వీక్లీ అమెరికా -5-1 (1-5-17 నుండి 7-5-17 వరకు )

వీక్లీ  అమెరికా -5-1 (1-5-17 నుండి 7-5-17 వరకు )
రెండు పుట్టిన రోజులవారం

1-5-17 సోమవారం ఉదయం నిద్ర మంచం మీద నించి ఇంకా కేవకుండానే ఉయ్యూరు నుంచి మా మనవడు చరణ్ ఫోన్ చేసి”తాతా ! ఉయ్యూరు ను ,మమ్మల్ని మర్చిపోయావు ఫోన్ చేయటం లేదు ”అని నేరం వేశాడు నవ్వుతూ .మధ్యాహ్నం అడ్డాడ శిష్యుడు భూషణం ఫోన్ చేసి అక్కడ నేను పని చేసినప్పుడు దివాకర్లవారు రాసిన ”భారతావతరణం ”పద్యనాటిక నేను వేయించటం అందులో తానూ నన్నయ పాత్ర వేయటం జ్ఞాపకం చేశాడు .నిజమే అక్కడ ఎక్కువ మంది విద్యార్థులు ఎస్ సి వాళ్ళు .వాళ్లకు మాటలు పలకటమే రాదు కానీ సాహసంగా తీసుకొని వాళ్ళతో పద్యాలు ప్రాక్టీస్  చేయించి వేయించాను చాలా చక్కగా చెప్పారు .అదొక సాహసం . మల్లినాథ సూరి 29 వ ఎపిసోడ్ రాసి  సుమారు 5 నెలలయింది .మళ్ళీ ఇవాళ మొదలుపెట్టి 30 వ ఎపిసోడ్ రాశాను .

సాయంత్రం డా ఎల్లాప్రగడ రామ మోహన రావు గారు” కారీ ”నుంచి ఫోన్ చేసి చాలా ఆప్యాయంగా మాట్లాడారు .మైనేనిగారికి ఊరగాయలు పంపించానని ఆయన చాలా అల్ప సంతోషి అని ,తనకు క్లాస్ మేట్ అని ఏరా అనుకుంటామని  ఊరగాయలు పంపినందుకు తనకు వెయ్యి డాలర్లు పంపిస్తానన్నారని తానూ ‘ఏరా !నేను పచ్చళ్ళు అమ్ముకునే వాడిగా కనపడుతున్నానా ?”అన్నానని చెప్పి మైనేని గారి వితరణ శీలత్వం సరసభారతి పుస్తకాలలో బాగా నేను రాశానని ,డబ్బు ఎందరికో ఉంటుంది కానీ దాన్ని మంచిపనులు ఖర్చు చేసి వారు అరుదు అలాంటి ఆరుధై నవాడు మా గోపాలకృష్ణ అన్నారు . ఆ తర్వాత మా చిన్నతనాలలో ఊరగాయలు పెట్టటం ఒక ఖార్ఖానా గా ఆ పరిశ్రమలాగా ఉండేదని ఇద్దరం జ్ఞాపకం చేసుకున్నాం .ఇళ్లల్లో గజం ఎత్తు  జాడీలు ఉండేవని మామిడికాయలు తరగటం కలపటం వగైరా వేసవి కాలపు కుటీర పరిశ్రమగా ఉండేదని అనుకొన్నాం . ఈ విషయాలన్నీ మైనేని గారికి వెంటనే మెయిల్ రాశా .ఆయన  రావుగారు రేపల్లె లో తమ స్వంత  తోట లో కాసిన మామిడికాయ చింతకాయ గోంగూర ,నిమ్మకాయ పండు మిర్చి లతో ఊరగాయలు పెట్టిస్తారని వాటినే తమకు పంపారని రాశారు . వారిద్దరి సౌజన్యం గొప్పది అలాంటి వారు నాకు మిత్రులవటం నా అదృష్టం .

  లైబ్రరీ పుస్తకాల గడువు రెండువారాలు మాత్రమే .మామనవాడు పీయూష్ చేత ఆన్ లైన్ రెన్యూ చేయించా .మళ్ళీ మంగళవారం మధ్యాహ్నం భూషణం వాట్సాప్ చేశాడు విషయం ఏమీ లేదు .సాయంత్రం కోడూరి పావని కెంటకీ నుంచి ఫోన్ చేసి మాట్లాడింది .ఆ అమ్మాయి చాలా పద్ధతిగల పిల్ల .భూషణం విసిగిస్తున్నాడా సార్ అంది . తాము  జులైలో మరో చోటికి వెళ్లవచ్చని చెప్పింది .మా శ్రీమతి తోనూ మాట్లాడింది ఎండ బాగానే ఉంది రెండుపూటలా వాకింగ్ చేశాను . ”చెన్నై చంద్రమా ”అన్నట్లు షార్లెట్ సూర్యుడు రాత్రి 8 గంటలకూ కనిపించాడు . రాత్రి సునయన ప్రెసెంట్ చేస్తున్న ”ఫ్రస్ట్రేటెడ్  ఉమన్ ”యు ట్యూబ్ లో చూసాం . సరదాగా బాగుంది ఎన్నో సమస్యలపై తనదైన ధోరణిలో బాగా ప్రదర్శిస్తోంది . దాదాపు ఏక పాత్రాభినయం . కరెంట్ టాపిక్స్ పై మంచికథనాలు . ఎంత ఈజీ గా చేస్తోందో చూస్తే ఆశ్చర్యమేస్తుంది ..మహా నటీమణులు చాలరుఅనిపించింది .చిన్నతనం లో బేబీ సునయన గా చాలా చేససిందని ప్రభావతి జ్ఞాపకం  చేసుకొన్నది ..మహాతల్లి  లూ  బాగుంటాయి  

  బుధవారం మా మనవడు చి హర్ష 6. 7 /10 మార్కులతో తెలంగాణా ఎస్ ఎస్ సి పాసయ్యాడు . 2015 ఆగస్టు 9 న పెద్ద యాక్సిడెంట్ అయి డివైడర్ కు తల తగిలి రెండు సార్లు బ్రెయిన్ ఆపరేషన్ జరిగి  అన్నీ మర్చిపోయి క్రమ క్రమంగా కోలుకుని 10 పరీక్షలు రాయాల్సినవాడు 9 చదివి తర్వాత 10 కూడా చదివి ఈ ఏడాది టెన్త్ పాసవ్వటం అద్భుతం . అందుకే వాడి బ్రెయిన్ ఆప రేషన్ చేసిన డాక్టర్ వాడిని మిరకిల్ బాయ్ అంటాడు  నిజమే హోప్స్ లేవని చెప్పారు కానీ దైవ కృపవలన సమయానికి హాస్పిటల్లో చేర్చిన యువ దంపతుల చలువ వలన మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి కృప వలన బతికి బయట పడి  క్రమంగా అన్నీ గుర్తుకు వచ్చి చదివి పరీక్ష పాసవటం ఎనిమిదవ వింత యే . వాడు పాసయిన సంగతి అందరికి మెయిల్ లో తెలియబరచాను మైనేనిగారు శ్యామలాంద  ప్రసాద్ గారు ,వారణాసి సూర్యకుమారిగారు  బొడ్డ పాటి చంద్ర శేఖర్ మొదలైనవారు సంతోషం వెలిబుచ్చుతూ సమాధానమిచ్చారు .
  వైకింగ్ శకం పై మూడు ఎపిసోడ్లు రాశాను . ది నాజీ హోలోకాస్ట్ ,ఏ వరల్డ్ వితౌట్ జ్యుస్  ది  వైకింగ్స్ పుస్తకాలు చదివేశాను .ఉయ్యూరునుంచి తెచ్చుకొన్న ఆలంకారికులు చదివాను ఈవారం లో . గురువారం సాయంత్రం 6-30 కు మా మనవళ్లు 6 వతరగతి చదువుతున్న  స్కూల్  లో పిల్లల జంత్ర వాయిద్య ప్రదర్శన కు వెళ్లాం మా మనవడు చి ఆశుతోష్ ట్రంపెట్ వాయించాడు బృందంతో .చాలామంది పేరెంట్స్ చూడటానికి వచ్చారు
 మే  21 వ తేదీ జరిగే శ్రీ హనుమజ్జయ0తి  కార్యక్రమం తయారు చేసి ప్రింట్ చేయించమని రమణకు మెయిల్ లో పంపాను .శ్రీమతిశాంతిశ్రీ భక్తి సంగీత విభావరి డా శ్రీ ఆచంట శివరామ కృష్ణ మూర్తిగారి ధార్మిక ప్రసంగం ,శతకత్రయ ధారణ పోటీలు బహుమతుల ప్రదానం మిగిలిన వాటితో చేర్చాం
  శుక్రవారం హర్ష పాలిటెక్నీక్ ఎంట్రన్స్ బాగా రాస్శాడని శర్మ చెప్పాడు . ఆదివారం హిందూ సెంటర్ లోశ్రీ సత్యసాయి మాతృశ్రీ ఈశ్వరమ్మగారి జయంతి  కార్యక్రమ0 లో వేసే పిల్లల డ్రామాలో మా మనవాళ్ళు స్టేజ్ ప్రాక్టీ స్  కోసం విజ్జి పిల్లని రాత్రి 7 కు తీసుకువెళ్లి 10 కి తిరిగివచ్చింది .అంతకు ముందుకొక గంట ఇంట్లో తెలుగు స్పెషల్ క్లాస్ నిర్వ హించింది ఆఫీస్ నుంచి రాగానే .
  రాత్రి బాలమురళీ కృష్ణ సంగీతం ఎలాపడాలి గాత్ర ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి స్వర రాగ విషయాలలో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి అనేవిషయాలపై ఇంగిలీషు లో చేసిన డిమాంస్ట్రేషన్ లెసన్ చూసాం యు ట్యూబ్ లో తర్వాత బృందావని రాగ తిల్లానా ఎలా పాడాలో నేర్పే తీరునూ చూసాం  బాలమురళి అంటే తిల్లానా స్పెషల్ .దీన్ని తమిళ విద్యార్థులకు నేర్పే  సిడి అది బాగుంది వాళ్ళు ఆయనతో చక్కగా పాడారు .ఇవి చూస్తే ఇలాంటి విషయాలపై బాలమురళికి ఉన్న సర్వజ్ఞత్వాన్ని  మన తెలుగు వాళ్ళు ఉపయోగించుకోలేక పోయారని పించింది .ఇలాంటి ఆయన పాఠాలు తెలుగులో ఉన్నాయో లేదో నాకు తెలియదు ఉంటె సంతోషం  .
  శనివారం  జ్యుల పై రెండు పుస్తకాలూ చదివి ఘోరకలి పేరిట 5 ఎపిసోడ్ లు రాశా . చి హర్ష పాలిటెక్నీక్ ఎంట్రన్స్ పరీక్షలో 45 మార్కులతో క్వాలిఫై అయినట్లు శర్మ మార్కుల మెమో తోసహా పంపాడు సంతోషించాము ఫోన్ చేసి మాట్లాడాం . అందరికి మెయిల్ ద్వారా విషయం తెలియ బరచాను .శ్రీ మైనేని  శ్రీ గాయత్రిప్రసాద్ గార్లు వెంటనే స్పందించి సంతోషం తెలిపారు
  సరసభారతి వీక్షకుల  సంఖ్య  ఈ ఉదయానికి 4 లక్షల 61 అయింది ఈ సంతోషవార్తనూ అందరికీ పంపాను  పవన్ రెండవ అమ్మాయి చి ప్రశాంతి పుట్టిన రోజును పిల్లలందరితో బయట నిర్వహించి రాత్రికి మమ్మల్ని ఇంటికి భోజనాలకుపిలిచాడు .మా కుటుంబం ,రాంకీ తమ్ముడు సాయి పవన్ కుటుంబం పవన్ మేనమామ కొడుకు కుటుంబం అతిధులం ..పవన్ భార్య రాధ అతిథిమర్యాద బాగా చేస్తుంది వాళ్ళత్త గారిని కంటికి రెప్పలాగా చూసుకుంటోంది ఆవిడ మా రెండవ బావగారు  వేలూరి వివేకానంద్ గారి అన్నగారైన ముకుందం గారి భార్య అంటే వదినగారు పవన్ ఆమె కుమారుడు ..పవన్ తండ్రి ముకుందం గారు చనిపోయి చాలా ఏళ్లయింది . వీరి బాగోగులు మా బావా అక్కయ్య చూశారు .  మంచి బంధుప్రేమ ఉన్నవాడు . భోజనంలో వంకాయ ,బెండకాయ కూరలు అల్లం చట్నీ ఆవకాయ ,బజ్జీలు గులాబ్జామ్ ,పెరుగు  పుచ్చ ముక్కలు ,మా అమ్మాయితీసుకు వెళ్లిన జున్ను ,పనస తొనలుతో సుష్టుగా భోజనం చేసాం . అన్నీ అదరహా . రాంకీ తమ్ముడు సాయి నా మెయిల్స్ పంపితే చదువుతానని అన్నాడు .వాళ్ళత్తగారు మామగారలకు మేంమంతా బాగా తెలుసునన్నారు విష్ణుభొట్ల ఇంటిపేరట . ఇంటికొచ్చి కొన్ని పంపాను . పవన్ తో డొమినికన్ ఆవిడ తన గురించి నాకేమీ సమాచారం పంపలేదని చెబితే తనకు పంపిందని తన గురించి రాయతగినంత గొప్ప విషయాలు లేవని తెలియ జేసిందని చెప్పాడు .సరదాగా ఒక అరగంట కబుర్లు చెప్పుకొని ఇంటికి రాత్రి 11 గంటలకు చేరాం .పవన్ ఇల్లు మా వాళ్ళ ఇంటికి చాలాదగ్గరే ఏడెనిమిది నిమిషాల కారు ప్రయాణమే  .మిగిలిన విషయాలు తర్వాత రెండో ఎపిసోడ్ లో రాస్తా ..
       మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.