మళ్ళీ ఒక సారి 70 ఏళ్ళు ఫ్లాష్ బాక్ కు వెళ్లి మాట్లాడుకున్నాం మా చిన్నప్పుడు శ్రీ గోసుకోండ వాసుదేవ శాస్త్రిగారు గురజాడ నుంచి వచ్చి వంగలవారి ఎత్తరుగుల ఇంట్లో ఉన్నారు ఆయన భార్య సావిత్రమ్మగారు మా అమ్మకు గురువు అంటే సలహా సంప్ర దింపులు  వగైరా లకు వాళ్ళబ్బాయి రామ చంద్రుడు ఫాక్టరీలో స్టోర్స్  లో పని .నత్తి ఎక్కువ మాకు కాఫీపొడి పంచదార తెచ్చిపెట్టేవాడు .భార్య రుక్మిణమ్మ మాకు అక్క లాంటిది .  ఆతర్వాత శాస్త్రిగారు భార్య పోవటం ,రుక్మిణమ్మకూతుళ్ళు  నాదగ్గర ట్యూషన్ చదవటం మామామయ్యా అని అత్తయ్యా అని మమ్మల్ని ఇద్దర్నీ పిలవటం వాళ్ళపేర్లు భ్రమరాంబ సావిత్రి కావటం గుర్తు చేసుకున్నాం రుక్మిణమ్మ కు ఊరంతా పరిచయం ఎవరికి ఏసాయం చేయాలన్నా చేసేది /చిట్కా వైద్యం బాగా తెలుసు మందు వేస్తె తగ్గి పోవాల్సిందే .

 ఆదివారం శ్రీ హేవిళంబి హనుమజ్జయంతి కార్యక్రమం రాసి రమణకు పంపాను . రెండుపూటలా వాకింగ్ చేస్తున్నాను . రాత్రి రాంగోపాల వర్మ ‘’సత్య -2 ‘’సినిమా చూశా శర్వానంద్ హీరో .చాలాబాగుంది ప్లాట్  విషయం ప్రక్కన పెడితే ట్రీట్ మెంట్ అమోఘం . హీరోయిన్ అందాలు బాగా ఆరబోసింది . అందరిలో ‘’నటన రసాన్ని ‘’ వర్మ  పిండేసి ఇక వాళ్ళదగ్గర ఏమీ మిగలకుండా చేశాడేమోనని పించింది .ప్రతిపాత్రనూ సమర్ధవంతంగా తీర్చిదిద్దాడు .కెమెరా వర్క్ సూపర్బ్ ,మంచి అందమైన లొకేషన్లు . ప్రతి షాట్ పెర్ఫెక్ట్ గా ఉన్నది కనులపండువుగా చూపించాడు .ఎన్నో ఏళ్లయింది వర్మ సినిమా చూసి మనీ మనీ  తర్వాత ఇదేనేమో చూడటం .అగ్ర శ్రేణి దర్శకుడని ఎందుకు అంటారో అర్ధమయింది . అతని  సమర్ధతకు హేట్సాప్ .ఇన్నేళ్లకు ఒక పెర్ఫెక్ట్ సినిమా చూశానన్న సంతృప్తి కలిగింది .

 ఉయ్యూరులో బయల్దేరేటప్పుడు రసాలు తినటం ప్రారంభించి హైదరాబాద్ లోనూ వచ్చేదాకా లాగించి ఇక్కడికి వచ్చాక కూడా మా అమ్మాయి తెస్తున్న నీలాలు తోతాపురి బ్లెండ్ చేసి చిన్న రసం ఆకారం లో సృష్టించిన పళ్ళు తింటున్నాం బాగానే ఉన్నాయి చెట్టులేని చోట–అన్నట్లు .

 మొదట్లో నీళ్లు పూలు లేకుండా పూజ చేసినా కిందటి ఆదివారం నుండి నీటితో సంధ్యావందనం పూలతో పూజ దీపారాధన ,అగరువత్తిల తో పూజ చేస్తున్నాను .రామకోటి రాసి భగవద్గీత చదువుతున్నాను . .ఇంకా లైబ్రరీ దర్శనం కాలేదు ఇవాళ సాయంతరం వెళ్ళవచ్చు .కానీ ఇంట్లో ఉన్న బ్రాహ్మణ సంక్షిప్త చరిత్ర  చదివా . అయిదేళ్లక్రితం మైనేనిగారు పంపిన జార్జ్ ఆర్వెల్ రాసిన యానిమల్ ఫారం  . మామనవళ్ల పాఠ్యగ్రంధం Elie Wieselsఅనే నాజీ దురాగతాలపై చిన్నపుస్తకం ఖాళీ ఉన్నప్పుడు చదువుతున్నా .  మా ఇద్దరి ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి . మా శ్రీమతికి మంచి విశ్రాంతి దొరికింది . నా పని అక్కడా ఇక్కడా ఒకటే తేడా ఏమీ లేదు దినపత్రికలు ఆన్ లైన్ లో చదువుతున్నాను . శ్రీ దేవినేని నే హ్రూ  అకస్మాత్తుగా మరణించినట్లు వార్త చూశాను  తెలుగు దేశం లోకి చేరి కొన్ని నెలలే అయింది . ఈ వారానికి  ఇంతే  .

    మీ-గబ్బిట దుర్గా  ప్రసాద్ -17-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

           


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.