ట్రోజన్ హార్స్ -నిజమా కల్పనా ?

ట్రోజన్ హార్స్ -నిజమా కల్పనా ?

‘’ట్రాయ్ పట్టణాన్ని వశపరచుకోవటానికి గ్రీకులు పదేళ్ళపాటు యుద్ధం చేసినా, దక్కించుకోలేక పోయారు .అందుకని ఒక ఐడియా జీవితాన్నే మార్చేసినట్లు ఒక ట్రిక్ పన్నారు .ఊహించలేనంత అతిపెద్ద కొయ్య గుర్రం అంటే ట్రోజన్ హార్స్ ను చక్రాలున్న బల్లపై ఎపియస్ అనే వాడితో మూడు రోజుల్లో నిర్మాణం చేయించి అందులో ముఖ్యులైన గ్రీకు సైనికులను దాచి ,ఓడిస్ససా అనే వాడిని ఒక్కడినే బయట ఉంచి ,తామంతా ఓడలలో బయల్దేరి గ్రీసుకు వెళ్ళినట్లు నటించారు . ఓడిస్సియాస్ ఆ గుర్రం ట్రాయ్ కు కానుకగా వదిలి వెళ్ళారని అందరికి చెప్పాడు  . గుర్రం బయట వైపున ‘’గ్రీకులు ఇంటికి తిరిగి వెడుతున్న సందర్భంగా ఎతీనా దేవతకు  కు కానుక ‘’అని రాయి౦చారుకూడా .గ్రీకులు తమ గుడారాలను అన్నిటినీ తగలబెట్టి టేనేడాస్ కు బయల్దేరారు . సినాన్ అనే వాడిని వేగుగా ఉంచి కొయ్య గుర్రం లోని సైనికులు బయటపడగానే సిగ్నల్  లైట్ వెలిగించమని చెప్పారు .వాడు దొంగ ఏడుపులు ఏడుస్తూ తనను ఒక్కడినే వదిలేసి గ్రీకులు పారిపోయారు అని  కొయ్యగుర్రం గ్రీకు దేవతః ఎతీనాకు కానుకగా వదిలి వెళ్ళారని కల్లబొల్లి మాటలు చెప్పి నమ్మించాడు ట్రోజన్లను . . ఇది కపటం మాయోపాయం అని ట్రోజన్ ప్రీస్ట్ ‘’లోకూన్ ‘’నెత్తీ నోరు పెట్టుకొని వారించాడు మూర్ఖంగా తట్రోజన్లు కేరింతలతో గుర్రాన్ని సిటీలోకి లాక్కు వెళ్ళారు .ఎఖీయన్ లలో 32మంది వీరాధివీరులు గురం కడుపులో ,నోటిలో ఇద్దరు గూడచారులుదాక్కుని ఉన్నారు .ముఖ్యులలో ఓడిస్సియాస్ నాయకుడు అకామాస్ ,ఆగా పెనార్  తయారుచేసిన ఈములాస్ మొదలైన వారున్నారు .ఆ రోజు అర్ధ రాత్రి కొయ్య గురం లో దాక్కున్న వారనతా బయటకు వచ్చి నగరం గేట్లు తెరిచి వెళ్ళిపోతున్న గ్రీకు సైనికులకు బీకన్ లైట్ ద్వారా వర్తమానం పంపారు . సిగ్నల్ అందుకున్న సైనికులు  వెంటనే వెనక్కి తిరిగి ట్రాయ్ నగరం ప్రవేశించి భీకర యుద్ధం చేసి ట్రాయ్ నగరాన్ని సమూలంగా నాశనం చేసి పదేళ్ళ యుద్ధానికి స్వస్తి పలికారు ‘’అని మనం గ్రీకు కవి హోమర్ రాసిన ఒడిస్సే  వర్జిల్ రాసిన ‘’ఎనీడ్’’ఆతర్వాతకాలం లో అగస్తస్ రాసిన ‘’లాటిన్ ఎపిక్ పోయెమ్స్ ‘’లో చదివాం .

   ఆతర్వాత చరిత్రకారులు ,పరిశోధకులు అసలు ట్రాయ్ నగరం ఉందా ,ఎక్కడ ఉంది ట్రోజన్ వార్ జరిగిందా ట్రోజన్ హార్స్ ఉన్నదా అనే విషయాలపై విస్తృత పరిశోధనలు చేశారు త్రవ్వకాలు కూడా చాలా లోతుగా చేశారు .ఇందులో అనేకుల పాత్ర ఉన్నది . వాటి సారాంశాన్ని మాత్రమే తెలుసుకొందాం ..అనేక మంది పరిశోధకులు ట్రోజన్ హార్స్ నిజంగా యుద్ధ పరికరమేనని లేక యుద్ధానికి పనికి వచ్చే ఒక యంత్రం అయి ఉండాలని ఖచ్చితంగా అభిప్రాయ పడ్డారు .కాని జర్మన్ విద్యావేత్త ఫ్రిట్జ్ స్క్రాచర్ మేయర్ ‘’ట్రోజన్ హార్స్ ఒక యుద్ధ యంత్రం కాదు .అది హోమర్ మొదలైన కవులు భూకంపానికి ప్రతీకగా చేసిన కల్పన.ప్రోసిడాన్అనే గ్రీకు దేవత భూకంప దేవత .ఆ దేవతను గ్రీకులు గుర్రం ఆకారంగా చిత్రిస్తారు భావిస్తారు ..ఎలాగంటే ఎతీనా దేవతను గుడ్లగూబగా భావించినట్లు పోసిదాన్ దేవతను రధం మీద ఊరేగిస్తుంటే ,సముద్రకెరటాల ఘోష తోపాటు భీకర భయంకర భూకంప శబ్దాలు ఏర్పడుతాయని గ్రీకుల ప్రబల విశ్వాసం .కనుక హోమర్ కవి పోసిదాన్ దేవత భూకంపాన్ని సృష్టించి ట్రాయ్ పట్టణం గోడలను సరి చేయించి ఉండవచ్చు . .దీనినే మెటాఫరికల్ గా హోమర్ ట్రోజన్ హార్స్ అని కల్పన చేశాడు .ఇది నా ఊహ ,సలహా మాత్రమే.దీనిపై నిగ్గు తేల్చాల్సింది భవిష్యత్ కాలమే ‘’అని రాశాడు .

 ట్రోజన్ వార్స్ ఎన్ని జరిగాయి అనేది కూడా చర్చనీయాంశమే .కనీసం నాలుగు  జరిగాయి .క్రీ పూ 15 వ  శతాబ్దం  లో అస్సువా రెబిలియన్  దానితర్వాత  13 బిసి లో విలూసా రాజు  వాల్ము ను పదవి నుంచి తొలగించటం  జరిగిన యుద్ధాలు ,ఆర్కియాలజీ వాళ్ళ లెక్కప్రకారం ట్రాయ్ లేక హిసారిక్ రెండు సార్లు పూర్తిగా 13౦౦ -1000వరకు యుద్ధాలలో ధ్వంసమైంది .అయితే ఇవన్నీ ఖచ్చితంగా చెప్పబడనివే ..ఇంకా వీటిపై త్రవ్వకాలు పరిశోధనలు జరిపి నిగ్గు తేల్చాలి  అంటున్నారు .

 అసలు ట్రాయ్ అనేది ఒకే ఒక పట్టణం కాదు .ఒకదానిపై ఒకటి ఉన్న మొత్తం 8 పట్టణాలు .మన పాత ఢిల్లీ లాగా .అట్టడుగు ట్రాయ్ దాకా ఇంకా త్రవ్వకాలు జరగలేదు ఇప్పటివరకు .

హిత్తీ ప్రిన్స్  హెలెన్ కోసమే పదేళ్ళు ట్రోజన్ యుద్ధాలు జరిగాయి అన్నది సత్యం కాదు అంతర్ సంఘర్షణలు భూకంపాలు వలన కూడా ట్రాయ్ ధ్వంసమైంది .ట్రాయ్ మైసీనియన్ సామ్రాజ్యం ,హిత్తీ సామ్రాజ్యంలకు అంచున ఉండటం వలన వాటి మధ్య నిరంతర పోరాటాలు ట్రాయ్ వశపరచుకోవటానికి జరిగాయి .రెండు వృషభాల  పోరాటం లో మధ్య నలిగిన తోడేలు లేక జిన్కలాగా ఈ రెండు సామ్రాజ్యాల యుద్ధం లో ట్రోజన్లు నలిగి శలభాలై పోయారుపాపం

20 02ఫిబ్రవరిలో జార్జి వాషింగ్టన్ యూని వర్సిటిలో డైరెక్టర్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజెస్ అండ్ సివిలిజేషన్స్ మరియు ఆర్మగార్డెన్త్రవ్వకాల కో డైరెక్టర్ ఎరిక్ హెచ్ క్లినే ఆధ్వర్యంలో రోజుకు ఎనిమిది వందలమంది హాజరైన  అరవైకి పైగా జర్నలిస్ట్ లున్న సదస్సులో పూర్వం ట్రాయ్ పరిసరాల్లో త్రవ్వకాలు చేసిన కోర్ఫ్ మాన్  అండ్ కోల్బ్ లు ట్రాయ్ గురించి చెప్పినది అంతా యదార్ధమే నని అంగీకరించారు .బ్రాంజ్ ఏజ్ లో ట్రాయ్ ద్వంసమై౦ది అన్నది సారాంశం .ఇంతకీ కోర్ఫమాన్ యేమని ఉవాచ ?

‘’ట్రాయ్ 6 హెచ్ కు 7 ఏ కు మధ్య సాంస్కృతిక విచ్చిన్నం జరగలేదు అది అలా నిలబడి ఉంది 7 ఏ ట్రాయ్  ఒక శతాబ్దం పాటు సురక్షితంగా ఉన్నది .ట్రాయ్ 7 ఏ13 ౦౦ బి సి లో  ప్రారంభమై 11 8 0 బి సి దాకా వర్ధిల్లింది .తర్వాత తీవ్ర యుద్ధం లో ధ్వంసమైంది .ట్రాయ్ 7 ఏ లోని కింది సిటి యుద్ధం, అగ్నిప్రమాదాలలో నాశనమైంది త్రవ్వకాలలో కాలిన శవాలు తూటాలు అస్తిపంజరాలు ఉన్నాయి .ట్రాయ్ 7 ఏ లోని కోర్ట్ యార్డ్ హౌస్ ట్రాయ్ 6 హెచ్ నుంచి వచ్చిందే .ఇది ఇప్పుడుపూర్తిగా తగలబడి నాశనమైంది 6 హెచ్ ట్రాయ్ భూకంపం వలన నాశనమైంది త్రవ్వకాలలో 16 ఏళ్ళ అమ్మాయి సగం కాలి  శిదిలాలమధ్య కూరుకు పోయి ఉంది .ట్రాయ్ ను ద్వంస౦  కాకుండా పోరాటం జరిగినట్లు ఆనవాల్లున్నాయి కాని విధివశాత్తు ఓడిపోయారు .

 కాని అడుగు సిటీ ఎలా నాశానమైనదో  తెలియటం లేదు .మైసీనియన్లు వాడిన కంచు బల్లెం మొనలు కనిపించాయి .వీటిని ‘’సీపీపుల్ ‘’కూడా వాడి ఉండవచ్చు ..11 8 ౦ బిసి లో ఇది పూర్తిగా ధ్వంసం అయింది .ఇది సీపీపుల్ వారి రెండవ దాడి కావచ్చు లేక మైసీనియన్ రాజు మూడవ రామ్సే కాలం లో కానూ వచ్చు ‘’అని కోర్ఫ్ మాన్ రాశాడు . కనుక మనం కూడా ఈ త్రవ్వకాలలోంచి బయట పడి ఊపిరి పీల్చుకుందాం .

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2

ఇన్‌లైన్ చిత్రం 3

   మీ -గబ్బిట దుర్గా ప్రసాద్  -20-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.