వీక్లీ అమెరికా -3 -2 (చివరిభాగం )

వీక్లీ అమెరికా -3 -2 (చివరిభాగం )

17-4-17 నుండి 23-4-17 వరకు

భగవాన్ పుట్టపర్తి సాయిబాబా 24-4-20 11 న సమాధి చెందిన సందర్భంగా ఆరవ ఆరాధనోత్సవాన్ని షార్లెట్ లోని సత్యసాయి సెంటర్ వారు రెండు రోజుల ముందే శలవు రోజు 22-4-17 శనివారం హిందూ సెంటర్ లో రాలీ  యాన్దర్సన్ గ్రీన్స్ బరీ సాయి సెంటర్ వారిని కూడా ఆహ్వానించి ఘనంగా నిర్వహించారు .సుమారు రెండు వందల మంది సాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కు ఉదయం టిఫిన్ కాఫీ మధ్యాహ్నం ,రాత్రి భోజనాలు సాయంత్రం స్నాక్స్ టీ ఏర్పాటు చేశారు .మా అమ్మాయి విజయలక్ష్మికి  భోజనం వగైరా ఏర్పాట్లకు కో ఆర్డినేషన్ బాధ్యత ను సమావేశ నిర్వహణ బాధ్యత జయ అనే ఆవిడకు అప్పగించారు .మా అమ్మాయి అందరితో సంప్రదింపులు ఫోన్ ద్వారా జరుపుతూ ఏ లోపం లేకుండా శ్రమించి  నిండు దనం  తెస్తే జయ సభా నిర్వహణ చక్కగా చేసింది అందరూ మంచి సపోర్ట్ గా నిలబడి విజయ వంతం కావటానికి దోహదపడ్డారు .ఇందులో నిర్వాహకులు సుబ్బు సత్య ,పవన్ ,రవి పాత్ర మరువలేనిది .

  ఉదయం 8-30 కి నన్నూ మా మనవాడు పీయూష్ ను ఇంటి వద్ద తయారు చేసిన మైసూర్ పాకులు ,సాంబారు వగైరా ను తీసుకొని కారులో తీసుసుకొని వెళ్ళింది. హిందూ సెంటర్ కు 9-30 కి చేరాం .అక్కడ అప్పటికే ఉన్న డా సర్వేశ్ దంపతులు సత్య సుబ్బు అయిదేళ్ళతర్వాత మళ్ళీ మేము రావటం తో సంతోషంగా పలకరించారు .అప్పటికే ఆ రోజు ముఖ్య అతిధి  వక్త కరణం బాల సుబ్రహ్మణ్యం అనే బ్రదర్ బాలు కూడా వచ్చి ఉన్నారు . మా రెండవ బావగారి అన్నగారి అబ్బాయి వేలూరి పవన్  ఏర్పాట్ల విషయం చూస్తున్నాడు .ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఉప్మా ,కేసరి పొంగల్  ,తిని కాఫే తాగాను .పదింటికి ఉష భర్త రాం ప్రసాద్ అనే రాంకీ మా శ్రీమతిని మనవడు అశుతోష్ ను తీసుకు వచ్చాడు . అందరూ సరదాగా ఉన్నారు కార్యక్రమాలతో నవ్వుతూ పలకరిస్తూ రమ్య ,సుచిత్ర ,పవన్ భార్య రాధ  జయ సందడి చేస్తూ అందర్నీ బ్రేక్ ఫాస్ట్ చేయమని కోరుతూ నా బోటి వాళ్లకు కాఫీ కలుపుకోవటం రాకపోతే సహకరిస్తూ సాయం చేస్స్తున్నారు . దాదాపు ఆడవాళ్ళు చీరలతో సంప్రదాయ బద్ధంగా వచ్చారు .తెలుగు కన్నడం మలయాళం గుజరాతీ మహారాష్ట్ర  అమెరికన్ లు కూడా పాల్గొని ప్రపంచం చిన్నది అనిపించారు .ఆకాశం లో సగం అనుకొనే మహిళలు చాలా ఎక్కువ మందే పాల్గొన్నారు .

  గాంధి భవన్ లో ఉదయం 10 30 కి భజనలతో కార్య క్రమం ప్రారంభమైంది . జయ ,సౌమ్య విజ్జి  సుబ్బు రవి మొదలైనవారు భజనలు పాడారు .వేదికపై పెద్ద సత్య సాయి బాబా ఫోటో దానికి రెండు వైపులా  అట్టలతో నెమలి బొమ్మలు కలర్ ఫుల్ గా చేసి పుష్పాలతో హారాలు వేసి అలంకరించారు .ఎన్ని రోజులనుండి దీన్ని చేశారో ?

 ఉదయం 11 గంటలకు కరణం బాల సుబ్రహ్మణ్యం ప్రసంగం ప్రారంభమైంది .ఆయన పుట్టపర్తి దగ్గర పల్లె టూరి వాడు .పల్లె చదువు పూర్తీ చేసి ,పుట్టపర్తి లో సత్య సాయి విద్యా సంస్థలలో  ఏం ఎసి సి  చదివి పి.హెచ్ డి చేసి కొద్దికాలం అక్కడే పని చేస్సి ఇప్పుడు అమెరికాలో అట్లాంటాలో కేమి స్ట్రి లెక్చరర్ గా ఉన్నాడు .మంచి వక్త ,కవి .బాబాతో చాలా ఏళ్ళ అనుబంధమున్నవాడు .కవితలతో బాబాను మెప్పించినవాడు . ఈ నాటి అన్నికార్యక్రమాలలో ఒక్కటే అంశం ‘’హృదయ పరి వర్తన ‘’అనేది. దీనిపై చాలా స్పాంటేనియస్ గా  స్క్రీన్ పై ప్రదర్శనాత్మకంగా   మాట్లాడాడు . మధ్యాహ్నం పానెల్  డిస్కషన్ తర్వాత కూడా ఆయన  మళ్ళీ మాట్లాడాడు .అందులోని సారాంశం అందరూ తెలుసుకోవాలి .అయన మాటలను ఎప్పటికప్పుడు నోట్ బుక్ లో రాసుకున్నా ఆ సారమే ఈ ప్రసారం –

‘’హృదయం అనే మాటకు బాబా దయ కలిగింది అని అర్ధం చెప్పారు .దైవం అంటే ప్రేమ ..అందరికీ’’ కంపాషన్’’ఉండాలే తప్ప కంపు ఫాషన్ కాదు ..’’అద్వితీయమ౦దంగ ప్రేమకాక వేరొకటి ఏల ?బాబా అనుగ్రహం ఎవరిమీదైనా కలిగితే ‘’తాంబూలం ఇస్తా .తీసుకో ‘’అనేవారు .తాంబూలం అంటే పళ్ళెం లో పళ్ళూ తమలపాకులు వక్కలు  వస్త్రాలు డబ్బు కానుకగా ఇవ్వటం .ఆయన నడిపే స్కూల్ లో ఎప్పుడూ విద్యార్ధులకు పుట్టపర్తిలో దొరకని ఆపిల్స్ ఫలహారాలు  భోజనాలు సమకూర్చేవారు .ఇది తెలిసి ఇక్కడే చదవాలనుకొన్నాడు బాలు .

