గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
106-ఉన్మత్త కీచకం నాటకం రాసిన -కె .ఎస్ .నాగరాజన్ (1911)
ఆంద్ర ప్రదేశ్ లో సోఢ0 గ్రామంలో1911 ఏప్రిల్ 11 న నాగాంబికా శేషం అయ్యంగార్ లకు నాగరాజన్ జన్మించాడు .సంస్కృత సాహిత్యం లో కాశ్మీర్ పాత్ర ‘’అనే అంశం పై పరిశోధన చేసి డాక్టరేట్ పొందాడు . రాష్ట్ర అకౌంట్ జనరల్ ఆఫీస్ లో అకౌంటంట్ జెనరల్ గా పనిచేశాడు .ఆధునిక సంస్కృత సాహిత్యాన్ని తన అమోఘ రచనలతో సుసంపన్నం చేశాడు .శ్రీ సీతాభ్యుదయం అనే 16 కాండలకావ్యం రామాయణం ఆధారంగా రాశాడు శ్రీ శబరీ విలాసం అనే ఖండకావ్యం ,,ఉన్మత్త కీచకం అనే అయిదుఅంకాల నాటకం ,భారత వైభవం అనే దేశభక్తి గీతం ,గాంధీ విజయం అనే అయిదంకాల నాటకం ,లవలీ పరిణయం నాటకం ,6 అంకాల గురుశాపం ,భారత దేశ భక్తలగురించి ‘’భారతీయ దేశ భక్త విజయం ,రాశాడు . కన్నడం లోసాహిత్య విచార ,సుభాషిత మంజరి భాస్కరాచార్యుని లీలావతి అనువాదం ఃచేశాడు .సుభాషితాలు సుభాషిత వాణిగా ఇంగిలీషు లోకి అనువదించాడు .సాహిత్యాలంకార ,బిరుదు అయోధ్య సంస్కృత అకాడెమి ,కవిభూషణను శ్రీ ద్వారకా శంకరాచార్య ప్రదానం చేశారు .వ్యాఖ్యాన వాచస్పతి అనేది ఆయన పాండితీ ప్రకర్షకు లభించిన విశేష బిరుదు .
ఉన్మత్త కీచకం నాటకం -లో కీచకుడు ఉత్తముడు నిజంగానే ద్రౌపదిని ప్రేమిస్తాడు .భీముడు సహించలేక కీచకవద చేస్తాడు .వాడి చావుకు ద్రౌపది కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది .మొదటి అంకం లో కీచక స్తుతి నాలుగులో విరాట స్తుతి ఉన్నాయి .ఇద్దర్నీ స్తుతిస్తూ చెప్పిన శ్లోకాలు –
‘’జయతు విజయ లక్ష్మీ శీలస్త సర్వాంగ శోభాహ్ -జయతు పశుబలానాం వృద్ధికారా బలి స్టాః – జయతు జయ పతాకాల౦క్రుత స్వీయ మార్గే -జయతు పరబలాంతఃకీచః ఖ్యాత కీర్తిః’’
జయతు నరవరేణ్యసత్యదామ ప్రతిస్టో-జయతు జన సుఖానాం వ్రుద్ధికర్తా దయాళుః-జయతు గుణగణానాం సన్నిదిర్ దీన బందూ -జయతు చిరమిల్యాం మత్స రాజో విరాటః’’
ఈనాటకం లో కీచకుడు విషాదాంత నాయకుడు చనిపోయే ముందు కీచకుడు మాట్లాడిన మాటలు హృదయాన్ని తరుక్కు పోయేట్లు చేస్తాయి కన్నీరు తెప్పించి అతనిపై సానుభూతి కలిగిస్తాయి ….
గురూపదేశం పౌరాణికకద దేవరాజ బహదూర్ ప్రైజ్ పొందింది తనకు ప్రేరణ ఉత్తేజం కలిగించిన కైలాసం కు అంకితమిచ్చాడు నాగరాజన్ ఇందులో హీరో కర్ణుడిని ఉదాత్తంగా చిత్రించాడు నిమ్న కుల సంజాతుడు అయినందువల్ల అణగాతొక్కబద్దాడని చెప్పాడు భాసుడు చెప్పిన .’’చక్రారాప ణీకీర్తిర్ ఇవ గచ్చతి భాగ్యప౦క్తి ః’’అన్నదాన్ని ‘’భాగ్య పంక్తిర్ఇవ సర్వ నరాణాం చంచలేతి విదితా మనులోకే ‘’ అని చెప్పాడు మనిషికి విలువ గుణం బట్టికాని జన్మ బట్టికాదుఅని బోధిస్తూకవి -గుణతాః పూజ్యతే లోకే మానవో న తు జన్మతః -తదాదీన గుణాః సర్వే జన్మ దైవ వశే భవేత్ ‘’దీనికి స్పూర్తి భవభూతి చెప్పిన .’’గుణాః పూజ స్థానం గుణిషు నచ ణ లింగం న వయః ‘’బాణుని వేణీసంహారం లోని కర్ణుని వచనాలు స్పూర్తిగా తీసుకున్నాడునటరాజన్
శ్రీ శబరీ విలాసం లో శబ్దార్ధ సౌందర్యంతో కవితాత్మకంగా రాశాడు . గాంధీ మహిమ లో ‘’ఏకో దేవో నేక రామాభిరామః -రామో బుద్దా కృష్ణా అల్లాఇతీహ -నానారిత్యా దృశ్యతే పూజ్యతేచ ‘’అంటూ ఋగ్వేదం లోని ‘’ఏకం విప్రా బహుద వదంతి ‘’నివివరించి చెప్పాడుకవికి సంస్క్రుతంపై వీరాభిమానం .-అందుకే ;;’’ఏతి సంస్కృతం మృతేతి వదంతి తే ఏవ మృతాః’’అని బల్లగుద్ది సంస్కృతం చనిపోయి౦ది అనే వారు నిజమగానే చనిపోయినవాళ్ళు అన్నాడు
‘’జయతు జయతు ధన్యా భారతాంబా పవిత్రా -జయతుజయతు గాంధీ సత్యమార్గాను వర్తీ -జయతు జయతు యుద్ధం చస్మాద్రియంనవీనం -జయతు జయతు సర్వో భారతీయాః ప్రపంచాః’’అని ఉదాత్తమైన ఉపదేశం చేశాడు సంప్రదాయ పద్ధతిలో సంస్కృతం చదివినవాడుకాకపోయినా ఒక సంస్తా నిర్వాహకుడుగా తీరిక లేకున్నా సంస్కృతం లో సృజనాత్మక రచనలు చేసి విఖ్యాతుదయ్యాడు నాగరాజన్ జాతీయ సమైక్యతా .,సర్వ మానవాభ్యుదయం ధ్యేయంగా పౌరాణిక కధలను ఆధునిక విధానం లో వ్యాఖ్యానించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా