బైజాంటిన్ నాగరకత -2

బైజాంటిన్  నాగరకత -2

క్రీ.పూ.6 5 8 లోనే బైజాంటిం లో గ్రీకు కాలనీ వాసులు స్థావరాలు ఏర్పరచుకున్నారు .క్రీ శ.2 93లో డయోక్లిటాన్ రోమన్ సామ్రాజ్యాన్ని వ్యవస్థీ కృతం చేశాడు 30 6 లో కాన్స్తాన్తిన్ చక్రవర్తి అయ్యాడు .312లో క్రైస్తవ మతం స్వీకరించాడు .32 4 లోమొత్తం రోమన సామ్రాజ్యాన్ని తన హస్తగతం చేసుకుని బైజాంటిం  ను రాజధాని చేసుకొని పాలించాడు ౩౩ ౦ లోదానికి  కాన్ స్టాంటి నోపిల్  అని పేరు పెట్టి  రోమన్ సామ్రాజ్యానికి నూతన రాజధాని చేసి పాలించాడు  .అంతకు అయిదేళ్ళక్రితం నికియాలో మొదటి ఎక్యూమేనికల్ కౌన్సిల్ సమావేశమై ఆర్ద డాక్స్ క్రిస్టియన్ మత౦  పై విశ్వాసం ప్రకటించింది . 392 లో పాగాన్ మతాన్ని ,దేవతలను దేవాలయాలను నిషేధించారు .413-434 మధ్య రెండవ ధియో డో సియస్ అనేకమైన నగర గోడలను కట్టించాడు 476లో రోమ్ఆస్ట్రో గోతస్ వశమై పడమటి రోమన్ సామ్రాజ్యం అంతమైంది .ఇక్కడ కాన్స్తాన్తిన్ తర్వాత జస్టినియన్ రాజ్యానికి 5 27 న వచ్చి 6 5 వరకు పాలించాడు .తరువాత చాలామందిపాలించారు 14 5 3 లో బైజాంటిన్ సామ్రాజ్యం కాన్ స్టాంటి నోపిల్ పట్టణం  అట్తోమాస్ టర్కుల స్వాధీనమై బైజంటిన్ సామ్రాజ్యం కను మరుగైంది . ఆ సంస్కృతిలో సాహిత్య విశేషాలు ఇంతకూ ముందే తెలుసుకున్నాం .

                                  చట న్యాయాలు

 ఇప్పుడు చట్ట న్యాయాలు తెలుసు కొందాం .చట్ట ప్రకారం అందరూ నడవాలన్నది  ముఖ్య విధి .రోమన్ ల ను సంక్రమించిన అనేక చట్టాలు సూత్రాలు ఎలా మార్చాలన్న దానిపై మొదటి జస్టి నియాన్ చక్రవర్తి నిష్ణాతులైన వారితో ఒక కమిటీ వేసి తేల్చమన్నాడు .వారి సలహాలతో ఒక చట్టం ఏర్పరచాడు దీన్ని కోడ్ ఆఫ్ జస్టి నియాన్ అన్నారు .చట్టాలలో మానవత్వానికి అధిక ప్రాధాన్యత నిచ్చాడు .యేసు చెప్పిన సోదర ప్రేమ కు విలువ కల్పించాడు .వీటివలన స్త్రీలకు బానిసలకు ,అప్పులవాళ్ళకు అధికారానికి దూరంగా ఉన్న వర్గాలవారికి వెసులు బాటు కలిగింది .బలహీనులకు వెనుకబడిన వారికి బలవంతులు అధికార వర్గాలవలన బాధ తగ్గింది .మరణ శిక్ష అరుదు గా ఉండేది .ఒక వేళ మరణ శిక్ష విధిస్తే ప్రజలందరి సమక్షం లో అమలు చేసేవారు చాలా నేరాలకు శిక్ష అంగవైకల్యం కలిపించటమే .అంటే చెయ్యో కాలో కన్నో తీసెయ్యటం .అతి సహజమైన శిక్ష కళ్ళు తీసెయ్యటం ..దీనివలన బలమైన శత్రువు భయపడి మీద పడటానికి జంకేవాడు .బైబిల్ లో చెప్పిన ‘’ఇతరులను చంపే అధికారం నీకు లేదు ‘’అన్నదాని ని బాగా అమలు చేసేవాళ్ళు చావుకంటే వాడి మానాన వాడిని పోనిద్దాం అనే ఉదార బుద్ధి ఉండేది .క్రిస్తియన్లు ఒకరికొకరు సాయం చేసుకోవాలని ముఖ్యంగా బీదలను ఆదుకోవాలని ఉండేది .దీనికోసం స్కూళ్ళు హాస్పిటళ్ళు ,అనాధ శరణాలయాలు కట్టించారు ముసలివారికి  అదృష్ట హీనులకు ఆదుకోవటానికి ఆశ్రమాలు ఉండేవి .రెండవ జాన్ కంయునాస్ చక్రవర్తి 50 పడకల ఆసుపత్రి కట్టించి అందులో గదులు ఆపరేషన్ దియేటర్ ఏర్పరచాడు ఈ విషయం లో బైజాంటిన్ సామ్రాజ్యం పశ్చిమ యూరోపియన్ సామ్రాజ్యం కంటే చాలా ముందు చూపుతో వ్యవహరించి బాధిత దుఖిత జనాలను గొప్పగా ఆదుకోన్నది .

                                సంగీతం

  బైజాంటిన్ నాగరకత లో సంగీతానికీ ప్రాధాన్యం ఉన్నది .మత ఉత్సవాలలో గాయక స్వరం మాత్రమే ఉండేది .వాయిద్యాల  హోరు  ఉండేవికావు .ఆకాలం లో ఫ్లూట్ ,వయోలిన్ ,డ్రమ్స్ ,కొమ్ము బూరాలుమొదలైన వాద్యాలను మతేతర ఉత్సవాలలో మాత్రమే వాడేవారు .దియేటర్ ,బాన్కేట్ ,వినోదాలలో వాద్య సంగీతం బాగా ఉండేది .సంగీత కర్తలు మ్యూజికల్ నోటేష న్స్స్ రాసేవారు  .ఆకాలపు సెక్యులర్ సంగీతం ఇప్పుడు కనిపించదుకాని మత సంగీతం భద్రంగానే ఉంది .సంగీత సంప్రదాయం అవిచ్చిన్నంగా కొనసాగించారు .తూర్పు యూరప్ ఆర్ధడాక్స్ చర్చి లలో ఇంకా బైజాన్టిక్ సంగీతం వినిపిస్తుంది

                            కళ,నిర్మాణం

బైజాంటిన్ కాలపు సెక్యులర్ ఆర్ట్ ఇప్పుడు లేదు .ఎక్కడో కాన్ స్టాంటి నోపిల్ లోని రాజ ప్రాసాదాలలో మాత్రమె గోచరిస్తుంది .అదృష్టవశాత్తు మత సంబంధ కళ సజీవంగా నే ఉంది .కాన్ స్టాంటి నోపిల్ ను క్రైస్తవ మత కేంద్రంగా చేయాలని కాన్ స్తాన్తిన్ చక్రవర్తి తీవ్రంగా కృషి చేశాడు సృజనకు  మేధస్సుకు  చర్చి నిర్మాణాలకు చాలా డబ్బు ఖర్చు చేశారు .. చర్చి  విభిన్నంగా మధ్యలో చతురస్రాకారం పైన అతి పెద్ద డోమ్ ఉంటుంది .చర్చి లోపల ఉన్నవారికి తాము స్వర్గ ఖండం లో ఉన్నామని పిస్తుంది డోమ్ లోపలి భాగమంతా అందమైన చిత్రాలతో కళాక్రుతులతో స్వర్గమే నని పిస్తుంది .చర్చి లలో మేరీ కన్య ఒడిలో బాల యేసును పెట్టుకున్న శిల్పాలు చిత్రాలు ఎక్కువగా ఉంటాయి .యేసు క్రీస్తు క్రాస్ అనేది ఎక్కడా ఉండదు .ఇది ఆర్ద డాక్స్ చర్చి ప్రత్యేకత .మేరీ ముఖం లో విధాదం కనిపించటమూ వింతగానే ఉంటుంది .ఏదైనా చాలా హుందాగా ఉంటాయి

 బైజాంటిన్ నాగరత ప్రత్యేకత దాని మొజాయిక్ ఆర్ట్ ..చిత్రాలు కాని శిల్పాలు కాని దానితోనే చేస్తారు .చైనా చిన్న రంగు  క్యూబ్ లతో వీటిని కూరుస్తారు .అద్భుత రంగుల ప్రదర్శన తోబాటు బంగారు నగిషీ కూడా గొప్ప అందాన్ని చేకూరుస్తాయి .ప్లాస్టర్ పై పెయింటింగ్ ళు వేసి చక్కగా అతికిస్తారు .రోమన్ కళలో పాగాన్ మైదాలజి గాధలకు ప్రాముఖ్యం ఎక్కువ .నీటి జంతువులూ జంతువులతో హీరో పోరాటాలు ఎక్కువ . రోమన్ మొజాయిక్ ఆర్ట్ నేలమీద ఎక్కువగా ఉంటుంది .కాని బైజాంటిన్ మొజాయిక్ ఆర్ట్ గోడలపై ఎత్తైన డోమ్ లపై అద్భుతంగా రాణిస్తుంది .మొజాయిక్ ఆర్ట్ లో వాడే చిన్న చిన్న చతురస్రాకార ముక్కలను రాళ్ళనుందడి  రంగు గ్లాస్ నుంచి  సేరామిక్ నుంచి కోసి చేస్తారు .దీనినే  ‘’టేస్సేరా’’అంటారు .గోడలకు ప్లాస్టర్ బాగా పూసి తర్వాత ఇంకో రకమైన పేస్ట్ పూసి దానిపై డిజైన్ గీసి టేస్సేరా ముక్కలను దానిపై కలర్ ఫుల్ గా అ౦టిస్తారు .ఇదే మొజాయిక్ ఆర్ట్ .బైజాంటిన్ మొజాయిక్ ఆర్ట్ ప్రత్యేకత విపరీతంగా బంగారు రేకులను వాడటమే.వీరి ఈ కళఎక్కువగా గోడలపై డోమ్ లోపలా కనిపించినా ఇటీవల ఇస్తాంబులో అంటే పాత కాన్ స్టాంటి నోపిల్ లో త్రవ్వకాలలో 6 వ శతాబ్దికి చెందిన భవనం బయట పడి జంతువులూ  పురాణ చిత్రాలు   వేటగాళ్ళు చెట్లూ ఆడుకొనే పిల్లలు ,అనేక పనులలో నిమగ్నమైన వారు కళలో కనిపించారు నేలమీద కూడా బైజాన్టిక్ మొజాయిక్ ఆర్ట్  దర్శనమిచ్చి ఆశ్చర్య పరచింది .చక్ర వర్తులు మొజాయిక్ ఆర్ట్ ద్వారా బైజాన్టిక్ సంస్కృతిని సామ్రాజ్యమంతటా వ్యాపింప జేయాలని భావించారు .దూర ప్రదేశాలలో చర్చి నిర్మాణానికి టేస్సేరా పంపేవారుకాదు. శిల్పులనే పంపి అక్కడే తయారు చేయించేవారు .డమాస్కస్ లోని గ్రేట్ మాస్క్ లో ఇప్పటికీ బైజాన్టిక్ మొజాయిక్ ఆర్ట్ ,అందులో చెట్లు ,నదులు ,భవనాలు మరింత అందంగా కనిపిస్తాయి .

 బైజాంటిన్ ఆర్ట్ లో పుణ్య పురుషుల విగ్రహాలకు ప్రత్యేకత ఉంది వీటిని చెక్కపై చక్కగా చెక్కారు .చర్చి లలోనే కాక ఇళ్ళల్లోనూ వీటిని ఉంచుకోనేవారు .ఇవి చిన్నవిగా ఎక్కడికైనా తీసుకు పోవటానికి వీలుగా ఉండేవి .బైజాంటిన్ ఆర్ట్ లో చిత్రాలను చూస్తే మొదట్లో మనకు ఆశ్చర్య మేస్తుంది అవి చిన్నపిల్లలా చేస్టల్లాగా ఉంటాయి .వికృతంగా కనిపిస్తాయి .ఏమిట్రా బాబూ ఇది కళా లేక కాకర కాయా అని పిస్తుంది .కాని కళ పరమార్ధం వారికి వేరు గా ఉంటుంది అది మతానికే అరిమితం .ఏదైనా పవిత్రంగా ఉండాలి .అందుకని మానవాక్రుతులలో నిజం కంటే ఆబ్ స్ట్రాక్ట్ ఆర్ట్ ఉంటుంది .దేవతలు చక్రవర్తుల ఖరీదైన దుస్తులతో కిరీటాలతో  ధగ ధగ మెరిసే అలంకారాలతో వ్యక్తుల్గా కాకుండా గొప్పతనానికి చిహ్నాలుగా తయారు చేస్తారు .

 ఆవ శేషాలు లేక రేలిక్స్ లో బైజాంటిన్ కళ మూఢ నమ్మకాలు కనిపిస్తాయి .కలలు,అద్భుతాలు జోస్యాలను బాగా నమ్మేవారు .సన్యాసులను పవిత్ర శీలురుగా భావించేవారు .వారికి దివ్య శక్తులున్నాయని నమ్మేవారు .ఎప్పుడూ ఏదో ప్రమాదం అకస్మాత్తుగా మీద పడుతుందనే భయం వారిలో ఉండేది .నిరంతరం టెన్షన్ లో ఉండి,అతీత శక్తులు కాపాడాలని భావించేవారు ..

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2ఇన్‌లైన్ చిత్రం 3ఇన్‌లైన్ చిత్రం 4ఇన్‌లైన్ చిత్రం 5

 సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.