గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -3
12 4-క్షణ విముక్తి నవల రాసిన -హెచ్ వి .నాగ రాజా రావు (19 42)
నాగారాజారావు 10-9-19 42నకోలారు జిల్లా సోమేన హళ్లి లో జన్మించాడు .వెంకట నారాయణప్ప లక్ష్మమ్మ తండ్రీ తల్లి .మైసూర్ సంస్కృత కాలేజి నుంచి వ్యాకరణ ,అలంకార శాస్త్రాలలో విద్వాన్ అయి ,మైసూర్ యూని వర్సిటి ,అమెరికాలోని సియాటిల్ యూని వర్సిటీల నుంచి ఏం ఏ అయి ,మైసూర్ ఓరియెంటల్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ లో సీనియర్ రిసెర్చ్ స్కాలర్ అయ్యాడు .సంస్కృతం లో విదులాపుత్రీయం ,సముద్యతా ,,దాంపత్య కలహం అనే నాటకాలు రాశాడు .బొంబాయ్ భారతీయ విద్యాభవన్ వీటిని ప్రచురించింది .వరన్వేషణం ,మాలవికధ అనే రెండు కధలుకూడా రాశాడు .క్షణ విముక్తి నవల ,శారదా దర్శనం అనే యాత్రిక సాహిత్యం ,ఉపాఖ్యాన యుగ్మకం అనే వచన రచన ,సిద్ధ గంగాయాః సుధా చేతనాఃఅనే సిద్ధ గంగ స్వామీజీ జీవిత చరిత్ర రాశాడు .
వేంకటాధ్వరి సుభాషిత కౌస్తుభం ,అన్యాపదేశ శతకం నీలకంఠ దీక్షితుని ఆనంద సాగర స్తవం,లకు సంపాదకత్వం చేశాడు .వేడ వేదాన్గాలపై ఆయన రాసిన పరిశోధనా పత్రాలను బెంగుళూర్ భారతీయ విద్యాభవన్ ప్రచురించింది .హెచ్ ఏం నాయక కన్నడ రచన ;;నమ్మ మనేయ దీప ‘’ను’’అస్మాకం గృహం దీపః ‘’గా సంస్క్రుతీకరించాడు .చిన్న కధలు రాసే ప్రసిద్ధ కధకుల చేత కధలురాయించి ‘’విపంచిక ‘’గా ప్రచురించాడు .అలాగే అప్పయ్య దీక్షితుని వరద రాజ స్తవం ,నీల క౦ఠదీక్షితుని రామాయణ సంగ్రహం ,రఘు వంశ స్తుతి ,గౌరీ శంకరస్వామి భావనా లహరి ,శంకరాచార్యుల ‘’శివ పాదాది కేశాంత స్తోత్రం ‘’లను కన్నడీకరించాడు .
శేఖావతీ సంస్కృత యూని వర్సిటి ‘’వేద వ్యాస ప్రశస్తి పురస్కారం అందజేసింది విజిటింగ్ ప్రొఫెసర్ గా చికాగో ,విస్కాన్సిన్ జెరూసలెం యూని వర్సిటీలకు వెళ్లి బోధించాడు .వరాన్వేషణం లో కట్నాలు ఇవ్వలేక పెళ్లి కొడుకులు దొరక్క తల్లి దండ్రులు పడే బాధలు చూపాడు .ఉద్యోగ పర్వం లోని విదుల అనే ఉత్తమ స్త్రీ కద ‘’విదులా పుత్రీయం ‘’.వార్తాపత్రికలలో వచ్చే సమకాలీన విషయాలపై రాసింది ‘’సముద్యతా ‘’.భార్యా భర్తల ‘’డిషుం డిషుం’’కథ’’దాంపత్య కలహం ‘’.ఊర్వశి ,శకుంతల ల గురించి ఉపాఖ్యాన యుగ్మకం వచనం లో రాశాడు .ఎవరూ ముట్టుకొని ,ఎవరూ రాయని అరుదైన విషయాలపై రాయటం నాగ రాజారావు పత్యేకత .
125- పంచ భాషా కవితా వల్లభ-ఆర్యార్ శ్రీ రామ శర్మ -(19 43 )
కర్నాటక లోని మెల్కోటే లో ఆర్యార శ్రీరామ శర్మ 19 43 ఆగస్ట్ 28 జన్మించాడు .తండ్రి శ్రీనివాస అయ్యంగార్ .సాహిత్య ,న్యాయ ,విశిస్టాద్వైతాలలో ఏం ఏ .మెల్కోటే సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ పంచ భాషా కవితా వల్లభ ,బిరుదు సంస్కృత ప్రాకృత కన్నడ తమిళ హిందీ భాషలలో రచనలు చేయటం వలన పొందాడు .సంస్కృతం లో అస్మత్ చంపు ,కదా కదంబకం కథా సాహిత్యం గాలి శతకం ,పాంచ జన్య శతకం ప్రకీర్ణ కల్లోలిని హంస ప్రతి సందేశః ,క్షుద్రకాంత ,క్షుద్ర కాదంబరి శ్రీ విజయ ధ్వని మొదలైనవి రాశాడు .
సంస్కృత విమర్శన గ్రంధాలుగా సంస్కృత కదా ప్రబంధం ,శాస్త్ర ప్రబంధం ,లఘుకావ్య ప్రబంధం ,సంశోధన ప్రబంధం విమర్శన ప్రబంధం ,ధ్యాని ప్రబంధం ఇతిహాస ప్రబంధం ,సాహిత్య మాత్రిక రాశాడు .ప్రాకృతం లో ప్రాకృత ముక్త వచయః ,ప్రాకృత పుష్పా పచయః రాశాడు ప్రాకృతం లో విశ్లేషణాత్మక విమర్శనాత్మక రచనలూ చేశాడు .రాజ శేఖరుని కావ్య మీమాంసను కన్నడీకరించాడు .కన్నడం లో విస్తృత కవితలు వ్యాసాలూ రాశాడు .పింగళ భారత ,రహస్య రత్నమాల మొదలైన తమిళ రచనలు ,హిందీలో చాలా వ్యాసాలూ రాసి సంపుటులుగా తెచ్చాడు .
కావ్య కల్లోలిని స్వయం సంస్కృత కవితలు వాటిని7 కల్లోలాలు అంటే7 అధ్యాయాలు-మంగళ ,వస్తు గీత ,కథ ,సంస్కృత ,,శృతి ,ప్రకీర్ణ కల్లోలాలుగా గా విడగొట్టాడు వీటిని శృంగారం అంగారం దేశభక్తి సమకాలీనత ,ఆధ్యాత్మికత ,హాస్యం అన్నీ రంగరించి రాసినవి .అస్మత్ చంపు లో సాంప్రదాయత ఆధునికత జోడించాడు .రామానుజా చార్యుల జీవితం ,విశిష్టాద్వైత మత విషయాలున్నాయి .చివరిది ‘’నిద్రా వైభవం ‘’లో విష్ణు మూర్తి దశావతారాలు వివిధ భంగిమలు వర్ణిస్తూ మానవుని మేల్కొలపటానికి జాగృత పరచటానికి రాశాడు
.
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -25-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా