బైజాంటిన్ నాగరకత
రోమన్ సామ్రాజ్యం రోమ్ నగరం నుండి పాలి౦ప బడింది .అందులో యూరప్ ,ఉత్తర ఆఫ్రికా ,పడమటి ఆసియా లున్నాయి .యూరప్ లో జర్మన్ కొండ జాతులు సరిహద్దులను ఆక్రమించటం ,సిరియా ,ఈజిప్ట్ లు రోమన్ రాజ్యాన్ని వ్యతిరేకించటం తో కల్లోలం సంక్షోభామేర్పడి రోమన్ సామ్రాజ్యం ప్రాభవం కోల్పోయింది .క్రీపూ 28 4 లో దియోక్లిటన్ అనే బలమైన చక్రవర్తి కల్లోల రోమ్ నగరం వదిలి పడమర వైపున్న అనటోలియా నుండి పాలన సాగించాడు .తర్వాత సామ్రాజ్యానికి ఇద్దరు చక్రవర్తుల ఉండాలని ప్రకటించాడు .పడమటిభాగామైన ఇటలి ,పడమటి యూరప్ బ్రిటన్ ఉత్తర ఆఫ్రికాలకు ఒక రాజు తూర్పు భాగమైన బాల్కన్స్ అనటోతోలియా సిరియా ,పాలస్తీనా ,ఈజిప్ట్ లకు మరో రాజు ఉండాలని ప్రతిపాదించాడు ..30 5 లో దయోక్లిటాన్ స్వచ్చందంగా పదవి నుంచి తప్పుకున్నాడు .పడమటి సామ్రాజ్యం లో బ్రిటన్ చక్రవర్తి 30 6 లో చనిపోగా సైన్యాధికారులుఅతనికొడుకు యువకుడైన కాన్ స్టాన్ టిన్ ను ను వారసునిగా ప్రకటించింది .ఆతను ఆతర్వాత 18 ఏళ్ళు ఏక చట్రాదిపత్యంగా రోమన్ సామ్రాజ్యాన్ని పాలించాడు .తూర్పు భాగం లోనే ఉంటానని కొత్త రాజధాని కావాలని భావించి బైజాంటిం అనే అనువైన చోట మహానగరం నిర్మించి అన్ని సౌకర్యాలు కలిపించాడు .ఈ నగరం ఎన్నో ఆటు పోట్లకు గురై నిలబడింది. ఇది ఆగాన్ సముద్రం నల్ల సముద్రం మధ్య స్ట్రాటేజిక్ పాయింట్ గా ఉన్నది .గొప్ప హార్బర్ ఉండటం అదృష్టం .ఈ నగరానికే తర్వాత తనపేరు కలిసోచ్చేట్లు కాన్ స్టాంటి నోపిల్ అని పే రుమార్చాడు .అతనిని” కాన్ స్టాన్ టిన్ ది గ్రేట్ ”అన్నారు . ” దీన్ని గోల్డెన్ సిటి అనేవారు . అప్పటి నుంచి నుంచి దీన్ని బైజాన్టిక్ సామ్రాజ్యం లేక బైజాంటిం అన్నారు .క్రీ శ 14 53 లో 9 వ కాన్ స్టాంటి న్ తో బైజాన్తిక్ సామ్రాజ్యం పూర్తిగా నాశనమైంది . కాని అది ఏర్పరచిన కళా సంస్కృతీ నాగరకత తరతరాలుగా నిలిచి దాని ప్రాభవాన్ని చాటింది .
భూమిపై భగవంతుని రాజ్యమేర్పరచాలన్న ధ్యేయం తో సామ్రాజ్యం ప్రారంభమైంది .క్రైస్తవమతమే రాజుకు ప్రజలకు మతం .వేష భాషలన్నీ గ్రీకు తరహా .మొజాయిక్ కళ దీని ప్రత్యేకత .అనేక చర్చిలు ధ్యానమందిరాలు నిర్మాణమయ్యాయి వివాహం సంతానం విద్య తో సామ్రాజ్యం వికసించింది .రోమ్ లో కేధలిక్ మతం ఉంటె ఇక్క ఆర్ధడాక్స్ క్రైస్తవ మతం ఉంది .సరైన విశ్వాసం ఉంటె మతం ద్వారా స్వర్గానికి వెళ్ళవచ్చు అని ప్రజలూ నమ్మారు ఆచరించారు .దీనిపై పబ్లిక్ గా చర్చలూ జరిగేవి మెజారిటీని అనుసరించారు రాజు దైవ ప్రతినిది .తమ పూర్వ వారసత్వ సంపదను తరతరాలుగా కాపాడుకోవటం వీరు చేసిన మంచిపని .సాహిత్య ,తత్వ శాస్త్ర సైన్స్ ,చరిత్ర లన్నీ ప్రాచీన గ్రీకు ,రోమన్ల లనుండి సంక్రమించాయి .తమ నాగరకతను చూసి గర్వపడే వారు బైజాన్టిక్ స్కూళ్ళు యూని వర్సిటీలు క్లాసికల్ రచయితల రచనలతో ఉండేవి విద్యార్ధులు వీటినాదారంగా విజ్ఞానం పొందేవారు .ధనవంతులు ఇంటివద్దే విద్య నేర్చేవారు .425 లో ప్రారంభమైన కాన్ స్టాంటి నోపిల్ యూని వర్సిటి ధర్మ శాస్త్రం మానవీయ విజ్ఞానం లను బోధించింది .సంఘం లో అన్ని తరగతుల వారూ విద్య కొద్దోగొప్పో నేర్చుకొనేవారు .చదువుకోవటం గొప్ప గౌరవం అని భావించేవారు .దేనిలో నైపుణ్యం ఉంటె వారితోనే ఆపని చేయించేవారు .మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలూ చదువుకునేవారు పై అంతస్తు మహిళ౦దరికి చదవటం రాయటం వచ్చు సాహిత్య పరిజ్ఞానం ఉండేది మగవారితో సమానంగా విషయాలపై చర్చించేవారు .
వీరి సాహిత్యం ఎక్కువభాగం గ్రీకులోనే ఉంది పెద్ద పెద్ద భవంతులలో ప్రాచీన వ్రాత ప్రతులు అనేక గదులలో ఉండేవి .సాహిత్యం లో ఎక్కువభాగం మతానికి సంబంధించిందే ఉన్నా నిఘంటువులు విజ్ఞాన సర్వస్వాలూ తేనే టీగల పెంపకం ,మిలిటరీ సైన్స్ పుస్తకాలున్నాయి .కవిత్వమూ ప్రచారం లో బాగానే ఉంది .ప్రేమ గీతాలు కథా గీతాలు వీరుల గీతాలు ఉన్నాయి స్త్రీ కవులలో కాస్సియా ప్రసిధి చెందింది అంద౦గా ఉండటం వలన రాజు ఆమెను రాణీ ని చేసుకొందామనుకొన్నాడు కాని ఆమెకు అతీంద్రియ శక్తి ఉన్నందున గ్రహించి ఆ ప్రతిపాదనను తిరస్కరించి కాన్ స్టాంటి నోపిల్ లో ఒక కాన్వెంట్ స్థాపించి అక్కడే చదువుకొంటూ రాసుకొంటూ జీవితం గడిపింది .ఆమె కవితలు చాలా భావ గర్భితంగా మతాతీతంగా ఉండేవి అందంగా ఉండటం లో తప్పూ ఒప్పూ గురించీ రాసింది
పూర్వం వారి చరిత్రలను భద్ర పరచుకోవటం వారికిష్టం .ఆ వ్రాత ప్రతులను భద్ర పరుస్తారు .ప్రాచీన గ్రీకు రోమన్ చరిత్ర కారులైన హియర్ దోటాస్,తూసి డైడ్స్ తాసిటస్ ల ప్రభావం ఎక్కువ .అనేక చోట్ల నుండి విషయాలు సేకరించటం ,ఇతర రచయితల రచనలు కాపీ చేసి ఉంచుకోవటం వారికి ఇష్టమైన పని కాని ఎందులో నుండి ఎవరి రచన కాపీ చేశారో రాయరు .బైజాన్ టిన్ విద్యావేత్తలు తమకాలపు విషయాలన్నీ రాసి భద్ర పరచారు .వీరి చరిత్రకారులలో ప్రసిద్ధుడు ప్రోకోపియాస్ మొదటి జస్టినియన్ చక్రవర్తికాలపు వాడు చక్రవర్తి కట్టించిన భవనాలు రాజప్రాసాదాలు చర్చిలు ,యుద్ధాల గురించి విస్తృతంగా రాశాడు .అతని కలా నికి రెండు వైపులా పదును ఉంది .రాజుగారి చీకటి కోణాన్నీ’’సెక్రెట్ హిస్టరీ గా వెలుగులోకి తెచ్చాడు .అందమైన ,స్థిర చిత్తం గల రాణి దియోడ్రాపై ఆశ్చర్యకరమైన అశ్లీల కట్టుకథలూ రాశాడు .11 వ శతాబ్దికి చెందిన విద్యా వేత్త మైకేల్ సెల్ల్స్ తెలివిగాలవాడే కాని విద్యా గర్వం ఉన్నవాడు .యూని వర్సిటి లో పని చేసి చారిత్రిక విషయాలు రాసి పత్రికలూ ప్రచురించాడు .రాజుల వద్ద మెప్పుపొంది రాజకీయం చలా యించేవాడు .చక్రవర్తులలో ఏడవ కాన్ స్టాంటి న్, మాన్యుయల్ కామస్ లు గొప్ప విద్యా వేత్తలు కొందరు రాయటం చదవటానికే సమయం ఎక్కువ ఇచ్చి పాలన పక్కన బెట్టేవారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా