జ్యోతిర్మఠపీఠాధిపతి-స్వామి బ్రహ్మానంద సరస్వతి
20-12-18 6 8 న జన్మించిన రాజారావు సన్యాసి అయి 15 0ఏళ్ళు ఖాళీగా ఉన్న ఉత్తర భారత దేశంలోని బదరీ క్షేత్రానికి దగ్గరలో ఉన్న జ్యోతిర్మఠఉత్తర ఆమ్నాయ పీఠాధి అవటం వింతయైన కధ.
అయోధ్య దగ్గర గణ గ్రామంలో ‘’మిశ్ర ‘’అనే బ్రాహ్మణ కుటుంబం లో రాజా రావు పేరుతో జన్మించి ,ఆధ్యాత్మిక భావ లహరిలో మునిగి తేలుతూమహా యోగి రాజు అని పించుకొని , మన ఆది శంకరాచార్యులవలె 9 వ ఏట తగిన గురువును అన్వేషిస్తూ ఇల్లు వదిలి పెట్టి వెళ్ళాడు .కాని ఒక పోలీసు గుర్తుపట్టి ఇంటికి తీసుకు వచ్చి అప్పగించాడు .తనకు గృహస్తాశ్రమం లో ఇష్టం లేదని సన్యసించాలని ఉందని చెప్పాడు .పెళ్లి చేసుకోమంటే వద్దన్నాడ్డు .ఇంటి పురోహితుని అడిగారు ఆయన కుర్రాడి యోగ జ్ఞానానికి అబ్బుర పడి అతని ఇష్టం ప్రకారమే చేయమని సలహా ఇచ్చాడు తలిదంద్రులకూ కొడుకు రాజారాం ఆధ్యాత్మిక బలం అర్ధమై సరేనన్నారు . రెండు రోజులతర్వాత ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి తపస్సుకోసం హిమాలయాలకు వెళ్ళాడు . .సరైన గురువుకోసం అణ్వేషిస్తూ ఎందరినో చూసి వారెవ్వరూ తన ఆధ్యాత్మిక దాహం తీర్చే సమర్దులుకారని నిర్ణయించుకున్నాడు .హరిద్వార్ రుశీ కేష్ లకు వెళ్ళాడు .14 వ ఏట ఉత్తర కాశిలో స్వామి కృష్ణానంద సరస్వతిని దర్శించి ఆయనే తాగిన గురువని శిష్యుడయ్యాడు .ఆయన ‘’బ్రహ్మ చైతన్య బ్రహ్మ చారి ‘’అనే పేరుపెట్టాడు రాజా రామ్ కు . గురువు చెప్పినట్లు సాధన చేస్తూ ప్రక్కనే ఉన్న గుహలో తపస్సు చేసి వారానికి ఒక్క సారిమాత్రమే గురు దర్శనం చేసేవాడు .25 వ ఏట గుహ నుండి బయటికి వచ్చి గురువుగారి ఆశ్రమం లో ఉండి పోయాడు .34 వ ఏట కుంభ మేళ సమయం లో గురువు శిష్యునికి సన్యాస దీక్షనిచ్చి స్వామి బ్రహ్మానంద సరస్వతి అనే దీక్షా నామం ఇచ్చాడు .ఇక్కడి నుంచి మధ్య భారతం చేరి ఒక గుహలో ఏకాంతం గా తపోధ్యానాలతో 40 ఏళ్ళు ఉన్నాడు .
7 0 వ ఏట .అనేక విద్యావంతులు బ్రహ్మానంద ను అప్పటికి 150 సంవత్సరాలుగా తగిన పీఠాధిపతి దొరకకక ఖాళీగా ఉన్న జ్యోతిర్మఠ పీఠాదిపత్యం వహించటానికి ఆయనే సర్వ సమర్ధుడు అని అందరూ అనేకసార్లు కోరగా సరే నని ‘’మీరు అరణ్యం లో స్వేచ్చగా తిరిగే సింహాన్ని బంధిస్తున్నారు .మీ రందరి ఇష్టం ప్రకారంమీ మాటలను గౌరవించి పీఠాదిపత్యాన్ని స్వీకరించి ఆది శంకరా చార్యుల అడుగు జాడలలో నడుస్తాను ‘’అన్నాడు దీనికి ముఖ్య ప్రేరకుడు కరపత్ర స్వామి . నియమించే ‘’ధర్మ మహా మండలి ‘ ఎంతో సంతోషంగా ఆహ్వానించింది /19 41 ఏప్రిల్ 1 న పీఠాదిపత్య విధానం అంతా వారణాశి పండితులు ,పూరీ శంకరాచార్య శ్రీ శ్రీ భారతీ కృష్ణ తీర్ధ ,శృంగేరి శంకరాచార్యులు శ్రీ చంద్ర శేఖర భారతి స్వాముల సమక్షం లో మహా వైభవంగా నిర్వహించారు .గర్వాల్, వారణాసి ,దర్భంగా మహా రాజులు ఎందరెందరో మత ప్రముఖులు హాజరయ్యారు .వేదం లో చెప్పబడిన సర్వ లక్షణ సంశోభితుడు స్వామి బ్రహ్మానంద సరస్వతి అని అందరూ శ్లాఘించారు .