మొదటిసారి బాబాను చూసి స్పందించి ‘’కంటి నఖిలాండ మూర్తిని గంటి -మదములు పోగొట్టుకొంటి ‘’అని పించింది .ఎవరిన్తికైనా గృహ ప్రవేశం చేయమని  బాబాను ఆహ్వానించేవారు వారికి తాంబూలం ఇచ్చి పాలలో వ్రేలు పెట్టి గృహ ప్రవేశం చేయిన్చేవారట. బాబా .పుట్టపర్తి స్టేట్ బాంక్ ప్రారంభోత్సవాన్ని కూడా ఇలాగే చేసి బ్యాంకులో డబ్బులు ధర్మవరం నుంచి ఇంకా రాకపోతే బంగారు నాణాలు సృష్టించి లాకర్లలో పెట్టించిన మొదటి ఖాతా  దారు బాబా యే..బాబా ఎప్పుడూ ‘’నేను డ్రిల్ మాస్టార్ని జాగ్రఫీ టీచర్నికాదు మీ శరీఅరానికి మనసుకు ఎక్సర్ సైజ్ లు ఇచ్చేవాడిని నేర్పే వాడిని ‘’అనేవారు .విజయం అంటే మన పరిశ్రమ ప్లస్ స్వామి దయ అని నిర్వచి0చేవారు.’’తనను తానూ తెలుసుకోవటం తనువుకు లక్ష్యం ‘’అనేవారు .

 బుక్కపట్నం లో వేంపల్లి జయమ్మ బాబా క్లాస్ మేట్.ఆమె బాలుకు బాబా సాక్షాత్తు పరమాత్మ అని చెప్పి ఆయన్ను నమ్ముకొంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని బోధించింది .ఆమె ప్రతి పుట్టిన రోజు ను జ్ఞాపకముంచుకొని బాబా ఆమె ఇంటికి ఘనంగా కానుకలు పంపేవారు .ఎవరైనా బాబా దగ్గర కొచ్చి ‘’నేను పాడుతాను ‘’అంటే ‘’మంచిది పాడు ‘’అనేవారు అంటే సరే నాయనా పాడు అని ఒకర్ధం మంచి పాటలు పాడు అని వేరోకర్ధం .’’singers who sing with ego are sinners ‘’అనేవారు .’’సాయి దర్శనం సుదర్శనం ‘’అని బాలు రాసి చూపాడు .’చావు లేని చదువు చదువ వలెను ‘’అని చెప్పేవారు .పుట్టపర్తిలో ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే మన గవర్నమేంట్ బడులలో ఉన్న లెస్ ఎడ్యుకేషన్ కాదు బెస్ట్ ఎడ్యుకేషన్ ‘’అన్నాడు బాలు .సాయి చిరుకోపంవస్తే దున్నపోతా బక్కోడా బండోడా  అనేవారు సాధారణంగా అందర్నీ ‘’బంగారూ ‘’అనే సంబోధించేవారు .’’సాయి నీ హృదయ స్థాయి -తెలుసుకొంటే మనసుకు హాయి ‘’అనేవారుబాబా  .మరోసారిబాలు ‘’స్వామితో మాట్లాడితే ఆనంద బాష్పాలు కారు ‘’అని కవిత వినిపిస్తే ‘’కపిత్వం ‘’బాగానే అబ్బిందే అని మేలమాడారు .బాలు ‘’కోదండ పాణి నువ్వైతే కపి(హనుమాన్ )ని నేను ‘’అన్నాడు .పద్యాలన్నీ విని ‘’నీకేం కావాలో తీసుకో ‘’అన్నారట .ఆయనతో గడపటం ‘’లివింగ్ విత్ లవింగ్ గాడ్ ‘’అన్నాడు బాలు .. ఎవరైనా భయమేస్తోందిబాబా అంటే ‘’నువ్వు చేస్తుంటే భయం -బాబాకు వదిలేస్తే అభయం ‘’అనేవారు

             మధ్యాహ్నం 2 కు మళ్ళీ ప్రసంగిస్తూ బాలు ‘’టెక్నాలజీ ఈజ్ ట్రిక్నాలజి ‘’అని బాబా అనేవారని ,బాబా అల్కెమిస్ట్ అని గోల్డ్ స్మిత్ విత్ లవ్ అని వర్ణించాడు .ఒక సారి అసలు పుష్పించని చెట్టునుంచి పూలు పళ్ళు కాయించి ఇచ్చారు .’’ఇన్ని విషయాలు మీకు ఎలా గుర్తు ఉంటాయి ?’’అనియా అడిగితే ‘’నీకు కావాల్సినప్పుడు అవే గుర్తుకు వస్తాయి ‘’అనేవారు .భగవద్గీత మొదటి శ్లోకం చివరి శ్లోకం లలో ధర్మ మన ఉన్నాయి అదే దాని పరమార్ధం నీడ్యూటీ నువ్వు చెయ్యి అని గీత సారం.కురుక్షేత్రం లో గీత బోధించినప్పుడు  అర్జునునివయసు 7 5 ,శ్రీ కృష్ణుని వయసు 8 0అని బాబా చెప్పారు ‘’నిజమైన ఆనందం నీలోనే ఉంది -అది చూపించటానికే వచ్చాడు సాయి ‘’అనేవారు బాబా ..సాయిబాబా సంస్థలలో ‘’స్టెప్పింగ్ డౌన్’’అనేది లేదు స్టెప్పింగ్ అప్ మాత్రమె ఎప్పుడూ .

 ‘’పాపాత్మా పాపసంభావానామ్ పాప కర్మాణానాం’’అనే శ్లోకాన్ని మార్చి బాబా ‘’ప్రాప్తోహం  ప్రాప్త సంపన్నానాం ‘’అని చెప్పించేవారు .ఈ దేహం నాకు వచ్చింది దాన్ని సార్ధకం చేసుకొంటాను అని అర్ధం ..ఎవరో ‘’సాయి కి వేదం తెలుసా ?’’అని అడిగితె ‘’సాయి చెప్పిందేవేదం ‘’అన్నారు ఆయనవద్ద ఉన్న మహా వేదవేదాంత శాస్త్ర విజ్ఞానులు .

 బాబాకు అపత్ సమయం లో ఎలా ఆదుకోవాలో తెలుసు.బాలు అక్క పెద్దగ చదువుకోలేదు పెళ్లి అయి రెండో ప్రసవం లో ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళింది ,ఇంట్లో వాళ్ళందరూ బాబాకు చెప్పమన్నారు ఆలోచించి ఆలోచించి బాబాకు బాలు విషయం చెప్పాడు మర్నాడే ఆమెను అమ్మనూ తీసుకుని రమ్మని జేబులో డబ్బు పెట్టి పంపారు మర్నాడు వాళ్ళు వచ్చ్చారు .బాబా ‘’వచ్చారా ‘’అని అడిగితె అంత మంది జనం లో ఎక్కడున్నారా అని చూస్తుంటే ‘’అదిగో అక్కడ ఉన్నారని చెప్పి ‘’వాళ్ళను లోపలి తెప్పించారు ఒక శివలింగం సృష్టించి దాన్ని  గ్లాసు నీళ్ళలో  వేసి ఏడు రోజులపాటు తీర్ధంగా అక్కకు ఇస్తే తగ్గిపోతుందని చెప్పి తే అలా చేయగానే తగ్గిపోతే కుటుంబం అంతా బాబా దగ్గరకు వచ్చి  కృతజ్ఞతలు  చెబితే అక్క బాలు సంగతి చూడమని అంటే ముందు నీ పిల్లల ఆలనా పాలనా చూసుకో అని చెప్పి బావనూ పిలిచి ఆమె నీకు సేవ చేసినట్లు నువ్వు ఆమెకు సేవ చేయి అని బోధ చేశారని బాలు తన అను భవాన్ని  తెలియ జేశాడు

 బాబా పై తనకు అత్యంత భక్తి అనిబాలు బాబాతో అంటే ‘’ కాన్ష స్ లో కాన్ఫిడెన్స్ ఉండాలి ‘’అని బోధించారు   బస్ బయల్దేరితే డస్ట్ కూడా దాని వెనక వచ్చి బస్సు ఆగితే ఆగి పోతుంది .కనుక సాధన నిరంతరం సాగాలి .అమెరికాలోని  అలబామా రాష్ట్రం లోని మాంట్ గోమరీలో ఉన్న ఒకాయన 35  ఏళ్ళనుంచీ దిగ్విజయం గా ఎక్కువ మంది సాధకులతో సాయి సెంటర్ నడుపుతున్నాడని ఆయన జీవితం లో కనీసం ఒక్క సారికూడా బాబాను సందర్శించలేదని ఇదొక అద్భుత అపూర్వ విషయమని బాబా స్పూర్తి అలాంటిదని  బాలు అన్నాడు .‘’మనసుకొంతయు నిచ్చి -స్వామి కరుణ అందరాని సుఖము నందగలరు ‘’అంటూ తన ట్రాన్స్ ఫర్మేషన్ కు బాబా ఎలా దోహద పడ్డారో సోదాహరణం గా ప్రసంగించి  అందరి ప్రశంశలు అందుకున్నాడు బాలు .

 మధ్యాహ్నం వివేకా హాల్ లోనే లంచ్ .పప్పు రెండు కూరలు పులిహోర ఫ్రైడ్ రైస్ ,ఆవకాయ ,టమేటా చట్నీ ,సాంబారు పెరుగన్నం ,లడ్డూ అరటిపండు  లతో భోజనం .అందరూ సంతృప్తిగా తిన్నారు అన్నీ బాగానే ఉన్నాయి .కావాల్సినవారికి పూరీ చానా మసాలా కూడా పెట్టారు .

      భోజనం తర్వాత మధ్యాహనం 1-30 కి కాసేపు భజనలు .తర్వాత హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ‘’పై పానల్ డిస్కషన్ .ఇందులో నస్రిన్ అనే ఇరానీ పి.హెచ్ డి అమ్మాయి రుద్రం అద్భుతంగా కంటో పాఠ౦ గా వచ్చినమ్మాయి ,అరుణ ,రవి ,రాజారావు శంకర్ లు పాల్గొన్నారు మోడరేటర్ గా బాలు వ్యవహరించాడు .వీరందరి చర్చ సారాంశం -పరివర్తన అంటే కామ క్రోధాదులను దూరం చేసుకోవటం గ్రోయింగ్ టువర్డ్స్ గాడ్ .చేంజ్ ఆఫ్ నో రికగ్నిషన్ . ఫిజికల్ వరల్డ్ నుంచి స్పిరిట్యువల్ వరల్ద్ కు ప్రయాణం   భౌతిక హృదయం ఆధ్యాత్మిక హృద్యంగా మారటం . ఇందులో పాల్గొన్న వారు వారి అనుభవాలు వివరించారు .ఒక సారి సాయిమందిరం లో పెయింటింగ్ వేయాల్సివచ్చింది .నిరంతరం భక్తుల ప్రవాహం వలన  పెయింటర్ లకు   అర్ధ రాత్రికాని వీలు చిక్కేదికాదు .సమయం దగ్గర పడుతోందని బాబా హెచ్చరిక .ఒక రోజు  అందరూ ఒక కుర్రాడిమీద వదిలేసి విసుగొచ్చి వెళ్లి పోయారు. వాడు తెల్లవార్లూ వేస్తూ బాబాకు కనిపించాడు .మర్నాడు వాడిని పిలిపించి తాంబూలం ఇచ్చారు. వాడు ఈ అదృష్టానికి వలవలా ఏడ్చేశాడు ఇది తెలిసిన మిగిలిన వాళ్ళు కూడా అప్పటిదాకా సాయిని చూడని వాళ్ళు అందరూ బాబా పాదాలపై పడ్డారు. వారందరికీ కానుకలు ఇస్తే అక్కడే వదిలి పాద స్పర్శ తప్ప తమకు ఏమీ వద్దన్నారు . వాళ్లకు నచ్చ చెప్పి కానుకలు మళ్ళీ ఇప్పించారు బాబా

           తరవాత టీ బ్రేక్ -మరమరాలు పళ్ళముక్కలు  బిస్కట్లు జ్యూస్లు టీ ఇచ్చారు .

సాయంత్రం 4 గం లకు సాంస్కృతిక కార్యక్రమాలు .ఇందులో కూడా హృదయ పరివర్తనమే సబ్జెక్ట్ .గ్రీన్ బరో వాళ్ళు శ్రీరామ వనవాసం చిత్రాలతో ‘’పప్పెట్ షో’’చేశారు బాగుంది . యాం డర్సన్ వాళ్ళు లఘు చిత్రాలు ‘’డజ్ గాడ్ ఎక్సిస్ట్ ,వాట్ ఈజ్ వర్షిప్ ,ది గెస్ట్ లు ప్రదర్శించారు .

 మొదటి సారిగా షార్లెట్ సెంటర్ వారు మగవాళ్ళందరూ కలిసి నాలుగు చిన్న నాటికలు ప్రదర్శించారు .మొదటి ది- వాల్మీకి -బోయ రత్నాకరుడు వాల్మీకిగా రూపాంతరం చెందటం రెండవది ప్రాఫెట్ మొహమ్మద్ ను ఎవగించుకొనే  వీధులు ఊడ్చే ముసలి వాడిలో ఆయన కరుణ వలన హృదయ పరివర్తన రావటం ,యేసు క్రీస్తు ను ఆరాధించే ధనవంతుడిపై అసూయ చెందినవారు ఆయన అంతరంగాన్ని తెలుసుకోవటం అధనవంతుడు తన సంపద  వీళ్ళకు ఇచ్చి  యేసు భక్తుడుగా మారటం ,నాలుగవది కల్పగిరి అనే ఖైదీ బాబా కు తన గోడు జాబులో తెలియ జేస్తే ఆయన అనుగ్రహం తో శిక్షాకాలం తగ్గి విడుదలవటం ఇందులో మా బంధువు వేలూరి పవన్ ఖైదీగా గొప్ప నటన ప్రదర్శించాడు .మరోనాటిక కేరళకి చెందిన వీర కమ్యూనిస్ట్ హిందూ మత ప్రచారకులు అంటే గిట్టక బాబాను అర్ధ రాత్రి చంపటానికి పుట్టపర్తి చేరి బాబాతో పాటు నిద్రించగా బాబా ‘’ఇంకా సమయం కాలేదా “‘?అని అడగటం తో తప్పు తెలుసుకొని బాబా అనుగ్రహం తో మారి అక్కడే ఉండిపోవటం ‘’లవ్ ఈజ్ గాడ్ ;;అనే సందేశం .

 ఈ నాటికలలో పాల్గొన్నవారంతా బాగా నటించారు పవన్ మాత్రంనటనతో  జీవించాడు అని చెప్పక తప్పదు. ఎక్కడా బోర్ కొట్టకుండా చక చక సాగిపోయాయి. ఉన్నంతలో రంగాలంకరణ అన్నీ బాగా చేశారు అందరూ ఉద్యోగస్తులే పిల్లా పాపా ఉన్నవారే .పిల్లల చదువులతో తీరిక లేనివాళ్ళే అయినా గొప్ప సంకల్ప బలంతో దీన్ని సాధించారు అందరూ అభినందనీయులే .

   బ్రేక్ ఫాస్ట్ లంచ్ చేసిన వివేక్ హాల్ ను మధ్యాహ్నం ఒంటిగంటకు గుజరాతీ సభ జరిపే వారికి అప్పగించాలి .అందుకని భోజనాలు అవగానే ఆడ మగా అందరూ త్వరత్వరగా సామాన్లు తీసుకొని గాంధీ భవన్ కింద అంతస్తు లోకి చేరవేయటం ,క్లీన్ చేయటం చేసేశారు వాలంటరీ వర్క్ అంటే ఎలా ఉంటుందో రుజూవు  చేశారు  . వాళ్ళ ఓర్పుకు సాయానికి హేట్సాఫ్.నేనేదైనా చేద్దామనుకొంటే నన్ను చేయనివ్వలేదు .

   సాంస్కృతిక  కార్యకరమాలు కాగానే డౌన్  స్టేయిర్ లో డిన్నర్ .దూర ప్రదేశాల నుండి వచ్చినవారికి బాక్స్ లలో చపాతీ కూరా పులిహోర ,మైసూర్ పాక్ ,బిర్యానీ సర్ది ఇచ్చారు ఆడవాళ్ళు .తినే సమయం ఉన్నవారు ఇక్కడే తిన్నారు .అంతా అయేసరికి ,ఊడ్చి బాగు చేసేసరికి సామాన్లు సర్దుకొని ఎవరిసామాను వాళ్ళు తీసుకు పోయేసరికి రాత్రి తొమ్మిదయింది .అప్పుడు బయల్దేరి అందరం ఇంటికి చేరేటప్పటికి తొమ్మిదిన్నర .

 సందట్లో సడేమియా -వివేక్ హాల్ లో మధ్యాహ్నం 1 గంటనుండి గుజరాతీ వాళ్ళు ‘’దాదా భగవాన్ ‘’పై సత్సంగం చేశారు ఒకటి రెండు సార్లు వెళ్లి చూశాను .వాళ్ళూ భోజనాలు వగైరాలతో ఉన్నారు యాభై మంది దాటిలేరు ఆడామగా . ఇంతకీ ఎవరి గురించి అని ఒక పెద్దాయననుఇంగ్లీష్ లో అడిగితే చెప్పాడు నెలకోసారి ఇలా సమావేశామౌతారట మాట్లాడుకొంటారు భజనలు పాడతారు అవి సంస్కృతం లోనే ఉన్నాయి .ఫోటోలు తీసుకోవచ్చా అని అడిగి సరేనంటే  ఫోటోలు తీశాను .

 దాదా భగవాన్ అంటే గుజరాత్ లో 7-11-19 09లో బరోడా దగ్గర తరసలి లో జన్మించిన అంబాలాల్ ము౦జీభాయ్ పటేల్ .19 5 8 లో ఆత్మజ్ఞానం పొంది దాదా  భగవాన్ అయ్యాడు .జైనులు చెప్పే క్రమ పద్ధతిలో ఆత్మ జ్ఞానం పొందకుండా తక్షణ ఆత్మజ్ఞానంపొంది మోక్షం సాధించటానికి అంటే – ‘’అక్రం విజ్ఞాన్ ‘’పొందటానికి సాధనాలు చెప్పాడు దీన్నే వ్యాప్తి చేశాడు .తన అనుభవాలను అందరితోపంచుకోనేవాడు .ఒక సారి ఉగాండా నుంచి19 6 2 లో  చంద్ర కాంత పటేల్ అనే ఆయన వచ్చి ఈయన ప్రభావానికి లోనై రెండవ తక్షణ ఆత్మజ్ఞాని అయ్యాడు దాదా తర్వాత .దేశ విదేశాలలో పర్యటించి ‘’అక్రం విజ్ఞాన్ ‘’వ్యాప్తి చేశాడు .1-2-19 8 8 న ఆయన మరణించినప్పుడు 60 వేల మంది భక్తులు అంత్యక్రియలకు హాజరయ్యారు .ఈ విధంగా ఇవాళ మరో మహానుభావుడిని గురించి తెలుసుకొనే అదృష్టం కలిగిందినాకు .

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2

          మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -23-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

 


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.