గీర్వాణ కవుల కవితీ గీర్వాణ౦-3 118-సాయి గాయత్రి మంత్రం రాసిన -శ్రీ ఘండి కోట వెంకట సుబ్బారావు (19 26 -20 03 )

గీర్వాణ కవుల కవితీ గీర్వాణ౦-3

118-సాయి గాయత్రి మంత్రం రాసిన -శ్రీ ఘండి కోట వెంకట సుబ్బారావు (19 26 -20 03 )

బ్రహ్మశ్రీ ఘండికోట వెంకట సుబ్బారావు గారు 7-11-19 26 న రాజమండ్రి లో జన్మించారు .తండ్రి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి తల్లి శ్రీమతి రామ లక్ష్మి .భారద్వాజ గోత్రం కృష్ణ యజు శ్శాఖ .తండ్రి వేద వేదా౦తా లలో  క్రతు నిర్వహణలో నిష్ణాతులు. కొడుకు జన్మించాలని  పుత్ర కామేష్టి చేసిన కర్మిస్టి.విజయనగర మహారాజు తన  ఆస్థాన విద్వాంసుని చేశాడు శాస్త్రి గారిని .విజయనగరం చేరి కొడుకుకు ఆంగ్ల ,భారతీయ విద్యా విధానం లో విద్య నేర్పించారు .తండ్రి గారు మహా రాజాతో పాటు ప్రయాణాలు చేయటం వలన రావు గారు విజయనగరం మద్రాస్ బెంగుళూరు లలో చదివారు .19 40 లో స్వాతంత్ర ఉద్యమకాలం లో భారత దేశ కీర్తి వైభవాలను కీర్తిస్తూ సైన్యాన్ని బ్రిటిష్ వారిని ఎదిరించమని కోరుతూ  పాటలు రాసి అచ్చు వేయించి కంటోన్ మెంట్ ప్రాంతం లో పంచి పెట్టారు .ప్రభుత్వం అరెస్ట్ చేసి౦దికాని కుర్రాడుకదా అని వదిలేసింది .మొదటి నుంచి సంప్రదాయ పద్ధతిలో విద్య నేర్చిన రావు 20 వ ఏట తల్లి మరణం బాధ కల్గించింది .19 42లో శ్రీమతి తంగిరాల లక్ష్మీ దేవిని వివాహమాడారు .62ఏళ్ళు వివాహ జీవితం అవిచ్చిన్నంగా సాగింది అయిదుగురు  మగపిల్లలుకలిగారు .

మద్రాస్ లయోలా కాలేజి నుంచి  ఎకనామిక్స్ లో బి ఏ ఆనర్స్  డిగ్రీ పొంది , విజయనగరం లో ఏం ఏ అయి అక్కడే లెక్చరర్ గా కొంతకాలం పని చేశారు .19 4 9 లో అమెరికా లోన్యూయార్క్ లోని  కొలంబియా యూని వర్సిటిలో ఏం ఏ పి హెచ్ డి చేశారు .ప్రొఫెసర్ సిఫార్స్ తో న్యూయార్క్ లో యునైటెడ్ నేషన్స్ సెక్రెటేరియట్ లో ఎకనామిక్స్ వ్యవహారం చూసే బాధ్యత 19 5 1 లో తీసుకున్నారు ..34ఏళ్ళ సుదీర్ఘకాలం ప్రపంచ వ్యవహార సంస్థలో సేవలందించారు తెలుగు బిడ్డ .భారతీయ విదాననాన్ని ఏమాత్రం మర్చి పోకుండా దంపతులు జీవించారు పిల్లలను అలాగే పెంచారు .భార్య ఇరగవరానికి చెందిన  తంగిరాలవారి ఆడబడుచు .వారిల్లు గురుకులం గా ఉండేది .నాలుగేళ్ళు ఇక్కడ పని చేశాక రావు గారిని బాంగ్ కాక్ లోని  యు యెన్ అకాడెమిక్ కమిషన్ కు బదిలీ చేశారు .డాగ్ హామార్ షెల్ద్ యు దాంట్ లు రావుగారి సహోద్యోగులు .19 5 8 లో మళ్ళీ న్యూయార్క్ లో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్ లో పని చేశారు .యువ ఆర్ధిక వేత్తగా గొప్ప గుర్తింపు పొందారు .

 19 6 ౦ లో ఇండియా వెళ్లి కుటుంబంతో గడుపుతుండగా అప్పటికే తండ్రి శాస్త్రిగారు సత్యసాయిబాబా ముఖ్య శిష్యులై  సలహా దారై సాయి భగవానుని అవతారమని ప్రచారం చేస్తున్నారు .రావు గారి నాలుగుతరాల కుటుంబ సభ్యులు పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నారు .శాస్త్రిగారిని బాబా ప్రశాంతి నిలయ ఆస్థాన విద్వాంసుని చేశారు .ఆయన ఆధ్వర్యం లో దసరాలలో యజ్ఞం నిర్వహించారు కూడా .

 19 6 1 లో రావు గారు ఢిల్లీ లో యునిసెఫ్ లో పని చేశారు .సీనియర్ ప్లానింగ్ ఆఫీసర్ అయ్యారు .దక్షిణ ,  ఆగ్నేయ ఆసియాలో  స్త్రీ శిశు పోషకాహారం కౌమార ,యవ్వన విషయాల సమస్యల పరిష్కార౦ పై పని చేశారు .వేదోపనిషత్ లపై సాధికారత సాధించి బదరీనాద్ కేదార్ నాద వంటి పుణ్య స్థల దర్శనం చేశారు .ఇండియాలో యునిసెఫ్ పని పూర్తవగానే మళ్ళీ న్యూయార్క్ వెళ్లి ఎనర్జీ సెక్షన్ హెడ్ అయ్యారు .ఇరవై ఏళ్ళు దీనిలో పని చేసి ఆయిల్ ఎకనమిస్ట్ గా ప్రపంచ ప్రసిద్ధి పొందారు .ఒపెక్ సంస్థలతో నిరంతర చర్చలు జరుపుతూ 19 73 లో వచ్చిన ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు .అలగప్పన్ అనే అతనితో కలిసి న్యూయార్క్ లో ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ‘’నార్త్ అమెరికా  టెంపుల్ హిందూ సొసైటీ ‘’స్థాపించారు .తిరుమల తిరుపతి దేవస్థానం వారితో సంప్రదించి న్యూయార్క్ లోని ఫ్లాషింగ్ లో గణేష్ దేవాలయం ను సంప్రదాయ హిందూ పద్ధతిలో నిర్మించారు .అప్పటికే సాయి భజన ఇంటివద్ద చేస్తున్నారు దానిని దేవాలయానికి మార్చారు .ఉత్తర అమెరికాలో ఇదే మొట్టమొదటి హిందూ దేవాలయం .ఇదే ఆతర్వాత ఎందరికో ప్రేరణ కలిగించి అనేక దేవాలయాలు ఎర్పడేట్లు చేసింది .ఇది సుబ్బారావు గారి పుణ్యమే .వ్యవస్థాపక అధ్యక్షులుగా నిర్విరామ కృషి చేసి ఎన్నో అభి వృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు .ప్రతివారం తాననే వేద ఉపనిషత్ గీతలపపై ప్రేరణాత్మక ప్రసంగాలు చేసేవారు .అన్ని మత విశ్వాసాల కు ఆలవాలంగా ‘’సత్య సాయి సర్వ ధర్మ ‘చిహ్నం ‘’ఏర్పాటు చేశారు .  మొదటిసారిగా సత్య సాయి స్టడీ సర్కిల్అమెరికాలో ఏర్పరచి .భారతీయ విద్యాభవన్ నిర్మాణానికి కృషి చేశారు స్వామి చిన్మయానంద ప్రభుపాద రామకృష్ణ పరమహంస వివేకానంద  మహేష్ యోగి బోధనలన్నీ క్షుణ్ణంగా చదివి జీర్ణించుకొన్నారు .న్యు యార్క్ లో మొట్టమొదటి ‘’తెలుగు సాహిత్య సాంస్కృతిక సంస్థ ‘’ఏర్పరచారు .ప్రతి ఉగాదినాడు పంచాంగ శ్రవణ౦ చేసేవారు .

  రెండేళ్ళ కోసారి కుటుంబం తో ఇండియా వచ్చి తప్పని సరిగా బాబా దర్శనం  స్పర్శనం సంభాషణం చేసేవారు .19 8 1 రావు గారి నాలుగవ కొడుకు సంజయ్ ఉపనయనం పుట్టపర్తిలో చేసి బాబా యజ్ఞోపవీతం సృష్టించి ఇస్తే వేయించి గాయత్రీ మంత్రోప దేశం చేయించారు అతనికి అక్కడే సత్యసాయి హయ్యర్ ఎడుకేషన్ సెంటర్ లో సీటు ఇచ్చారు .మరొక అబ్బాయి రవి శంకర్  కూడా అక్కడే చదివి బాబా గారి బెంగళూర్ బృందావన్ కాలేజి లెక్చరర్ అయ్యాడు ఇదీ ఆకుటుంబానికి బాబాకు ఉన్న అనుబంధం .

  19 8 4 లో ఇండియాకు వచ్చినప్పుడు 90 ఏళ్ళ తండ్రి శాస్త్రిగారు ‘’ఇండియాకు ఎప్పుడు వచ్చేస్తావు ?అని అడగటం బాబా అనుగ్రహం తో రావుగారిని బాబా ప్రశాంతి నిలయానికి రమ్మని ఆహ్వానించటం జరిగిపోయి  19 8 5 లో యుయెన్  సర్వీస్ నుండి 5 8 వ ఏట రిటైర్ అయి ,మెరిట్ సర్వీస్ అవార్డ్ పొంది ,పుట్టపర్తిలో ఉన్న  తండ్రి గారి  సేవలో బాబా సేవలో 18 సంవత్సరాలు గడిపారు .తండ్రిగారు రావు గారి చేతులమీదుగా చనిపోయారు .స్వామి పుస్తక ప్రచురణ విభాగం లో రావుగారు పని చేశారు పిల్లలకు బాబా కాలేజీలలో ఉద్యోగాలు ఇచ్చారు .ఆశ్ర మ మేగజైన్ ‘’సనాతన సారధి ‘’లో తెలుగు ఇంగ్లీష్ లలో వ్యాసాలూ రాస్తూ  సంపాదకత్వం వహిస్తూ సేవ చేశారు పితృ ఋణం తీర్చుకున్న  రావుగారు మిగిలిన కాలమంతా బాబా సస్న్నిధిలో సేవలోనే గడిపారు .విదేశీ భక్తులకు ఇంగ్లీష్ లో రావుగారు అనర్గళ ఉపన్యాసాలు ఇస్తూసాయి భావాలను సులభంగా అర్ధమయేట్లు చెప్పేవారు .అప్పటికే ముగ్గురు కుమారుల వివాహాలు చేసిన రాగారిని బాబా మిగిలిన ఇద్దరు అబ్బాయిల పెళ్ళిళ్ళు త్వరగా చేయమని చెప్పి ఎర్రమిల్లి సత్యమూర్తి గారి అమ్మాయిలు ఆహ్లాదిని ,సుమన లను కుదిర్చితన నివాసం ‘’త్రయీ బృందావన ‘’లో ఎంగేజ్ మెంట్ జరిపించి బెంగుళూరు బృందావన్ లో అన్ని ఖర్చులు తామే భరించి అత్యంత వైభవం గా తమ చేతులమీదుగా ఏప్రిల్ 20 నవివాహాలు జరిపించారు ఘండికోట కుటుంబీకు లందరూ పాల్గొని ఆశీర్వదించారు .మంగళసూత్రాలను స్వామి సృష్టించి వారికి అందజేశారు .

 భగవాన్ బాబా తనపై కురిపించిన అపూర్వ దయా వర్షానికి పులకితులైన సుబ్బారావు గారు దాన్ని సార్ధకం చేసుకోవాలని భావించి 21 వ శతాబ్ది ప్రారంభం లో భక్తులు సులభంగా అర్చించ టానికి ‘’’’సాయి యంత్రం ‘’తయారు చేశారు .సాయి త్రిచక్రాలు అంటే సత్య సాయి గాయత్రి సత్యసాయి సూర్య గాయత్రి సత్యసాయి హిరణ్య గర్భ గాయత్రి లను 19 7 7 ,19 9 7 ,19 9 9 లలో రచించి అందజేసి తన జీవితం ధన్యమైందని భావించారు .భగవాన్  వీరి కృషిని హృదయపూర్వకంగా మెచ్చి హర్షించారు .వీటినే రావుdగారు -’’త్రి సాయి -మంత్రం యంత్రం తంత్రం ‘’అనిరాశారు సంస్కృతం తెలుగు  స్పానిష్ మొదలైన అనేక భాషలలోకి ఇవి అనువాదమయ్యాయి

 భారతీయ సంప్రదాయం సంస్కృతులను పూర్తిగా అనుసరిస్తున్న రావుగారిని మనసారా అభినందించిన బాబా ఆయన ముగ్గురి మనవళ్ళఉపనయనాలు కూడా తానే దగ్గరుండి జరిపించారు .మూడు యజ్నోపవీతాలను సృష్టించి గాయత్రీ మంత్రోపదేశం తో చేశారు . .29-3-20 03 ఉదయం  ఘండికోట వెంకట సుబ్బారావు గారు 7 4 వ ఏట సత్య సాయి బాబాలో ఐక్యంయ్యారు .కర్మ కాండ లన్నీ యధావిధిగా జరిపించారుబాబా 13 వ రోజు కుటుంబ సభ్యులకు ఏదికావాలో అడిగి వాటితో సంతృప్తిగా భోజనం పెట్టారు .17 00 మందికి ‘’నారాయణ సేవ ‘’గా భోజనాలు పెట్టించారు . ప్రాత్య పాశ్చాత్య సంస్కృతీ మేళనం సుబ్బారావు గారు అనిబాబా మెచ్చుకొనేవారు .20 04 జనవరి 17 న రావుగారి చితా భస్మాన్ని మద్రాస్అడయార్ లో ఉన్న  అష్టలక్ష్మి దేవాలయం వద్ద  బీచ్  లో నిమజ్జనం చేయమని చెప్పి చేయించారు .

 సుబ్బారావు గారు రాసిన పుస్తకాలు -మాన్ విత్ మైటీ మిరకిల్స్ ,మైండ్ బొగ్లింగ్ మిరకిల్స్ ఆఫ్ సత్యసాయి ,ఇంటర్వ్యూస్ ,ఇన్నర్ మోస్ట్ విస్టాస్ అండ్ ఇన్ మోస్ట్ విజన్స్’’

   సుబ్బారాగారు రాసిన సాయి మంత్రాలు –

1-సాయి (ఈశ్వర) గాయత్రి–ఓం సాయీశ్వరాయ విద్మహే -సత్య దేవాయ ధీమహి -తన్నో  సర్వాః ప్రచోదయాత్  (24-12-19 7 7 )

2-సాయి సూర్య గాయత్రి –ఓం భాస్కరాయ విద్మహే -సాయి దేవాయ ధీమహి -తన్నోః సూర్యాః ప్రచోదయాత్ (22-9-19 9 7)

3-సాయి హిరణ్య గర్భ గాయత్రీ-ఓం ప్రేమాత్మనాయ  విద్మహే -హిరణ్య గర్భాయ ధీమహి -తన్నః సత్యాఃప్రచోదయాత్ ‘’(15-2-19 9 9 )

4-సాయి పంచాక్షరి -సాయి శివోహం 15-2-19 9 9 )

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2ఇన్‌లైన్ చిత్రం 3

 సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-17 -కాంప్  -షార్లెట్ -అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.