గ్రీకు ప్రజాస్వామ్య ప్రదాత సొలోన్

గ్రీకు ప్రజాస్వామ్య ప్రదాత సొలోన్

 ఎధేన్స్ కవి రాజకీయ వేత్త సోలోన్ క్రీ .పూ 630 లో  సంపన్న  అరిస్టోక్రాటిక్ కుటుంబం లో పుట్టాడు ..తండ్రి ఎక్సేస్ట్నిస్ రాజవంశీకుడు . అతని చిన్నతనం గురించి తెలియదుకాని వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించాడు . సంచార వ్యాపారవేత్త . ఆనాటి సంఘం లో ప్రముఖుడయ్యాడు .ఎధేన్స్ ,మగరా లు యుద్ధ ప్రయత్నాలలో ఎప్పుడూ ఉంటే వారిని కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం చేసి శాంతి కలిగించాడు .దీనిపై కవిత కూడా చెప్పాడు .. ధనవంతులదే రాజకీయ పెత్తనం అయి సామాన్యులకు స్థానం లేకుండా పోయింది  .రాజకీయ సాంఘిక విద్వేషాలకు చెక్ పెట్టమని సొలాన్ ను కోరారు .. అందరికి సమాన న్యాయం కోసం సంస్కరణలు చేయాల్సిన బాధ్యత సోలోన్ పై పెట్టారు .. యెరొపెయాగస్ అనే సంఘ సభ్యుడు డ్రాకో కు వ్రాత రాజ్యా0గేమ్ తయారు చేయమన్నారు . కానీ ఆత ను రాసింది చాలా కఠినంగా ‘’రక్తం తో రాశాడుకాని సిరా తో కాదు ‘’అని పించింది .అప్పుల ఊబినుంచి గట్టెక్కే ఉపాయం ఏదీ అతడు చెప్పక పోవటం తో అంతా  వ్యతిరేకించారు . పేదలు  అప్పుల్లో కూరుకుపోయి చెల్లించలేని స్థితిలో ఎదురు తిరగాల్సి వచ్చింది .ఈ పరిస్థితులలో బాధ్యత సోలోన్ పై పెట్టాల్సి వచ్చింది . కొద్దిమంది చేతుల్లో అధికారం ఉండరాదని ఆత ను నిర్ణయించాడు .తనకున్న మేధస్సును లౌకికజ్ఞానాన్ని అనుభవాన్ని రంగరించి సంస్కరణలకు ఆద్యుడని పించాడు ..

