గ్రీకు నావికాదళ పిత -డెమిస్టో క్లెస్

గ్రీకు నావికాదళ పిత -డెమిస్టో క్లెస్

 

ఏథెన్ ల స్వర్ణయుగం డేమిస్తో క్లెస్ తో ప్రారంభమైంది .గొప్ప రాజకీయ వేత్త మహా నావికుడు దార్శనికుడు ,యుద్ధ తంత్ర నిపుణుడు అయిన ఇతను క్రీ పూ 48 0లో పెర్షియన్ సైన్యాన్ని చిత్తుచిత్తుగా సలామిస్  యుద్ధం లో ఓడించాడు . ఆతర్వాత గ్రీకుల ప్రాభవం పెరిక్లేస్ వలన వచ్చింది .ఇక ఫిలిప్ అలేక్సాందర్ ల సంగతి చెప్పనక్కర్లేదు. విశ్వ విజేత అనిపించాడు అలెక్సాండర్.దీనికంతటికీ ప్రాధమిక శక్తి నిచ్చినవాడు డేమిస్తో క్లెస్ .మహా మేధావిగా ,అకస్మాత్తుగా విరుచుకు పడే ఆపత్సమయం లో బుర్ర పాదరసం లా పనిచేసి ప్రతిక్రియ చేసే పోరాట యోధుడిగా పేరు పొందాడు .ఎమర్జెన్సీ నిఎదుర్కోగల సర్వ సత్టాక ఉన్నవాడు .

 క్రీ .పూ .5 23లో ఎదేన్స్ ఈశాన్య భాగం లో ఆటిక్ జిల్లాలో పుట్టాడు .తండ్రిపేరు నియోక్లాస్ అంటే కొత్త కీర్తి .అరిస్టాక్రాట్ భూస్వామి. తల్లి విదేశీయురాలు .ఉత్తర గ్రీసులో త్రేస్ లో పుట్టింది .ఆమె ఏసియా మైనర్ కు చెందిందని బానిస అని కూడా అంటారు .చిన్నప్పటి నుంచి విజయాలు సాధించి పేరు ప్రఖ్యాతులు పొందాలని భావించాడు .ఆల్కేమేయోనిడ్స్ కు చెందిన ఆర్చిప్ ను పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఆమె అయిదుగురు కొడుకుల్ని ముగ్గురు కూతుళ్ళను కని పెట్టింది ..అప్పటికే సోలోన్ తెచ్చిన సంస్కరణలవలన సామాన్యులు కూడా పార్టీ సభ్యులయ్యారు కింది మధ్య తరగతి వారి చేతుల్లో అధికారం ఉన్నా అరిస్తోక్రాట్ ల ప్రభావం జాస్తీగానే ఉండేది .

 క్రమగా ఎదీనియన్ రాజకీయాలలో ప్రవేశించి సమాజం లో గుర్తింపు పొందాడు .493బి సి లో మొదటిసారిగా ఆర్కాన్ కు  చీఫ్ ఆర్కాన్ గా ఎన్నికై రాజకీయ అరంగేట్రం చేశాడు .ఇక వెనకడుగు వేయలేదు .ముందుకే మును ముందుకే దూకాడు ..ఈ యువ  వయసులోనే తాను   విజన్ ఉన్న నాయకుడిగా అందరికి అభిప్రాయం కలిగించాడు .ఎదేన్స్ కు అయిదు మైళ్ళ దూరం లో శతాబ్దాలకాలం ఫెలేరాన్ బే చాలా బహిరంగం గా ఉండి పోయింది .నైరుతి భాగాన ఉన్న ఇదే ఓడ రేవు .దూర  దృష్టికల డేమిస్తో   ప్రక్రుతి సిద్ధమైన మూడు పైరేయాస్ హార్బర్ లుబాగా వృద్ధి చెందితే  శత్రువులనుంచి రక్షణకు చాలా అనుకూలంగా ఉంటుందని భావించాడు .ఇది అయితే బోర్లించిన కప్పు ఆకారంగా ఉండి శత్రువులను నివారించటం సులభం అన్నాడు .అందుకని హార్బర్ ను అంతటినీ ఒక సన్న గోడ ద్వారా అప్పర్ సిటీకి అనుసంధానం చేస్తే వాల్లెడ్ కారిడార్ ఏర్పడి దేశానికి ప్రమాదం ఉండదని నచ్చ చెప్పాడు  కాని ఇది కొంతకాలానికి కాని సాధ్యపడలేదు .ఆతను ముఖ్య ఆర్కాన్ కాక ముందు ఒక ఏడాది క్రితం పెర్షియన్ నౌకలు గ్రీకు సంయుక్త బలగాలను విపరీతంగా ధ్వంసం చేసి అలీనియా మిలీతియాస్ పట్టణాలను లోబరచుకున్నాయి .దీనితో గ్రీకు ప్రపంచం ఒక్కసారిగా హడలి పోయింది .క్రీ పూ 4 90లో మళ్ళీ పర్షియన్లు గ్రీకు భూభాగం మరాతాన్ పై దాడి చేసి న సందర్భం లో సేనాని మిలిటి యేడ్స్ వెనక ఉన్న పది మంది ఎన్నికైన జనరల్స్ లో ఒక్కడుగానే ఉన్నాడు .ఇంకా రంగ ప్రవేశం చేయలేదు .

 ఎదీనియన్లు తమను మోసం చేసినందుకు శిక్షగా మిల్టాడియాస్ ను తొలగించి చాలా మందిపై ప్రయోగాలు చేశారు కాని చివరికి దెమిస్తో క్లెస్ అందరి దృష్టినీ ఆకర్షించి ఒకరిద్దరు ప్రముఖులలో ఒకడుగా నిలిచాడు .పగ్గాలు అప్పగించారు మరాతాన్ యుద్ధం లో దెబ్బతిన్న పర్షియా మళ్ళీ కాలుదువ్వదని అందరూ నమ్మారు కాని దాని స్వభావం తెలిసిన ఇతను మాత్రం సమయం చూసి మళ్ళీ పర్షియా విరుచుకు పడుతుంది అన్నాడు .చివరికి అందరూ అంగీకరించి తక్షణ కర్తవ్యం ఏమిటో చెప్పమన్నారు .ఎదేన్స్ నౌకా బలగాన్ని బాగా అభి వుద్ది చేసుకోవటం ఒక్కటే మార్గమని చెప్పాడు .కొత్త యుద్ధ నౌకలు నిర్మించటం నావికులకు శిక్షణ నివ్వటం తప్పనిసరి అన్నారు .అతని ది ఎదేన్స్ ది అదృష్టం బాగుండి  వెండి గనులు బంగారు గుడ్లు పెట్టి విపరీతమైన  లాభాలు చేకూర్చాయి .ప్రజలందరూ దాన్ని తలాకాస్తా పంచుకుందాం అన్నారు

.అలా పంచుకొంటే ఒక్కోమనిషికి10 ద్రాక్మాలు వస్తాయి .అందుకని దెమిస్తో క్లెస్ వాళ్లకు నచ్చ చెప్పి ఆ మొత్తం లాభాలను రెండు వందల యుద్ధ నౌకలు నిర్మించటానికి ఉపయోగిద్దామని చెప్పాడు .’’వాకే’’ అన్నారు అంతా .

 అనుక్న్న నౌకానిర్మాణం కోటల పతిస్టీకరణ సైనిక శిక్షణ ,పైరేశియాస్ వద్ద హార్బర్ విస్తరణ జరిగిపోయాయి .చివరికి ఆతను చెప్పినట్లే పర్షియా సైన్యం ఏసియా మైనర్ మీదుగా హీల్స్ పాయింట్ కు 4 8 ౦ లో రెండులక్షల సైనికులు ,80౦ మంది ఆశ్విక దళం  వెయ్యి దాకా యుద్ధ నౌకలతో ఒక లక్షా యాభై వేలమంది నావికులతో దాడికి దిగింది .మొత్తం 3 లక్షలమంది అని చరిత్రకారులు రాశారు . అవాక్కయింది దేశం .డెల్ఫీ వెళ్లి దేవతను సలహా అడగాలని వెళ్ళారు .అక్కడ ప్రీస్ట్ ద్వారా దేవత ‘’ఒక్క కర్ర గోడ మాత్రమె మిమ్మల్ని  మీ సంతానాన్ని రక్షిస్తుంది’’ అని జోశ్యం చెప్పింది .కొయ్య గోడ అంటే ఏమిటో అని అందరూ బుర్రలు బద్దలు కొట్టుకున్నారు .తలోమాటా చెప్పారు అప్పుడు దెమిస్తో క్లెస్ అది తాము నిర్మించిన కొత్త నౌకాదళం అని చెప్పాడు అప్పుడు అందరూ నమ్మారు .అంతేకాదు ‘’స్త్రీ కొడుకులు సలామిస్ లో చనిపోతారు అని చెప్పినదానికి  పర్షియన్లు  ఓడిపోవటం ఖాయం అనీ అర్ధం వివరించి చెప్పాడు .

 పర్షియన్ దాడి ప్రమాదానికి అప్రమత్తమైన దెమిస్తో క్లెస్ చుట్టుప్రక్కలున్న సిటీ స్టేట్ ల నాయకులతో సంభాషణ జరిపి దక్షిణ గ్రీసును ఎలాకాపాడుకోవాలో చర్చించాడు .జేర్జియాస్ నాయకత్వం లోని అతి పెద్ద యుద్ధ సమూహాలను భూసైనికులతో పోరాటం అచ్చి రాదనీ ,పెర్షియన్ యుద్ధ నౌకల ద్వంసమే తక్షణ కర్తవ్యమని తెలియ బర్చాడు ,వారి నౌకాబలగం క్షీణిస్తే ఆహార పదార్ధాల  సరఫరా  రాక  లోన్గిపోవటమో పారిపోవటమో చేస్తారు అని యుద్ధ వ్యూహం వివరించాడు

 క్రీ పూ 48 ౦ సెప్టెంబర్ లో పర్షియా సైన్యం గ్రీసు దక్షిణభాగం పై దాడి చేసి ఎదేన్స్ వైపుకు దూసుకు వస్తోంది .వెంటనే మెరుపులా ఆలోచనవచ్చి ఎదేన్స్ ను తక్షణం ఖాళీ చేయవలసిందిగా ఎమర్జెన్సీ ఆర్డర్ జారీచేశాడు .సిటీ గార్డియన్ ఎతేనా కు అప్పగించి పిల్లలు స్త్రీలను పెలో పోనిసియాన్ తీరానికి ,ముసలి వారు బానిసలను సలామిస్ కు పంపించాడు  .మిలిటరీ లో చేరే వయసున్నవారందరినీ తమ రెండు వందల యుద్ధ నౌకలకు కాపలాగా ఉంచాడు .సెప్టెంబర్ 17 న పర్షియన్ సైన్యం ఎదేన్స్ చేరి అంతా  నిర్మానుష్యఎడారిగా ఉండటం చూసి కేరింతలతో రాజు జేర్జేస్ కు జేజేలు కొట్టి ఇంతసులభంగా ఎదేన్స్ స్వాదీనమయినదుకు తమలో తాము అభినందిన్చుకొన్నారు ..ఇదే సమయం లో గ్రీకు జనరల్స్ యుద్ధ నౌకల పనిలో పడ్డారు .ఇదే దేమిస్తోక్లేస్ కు బంగారు గడియలు అయ్యాయి .మిగిలిన జనరల్స్ అట్టికా ఖాళీ చేసి కోరింత్ వద్ద ఇస్తమస్ లో రక్షణ కవచంగా ఉన్నారు .కాని ఆతను ‘’గ్రీసును రక్షించాలి అంటే సలామిస్ దగ్గరే యుద్ధం చేయాలి కాదని అక్కడ చేస్తే బహిరంగ  సముద్రం లో యుద్దమై మనకు విజయాన్ని ఇవ్వదు మనం నారో వాటర్స్ లో యుద్ధం చేస్తేనే అంత పెద్ద సైన్యాన్ని గెలవగలం అన్నాడు .కొందరు సైన్యాధికారులు గోణుక్కున్నా తీవ్రం గా హెచ్చరించి తానూ చెప్పినట్లే చేయాలని   లేక పొతే ఇటలీ వెళ్లి అక్కడ మన నౌకాదళం లేక  నెత్తిమీద చెంగేసు చెంగేసుకోవాలి’’అని   హుకం జారీ చేశాడు

సెప్టెంబర్ 20 జేర్జేస్ నారో వాటర్ ఉన్న సలామిస్ జలసందిలోనే యుద్ధం చేయమని  ఆజ్న ఇచ్చాడు .దగ్గర ఉన్న ఎత్తైన కొండ ఎక్కి యుద్ధం చూస్తున్నాడు ..తమకున్న 600యుద్ధనౌకలతో మొత్తం35 0కూడా లేని  గ్రీకు యుద్ధనౌకలు  ఏమాత్రం నిలవరించలేవని గర్వపడ్డాడు .పెర్షియన్ సైన్యం ఆ ఇరుకు బొక్కలో యుద్ధం చేయలేక బోనులో పడ్డ ఎలుకల్లా అగ్నిలో పడ్డ మిడతల్లా గ్రీకు యుద్ధ నౌకలకు ఆహుతయ్యారు ..దొరికిన వాళ్ళను దొరికినట్లు ఊచకోత కోసింది గ్రీకు సైన్యం  దీనితో గ్రీకును విజయ తీరాలకు చేర్చి పెర్షియన్ సైన్యం పలాయనం చిత్తగించేట్లు చేశాడు .

 గ్రీకు విజయానికి దేమి క్లెస్ యుద్ధ నీతి మాత్రమె ఫలించింది .ఈ విజయానికి పొంగిపోక స్పార్టా ఎప్పుడూ పక్కలో బల్లెం గానే ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు నమ్మలేదు చాలామంది . స్పార్టా తో చర్చలు జరుపుతున్నట్లు నటించి ఆదేశం వెళ్లి మరింత లోతుగా చర్చలు చేసి తిరిగి వచ్చేసరికి యువకులంతా నడుం బిగించి యుద్ధంలో దెబ్బతిన్న గోడలన్నీ మళ్ళీ కట్టారు .ఈ విధంగా ఎదేన్స్ నావికా దళాన్ని వృద్ధి చేసి ఎదురు లేని నావికా దళం గా నిలబెట్టి నావికా దళ పిత అనిపించుకొన్నాడు దెమిస్తో క్లెస్ .క్రీ పూ 4 7 0 కి ఎదేన్స్ సామ్రాజ్యం బలంగా రూపు దాల్చింది .స్పార్తాకు బద్ధ విరోదిగానే ఉన్నాడు .మిల్తి యేడ్స్ కొడుకు సైమన్ అధికారం పొందాడు .ఇతన్ని దేశ బహిష్కరణ చేశాడు .పర్షియా రాజుతో లోపాయకారీగా ఒప్పందం చేసుకోన్నాడని అభి యోగం మోపారు .అతని దురదృష్టం వలన ఎక్కువమంది ప్రజలు దాన్ని నమ్మారు .ఇక్కడినుంచి అనేక ప్రాంతాలు తిరుగుతూ వలస జీవితం అనుభవించాడు మహా వీరుడు   పర్షియన్ రాజు  జేర్జేస్ ను కలిస్తే ఆయన ఆర్కాన్ చీఫ్ ను చేశాడు .ఏసియా మైనర్ లో ఉన్న మాగ్నేసియా సిటీ గవర్నర్ పదవి ఇచ్చాడు

ఇన్‌లైన్ చిత్రం 1 ఇన్‌లైన్ చిత్రం 2

ఇన్‌లైన్ చిత్రం 3

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.