బైజాంటిన్ నాగరకత -3 (చివరి భాగం )

బైజాంటిన్   నాగరకత -3 (చివరి భాగం )

బైజాంటిన్ సామ్రాజ్యకాలం లో అది ప్రపపంచ మార్కెట్ ను శాసించింది . కాన్ స్టాంటి నోపిల్ ను గోల్డెన్ సిటి అని పాలనకాలాన్ని స్వర్ణయుగమని అన్నారు .క్రిసేండం లో జ్యుయేల్ అనేవారు .విశాల మైన రాజవీదులు ,ఎత్తైన ప్రాకారాలు అందాల భవనాలు మంచినీటి సౌకర్యం తోపాటు మురికి నీటి పారుదల ఏర్పాట్లు గొప్పగా ఉండేవి .బంగారు కిరీటాల గదులు  విందు వినోద మందిరాలు ఫల పుష్ప ఉద్యానవనాలు ,పోలో గ్రౌండ్  ,గుర్ర౦ స్వారీ నేర్పే స్కూళ్ళు  చెత్త పారవేసే పకడ్బందీ ఏర్పాట్లు ఉం బైజాది .పడమటి యూరప్ లో ఎక్కడా ఇలాంటి ఏర్పాట్లు లేవని చరిత్ర కారులు రాశ్హారు .స్వర్ణయుగమే కాదు బంగారు గనికూడా .అందుకే శత్రువుల కళ్ళు ఎప్పుడూ దీనిపైనే ఉండేవి .ఓడ రేవులలో వ్యాపారం ,అన్ని రకాల బోట్లు , వీదులనిండా  స్కాండి నేవియన్లు   ఫ్రాంకులు ,ఈజిప్షియన్లు ,బెర్బెర్లు ,ఉత్తర ఆఫ్రికా ,పెర్షియన్ జనాలతో కళకళ లాడుతూ జన   సమ్మర్దం గా  ఉండేవి .అరుదైన బంగాగారు ఆభరణాలు నగా నట్రా ,దంతపు బొమ్మలు ,సున్నిత చర్మ వస్తువులు  సుగంధ ద్రవ్యాలు సెంట్లు  నాణ్యమైన గాజు పింగాణీ  వస్తువులు  షాపుల్లో దర్శన మిచ్చేవి .ఒక ఆరకంగా నగరం ధగ ధగ మెరిసిపోతూ ఇతర దేశీయులకు అసూయ కలిగించేది .

 బైజాంటిన్ లకు రధాల స్వారీ పందాలు మహా ఇష్టం .అక్కడ కోడి గుడ్డు  ఆకారపు స్టేడియం లుండేవి .60 వేల మంది ప్రేక్షకులు కూర్చుని చూచే ఏర్పాటు ఉంది .అవినీతి అధికారులపై ప్రజలు తిరగ బడేవారు .వారిలో బ్లూస్ అని గ్రీన్స్ అని రెండు గ్రూపులు ఉండేవి .ఒకసారి శత్రురాజు రధాన్ని ప్రశంసిస్తూ చక్రవర్తి  జస్టినియన్ ను యెగతాళి చేయటం జరిగితే సహించలేక మూడు వేలమంది సైన్యాన్ని హిప్పోడ్రోం ప్రదర్శన శాలకు పంపి ,తలుపులన్నీ మూయించి 30 వేలమందిని ఊచకోత కోయించాడు . దీనినే నీకా ఆందోళన అన్నారు .దీనితో బ్లూ గ్రీన్ గ్రూపులు అంతరించాయి .

 దాదాపు లక్షన్నర సైన్యం ఉండేది 7 నుంచి 12 వ శతాబ్ది వరకు అది అత్యంత క్రమశిక్షణ మెరుగైన శిక్షణ ఉన్నదిగా పేరు పొందింది అదే లేకపోతె సామ్రాజ్యం చిక్కుల్లో పడేది .ఆశ్విక దళం సర్వ సమర్దమైంది .దాదాపు ఆత్మ రక్షణకే సైన్యాన్ని ఉపయోగించారు .వారి పవర్ ఫుల్ ఆయుధం ‘’గ్రీక్ ఫైర్’’ఇది అకస్మాత్తుగా అంటుకొని ఒక గొట్టం గుండా ప్రయోగిస్తే యుద్ధ నౌకలపై పడి మండించేది .నీటిలో పడినా ఇంకా కాలుతూనే ఉండేది .దీన్ని చూస్తే శత్రువుల గుండెల్లో  రైళ్ళు పరిగెత్తేవి . .దీన్ని పట్టణాన్ని ఆరబ్ ముస్లిం ల దండయాత్ర లో కాపాడుకోవటానికి మొట్టమొదట తయారు చేశారు .రష్యా నౌకల్ని దగ్ధం చేసి లోనికి ప్రవేశించకుండా పట్టణాన్ని కాపాడింది .ఇందులో గంధకం ,సాల్ట్ పీటర్ ,నాఫ్తా  లిక్విడ్ పెట్రోలియం ఉపయోగిస్తారని ఊహించారు తప్ప ఇప్పటికీ దాని రహస్యం ఎవరికీ తెలియదు అంత సీక్రెట్ గా కాపాడుకొన్నారు .  సామ్రాజ్యం గ్రీకు –రోమన్ సంస్కృతి నాగరకత లకు  నిలయమైంది ముఖ్యమైన సిటి గా పాగాన్ ఆరాధనా నిలయంగా ఉండి తర్వాత కాలం లో విగ్రహారాధన నిషేధింప బడింది .క్రైస్తవాన్ని విస్తరింప జేయటానికి బలీయమైన ఆఫీసర్లను నియమించారు .రోమ్ లో బిషప్పులు ఉన్నతాదికారులైతే ఇక్కడ  పాట్రియార్క్ బిషప్పులపైన ఉన్నతాధికారి .చక్రవర్తి ,పాట్రి యార్క్  నిర౦తర సంప్రదింపులు జరిపేవారు .బైజాంటిన్ సామ్రాజ్యం అంటే ‘’హెవెన్ ఆన్ ఎర్త్ ‘’అంటే అందరికి సమానావకాశాల కల్పనా, యేసు పేరుతో అందరూ కలిసి ఉండటం .ఆయనే ‘’ప్రిన్స్ ఆఫ్ పీస్ ‘’చక్రవర్తి దైవాంశ సంభూతుడు పాగాన్ దేవతలలో ఒకడు. దైవ ప్రతినిధి .దేవుడే ఎంపిక చేసి భూమికి పంపాడని నమ్మకం .ఆయన ఎవరికీ బాధ్యుడుకాడు .దైవం పై నమ్మకం తో ఆయన ప్రవర్తిస్తాడు సామ్రాజ్యం పూర్తీ ఆటోక్రసీ కేంద్రం .చక్రవర్తితో సహా అందరూ యుద్ధాన్ని కోరని శాంతిప్రియులు .విదేశీ దండయాత్ర చేయరు .బైజాంటిన్ అనే మాటకు రెండు అర్ధాలున్నాయి వంచకుడు ,రహస్య ప్రవర్తకుడు ,అని. అందుకే శత్రువుని నయానా భయానా బెదిరిస్తారు. ముందు ,చర్చలు జరుపుతారు ,డబ్బు ఇచ్చి మచ్చిక చేసుకొంటారు .బంగారం నగదు ఇచ్చి వశ పరచుకొంటారు .వీరి ప్రవర్తన చాలా సంక్లిష్టంగా ఉంటుంది .దీనికి కారణం అతిపెద్ద బ్యూర్రాక్రాసి ఉండటం .వీరి తెలివి తేటలతో చక్రవర్తికి మంచి మార్గం చూపిస్తారు లేక కపటం తో ముంచుటారు .కనుక ద్విస్వాభువులు. లోకం లో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే ‘’బైజాంటిన్ ప్రవర్తన ‘’అనే పేరు స్థిరపడింది .

 ఒక బైజాంటిన్ చక్రవర్తి పేరు ‘’బేసిల్ బల్గారో క్తానాస్ అంటే బల్గర్లను వధించిన బేసిల్ .9 7 6 రెండవ బేసిల్ అధికారానికి వచ్చాడు పొట్టిగా రాజ ఠీవి లేకుండా సామాన్య దుస్తులతో ఉండేవాడు గుర్రపు సవారిలో ఎక్స్పర్ట్ .క్రమంగ్గా పాలన అంతా నేర్చి సైన్యాన్ని నడిపించటం తెలుసుకొన్నాడు .అతని జీవితమంతా యుద్దాలతో గడిచింది .బాగ్లర్లు అనే ఆటవిక జాతి సమర్ధుడైన వాడి నాయకత్వం లో 9 8 6 లో బేసిల్ చక్రవర్తిపై దాడి చేశారు .చాలా యుద్ధాలు చేశాడు గట్టి సైన్యం కూర్చుకున్నాడు చివరికి 10 14 లో వారిని ఓడించి 15 వేలమందిని బందీలను చేసి అందరి కళ్ళు పోడిపించి వందమందికి ఒక్కకన్ను మాత్రమె ఉంచి పంపించేశాడు .బర్గ్లర్ రాజు ఈ షాక్ తో చచ్చిపోయాడు .వాళ్ళ ధైర్యం సడలిపోయి బైజాన్టిక్ పాలనలోకి వచ్చారు అందుకే బేసిల్ ను బేసిల్ ది బగ్లర్ కిల్లర్ ‘’అన్నారు

 మొదటి కాన్ స్తాన్తిన్ ‘’చర్చ్ ఆఫ్ ది హోలీ  విస్డం ‘’ను చాలా ఎత్తైన ప్రదేశం లో రాజధానిలో కట్టించాడు .అయిదేళ్లపాటు నిర్మాణం జరిగి 5 37లో పూర్తయింది .21 ఏళ్ళ ఆతర్వాత చర్చి డోమ్ భూకంపం వలన కూలింది .శిల్పి నిరాశ చెందక మరింత పెద్దది కట్టాడు .ఇప్పటికీ ఇది ఉంది .సున్నిత రిం విండో లపై ఇది బహు నాజూకుగా ఉంటుంది .గాలిలో తేలుతున్నట్లే ఉంటుంది 18 ౦ అడుగుల ఎత్తులో  100 అడుగుల వ్యాసం తో .చర్చి అంతా బంగారం వెండి దంతం కళ్ళు చెదరే మొజాయిక్ తో సుందరాతి సుందరం గా ఉంటుంది వేలకొలది దీపాలతో ధగ ధగ లాడుతుంది .ఈ చర్చినే ‘’హేగియా సోఫియా ‘’అంటే సోఫియా ముని అంటారు .సోఫియా జ్ఞాపకార్ధం హోలీ  విస్డం అనే ఈ చర్చిని కట్టించాడు .14 53లో టర్కీల ఆక్రమణ తర్వాత ఇదే మసీదుగా మారింది

  జోర్డాన్ లో 2 వేల ఏళ్ళనాటి పెట్ర నగరం త్రవ్వకాలలో ఈ మధ్య బయట పడింది .అది పెద్ద సంపన్న వ్యాపార పట్టణం ఆరబబుల  రాజధాని పేరు నేబతెనియన్స్ .తర్వాత రోమన్ సామ్రాజ్య వశమైంది .ఇప్పటిదాకా పెట్రా నగరం భూకంపం వలన నాశనమైందని భావించారు ఈ త్రవ్వకాలలో అసలు విషయం తెలిసింది ఇది ప్రాచీన బైజాంటిన్ సామ్రాజ్యం లో ఉండేది .ఇందులోని చర్చి లోపలి గదులలో పాపిరస్ చుట్టలు కనిపించాయి.అగ్నిలో కొంతభాగం కాలి ఉన్నాయి ఇప్పటికీ వాటిని చదివే వీలు ఉంది ఈ వ్రాత ప్రతులు 53 7-5 9 4 కాలానివి .వేటిలో వీలునామాలు రసీదులు కాంట్రాక్ట్ పత్రాలు కనిపిస్తాయి .ధనవంతుల ఇళ్ళుఉన్నాయి  ఈ ప్రజలు చర్చి హాస్పిటల్ స్కూల్స్ నిర్మించటానికి ఆర్ధిక సాయం చేసిన దాఖలాలు కనిపిస్తాయి కొందరు మిలితరిలో పని చేసినట్లు ,బలమైన కోతలు ఉన్నట్లు  35 ౦ మంది బానిసల పేర్లున్నాయి అందులో ఆడవారు 27 మందిమాత్రమే   ఆకాలం లో పేత్రా ఆదాయం వర్త్కమేకాక వ్యవసాయం కూడా .6 వ శతాబ్దానికే అది విడిచి పెట్టబడిన నగరం కాలేదని ఆతర్వాత చాలా ఏళ్ళు నిలబడి ఉందని 19 93 త్రవ్వకాల ద్వారా తెలిసింది ఇంత సుదీర్ఘ సంస్కృతీ నాగరక చరిత్ర ఉన్నది బైజాంటిన్ సామ్రాజ్యం లో

ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2ఇన్‌లైన్ చిత్రం 3

ఇన్‌లైన్ చిత్రం 4.ఇన్‌లైన్ చిత్రం 5ఇన్‌లైన్ చిత్రం 6

  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-17-కాంప్-షార్లెట్ -అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.