ప్రభుత్వానికి కానీ ప్రయివేట్ వ్యక్తులకు కానీ  అప్పులు చెల్లించవలసిన వారి అప్పులను ముందుగా రద్దు చేశాడు . దీనినే షేకింగ్ ఆఫ్ బర్డెన్స్ అన్నారు ..డ్రోకో  పెట్టిన కఠిన నిబంధనలను సరళీకృతం చేశాడు పగ ,ప్రతీకారం శిక్షలపేరుతో చంపటాలు దౌర్జన్యాలను చేయిక చట్టాన్ని సంప్రదించాలని హితవు చెప్పాడు ..పాత కొత్త మేలుకలయికతో విధానం రూపొందించాడు ..సంవత్సరాదాయం 500 బుషెల్స్ ఉన్నవారు మొదటి తరగతివారుగా 300 నుంచి 500 వరకు ఆదాయం ఉన్నవారికి గుర్రం కొనే సామర్ధ్యం ఉంటుందికనుక నైట్స్ -హిప్పీపస్ అని ,200 ఆదాయం వారు రైతులు అంతకు తక్కువ వార్షికఆదాయం ఉంటె కూలీలు గా విభజన చేశాడు .దీనివలన అంతకు పూర్వం అతి తక్కువగా కానీ అసలు లేక కానీ అవకాశాలు లేనివారికి మంచి అవకాశాలు వచ్చాయి . పైతరగతివాళ్ళు అరిస్టోక్రాట్స్ గా జనం వలన సంపదవలన అయ్యారు ..ఇప్పటిదాకా వీళ్లదే పెత్తనం దీనినే ‘’’’టీమోక్రసి’’అన్నారు అంటే ధనవంతులపాలన . ఈ సంస్కరణాలప్రకారం కింది తరగతి వారు అంటే పొలం పుట్రా  లేనివాళ్లు కూడా ఓటు హక్కు పొందారు .ప్రభుత్వోద్యాగాలలో నియామకం లో వీరి ఓటుకు ప్రాధాన్యత లభించింది అంతకుపూర్వం సంపన్నులు ఎవరి పేరు చెబితే వారే అధికారులు అయ్యేవారు ..ఈ విధంగా సోలోన్ ప్రజాస్వామ్య సంస్కరణలు చేసి బౌల్ అంటే కౌన్సిల్ ను ఏర్పాటు చేశాడు . ఎధేన్స్ లోని నాలుగు ప్రాచీన తె గల నుండి ఒక్కో తెగకు వందమంది చొప్పున లాటరీ పద్ధతిలో దీనిలో సభ్యుల్ని చేశాడు .దీనికి కిందితరగతి వారి వోటుతోపని లేదు .వీరిపదవీకాలం ఒక ఏడాది .ఈ రాజీ ఫార్ములాకు సోలోన్ ఒక ఆర్చ్ టైప్ గా అంటే మోడల్ గా నిలిచాడు .దీనికి ఉన్నతవర్గాలనుండి వ్యతిరేకత వచ్చింది భూమి పంచిఇవ్వలేదని కిందివర్గాలు రుసరుసలాడాయి .అయినా చక్కగా అందరినీ సమాధాన పరచాడు .తరువాత ఎన్నో ఏళ్ళు మధ్యధరా ప్రాంతమైన సైప్రస్ లిడియా అంటే ఏసియా మైనర్ మొదలైన ప్రదేశాలు తిరిగి వచ్చాడు . ఎధేన్స్ కు తిరిగివచ్చేసరికి  శిరసా కు  టి రంట్  గా పిసిస్ట్రాటస్ కీ పూ 561 కి ప్రకటించుకున్నాడు  వృద్ధాప్యం లోనూ సిలోన్ అతనికి సలహాలిచ్చారు  గ్రీసులో మొదటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనతసోలోన్ కి దక్కింది .అతని ‘’టెన్ ఏజెస్ ఇన్ ది లైఫ్ ఆఫ్ మాన్ ‘’కవిత షేక్స్పియర్ రాసిన డది  సెవెన్ ఏజెస్ ఆఫ్ మాన్ ‘’తో సమానంగా ఉందనిపిస్తుంది .సోలోన్ కవితను ఆస్వాదిద్దాం –

‘’బాలుడి  బాల్యం లోనే  పాలపండ్లు పెరిగి ఏడేళ్ళకే  ఊడిపోతాయి

వాడికి పద్నా లు  గేళ్లప్పుడు  పరిణతి పొందుతాడు

మూడవ సప్తకం లో అవయవాలు పెరిగి గడ్డం మీసం తయారై శరీరం మగతనాన్ని చూపిస్తుంది

నాలుగవ సప్తకం లో బలం శక్తితో మగసిరి ఉట్టిపడుతుంది

పంచమ సప్తకం లో యువకుడై పెళ్లి , పిల్లలకై తపన వస్తుంది

ఆరవ సప్తకం లో అతని బుద్ధి వికసించి అన్నిటా మంచి శిక్షణ పొంది ఏదీ అసాధ్యం కాదనిపిస్తుంది

ఏడవ  ఎనిమిదవ సప్తకం లో చక్కగా నిర్దుష్టంగా సంభాషించి మెప్పు పొందుతాడు

తొమ్మిదో సప్తకం లో ఇంకా మంచిపనులు చేస్తాడుకాని అతని ఆలోచనలు మాట తగ్గిపోతాయి

పదవ సప్తకం అంటే డెబ్బై ఏళ్లకు చావు సమీపిస్తోందని పిస్తుందికాని అంతత్వరగా రాదు

ఇన్‌లైన్ చిత్రం 1

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-4-17 – కాంప్-షార్లెట్ -అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.