విదేశీ హాస్యరసం ప్రవహించిన విదానం బెట్టిదనిన –

విదేశీ హాస్యరసం ప్రవహించిన విదానం బెట్టిదనిన –

నవ్వు హాస్యం  చెణుకు వ్యంగ్యం శ్లేష ,రిపార్టీలకు చలించని మనిషి ఉండకపోవచ్చు ఎవరైనా ఉన్నా ఎక్సేప్శనల్ కేసులుగా భావిస్తాం .అసలు నవ్వటానికి కారణాలు చెప్పచ్చుకాని ఎందుకు నవ్వుతామో చెప్పలేము .నవ్వు ‘’కలలు’’వంటిది అన్నారు  .అయిదు వేల ఏళ్ళక్రితం అంటే క్రీ.పూ 29౦౦ లో ప్రాచీన ఈజిప్ట్ లో నవ్వు కు ఒక  చిత్ర లిపి -ఈరోగ్లిఫ్ కనిపించింది .అందులో ఒక వంకర కర్ర దానిపక్కన పాదం ఆకారం తో కాలు ,తర్వాత  పడుకోబెట్టిన వంకరకర్ర పైన అర్ధ చంద్రాకారం దానిప్రక్కన కూర్చున్న మనిషి చిత్రాలున్నాయి ఇదే నవ్వుకు మొదటిసారిగా కనిపించిన ఆధారం అని చెబుతారు .ఈజిప్ట్ గ్రామర్ ,స్క్విగిల్స్ పై దిట్టయైన సర్ అలాన్ గార్దేనర్ తాను హీరోగ్లిఫ్ గీస్తున్నప్పుడల్లా  వాటిని చూసి నవ్వు ఆపుకోలేక పోయానని రాశాడు .ఓల్డ్ టెస్టమెంట్ లో 26నవ్వు సందర్భాలున్నాయి .అయితే వీటివలన నవ్వు ఎందుకు వస్తుందో తెలియదు .ఇందులో  నాటు హాస్యం ఒకటి ఉంది ముసలివారయిన అబ్రహాం సారా  దంపతులకు సంతానం లేదు .ఒక రోజు  ఒక దేవత దేవునిలా ప్రత్యక్షమై అబ్రహాం గుడారం బయట ఉన్నప్పుడు ,భార్య లోపల అతిధులకు వంట చేస్తున్నప్పుడు అబ్రహాం తో ‘’నీభార్య సారా కు కొడుకు పుడతాడు ‘’అని చెప్పింది ఈ మాట లోపల ఉన్న భార్య సారాకు వినిపించింది .ఆమె పగలబడి నవ్వింది .కాటికి కాళ్ళు చాచుకున్న ముదిమి వయసులో  ఆయనతో శృంగారం ఏమిటి సుఖమేమిటి  పిల్లలు యెట్లా పుడతారరు?..ఈ నవ్వు దేవుడికి తనను అవమానించినట్లు అనిపించింది .’’దేవుడికి అసాధ్యం ఉన్నదా ?’’అడిగాడు ఆమె నవ్వు ఆపి ‘’నవ్వేట్లు చేసింది నువ్వే ‘’  ‘’అంది .ఆమె నవ్వుకు ఆమె కారణం చెప్పలేదు .ఊహించాలి .ఆమె మాటల అంతరార్ధం తెలిస్తే మనమూ నవ్వుతాం .ఇదే మొదట రికార్డ్ అయిన’’ డర్టీజోక్ ‘’గా భావించారు .అంటే అబ్రహాం కు అంగం నిక్కబోడుస్తుందా ,దానితో తానూ సుఖించి సంతానం పొందగలనా అని సారా భావం .కనుక నవ్వుకు ఏ చిన్నవిషయమైనా చాలు .కలిసికట్టుగా నవ్వితే కొందరికి బాధ అసూయ కలగవచ్చు .హోమర్ రాసిన ఇల్లియడ్లో పాగాన్ దేవతలు చాలాసార్లు నవ్వారు ..మనుషుల అనుమానానికి భయానికి నవ్వారు వాళ్ళు .చివరికి అందరు మానవుని ప్రమాదానికి నవ్వారు ..అకస్మాత్తుగా జరిగిన మంచి కాని  చెడుకాని నవ్వుకు కారణం అవుతు౦ది .

ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ నిఘంటువులో ‘’లాఫ్టర్ ‘’కు 36రకాల స్పెల్లింగ్ లున్నాయి .కింగ్ ఆర్ధర్ 8 9 7 ,చాసర్ 13 8 5 రకాలుగా చూపారు.షేక్స్పియర్ కు ‘’లాఫ్ఫే ‘’బాగా నచ్చినమాట .ఇది వార్విక్ షైర్ ఉచ్చారణ .పబ్లిక్ హాస్యం లో రెండు విషయాలున్నాయని మాక్స్ బీర్బోం అన్నాడు .అందులో ఒకటి ఇతర దేశీయులను లేక కొత్తవారు కనిపిస్తే చూసి నవ్వటంఅవతల వాడు బాధలో ఉంటె వికృతంగా కనిపిస్తే నవ్వటం .విశ్లేషిస్తే హాస్యం జోక్ కాదు .కలహారి ఎడారిలోని ఆదిమ బుష్ మెన్ లు  నవ్వు పుట్టించారని ఆర్ధర్ కోస్ట్లర్ అన్నాడు. ఆయన ‘’నవ్వు విలాసవంతమైన అసంకల్పిత ప్రతిక్రియ ‘’అన్నాడు .’’ఇన్ లాఫ్టర్ ‘’రాసిన ఫ్రెంచ్ జ్యూయిష్ ఫిలాసఫర్ హెన్రి బెర్గ్ సన్’’మన పొరుగువాడి తప్పులు సరిచేయటానికి నవ్వుతాం .దీనినే ‘’the collective punishment of society on the un sociable individual ‘’అన్నాడు .జీన్ పాల్ సాత్రే తనకు చూపు తక్కువ కావట వికారంగా చదువు ఆటలలో ముందు ఉండలేక పోవటం తో అందరూ తనను చూసి నవ్వకుండా అందర్నీ తానే నవ్వుల్లో ముంచి మంచి చేసుకోనేవాడినని చెప్పాడు .’’laughter is a respiratory gymnastics ‘’అన్నాడు స్పెన్సర్ .కోస్ట్లర్ ‘’it is trigger releasing ,detonating vast amounts of stored emotions ,derived from various often un conscious sources

  కొందరు మహానుభావులు ఎదుటివారు నవ్వితే భరించలేరు సాహిన్చాలేరుకూడా . .శ్లేష హోమర్ కంటే పూర్వమే ఉన్నా కారల్ మార్క్స్ దాన్ని ‘’ఇంటలేక్త్యువల్ లంపెన్ ప్రోలటేరియట్ ‘’అన్నాడు .ఎంగెల్స్ నవ్వుతుంటే సహిన్చేవాడుకాడు . మిల్టన్ హాస్య  కవి కాకపోయినా సందర్భాను సారం ‘’పన్ బన్’’ బాగానే తయారు చేసేవాడు .ఇక ఫ్రాయిడ్ మహాశయుడు పన్ కు ఫుల్ స్టాప్  పెట్తమని క్రిస్మస్ సీజన్ ను ‘’ది ఆల్క హాలిడేస్ ‘’అన్నాడు .జీవిత మాధుర్యానికి పన్ త్రిపాద స్టాండ్ లో ఒకపాదం అయితే మిగిలినవి పొగ తాగటం జిమ్ తాగటం అన్నాడు   లాంబ్. మాక్స్ ఈస్ట్ మాన్ ‘’అది పన్ కాదు అది ప్యునిటివ్ ఎక్క్స్పేడి షన్ -అంటే దండించే సాహస యాత్ర ‘’అన్నాడు .కొందరు దేన్నీ చూసినా నవ్వలేరు .విలియం హొగార్హ ,,హోరేస్ వాల్ పోల్ నవ్వులు పూయించారు ..లార్డ్ చాటన్ ‘’పెద్దమనుషుల నవ్వు కు అనుమతి లేదు నవ్వు కింది తరగతి వాళ్ళ పని  ‘’అని తేల్చాడు .ప్రైడ్ అండ్ ప్రిజుడిస్  సెన్స్ అండ్ సేన్సిబిలిటిరచనలలో జేన్ ఆస్టిన్ ‘’మనిషి నవ్వే తీరును బట్టి అతడు మర్యాద సొసైటీకి తగినవాడా లేక ఆమె నిజంగా స్త్రీయేనా తేల్చి చెప్పవచ్చు అంటుంది .

 యార్క్ షైర్ లో లాగానే జెర్మని లో కూడా ఒక స్థాయి లేక రాంక్ ఉన్నవారికి నవ్వే అవకాశం లేదు మహాకవి గోదే నవ్వగా ఎవరూ చూడలేదట . అక్కడ స్త్రీలు నవ్వితే మగాళ్ళు పళ్ళు బిగ బెట్టుకొని స్టిఫ్ గా కూచోవాలట 19  వ శతాబ్ది ప్రష్యన్ స్త్రాట జిస్ట్  ఫీల్డ్ మార్షల్ హేల్మత్ జీవితం లో రెండే రెండు సార్లు ఇకిలించాడట .మొదటిసారిగా ఒక ఫ్రెంచ్ కోట ఆక్రమించటం దుర్భేద్యం అని  చెప్పినప్పుడు రెండోసారి అత్తగారు చనిపోయిందని వార్త చెప్పినప్పుడు నవ్వాడట .ఇంతకంటే మరో ఘన పదార్ధం సారీ ఘనుడు 12 వ శతాబ్దానికి చెందినా ఫిలాసఫర్ మార్టిన్ హీ డిగ్గర్ జీవితం లో ఒకే ఒక్కసారి నవ్వాడట .ఒకసారి మొదటి ప్రపంచ యుద్దానికి ముందు ‘’డెత్ హెడ్ ‘’కు ఆఫీసర్ అయిన హస్సార్స్ కెప్టెన్ రాంక్ కన్నా కిందివారిని సమావేశపరచి ‘’కుర్ర ఆఫీసర్లూ  మీరు పదే పడదే పగలబడి నవ్వటం నాకస్సలు ఇష్టం లేదు .ఇకిలి౦పు లు సకిలింపులు నాకు నచ్చవు .కావల్రి ఆఫీసర్లు అందరూ ఒకే విధంగా ‘’హా హా ‘’అని మూడు సార్లు మాత్రమే నవ్వాలి అంతకంటే నవ్వితే ఊర్కోను  దీన్ని బాగా ప్రాక్టీస్ చెయ్యండి ‘’అని బెదిరించాదట .బయటికొచ్చి బహుశా అంతా పగలబడి హహ్హహ్హా అని నవ్వుకొన్నారేమో ?స్టీఫెన్ స్పెండర్ రచయిత’’జర్మన్ జోకులన్నీ స్పాంటేనియస్ గా వచ్చినవే ‘’అని రాశాడు .

 అకస్మాత్తుగా వచ్చిన నవ్వు చాలమంచిది ఆరోగ్యకరమైనది ,ఆహ్వానించదగినది ..గ్రీకు సిటి స్టేట్ లన్నీ ‘’హిత్తీస్’’నుంచి హాస్యాన్ని సరఫరా చేసుకున్నాయి .వారి క్లౌన్లు ,టంబ్లర్లు ,ఆక్రోబాట్స్ రంగస్థలంపై హాస్యం కురిపించారు .డార్క్ ఏజ్ నుంచి క్రిస్టియన్ యూరప్ ఆవిర్భవించింది .ఆంగ్లో సాక్సన్ రాజులకోలువులో కోర్ట్ జస్టర్ర్ లు విదూషకులు ఉండేవారు .ఇంగ్లాండ్ లో ట్యూడర్ రాజ్యపాలన14 8 5 నుంచి 15 47వరకు వృత్తిపరమైన వినోదం వచ్చింది. అది ‘’ఆఫీస్ ఆఫ్ దిరేవేల్స్ ‘’వద్ద ఉండేది .7 వ హెన్రి రాజు చాలాకాలం ప్రవాసం లో ఉండిబాస్వర్త్ లో జరిపిన తీవ్ర యుద్ధం లో గెలిచి సింహాసనం దక్కించుకున్నాడు .ఈయన నవ్వేకాదు చిరునవ్వుకూడా చిలికించిన పాపాన్ని ఎవరూ చూడలేదట .దేశ ఆర్ధిక స్థితిని పటిష్టం చేయటం పైనే ద్రుష్టి పెట్టాడట .రాయల్ అకౌంట్స్ స్వయం గా చూసి ప్రతిపేజీ మీదా సంతకం చేసేవాడట ..కాని వినోదం అవసరమని గ్రహించి 14 90 లో రావేల్స్ ఆఫీస్ ఏర్పరచి రాజాస్థానం లో వినోదానికి అవకాశం కల్పించాడు .దీని పర్మినెంట్ ఆఫీసర్ గా రిచార్డ్ గిబ్సన్ అనే నటుడు ,ప్రొడ్యూసర్ మేనేజర్ ఉండేవాడు .అతని గ్రూప్ ను’’ కింగ్ ప్లేయర్స్ ‘’అనే వారు .ఇతనే హెన్రి 8 కి మొదటి చార్లెస్ కు శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించాడు .15 20 లో జరిగిన ఈ సంఘటనను ‘’ఫీల్డ్ ఆఫ్ దిక్లాత్ ఆఫ్ గోల్డ్ ‘’గా పిలువబడింది మహా ఆడంబరం గా మందుగుండు సామగ్రి తాగినంత తిన్ననత పదార్ధాలు వినోదాలు ,ఒక ఫౌంటెన్ నుంచి వైన్ నిరంతర ధారగా కారేట్లు చేశారు గిల్బర్ట్ జీవితం లో ఒకసారైనా నవ్వటం ఎవరూ చూడలేదని అంటారు కాని అందర్నీ నవ్వించటం అతని నేర్పు .

 షేక్స్పియర్ చాలా జోకులు నవ్వులు పండించాడు .అతని నవ్వు ‘’హా హా హో హో హో ఓహ్ లా ‘’రకం .జాన్ లిస్టన్ త్ట్రాజేడి నటుడు గిట్టక కామెడికి మారి ఎక్కువ డబ్బు సంపాదించాడు .విలియం డాడ్ గొప్ప హాస్యనటుడు ..హిట్లర్ ఆర్కిటెక్చర్ పై అందరికంటే ఎక్కువ ద్దృష్టిపెట్టాడు .కలలో కూడా నవ్వి ఉండడు .కల్లోల పరిస్తుతులనుంచి హాస్యం పుడుతుంది.డికెన్స్  నోయెల్ కవార్డ్ చార్లీ చాప్లిన్ లాత్రేస్ ,షా , చేష్టర్తాన్, వుడ్ హౌస్ మొదలైన వారంతా పుష్కలం గా హాస్యం పండించినవారే .జేమ్స్ దర్బార్  హాస్యం ఉడికిస్తే బెంజమిన్ ఫ్రాన్క్లిన్ అమెరికా హాస్యం సృష్టించి పూయించి పండించి ఫలి౦ప జేశాడు .అతని  ఆల్మ నాక్  లో ఎన్నో ఒకే వాక్య హాస్యగులికలున్నాయి .నేటివ్ హాస్యానికి ఆద్యుడు ఫ్రాన్క్లిన్ .  డికెన్స్ పాత్ర మిసె గామ్ప్ ‘’what a blessed thing it is -living in a wale -to be contented ‘’అంటే కొరడా దెబ్బల మధ్య సంతృప్తి పడటం .ఇలా విదేశే హాస్యం ఈజిప్ట్ లో ప్రారంభమై అన్ని చోట్లా ప్రవహించి ముంచి తేల్చింది .

       ఇన్‌లైన్ చిత్రం 1

 మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -20-4-17- కాంప్-షార్లెట్ -అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.