వ్యాఖ్యాన చక్రవర్తి, మల్లినాథ సూరి మనీష -32

వ్యాఖ్యాన చక్రవర్తి,  మల్లినాథ సూరి మనీష -32

ఏకావాలి లో  అలంకార చర్చ
ఆపహ్నుతి  అలంకారం -దీనిలో రూపకాలంకారం లో ఉన్నట్లే ఆరోపం ఉంటుంది .అయితే ఇది అపహ్నవం  చేత సమర్ధింపబడుతుంది .కనుక వర్ణించబడే విషయం అలా ఉన్నట్లు కనబడదు అది ఒక ప్రత్యేకతతో మారిపోతుంది విద్యాధరుడు ఆపహ్నుతి లో మూడు రకాలు ఉన్నాయని చెప్పాడు -”ఆపహ్ను త్యా రొపః , ఆరోప్యా పహ్నవః -చలాది  శబ్దే రసత్యవం ప్రతిపాదనం చేతి త్రివిధోస్య బంధ ఇత్యర్ధహ ”అన్నాడు సూరి .మొదటి దానిలో ఆరోపం  రహస్యమైన దానితర్వాత వస్తుంది .రెండవ దానిలో దీనికి వ్యతిరేకంగా అంటే రహస్యం తర్వాత ఆరోపం వస్తుంది .మూడవ దానిలో రహస్యంగా ఉన్నదాన్ని చల ,ఆపదేశ వంటి శబ్దాలచేత సూచింపబడుతుంది దీని నేపధ్యంగా మల్లినాథుని నిర్వచనం సరళం గా ఉండి  ప్రత్యేకంగా కనిపిస్తుంది -”యత్యా రో ప్య మాణస్యా రోవిషయాపహ్నునేవనావ సాపాహ్నుతిః ”
 సహోక్తి-సహోక్తి   విషయం లో సూరి రుయ్యక భావం పై ఆధారపడ్డాడు ఇందులో సహా అంటే సూత్రాలోచన పాదాలమధ్య గౌణమైన సంబంధం కనుక వస్తువులమధ్య సంబంధం గా ఉండాలని లేదు అదివస్తువు  ఒకదానితో ఒకటి కలిసి పోవటం (ఇంట్రా ససెప్షన్ )పై ఆధార పడి  ఉంటుంది దీన్ని శ్లేష ద్వారా గుర్తించాలి ఇక్కడ రుయ్యకుని వివరణపై మల్లినాథుని వ్యాఖ్యానం దాన్ని గుర్తుకు తెస్తుంది .సహోక్తి లో ఉపమా న ,ఉపమేయాల సంబంధం ఉద్దేశ్య పూర్వకమైనదే ..సహా చేత సూచింపబడే వస్తువు ఉపమేయ స్థానం లో ఉండి వ్యక్తీకరించే క్రియ తో సంబంధంకలిగి ,రెండవ దాని అర్ధం సహలో చెప్పినట్లు  ఉద్దేశితమౌతుంది .-”ఇహ భావే ప్రకృతత్వాన్ ఉపమానోపమేయ భావో వైవక్షి కః -తత్ర సహార్ద నిర్దిష్టస్య అప్రాధాన్యా దుపమానా త్వమర్దాది తరస్య ప్రాధాన్యాద్యుపమేయ త్వం -యాత్రోపమానోపమేయ యో రేకస్య శబ్దహ -క్రియా సంబంధ ఇతరస్య సహార్ద నిర్దేశా ద్ గమ్యహ సా సహోక్తి రిత్యర్దా ”
ప్రతి వస్తూపమాలంకారం -అనేక వాక్యాలలో పోలిక ఉండటం దీనిప్రత్యేకత రెండు వాక్యాలుంటే వాటిలో లక్షణం లేక గుణం (యట్రి బ్యూ షన్ ) ఒకే రకంగా ఉంటుంది . దృష్టాంతం లో  మొదటిదానిలోని గుణం రెండవ దానిలోగుణం పోలికతో  ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ఈ రెండు వేరు వేరు వాక్యాలలో చెప్పబడిన గుణాలు అసలైనదానికి దాని ప్రతిబింబాన్ని ఉన్న సంబంధంగా ఉంటాయి . మల్లి నాధుని వివరణ -”భిన్న యోరేవ వస్తు నో రత్యంత సదృశా యోరుభయత్ర  పృధంగా నిర్దేశో బింబ ప్రతి బింబ భావః ”కానీ ”యత్ర వస్తు స0బందేన ప్రతి బింబనం గమ్యతే సా నిదర్శనమే ”అన్నాడు .కొన్ని చోట్ల వస్తువుకు ,పోల్చబడేదానికి  ,సాధ్యం లేక సాధ్యం కాని    సంబంధాలు కొన్ని సందర్భాలలో ఉంటె   అది నిదర్శనాలంకారమవుతుంది-యత్ర పరస్పరని రక్షరాని రపేక్షర్ద త్వే న వాక్యార్ధ భేద స్తత్ర దృష్టాంతః -యత్ర సాపేక్షార్ధత్వే న విద్యర్ధ వాద యోరివ వాక్యయో  రేకవాక్య తా తత్ర నిదర్శనేతి  భేదః -ఉత్ప్రేక్షాలంకారం -ఉత్ప్రేక్షను విద్యాధరుడు తనపద్ధతిలో విచిత్రంగా నిర్వచించాడు .ఈ అలంకారం   శోషణం (అబ్సా ర్ప్షన్  ) లేక ఒకదానిలో ఒకటి దూసుకుపోవటం వలన అంటే ఆద్యావసయం వలన ఏర్పడుతుంది ఏకావాలి కర్త చక్కని నిర్వచనం చెప్పాడు -అభిన్న త్వే న ప్రతిభాసనమద్యావసాయహ్ ”అని అధ్యావసాయ కు అర్ధం చెప్పాడు వస్తువును పోల్చబడేది పూర్తిగా మింగేస్తే వచ్చేది ఆద్యావసయం 1-సిద్ధ 2 సాధ్య అని రెండురకాలన్నాడు విద్యాధరుడు.పోల్చబడినది వస్తువుతో ఉన్న సంబంధం తెలియబడితే వచ్చేది విషయ పై విషయం ఆరోపిస్తే వచ్చేది   .ఇదే అతిశయోక్తి ఆధారం .విషయం విషయిల సంబంధం వేరుగా ఉంటె కొత్త భావం అందులో స్ఫురిస్తుంది .ఇక్కడ అనుమానం  తర్కం ఊష సహాయ పడుతుంది .మల్లినాథుడు ఉత్ప్రేక్షకు కొత్త నిర్వచనమిచ్చాడు -”స0 భావన మాయోత్ప్రేక్షా ప్రకృతస్య పరేణ యాత్ అని మమ్మటుడు చెప్పనడానికి సూరి ”అప్రకృత గుణ క్రియాభి సంబంధాత్ ప్రకృతస్య  ప్రాకృతత్వే న స0భావన ముత్ప్రేక్ష్యో త్య ర్ధః ”
అధ్యావసాయ లోని సిద్ధ ,సాధ్యలనూ మల్లినాథుడు  విస్తరించి చెప్పాడు .-”యత్ర వైశ్య విషయిణో ర్ధ యో రూపాదానం తత్ర భేద వదవ భాసా దభేదో నావ బాసతే -విషయిణో సత్యతా ప్రతీతేహ్ -తథాపి విషయస్య తదా వ్యపదేశత ద్ధర్మ యోగి త్వాభ్యామ భేదోద్యవసీయతే సంభావ్యతా ఇతి వ్యాపార ప్రాధాన్యా ధ్యా వసాయః సాధ్య ఇత్యర్దహ”
  అధ్యావసాయ  సిద్ధ ఎప్పుడు అవుతుందిఅంటే విషయం శబ్దాలతో చెప్పబడక పోలిక చెప్పబడే దానితో మింగివేయబడితే అప్పుడు పోలిక వస్తువు అధ్యావాసిత అయి కప్పి వేయబడి స్పష్టమౌతుంది . సాధ్య ఎప్పుడౌతుంది అంటే -వస్తువు పోలిక చెప్పబడే దానితో తాదాత్మ్యంగా చెప్పబడితే అప్పుడు సాధ్య అవుతుంది -”యత్ర తుతస్యానుపాదానం తత్ర విషయిణా ఏవోయాదాన మహిమ్నా తస్య వస్తు తో సత్య స్యాపి సత్యతా ప్రతీతౌ విషయస్య తదాత్మా నాధ్యా వసిత ప్రాధాన్యే ”జ్ఞాతోదర ”ఇత్యర్ధ ధరమ్ ప్రతి జ్ఞానస్యేవా ద్యావసాయ స్యాద్య వసితం ప్రత్యుప సర్జన త్వం ప్రతీయతే -ఏతదేవాద్యావస్యా వయస్య సిద్ధాంతం నామ ”
  ఉత్ప్రేక్షలో ఉపమాన ఉపమేయాలు లేక విషయం విషయ లను గుర్తించటం  పూర్తికాకపోతే సాధ్య అవుతుంది .కానీ అతిశయోక్తిలో గుర్తించటం పూర్తి అయితే సిద్ధ అవుతుంది ఏకావాలి మల్లినాథుని నిర్వచనం లో ”గుణాభి సంబంధా ”అనే దాన్ని ఉపయోగించాడు ఇక్కడ గుణ అంటే క్రియ అనే అర్ధం లో వాడాడని గమనించాలి  .మరికొన్ని అలంకారాలు తర్వాత తెలుసుకొందాం .
  సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-5-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.