బ్రహ్మానంద సరస్వతి మొదటి సారిగా జ్యోతిర్మఠాన్ని పునర్నిర్మించాడు . ఆప్రాంతమంతా స్థానికుల ఆక్రమణలో ఉంటె స్థానిక డిప్యూటీ కమీషనర్ స్థానిక పెద్దల సహకారం తో ఖాళీ చేయించి 30 గదులతో రెండస్తుల భవన నిర్మాణం చేసి ‘’జ్యోతిర్మఠ పీఠ భవనం ‘’అని పేరు పెట్టాడు .దీనికి వంద గజాల దూరం లో దర్భంగా మహా రాజు మొదలు పెట్టిన ‘’పూర్ణ గిరి దేవి ‘’దేవాలయాన్ని బ్రహ్మాన౦ద పూర్తీ చేయించాడు .సంప్రదాయ అద్వైత మత ప్రచారానికి ఉత్తర భారతం లో జ్యోతిర్మఠం అతి ముఖ్యమైన గొప్ప కేంద్రం . జ్యోతిర్మఠ శంకరాచార్యునిగా ఉత్తర భారత దేశమంతా పర్యటించి ప్రబోధాత్మక ప్రసంగాలతో శంకరాద్వైత భావ వ్యాప్తి చేశాడు మహర్షి మహేష్ యోగి కరపత్రి స్వామి ,స్వామి స్వరూపానంద సరస్వతి ,స్వామి శాంతానంద సరస్వతి మొదలైన వారు బ్రహ్మానంద సరస్వతి ముఖ్య శిష్యులు .భారత ప్రధమ రాష్ట్ర పతి డా బాబూ రాజేంద్ర ప్రసాద్ ,ఫిలసాఫికల్ ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బ్రహ్మానంద సరస్వతిని దర్శించి ఆశీర్వాదాలు పొందారు .రాదా కృష్ణన్ ‘’మూరీ భవించిన వేదాంతం సత్య స్వరూపం స్వామి బ్రహ్మానంద సరస్వతి ‘’అన్నారు .19 53లో 8 5 వ ఏట బ్రహ్మైక్యం చెందటానికి 5 నెలల ముందు స్వామి బ్రహ్మానంద వీలునామా రాసి తన తదనంతర పీఠాదిపతి స్వామి శాంతానంద సరస్వతి అని పేర్కొన్నాడు .
స్వామి బ్రహ్మానంద గొప్ప శ్రీ చక్ర ఉపాసకుడు ఆయన వద్ద అరుదైన రూబీ శ్రీ చక్రం ఉండేది .ఆయన పీఠాదిపత్యకాలం లో ఎందరెందరో రాజులు ధనికులు ఆశ్రమానికి వచ్చి విలువైనకానుకలు సమర్పించేవారు .మంత్ర దీక్ష స్వీకరించేవారు . ఈ ధన సంపద పీఠ ఆధ్యాత్మిక కార్య క్రమాలకు సద్వినియోగమయ్యేది . ‘’మహర్షి మహేష్ యోగి 20 08లో ‘’మహేష్ యోగి ట్రస్ట్ ‘’ఏర్పరచి బ్రహ్మానంద సరస్వతి పేరుతొ దేశంలోని 30 వేల వేద పండితుల కు ఆసరా కలిపించి గురు ఋణం తీర్చుకున్నాడు .కారణ జన్ముడు స్వామి బ్రహ్మానంద సరస్వతి శంకరాచార్య .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా