వీక్లీ అమెరికా -3 -1

 వీక్లీ అమెరికా -3 -1

                                     17-4-17-నుంచి 23-4-17 వరకు

వీక్లీ అమెరికా -2 సోమవారం రాసి మధ్యాహ్నం 3-15 కు మా పెద్ద మనవాడు శ్రీకేత్ తోకలిసి మేక్లిన్ బర్గ్ లైబ్రరీకి వెళ్లాను ఈ సరస్వతీ ఆలయాన్ని అయిదేళ్ళక్రితం చాలా పుస్తకాలు చదివి సార్ధకం చేసుకొన్నాను మళ్ళీ అక్కిడికి  రావటం గొప్ప అనుభూతి నిచ్చింది .మనవడు 5 గం నుంచి 7 వరకు     వాలంటరి చేశాడు  .అలా చేయాలట దానికి మార్కులు ఉంటాయట . .నేను అక్కడ మూడు పుస్తకాలు చదివాను . 10 పుస్తకాలు ఇంటికి తెచ్చుకున్నాను .అక్కడ చదివినవాటిలో మొదటిది -The art of x ray reading .దీన్ని ‘’రాయ్ పీటర్ క్లార్క్ ‘’రాశాడు .అందులో నాకు నచ్చిన వాక్యాలు మీ కోసం -డాంటే రాసిన’’ ఇంఫెర్నో ‘’లో బతికిఉన్నవారు చనిపోయిన వారూ ఒక ఫెర్రి లో అధోలోకానికి ప్రయాణం చేస్తారని దానినే హేడ్స్లేలేక హెల్ నరకం అంటారని ఫెర్రి నడిపే చరోన్ అనే వాడికి డబ్బు ముట్ట జెబితే బోటులో స్టైక్స్ రివర్ మీదుగా లివింగ్ అండ్ డేడ్ వరల్డ్ లను విభజించే చోటుకు తీసుకు  వెడతాడని ఉందట .గ్రీసు దేశం లో పూర్వం చచ్చిన వాడి నోరు ,కళ్ళ మీద నాణాలు పెట్టేవారని ,ఇది వాడి ఇతరలోక ప్రయాణానికి దారిఖర్చు ఆధునిక భాషలో’’ కాబ్ ఫేర్’ ఫర్ దిజర్నీ ఇంటూది నెక్స్ట్ వరల్డ్ ‘’.ఇంగ్లాండ్ లో కింగ్  ఆర్ధర్ చనిపోతే శవాన్ని బోటు లో పెట్టి ధనకనక వస్తు వాహనాలు అందులో ఉంచి దాన్ని పాతి పెట్టటమో ,సముద్రం లో వదిలేయటమో చేశారట .అది ఆయనకు ఉత్తమ లోకానికి దారి చూపిస్తుందని నమ్మకం .

 ఇందులోనే రచయిత రచయిత రచన ఎలా ఉండాలో మంచి సూచనలు చేశాడు అందరికీ శిరో దార్యమే అవి .-’’Your writing should move -move -move from concrete to abstract ,from specific to general ,from idea to example -from information to anecdote ,from expression to dialogue .A good book is a  perpetual motion machine that drives a story and lets the reader feel the energy ‘’అంటాడు .వ్లాదిమిర్ నేబోకోవ్ రాసిన ‘’లోలిత ‘’నవల లో నేబోకో ‘’సాహిత్యాన్ని ముక్కలు ముక్కలుగా చేసి లాగి పీకి  అరచేతిలో నలిపి పెట్టి పీల్చాలి .నోటిలో వేసి నవలాలి అప్పుడే దాని ప్రయోజనం తెలిసి ,దానిలో చెప్పబడిన అసలు విషయం అవగతమై ,ఇందాక మనం చేసిన ముక్కలు చక్కలూ మన మైండ్ లో    అతుక్కుపోయి  రక్తగాతమై అనుభూతినీ ఆనందాన్ని ఇస్తుంది ‘’అన్నాడు .రాయ్ పీటర్ ‘’Lolita is a kind of love letter to English Literature ‘’అని గొప్ప నిర్వచనమిచ్చాడు .

 రెండవ పుస్తకం ‘’గ్రేటెస్ట్ ఆధర్స్ ఆఫ్ క్లాసిక్ హిట్ ‘’పుస్తకం Jeanne Nagle రాసింది .ఇందులో కొన్ని విషయాలున్నాయి .ఫ్లాబర్ట్ – మేడం బోవరి నవల రాసేటప్పుడు సరైన నిర్దుష్టమైన పదం కోసం రోజులతరబడి ఆలోచిన్చేవాడట .దీనినే అతనిమాటల్లోనే తెలుసుకొంటే బాగుంటుంది -My head reels and throat aches with chasting after ,slogging over ,delving into ,,turning around ,,gropping after and bellowing in a hundredth thousand different ways,a sentence that i have at last finished ‘’అని చెప్పాడు మనవాళ్ళు చెప్పిన కృత్యాద్యవస్థ అంటే ఇదే .

మూడవ పుస్తకం -Flights and wisdom of the ancient -అలేక్సాన్ద్రియా పబ్లిషింగ్ వాళ్ళది చిన్నపుస్తకం లో అనేక అద్భుత విషయాలు చదివాను .

పూర్వం మాయన్ ఖగోళ వేత్తలు సంవత్సరానికి 365.24 20 రోజులు అని చెప్పారు .ఇవాల్టి రోజుల్లో మనం 36 5 .24 25 గా రోజులుగా వాడుతున్నాం .హుండూరస్ శిధిలాలో ఈ కాలెండర్ రాతి మీద చెక్కబడి ఉంది దానిపై 1 day July 26 736 అని ఉందట .

 5 వేల ఏళ్ళ క్రితం సుమేరియాలో ఉన్నత వంశస్తులకే హై స్కూల్స్ ఉండేవట .బాటని జువాలజీ  మినరాలజి  జాగ్రఫీ లెక్కలు వగైరా నేర్పెవారట .రెండు వేల ఏళ్ళక్రితం బాగ్దాద్ లో ఒక మట్టి కుండలో సోల్దరింగ్ కాపర్ షీట్ ట్యూబ్ ఇక అంగుళం వెడల్పు ,నాలుగు అంగుళాల పొడవుతో కనిపించింది .అడుగున కాపర్ డిస్క్ ఇనుప కాడది ఉన్నాయి .దీనిలో యాసిడ్ పోస్తే బాటరీలాగా పని చేసేదట  .కైరో మ్యూజియం లో క్రీ పూ 200 లో  విమానం తయారు చేసిన దాఖలాలున్నాయట .బాబిలోనియాలో 5 వేల ఏళ్ళ క్రితం కాపర్ గ్రాఫైట్ ఎయిరోప్లేన్ భాగాలు కంపించాయట.40 8 బి సి లో గ్రీకు గణిత వేత్త  ఆర్బైటిస్ ఒక కర్ర పావురం తయారు చేసి ఎగిరెట్లు చేశాడట .లోపల ఇంజను రెక్కలు అన్నీ కూర్చాడట .ఇప్పుడు వాడుకం లో ఉన్న జెట్ ప్లేన్ ప్రిన్సిపల్ కూడా అతనే కానీ పెట్టాడని అంటారు .అతనిని ‘’సైంటిస్ట్ హీరో ‘’అని పిలిచేవారట .రొటేటింగ్ బాయిలర్ ను రొటేటింగ్ రిపల్సివ్ ఎఫెక్ట్ కోసం తయారు చేశాడు .ఇదే జెట్ ఫ్లేం కు దారి చూపింది ..చైనా రాజు షాన్ తలిదండ్రులు తనను చంపబోతున్నట్లు తెలుసుకొని ఒక విమానం తయారు చేయించుకొని పారిపోయినట్లు ఉన్నది .దీని తర్వాత 450 ఏళ్ళకు చింగ్ తాంగ్ చక్రవర్తి తన ఇంజనీర్ కి కుంగ్ -షి తో ఫ్లైయింగ్ చారియట్ తయారు చేయించాడు .నాలుగవ శతాబ్దం లో కో హాంగ్  ఫ్లైయింగ్ కార్ ఉన్నట్లు రాశాడు దాన్ని ఎద్దు చర్మం తో తయారు చేశారట .దానికి రొటేటింగ్ బ్లేడ్స్ ఇప్పటి హెలికాప్టర్ కు లాగా ఉన్నాయట .’

‘’సమర సూత్ర ధార’’గ్రంధం లో పక్షిలాగా ఎగిరేదాన్ని విమానం అని అన్నారు .మధ్య ప్రాచ్యం లో కంబోడియాలోని బొగోటా లో  ‘’gold trinket resting in a blank vault ‘’కనిపించిందట .ఇది సుమారు 6-9 శతాబ్దానికి చెందింది .రెండు అంగుళాలు పొడవు రెక్కలు అసాధారణ తోక ఒక పురుగు ఆకారం దాదాపు గబ్బిల౦  లాగా ఉండే ఎగిరే విమానం కనిపించింది ఇదే డెల్టా వి౦గ్ తో ఉన్న స్తీప్ క్లైమ్బింగ్ జెట్  ఫైటర్ నిర్మాణానికి దారి చూపి ఉంటుంది .

                  రాత్రి 7 గంటలకు మా అమ్మాయి డ్యూటీ నుంచి వచ్చి నన్ను మనవడిని ఇంటికి తీసుకు వచ్చింది .మిగిలిన విషయాలు ఇప్పుడు రాస్తాను

 మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి రాత్రి 7-30 వరకు సూర్యుడు కనిపిస్తూనే ఉన్నాడు .పెద్దగా ఆశ్చర్యపడలేదు .కారణం మొదటి సారి అమెరికా టెక్సాస్ రాష్ట్రం హూస్టన్ కు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు రాత్రి 10- 30 కు కూడా సూర్యుడు కనిపించేవాడు జూన్ నెలలో .ఈ సోమవారు డా.ఇన్నయ్యగారు ఫోన్ చేసిమాట్లాడారు ఆత్మీయంగా .

 నేను లైబ్రరి నుంచి తెచ్చుకున్న 10 పుస్తకాలలో మొదటిది ‘’ది ట్రోజన్ వార్ ‘’చదవటం ప్రారంభించా దానిపై ఒక వ్యాసమూ రాశాను .రాత్రి బ్రహ్మానందం కోవై సరళ కామెడీ బిట్స్ చూశాం .సాయంత్రం గంగాధరరావు గారికి ఫోన్ చేసిమాట్లాడా .మంగళవారం ఖాజీ పాలెం లో ఉన్న నా బి ఎడ్ మిత్రుడు వారణాసి సుబ్బయ్యకు ఫోన్ చేసిమాట్లాడితే పరమ సంతోషించాడు వాళ్ళ మనవాడి ఉపనయనం అనీ మా ఇద్దరి ఆశీర్వాదాలు  .కావాలని కోరాడు .తరువాత మన గుడి బడ్డీ బుడ్డి తో ,తూములూరు వారితో ,మనవడు చరణ్ తో ,వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రిగారితో ఫోన్ చేసి మాట్లాడాను శాస్త్రిగారు మహదానందం తెలియబరచారు .రెండవ పుస్తకం ‘’లీడర్స్ ఆఫ్ ది ఎంసేంట్ గ్రీస్ ‘’చదవటం మొదలెట్టా .దీనిపై కూడా మూడు ఆర్టికల్స్ రాశాను .ఈల వీజిల్ పూర్తీ చేసి ,లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్ స్వామి రాం రాసిన పెద్ద పుస్తకం ప్రారంభించి ఈ వారం లో సగం చదివా .మధ్యలోపాల్ జాన్సన్ రాసిన  ‘’హ్యూమరిస్ట్స్ –చదివి విదేశీ హాస్యం పై రాశా . మాస్టర్స్ పుస్తకం ఆధారం గా ఏతి పై నేతి నేతి యేతి ,హిమాలయ గుహాంతర ఆశ్రమ జీవనం రాశా .గ్రీస్ పుస్తకం ఆధారం గా గ్రీకు ప్రజాస్వామ్య పిత సోలోన్ ,నావికా దళపిత  స్టేమో క్లెస్ రాశా . ఇందులో ఇంకో విషయం ఒకటి బాగా నచ్చింది -మాసిడోనియన్లు గొప్ప భవన నిర్మాతలు అని ,వారు కట్టిన సిటడేల్స్-కోట ప్రహరీ గోడలు -10 అడుగుల మందంగా కట్టారని ,రాజ సమాధులను తేనెటీగ గూడు లాగా నిర్మించారని ,వాటి నిర్మాణానికి  12 0 టన్నుల బరువున్న కొండ రాళ్ళను ఉపయోగించారని తెలిసి కొంత ఆశ్చర్య పోయాను కాని మన బృహదీశ్వరాలయ నిర్మాణమూ ఇంత బృహత్తరమైనదే  నని సంతోషించాను .గ్రీకు దేశం లో బ్రాంజ్ ఏజ్ ను ‘’ఏజ్ ఆఫ్ హీరోస్ ‘’అంటారని తెలిసింది .12 00 బి సి లో ట్రాయ్ నగర పతనం తర్వాత ఎజియన్ ప్రాంతం ,తూర్పు భాగాలు అనుకోని సంక్షోభం లో పడిబలమైన  మైసీనియన్ సామ్రాజ్యం నాశానమై ఆర్ధిక రాజకీయ సంస్క్షోభాలలో కూరుకు పోయి ఆటవిక జాతులు సిటీలను ఆక్రమించి మైసీనియన్ నాగరకత  కనుమరుగైంది . .ఈ  11 ౦౦ -8 ౦౦ బి సి సంక్షోభ  కాలాన్ని ‘’డార్క్ ఏజ్ ‘’అన్నారు చరిత్రలో .మళ్ళీ -8 ౦౦-500 బి సి నాటికి గ్రీసు వైభవం మొదలైంది .దీన్ని ఆర్కాయిక్ ఏజ్ అన్నారు .క్రమగా ఈజిప్ట్ తో నౌకా వ్యాపారం సాగించారు .

 ఇక 22-4-17 శనివారం నాడు షార్లెట్ లో హిందూ సెంటర్ లో జరిగిన ‘’శ్రీ సత్యసాయిబాబా ‘’ఆరాధనోత్సవం ‘’పై వివరంగా రెండో భాగం లో రాస్తాను .

 మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -23-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.