వీక్లీ అమెరికా -4 –1 24-4-17 నుండి 30-4-17 వరకు

వీక్లీ అమెరికా -4 –1

24-4-17 నుండి 30-4-17 వరకు

  మూడు విందులు రెండు పూజల వారం .

24 వ తేది  సోమవారం  ఇంకా బెడ్ మీద ఉండగానే  సెల్ మోగింది .నిద్రలో ఎత్తా.విశాఖ నుంచి స్వామిగారట మెయిల్ రాశాను జవాబు లేదని ఫిర్యాదు .తెలివి తెచ్చుకొని అమెరికాలో ఉన్నా తడిసి మోపెడవుతుంది అని కట్టేశా అయినా 30 రూపాయలు బొక్క పొద్దున్నే .అలాగే ఇక్కడికి వచ్చిన 7 వ తేది వాషింగ్టన్ నుంచి కారులో వస్తుంటే రావి శాస్త్రిగారి అబ్బాయి ప్రసాద్ గారు ఫోన్ చేశారు .అప్పటికి రోమింగ్ విషయం గుర్తులేక కాసేపు వాయి౦చామ్ .మా అమ్మాయి అరుస్తూనేఉంది. ఉండమని ఆపేశా .90 రూపాయలు తోసింది .అప్పటినుంచి మ్యూట్ లో పెడుతున్నా సెల్ .రెండు రోజులుగా వర్షం పడుతోంది . శ్రీ గండికోట సుబ్బారావు ,సోమలత గుర్తించినవైద్య  భైరవ దత్త లపై నెట్ లో రాశా ..ఇల్లంతా ఇద్దరు ఆడవాళ్ళు బహుశా మెక్సికన్లు అన్నీ సర్ది క్లీన్ చేశారు .

హైదరాబాద్ లో జ్యోతి శ్శాస్త్ర వేత్త ,పంచాంగ కర్త శ్రీ అడుసుమిల్లి (బ్రాహ్మణుల ఇంటిపేరు కమ్మవారింటి పేరుకాదు )లీలాప్రసాద్ గారబ్బాయి రాంకీ ,భార్య ఉష లు అయిదేళ్ళ క్రితం వచ్చినప్పుడే బాగా పరిచయం .వాళ్ళ ఇంట్లో ఇవాళ రాత్రి సాయి భజనకు పిలిస్తే మా అమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చాక రాత్రి 7-30 కు బయల్దేరి 8 కి చేరాం .సుమారు 50 మంది వచ్చారు . రాంకీ ఉషా దంపతులకు శతకత్రయం ఇచ్చాము  ఆతను’’ వేద మాల ‘’అనే సంస్కృత శ్లోకాల పుస్తకం ఇచ్చాడు తర్వాత భోజనాలు .మూడు స్వీట్లు రెండుహాట్లు రెండుకూరలు పప్పు అప్పడం సాంబారు ,పెరుగు ,పుచ్చముక్కలు వగైరా లతో భోజనం .అన్నీ బాగానే ఉన్నాయి .రాంకీ తమ్ముడు భార్య ఇక్కడే ఉంటున్నారు .ఆమె పద్మశ్రీ సంగీతం బాగా పాడింది. మా మనవళ్ళు  ఆశుతోష్ ,పీయూష్ లకు సంగీత గురువు .అక్కడ ఒక డాన్స్ టీచర్ పరిచయమైంది .అలాగే పవన్  డోమేనికన్ రిపబ్లిక్ కు చెందిన ఆవిడను  పరిచయం చేశాడు ఆవిడను ఆరాధన రోజూ చూశా .ఇప్పుడు మాట్లాడా .ఆమె అక్కడ దేశానికి ప్రెసిడెంట్ అయ్యే చాన్స్ వచ్చినా వదిలేసి ఇక్కడ కొడుకుతో ఉంటోంది .మన సంప్రదాయాలు తెలుసు .ఉష బొట్టుపెడితే చక్కగా పెట్టి౦చు కోన్నది  .పవన్ చెబితే ఆవిడపై నెట్ లో వ్యాసం రాద్దామని అనుకొన్నాను .ఆవిడకు నా మెయిల్ ఐడి ఇక్కడి ఫోన్ నంబర్ ఇచ్చి ఆమె గురించి విషయాలు మెయిల్ చేయమన్నాను .అందగానే తెలుగులో రాస్తానని చెప్పా. .ఈ రోజు వరకు ఆమె నుండి విషయం రాలేదు .ఇంటికి వచ్చేసరికి రాత్రి పదిఅయింది

 మంగళవారం మధ్యాహ్నం మాంచి నిద్రలో ఉండగా మధ్యాహ్నం 2 గంటలకు విజయ  వాడ నుంచి నేను అడ్డాడ హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు చదివిన భూషణం బాబు వాట్సాఫ్ లో రెండు సార్లు ప్రయత్నిస్తే నేను ఎత్తలేదు  .మూడో సారీ చేస్తే అప్పుడు మెసేజ్ లో తాను స్టూడెంట్ అని ఉంటె నేనే ఫోన్ చేశా .దర్వాజా అయ్యాడు పాపం ఆనందం పట్టలేక .చాలా విషయాలు మాట్లాడుకున్నాం అతనిప్రక్కనే సురేష్ అనే అదే బాచి కుర్రాడుకూడా మాట్లాడాడు. అడ్డాడ వదిలి సుమారు 20 ఏళ్ళు అయినా ఇంకా గుర్తుపెట్టుకున్నారు ఈ బాచ్ వాల్లందరూ కలిసి అక్టోబర్ లో నేను ఇండియా వచ్చినతర్వాత ఒక గెట్ టు గెదర్ పెట్టాలన్న ప్లాన్ లో ఉన్నట్లు చెప్పారు .వీళ్ళతో పాటే 12 ఏళ్ళుగా ఇక్కడున్న పావని అనే అమ్మాయి దుబాయ్ లో ఉన్న ఆనంద్ కూడా ఇదివరకే మాట్లాడారు .నిద్రపట్టక మైనేనిగారికి వాట్సప్ లో  ప్రయత్నిస్తే దొరక్క పొతే మెయిల్ పెట్టాను .తర్వాత ఆయనే ఫోన్ చేసి మాట్లాడారు .తర్వాత డా. యెన్ ఇన్నయ్యగారు ఫోన్ చేసి మాట్లాడుతూ చిత్రకారులు శ్రీ ఎస్వి రామారావు గారు చికాగో వచ్చి వారమయిందని  తెలుగు విద్యార్ధి పత్రికకు ఆర్టికల్ రాయమంటే రాశానని చెప్పారు ..బైజాంటిన్ సామ్రాజ్యం చదవటం మొదలుపెట్టి దాని నాగరకతపై ఒక వ్యాసం రాశాను  గీర్వాణ౦ లో 12 5 వరకు లాగాను .

కళాతపస్వి  కాశీనాధుని విశ్వనాద్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇచ్చారు .విశ్వనాధ ,మొల్ల, వెంగమాంబ పోస్తేజ్ స్టాంపులను కేంద్రం విడుదల చేసింది. రాత్రి 12 వరకు నిద్ర పట్టలేదు

 బుధవారం ఎండ బాగానే వచ్చింది రెండుపూటలా వాకింగ్ కు వెళ్ళా .ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలలో బి జెపి ‘’ఆప్’’ను వాళ్ళ ‘’చీపిరి ‘’తోనే తుడిచేసి 18 2 స్థానాలు 3 మునిసిపాల్తీలు గెల్చింది రాత్రి యు ట్యూబ్ లో క్రిష్ సినిమా ‘’కృష్ణం వందే జగద్గురుం ‘’చూశాం .పేరుకీ సినిమాకు లంకె లేదు సీన్లు అన్నీ ఇష్టం వచ్చినట్లు తీసి అతికించినట్లు అనిపించింది నయనతార ఎందుకున్నదో ఎవరికీ తెలీదు .దగ్గుబాటి రాణా బానే చేశాడు  టార్జాన్ సినిమాలకు బ్రహ్మాండంగా పనికోస్తాడని పించింది .మణిశర్మ సంగీతం సిరివెన్నెల పాటలూ వినసొంపు .పిక్చరై జేషన్ బాగుంది  సాయంత్రం ‘’కారీ ‘’లో ఉంటున్న మా అన్నయ్యగారి మనవడు అంటే కూతురు వేదవల్లి కొడుకు వేలూరి హరి ఫోన్ చేశాడు భార్య కూడా మాట్లాడింది .

  గురువారం గీర్వాణం 13 5 వరకు దేకా .రెండుపూటలా నడక .స్వామి రామా పుస్తకం ‘’లివింగ్ విత్ ది హిమాలయన్  మాస్టర్స్ ‘’పూర్తి చేసి హిమాలయ యోగులపై రాశా .విజ్జి వాళ్ళ ఇంటి ప్రక్క రవి గాయత్రి పలకరించి మాట్లాడారు రవి తలిదండ్రులు బుధవారం వస్తారట ఇండియా నుంచి

మధ్యాహ్నం విజ్జి స్నేహితురాలు వీటూరి పద్మ వచ్చి పలకరించింది .తర్వాత గోసుకొండ అరుణ కూడా వచ్చి శుక్రవారం వాళ్ళ ఇంట్లో అమ్మవారి మణి ద్వీప పూజ ఉందని తాంబూలాని భోజనానికి రమ్మని పిలిచింది .నేనెందుకు ‘’పోతు పేరంటాలు ‘’లాగా అనిపించింది కాని అంత ఆప్యాయంగా పిలిస్తే వెళ్ళాలి అనుకొన్నా .రాత్రి ఏమీ తోచక ‘’ఫ్యన్ బకెట్ ‘’చూశా౦ .ఒక జోకు మురికిదే అయినా బాగుంది -అది చెప్పకపోతే నా కడుపుబ్బరం తగ్గదు .ఒక భార్యా భర్తా తగువులాడుకొని విడాకులిప్పించమని పోలీస్ స్టేషన్ కొచ్చి సబిన్స్పెక్టర్ను . అడుగుతారు .సరేనని ఆమె దగ్గర లక్ష రూపాయలు కాష్ ఉందని సగం భర్త కిస్తానని అంది ఒకే ఇంటిలో వంటిల్లు భార్యకు బెడ్ రూమ్ భర్తకు పంచాడు .ముగ్గురు పిల్లల్ని ఏం చేయాలని సమస్య .ఎస్ ఐ నాలుగో సంతానం కన్నాక విడాకుల సంగతి చూద్దామన్నాడు .భార్య ‘’ఈ యనపై నమ్మకం పెట్టుకొంటే ఆ ముగ్గురూ కూడా పుట్టేవాళ్ళు కాదు ‘’అని గబుక్కున నోరు నొక్కు కుంది. అవాక్కవటం భర్త ,ఎస్ ఐ ల వంతు అయింది .పనిలో పని మరోకుళ్ళు జోకూ చెప్పకపోతే ఆగలేదు .బిగ్ జోక్స్ అనే పుస్తకం చదువుతున్నా .అందులో రాజకీయ నాయకుల మీద ఏదో కల్పిత జోకులు చాలా ఉన్నాయి అందులో ఒకటి చదివి నవ్వు ఆపుకోలేక పోయా . అమెరికా ప్రెసిడెంట్ ఒబామా  ఇంగ్లాండ్ వెళ్ళాడట. రాణి ఆరుగుర్రాల బండీలో ఆయన్ను  రాజ సౌధానికి   తీసుకు వస్తోందట .అందులో ఒక గుర్రం కొంత దూరం వెళ్లేసరికిడామ్మని పెద్ద శబ్దం తో పిత్తిందిట .పిచ్చకంపుట .ఇద్దరూ అవాక్కయి ‘’పిత్తినన ముత్తయిదుల్లా ముక్కు మీద కర్చీఫ్ పెట్టుకొని  భరి.స్తున్నారట .కాసేపయ్యాక   రాణి ఇకమర్యాదగా ఉండదని’’మిస్టర్ ప్రెసిడెంట్ ! మహా రాణీ అయినా కొన్ని విషయాలు ఆవిడ చేతుల్లో ఉండవు ‘’అన్నదట .అప్పుడు ఒబామా కూడా నవ్వుతూ ‘’ఇప్పటిదాకా ఆశబ్దం గుర్రానిదనుకోన్నాను  మీదా ?’’అన్నాడట ఆశ్చర్యంగా .ఆ పుస్తకం చదివితే జోకులు ఎలా పుట్టాయో మొదటి అధ్యాయం లో రాస్తూ ఇలాంటి కుళ్ళు జోకులే ముందు పుట్టాయని అన్నాడు రచయిత .కొన్ని జోకులు తరువాత రాస్తా. ఇప్పటికే వాసన భరించ లేక పోతున్నారేమో ?

                  సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.