కొందరు హిమాలయ యోగులు -2(చివరిభాగం )
3-నిప్పు స్వామి
హిమాలయాలలో ఒక స్వామి నోటినుంచి నిప్పు అంటే మంటలను వెదజల్లెవాడు ..చిన్న అగ్గి పుల్ల ఆపని చేస్తు౦ది కదా యోగ శక్తులను అంతర్ముఖం చేసుకో కుండా ఈ ప్రదర్శనలేమిటని గురువు ఈసడిస్తే ఆశ్రమం వదిలి వెళ్ళిపోయాడు .
4- నీమ్ కరోలి బాబా
నీం కరోలి బాబా కు ఎక్కడెక్కడ ఏమి జరిగిందో జరుగుతుందో తెలుసు .ఎవరైనా ఆయన్ను దర్శించటానికి వస్తే నువ్వు ఫలానా రోజున ఫలానా సమయం లో ఫలానా చెట్టు కింద నన్ను గురించి చెడ్డగా మాట్లాడావు గుర్తుందా ఇప్పుడు నన్ను చూడటానికి వచ్చావా వెళ్ళు వెళ్ళు అని తరిమేసేవాడు ఒక సారి ఆయన శిష్యుడైన ఒక ఫార్మసిస్ట్ దర్శించటానికి వచ్చాడు బాబా తనకు ఆకలిగా ఉందని ఆతని చేతిలో ఏది ఉంటె దాన్ని ఆహారంగా పెట్టమని కోరాడు .ఆతను తనదగ్గర ఆర్సేనికి ఉందని అది ప్రమాదమని వెంటనే భోజనం తెస్తానని అన్నాడు .బాబా అతని దగ్గర్నుంచి ఆర్సెనిక్ పౌడర్ లాక్కుని గుప్పెడు నిండా తీసుకొని గ్లాసెడు మంచి నీళ్ళతో తినేశాడు చచ్చి పోతాడేమో నని అందరూ కంగారు పడ్డారు .కాని బాబాకు ఏమీ కాలేదు మర్నాడు యదా ప్రకారం తన కార్య క్రమాలు చేసుకొన్నాడు .
బాబా ఎప్పటికప్పుడు ఆకలిగా ఉందనే వాడు .ఎదుటివారు ఆయన అంతక్రితమే భోజనం చేశాడని చెబితే ‘’అయితే’’ వాకే ‘’ఆకలి లేదు ‘’అనేవాడు .ఒక రోజు ఆయన 45 సార్లు భోజనం చేశాడు .తన శక్తిని ప్రదర్శించాలని ఆయన తహతహ ..అంతటి గొప్ప స్థాయి ఉన్నబాబా పసిపిల్లడిలాగా ప్రవర్తిస్తాడు .
5-దిగంబర అస్సాం సన్యాసిని
అస్సాం కామాఖ్య దేవాలయం ప్రక్కనే చిన్న గదిలో ఈ దిగంబర సన్యాసిని ఉండేది . 96 ఏళ్ళ వయసు .ఆమె పగటిపూట గదిలో నుంచి బయటికి వచ్చి అప్పటికి 20 ఏళ్ళయింది గదిలోనే సమాధిలో ఉండిపోయేది .అయితే అర్ధరాత్రి దాటాక తెల్లవారు జామున మూడు గంటలకు ఆమె కామాఖ్యశక్తి దేవాలయానికి వెళ్లి మంత్రాలు చదువుతూ అమ్మవారిని పూజించేది .ఒంటి మీద నూలు పోగు కూడా ఉండేదికాదు .బక్క చిక్కి శాల్యావశిస్టమై ఎముకలకు చర్మం అతికించినట్లు ఉండేది .కళ్ళు మాత్రం అగ్ని గోళాలుగా ప్రకాశం తో ఉండేవి .స్వామి రామా ఆమె గది ప్రక్కనే మరో గదిలో ఉండేవాడు ఆమె చర్యలన్నీ గమనించేవాడు .ఒక రోజు రాత్రి ఆమె దేవాలయానికి వెళ్ళినప్పుడు చప్పుడు చేయకుండా తానూ వెనక వెళ్లి ఆమె చేసేవన్నీ చూశాడు .రావద్దని హెచ్చ రించి బెత్తం పెట్టి కొట్టి తరిమేసింది ఒక రోజు. అయినా ఈయన మానలేదు అప్పుడు రామా కున్న మారు పేరుతొ పిలిచింది ఆశ్చర్య పోయాడు ఈ నిక్ నేం ఆయన గురువుకు తప్ప ఎవరికీ తెలియదు .అప్పుడు స్వామి రామాను దగ్గర తీసుకుని తొడడ పై కూర్చో బెట్టుకొని’’నీసాధనలో కొన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకే వెడతావు నా శీస్సులు ఇస్తున్నాను ‘’అని ఆశీర్వదించగా రామా కు స్వర్గం లో తల్లి ఒడిలో ఉన్నట్లనిపించింది .అర్ధ రాత్రి అంకమ్మ శివాలులాగా ఈ గుడిలో ఏం చేస్తున్నావని రామా ఆమెను చనువుతో అడిగాడు .శక్తి పూజ చేస్తున్నట్లు చెప్పింది .రాత్రి 12 నుంచి మూడువరకు నా దగ్గర ఎవరున్నా సహించలేను ‘’అన్నది అందుకనే ఆ శక్తి దేవాలయానికి అర్ధ రాత్రి 12 నుంచి 2 వరకు మళ్ళీ 3 నుంచి నాలుగున్నర వరకు ఎవరూ దర్శించరు.స్వామి రామా ఆమెను మాతృ గురువు ‘’గా మదర్ టీచర్ గా భావించాడు .చాలా శక్తి సామర్ధ్యాలు ఉన్న చాలా ప్రశాంతం గా ఉండేది .ఆమె ఏది చెబితే అది జరిగేది .ఆమె రాత్రి ఏనాడు నిద్ర పోయి ఎరుగదు తపో భంగిమలో కూర్చునే ఉండేది రాత్రంతా .ఒక రోజు స్వామిరామా ‘’అమ్మా మీరు పడుకుని నిద్రపోతే మీ మీకాళ్ళకు మాసేజ్ చేస్తాను ‘’అన్నాడు ఆమె వెంటనే ‘’నిద్రా ! అది నాకు పడదు .నేను జడత్వానికి ,బద్ధకానికి అతీతం .నేను నిద్ర లేని నిద్ర పోతాను .దానికి పడుకోవాల్సిన పని లేదు యోగ నిద్రలో ఆన౦ దించేవారికి పంది నిద్ర ఎందుకు ?’’అన్నది .దీని అర్ధం ఏమిటి అని అడిగితె ‘’పందులు శక్తికి మించి తెగతిని అరగటానికి గురక పెడుతూ నిద్రపోతాయి అవి అంతకాలం ఎలా నిద్రపోతాయోనని ఆశ్చర్యమేస్తుంది ‘’అంటూ ని ద్రా శాస్త్రాన్ని చక్కగా వివరించింది ..అప్పుడు మాండూక్య ఉపనిషత్ లోని మూడు నిద్రావస్తలు గుర్తుకు వచ్చాయి .స్వామి రామకు చివరిసారిగా సందేశమిస్తూ ‘’ఈ భౌతిక తల్లి బి౦బానికి అతుక్కు పోకు .నేను విశ్వ మాతను .సర్వాంతర్యామిని నీ అంతరాత్మను తెలుసుకో .భయం వీడు నేను నీతో ఎప్పుడూ ఉంటాను ‘’అనగానే రామా కళ్ళు నీళ్ళతో సుళ్ళు తిరిగాయి
6-దేవర బాబా
ఉత్తర ప్రదేశ్ లోని దేవరబాబా వయస్సు 15 ౦ ఏళ్ళు అని అంటారు అప్పటికే .హిమాలయ పర్వత గుహలలో ధ్యాన తపస్సులు చేస్తూ అప్పుడప్పుడు తూర్పు ఉత్తర ప్రదేశ్ కు వస్తాడు ప్రధమ రాష్ట్ర పతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ఆయన ముఖ్య భక్తుడు .తన చిన్నతనం లో తండ్రి బాబా దగ్గరకు తెసుకు వెళ్ళాడని అప్పటికే ఆయన చాలా ముసలివాడని రాజేంద్ర ప్రసాద్ రాశాడు . రిషీ కేష్ లో తాత్కాలిక పైన్ వుడ్ గుడిసె లో ఉండేవాడు .ఒక్కోసారి చెట్టుకిందే ఉండి పోయేవాడు .చాలా నియమ నిష్టలతో పవిత్రంగా ఉండేవాడు ఎవరినీ తాక నిచ్చేవాడు కాదు .ఉత్తర భారత దేశమంతా దేవర బాబా శిష్యులే ఆయన కిందికి దిగి వచ్చాడని తెలిస్తే వేలాది మంది దర్శనానికి వచ్చేవారు .గట్టి పోలీసు బందోబస్తు ప్రభుత్వం చేసేది . కుంభ మేళాలో ఆయన్ను చూడటానికి విదేశాలనుంచి కూడా వేలాది భక్తులు వచ్చేవారు .ఆయన ఆహారం పళ్ళు కూరలు మాత్రమె .’’సంతోషమే గొప్ప సంపద .నియమ నిబద్ధత జీవితానికి అవసరం నూతన శ్వాస విధానాలు పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది టెక్నిక్ ఆఫ్ ఏజ్ లెస్ నెస్ ఈజ్ టెక్నిక్ ఆఫ్ ప్రాణ యామ’’అన్నది ఆయన సిద్ధాంతం ప్రేమైక మూర్తిగా దేవర బాబా ప్రసిద్ధుడు
మరి కొన్ని విషయాలు
బదరీనాద్ దగ్గర వాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంది .అవి వికసించే కాలం లో అందరూ వెళ్లి చూసి మహదానందం పొందుతారు అనేక రంగులు రకాలు వాసనలతో కనులకు వైభోగం ఉంటుంది .అయితే ఆ పూల వాసన ఎక్కువ సేపు పీలిస్తే మత్తు మైకం వచ్చి జ్ఞాపక శక్తి తాత్కాలికంగా కనుమరుగౌతుంది కొన్ని గంటల ఆతర్వాత కాని మళ్ళీ విషయాలు గుర్తుకు రావు ..ఇక్కడే సిక్కుల గురుద్వారాకూడా ఉంది
వారణాసి లో ఒక వేశ్య ఉండేది .ఆమె పేరు బాగా ప్రచారం లో ఉండేది .ఒక చిన్న బోటు లో గంగానదిలో ఉండేది బోటు బయట ‘’నేను వేశ్యను నన్ను సాధువుగా అపార్ధం చేసుకోవద్దు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి భంగం కలిగించవద్దు ‘’అని బోర్డ్ ఉండేది .సాయం సమయం లో నీటినుంచి బయటికి వచ్చి ఇసుక తిన్నెలపై కూర్చుని ఏకాంతంగా మంత్రాలు చదువుకొనేది వేలాది మంది ఆమెతోపాటు చదివే వారు ..ఎవరితోనూ మాట్ల్లాదేదికాడు సౌజ్ఞలు చేసి తనతోపాటు దైవ స్మరణ చేయమని చెప్పేది .ఒక రోజు సాయంత్రం దాదాపు ఆరు వేలమంది ఆమె దగ్గర ప్రార్ధనలు చేస్తుంటే ‘’నేను ఉదయానికల్లా వెళ్లి పోతాను నా శరీరం గంగలో పడెయ్యండి ‘.అది చేపలకన్నా ఆహారంగా ఉపయోగ పడుతుంది ‘’అని చెప్పింది .చెప్పినట్లే మర్నాడు ఉదయం ఆమె దేహం చాలించింది ఆమె కోరిక తీర్చారు భక్తులు .
మహాత్మా గాంధి నడుస్తుంటే చాల తమాషా గా ప్రత్యేకంగా ఉంటుంది మునుల మహర్షుల నడకకంటే అతి భిన్నంగా ఉంటుంది .ఆయన నడుస్తుంటే ఆయన -శరీర౦ నుంచి విడిపోయినట్లు కనిపిస్తుంది .గుర్రం బండిని లాగినట్లు ఆయన శరీరాన్ని లాగుతూ నడుస్తున్నట్లు అనిపించటం విశేషం .దీన్ని ఆతెన్ బరో తీసిన గాంధి సినిమాలో గాంధీగా నటించిన బెంక్లిన్ చక్కగా చూపించాడు దీనికి కారణం అయన ఎప్పుడూ కులమతాలకు అతీతంగా అందరినీ ప్రేమించటం అందరి క్షేమం కోసం ప్రార్ది౦చ టమేఅంటారు . .ఆయన కు ముగ్గురు గురువులు క్రీస్తు కృష్ణుడు బుద్ధుడు .
స్వామి బ్రహ్మానంద అరుదైన సిద్ధుడు .శ్రీ విద్యపై నిష్ణాతుడు .ఆయనకున్న అద్భుత శక్తులను గుర్తించి స్వామి కరపత్రి అనే మహా విద్వాంసుడు ఆయనను మూడు వందల ఏళ్ళుగా ఖాళీ గా ఉన్న ఉత్తర శంకరాచార్య మఠానికికి పీఠాధిపతి గా ఉండమని కోరగా అయ్యాడు .వేలాదిమంది అనుచరులతో యాత్రలు చేసేవాడు భక్తిని అద్వైతం తో జోడించి ప్రసంగించటం ఆయన ప్రత్యేకత .స్వామి బ్రహ్మానంద వద్ద అరుదైన కెంపు లతో చేయబడిన శ్రీ యంత్రం ఉండేది
సమాప్తం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా