ఘోరకలి -1 ,

ఘోరకలి -1         ,

జర్మనీలో హిట్లర్ నియంతకాలం లో జరిగిన దారుణ మానవ కాండ నరజాతి చరిత్రలో రక్తపు మరకలను మిగిల్చింది . అంతకు పూర్వం రష్యా చైనా లలో మానవ హననం జరిగింది కానీ ఇక్కడ పగా ద్వేషం జాతి నిర్మూలన తోపాటు పసిపిల్లలు వృద్ధులు ,పిచ్చివాళ్ళు అంగవైకల్యమున్నవారు ,,ముఖ్యం గా యూదులు ,జిప్సీ జాతులను భూమి మీదే లేకుండా చేయాలని ఆర్య రక్తమే స్వచ్ఛమైనది మిగతా రక్తం లేని స్వచ్ఛ ఆర్యరక్తపు జనాలతో  నూతన జర్మనీ నిర్మించాలన్న పగటి క లలతో ఇంతటి ఘోర కలి  సృష్టించారు .ఆ బీభత్సం జరిగి సుమారు 80 ఏళ్ళు అయినా ఎందరెందరో ఇప్పటిదాకా ఎన్నెనో రహస్యాలు వెలికి తీసి చరిత్ర కెక్కిస్తున్నా ,చదివిన ప్రతిసారీ గుండె చె రువైపోతూనే ఉంటుంది ఒళ్ళు గగుర్పాటు పొందుతూనే ఉంటుంది ఆ అభాగ్యులపట్ల కళ్ళు చెమరిస్తూనే ఉంటాయి ఆ నర రూప కిరాతుల అనాగరిక వికృత చేష్టలకు  బాధ్యులైన వారిపై కసి ద్వేషం ఉవ్వెత్తున ఉబుకు తూనే ఉంటుంది . రక్తం మరుగుతూనే ఉంటుంది ఇంతటి ఘోరకలి ఎప్పుడూ ఏదేశం లోనూ చూసి విని ఉండరు .
  హిట్లర్  స్టూడెంట్ లాండ్ ను వశ పరచుకున్నాక జెకోస్లో వేకియాపై ద్రుష్టి లేదన్నాడు.దాని సరిహద్దుల జోలికి రానని అగ్రిమెంట్ కూడా రాసిచ్చాడు  ఆత ను చెప్పేది ఒకటి చేసేది మరొకటి అబద్ధాలాడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య -కాదుకాదు వెన్నుతో పుట్టిన విద్య . 1939 మార్చ్ 15 ఉదయం 6 గంటలకే జర్మనీ సైన్యం జెకోస్లోవేకియాపై దాడి చేశాయి .తమాషా ఏమిటంటే అక్కడ వారిని ఎదిరించినవారే లేరు . ముసలివాడైనా జేక్ ప్రెసిడెంట్ ఈమైల్హాచా ను బెదిరించి లొంగిపోయినట్లు సంతకం పెట్టించాడు హిట్లర్ . ఒక వేళ కాదని ఎదురు తిరిగితే జేక్ ప్రజల్ని చంపి ,నగరాలను విధ్వంసం  చేసి బూడిద కుప్ప చేస్తానని బెదిరించాడు ఇది హిట్లర్ సిగ్గులేని చేస్ట కు నిదర్శనం ..ఇలా జర్మన్ల రక్తపు బొట్టు చిందకుండా విజయం సాధించి మూడవ రీచ్ అనే జర్మనీ సామ్రాజ్యం లో కొత్త దేశాన్ని కలిపేశాడు 

దాస్టికం బుకాయింపు ,ఆగ్రహం బెదిరింపు లతో పొందిన విజయం అందుకే అతనిని ”బ్లఫ్ బ్లస్టర్ మాస్టర్ ”అంటారు . . 1939 ఆగస్టు 23న రష్యా నియంత స్టాలిన్ తో దాడి రహిత సంధి కుదుర్చుకొని రష్యాను తటస్థంగా ఉండేట్లు చేశాడు .ఫ్యూరర్ అని పిలువ బడే హిట్లర్ ..అందుకే అతనిని ‘ . ఇంతటి తో ఆగక చూపు పోలాండ్ పై పడింది .సైన్యాధికారులు సమయం కాదని వారిస్తున్నా ఉక్కు ,ఆయిల్ ,సరఫరాలు చాలా తక్కువగా ఉన్నాయని  ఉన్న ఆయుధ సామాగ్రి 6 వారాలకు మాత్రమే సరిపోతుందని చెప్పినా  పెడ  చెవిని పెట్టి ఆకస్మిక దాడులతో భయ భ్రా0తులను  చేసి చరిత్రలో పేరు పొందాలని భావించి సాధించిన ప్రతి విజయం మరోదానికి దారి చూపిస్తుందని కావలసినవన్నీ త్వరలోనే సమకూరుతాయని నచ్చ చెప్పి 1939 సెప్టెంబర్ 1 న పోలాండ్ పై 10 లక్షల సైన్యం తో విరుచుకు పడ్డాడు యుద్ధ టాంకులు  కాల్బలం లూప్త్ వాఫ్ అనే వైమానిక రక్షణ పై నుంచి ఇచ్చింది వణకిపోయిన పోలాండ్ లొంగిపోయింది .దీనితో తటస్థంగా ఇప్పటిదాకా ఉన్న బ్రిటన్ ఫ్రాన్స్ లు జర్మనీ పై యుద్ధ ప్రకటన చేసి ”అనుబంధ కూటమి ”గా మారాయి తర్వాత రష్యా అమెరికాలు దీనిలో చేరాయి ఇటలీ  జపాన్ లు జర్మనీ వైపు నిలబడి ”అక్ష కూటమి ”గా మారాయి .  .మళ్ళీ మామూలే హిట్లరయ్యకు మాట తప్పటం .చేసిన ఒప్పందాన్ని తూనా బొడ్డు  అని ఒట్టు తీసి గట్టున పెట్టి 1941 జూన్ 22 న హిట్లర్ రష్యాపై దాడి చేశాడు .జపాన్ అమెరికా వాళ్ళ పెరల్ హార్బర్ పై దాడి చేసింది .మొదట్లో దూకుడుగా దూసుకు పోయి,అజేయమగా ఉన్న  జర్మనీ పడమటి యూరప్ దేశాలను వరుసగా స్వాధీనం చేసుకొంటూ అప్రతిహతంగా ముందుకు పోతోంది డెన్మార్క్ నార్వే ,లక్సమ్  బర్గ్ బెల్జియం నెదర్లాన్డ్స్ చివరికి ఫ్రాన్స్ లు దాసోహమన్నాయి
       స్వచ్ఛ జర్మన్ రక్తం కోసం దారుణాలు
జర్మనీని స్వచ్ఛ జర్మన్ రక్తం తో నింపాలన్న హిట్లర్ ఆశయం ఎన్నడూ వదిలి పెట్టలేదు  కనుక ముందు ఎధునాసియా అంటే ” మెర్సీ  కిల్లింగ్”ను అమలుపరచాడు .అవయవ లోపంఉన్నవారు వికృతంగా ఉన్నవారు , మతి స్థిమితంలేనివారు పిచ్చివాళ్ళు వీరందరూ  మెర్సీ కిల్లింగ్ కు  బలయ్యారు   వీళ్ళతో ఆగలేదు పుట్టిన పసిపిల్లలమీదా దృష్టి పడింది ”సైన్టిఫిక్ రిజి స్ట్రే షన్ ఆఫ్ సివియర్ హెరెడిటరీ ఎయి ల్మెంట్స్ ”అనే సంస్థ రీసెర్చ్ నెపం తో తీవ్రం గా బాధపడుతున్న పిల్లకు మంచి మందు ఇచ్చి నయం చేస్తామని నమ్మబలికి ఈ రీసెర్చ్ కి సహాయంగా ప్రసూతి హాస్పత్రులు ,మిడ్ వైఫ్  లు ,లను సరైన పుట్టుక లేని బేబీలను గుర్తించి రిపోర్ట్ చేయమని చెప్పి జాబితాలు తయారు చేయించింది .వాళ్ళు చాంతాడంత లిస్ట్ లు తయారు చేసిచ్చారు . అవయవ లోపం  నరాల బలహీనత మానసికంగా కుంగిపోయిన వారూ ఉన్నారు .ఈ లిస్ట్ రీచ్ కమిటీకి చేరాక చూపు పెద్ద పిల్లలపై  పడివారి లిస్ట్ లు తయారు చేయించారు . ఈ రిపోర్ట్ లను ముగ్గురు పీనల్ డాక్టర్లు పరిశీలించి ఇందులో ఎవరు చావాలో ఎవరు బతకాలో నిర్ణయం చేసేవారు .కానీ చివరికి వాళ్లకు మందులు ఇచ్చిబాగు చేసినట్లుకాని అందులో బతికి బట్టకట్టిన వారు కానీ కలికానికి కూడా కనిపించేలేదని ఇదంతా నయవంచన అని తేలింది ఎవరూ మాట్లాడే వీలు లేదు మూ సుక్కొచోవటమే  ,
  పిల్లలనుంచి తలిదండ్రులను వేరు చేసి ”మీ పిల్లాడు కొత్త ట్రీట్ మెంట్ ప్రోగ్రామ్ ”లో ఉన్నాడు మంచి గట్టి మందులిచ్చి మీ వాడిని ఆరోగ్య వంతుడిని చేస్తారు ,,మంచి గొప్ప జీవితం లభిస్తుంది ”అని బ్లఫ్ మాస్టర్స్ పలికి వేరు చేసేవారు ఒక వేళ ఎవరైనా  తలిదండ్రులు  మేము ఇవ్వం మాపిల్లల్ని అన్నా ,అనుమానం తో ప్రశ్నలు వేసినా వారిని నయానా భయానా చెప్పి చివరికి ఒప్పుకునేదాకా బెదిరించేవారు .దీనిపై నిర్ణయం బాధ్యత పేరెంట్ లకు లేదు అదీ బ్లఫ్ మాస్టర్స్ చేతుల్లోనే ఉండేది .నిర్ణయాధికారం ఉందని మాత్రం పో జు కొట్టేవారు . సర్వం దైవా దీనం -సారీ నారీ అధీనం మరోసారి సారీ నాజీ అధీనం .అయ్యా ఈ ఇన్టేక్  ట్రీట్ మెంట్ సెంటర్లు నగరం నడి  బొడ్డున ఉన్నాయని కొంటె” తప్పులో”కాలేసినట్లే ఎక్కడో చాలా దూరం లోనిర్మాణుష్యప్రదేశం లో పల్లెల్లో ఉండేవి అంటే నమ్ముతారా ?అబద్ధాలమీద బతికింది నాజీ రెజీమ్ .
  కొన్ని వారాలతర్వాత పేరెంట్స్ కు వాళ్ళ పిల్లాడో పిల్లో చచ్చి పోయిందని నోటీస్ వచ్చేది .చావుకు కారణం న్యుమోనియా ,అపెండిక్స్ బద్దలవటం అని మాత్రమే తెలియ జేసేవాడు .అసలు కారణాలు వేరు బాబూ . వాళ్ళ డాక్టర్లే వాళ్ళని మర్డర్ చేశారు .రీచ్ కమిటీ పిల్లలు  ప్రాణాంతక  ఇంజెక్షన్లు ,విషవాయువు  ఆకలి , మూలం గానే చనిపోయారు .స్వయానా ఈ భయానక మరణాలను చూసిన డాక్టర్ హెర్మన్ ఫానిమిల్లర్ ”ఓక్ అనే ఆరోగ్య జర్మన్ ప్రజలకు  ఈ అభాగ్యులు  భారమని భావించాం .మేం  పిల్లల్ని చంపం ఇంజెక్షన్లతో విషంతో .మాది ఇంకా తేలికపద్ధతి చాలా సహజంగా ఉంటుంది ”అని  చెప్పి బెడ్ మీద ఉన్న పిల్లాడిని చచ్చిన ఎలుకను పట్టుకున్నట్లు పట్టుకుని విషపు నవ్వు నవ్వుతూ  ఈ వెధవ  చావుకు ఇంకా మూడునాలుగు రోజుల టైమ్ ఉంది ”అని ఒక డాక్టర్ స్వయానా చెప్పాడని రాశాడు ..ఇలాంటి చోట్ల వేలకొద్దీ జర్మన్ పిల్లలు ఈ డాక్టర్లనబడే కిరాతకులు చేతుల్లో అసువులు బాశారు .దీనికి కారణం ఒక్కటే ”రీచ్(హిట్లర్ జర్మనీ ) కు ఇలాంటి వాళ్ళు బతకటానికి అనర్హులన్న భావమే ఇక్కడ హీలర్స్ కిల్లర్స్ గా మారారు  ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న మెంటల్ పేషేంట్ లను ముందే హతమార్చారు ఈ హత ప్రక్రియకు ఒక కోడ్  ”ఆపరేషన్ T4”అని పేరుపెట్టారు .ఇది బెర్లిన్ హెడ్ క్వార్ట్రర్స్ –”టీర్ గార్టన్ స్ట్రాస్సీ -4 ”పేరు
  ఇక యువకులను చంపే ప్రోగ్రామ్ అమలుకు t 4 కిల్లింగ్ కేంద్రాలు 6 సెంటర్  లలో పెట్టారు . వాటిలో గాస్ చేంబర్లు షవర్ బాత్ ల రూపం లోనూ అనుబంధంగా   కళేబర దహన  వాటికలు ఉండేవి . ఒక క్రమపద్ధతిలో చంపటం అంతే  వేగంగా కాల్చిపారేయటం క్షణాలమీద జరిగిపోయేవి . 1941 ఆగస్టు లో ఈ హనన దహన ప్రోగ్రామ్ అంతమైంది .అప్పటిదాకా నిరంతరాయంగా 24 గంటలు ఏడు రోజు లూ జరిగింది .దాదాపు 80 వేల ప్రాణాలు వీరి ఆపరేషన్ 4 లో గాస్ కు మంటలకు ఆహుతయ్యాయి . కాదేదీ కవితకనర్హం ”అన్నాడు ఆతర్వాతెప్పుడో శ్రీ శ్రీ కానీ నాజీలు ”కాదేదీ చావుకనర్హం ”అని నమ్మారు ,రుజువు చేశారు ..నిజానికి ఈ నిరంతర హనన ప్రక్రియ ఆగిపోలేదు రెండవ ప్రపంచ యుద్ధకాలం లోను ఆ తర్వాతా కూడా జరిగింది ఈ కాలాన్ని ”వైల్డ్ ఎధునేషియా ”అన్నారు అంటే” ఆటవిక కారుణ్య హత్య ‘-వైల్డ్ మెర్సీ కిల్లింగ్ . కారణం ఇది అనధికారిక ,అవ్యవస్థిత మానవ మారణ హోమం .జర్మన్ కిల్లింగ్ సెంటర్ లలో ఈ మెర్సీ  కిల్లింగ్ సెంటర్ లలో ఎధు  నేషియా  ప్రోగ్రామ్  అధికారికంగా సమాప్తమయిన తర్వాత  ఎన్ని వేలమందిని చంపారో  లెక్కా డొక్కా లేదు
ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2ఇన్‌లైన్ చిత్రం 3
  .
   సశేషం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-5-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.