వీక్లీ అమెరికా -5 -2 చివరిభాగం (1-5-17 నుండి 7-5-17 వరకు )

వీక్లీ  అమెరికా -5 -2 చివరిభాగం (1-5-17 నుండి 7-5-17 వరకు )

  రెండు పుట్టిన రోజుల వారం -2
7 వ తేదీ ఆదివారం విషయాలు -నిన్న మైనేనిగారు నాకు మెయిల్ రాస్తూ డా ఇన్నయ్యగారి భార్య గారు ”ఈల్ వీజిల్ ”రాసిన ”నైట్ ”పుస్తకాన్ని తెలుగులోకి”కాళరాత్రి ”గా  అనువదించి ముద్రించారని తనకు పంపిన మూడు కాపీలలో ఒకటి పంపానని మంగళవారం అందుతుందని తెలియ జేశారు .దీ న్ని మా మనవుడు శ్రీకేత్ టెక్స్ట్ బుక్ గా చదివి నాకిస్తే నేనూ చదివి తెలుగులో డబ్బింగ్ చేద్దామనుకొని ఎందుకో చివర నచ్చక మానేశాను ఆ పని ఆమె చేసినందుకు అభినందనలు మా అమ్మాయి ఇంటి దగ్గర నిర్వహించే తెలుగు క్లాసులు ఈ రోజుతో అయిపోయాయి పరీక్ష పెట్టారు మళ్ళీ సెప్టెంబర్ లో బడులు తెరిచాకనే మళ్ళీ ప్రారంభం అప్పటిదాకా ఆటవిడుపు . ఇవాళ ఉదయం  వీక్లీ  5 మొదటిభాగం రాశాను .     మధ్యాహ్నం  భోజనాలయ్యాక రెండు గంటలకు బయల్దేరి హిందూ సెంటర్కు వెళ్లాం .అక్కడ షార్లెట్ సాయి సెంటర్ వాళ్ళు గాంధీ భవన్ లో శ్రీ సత్య సాయి మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మగారి జయంతిని జరిపారు శ్రీమతి జయ ముఖ్య భూమిక వహించింది.  పిల్లలతో చక్కని ప్రోగ్రాములు నిర్వ హింప జేశారు తలిదండ్రుల సహకారం పిల్లల కుతూహలం ,సెంటర్ లోని టీచర్ల శిక్షణ అన్నీ కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి మా మనవాళ్ళు చి ఆశుతోష్ ,పీయూష్ లు కూడా పాత్ర పోషణ చేశారు  .
  సరిగ్గా మధ్యాహ్నం 3 కు ప్రార్ధన తో మొదలైంది .తర్వాత అందరూ సత్య అనిపిలిచే సత్య శంకర్ -బాబా కు తల్లికి ఉన్న చక్కని అనుబంధాన్ని తేలికమాటలతో అందరికీ అర్ధమయ్యేట్లు ఇంగ్లీష్  లో తెర మీద పిక్చర్లు చూపిస్తూ ప్రసంగించారు అతడు మంచి వక్త ,వాద్యకారుడు . భార్య సౌమ్య హార్మోనిస్టు  గాయకురాలు . కూతురు కూడా మంచిగాయని .ఈ కుటుంబం సాయి సెంటర్ కు వెన్నెముక అన్నివిషయాలలో –
”సాయి బాబా తాత  కొండలరాజు మనవడి లో  దైవ లక్షణాలు కనిపెట్టి చేయెత్తి నమస్కరించకుండా చేయి పట్టుకునేవాడు అదే నమస్కారం బాబా నిద్ర పోతుంటే వచ్చి పాదాలకు నమస్కరించేవాడటతాత .తాత కుఅన్నం వండేవాడు బాబా రసం బాగా కాచేవాడట ..పుట్టపర్తి అంటే పాము పుట్టపర్తి అనేవారట నాగ సంచారం ఎక్కువ కొండలు రాళ్లు రప్పలమయం బాబా చిన్నతనం లో .బాబాను చిన్నప్పటినుంచి బ్రహ్మ జ్ఞాని అనేవారట అందరూ .తల్లి నమ్మేదికాదట .ఒక్కోసారి ఆయన మహిమలు చూసి కంగారుతో అత్తగారికి చెప్పేది .ఆమె ఎవరికీ చెప్పకు నవ్వుతారు అనేది .. ఇంట్లో ఏ పండగ జరిగినా తన పుట్టిన రోజు అయినా సరే అందరికీ అన్నీ ఇప్పించి చివరికి తాను తీసుకునేవాడు సత్య నారాయణ రాజు అనే సత్య సాయి .దూరం గా అడవుల్లో ధ్యానం లో ఉన్న బాబా ను చూడటానికి తలిదండ్రులు వస్తే ”మాయ ”వచ్చింది అనేవాడు .అంటే తానూ సంసార బంధానికి దూరామని అర్ధం .బ్రహ్మజ్ఞానికి ఏ బంధాలు ఉండవని భావం .. తల్లితో ”నువ్వు ఈ ప్రపంచానికి చెందిన దానివి సర్వ ప్రపంచం నీదే ”అనేవాడు.
  దగ్గరున్న కొండపై మందిరం కడతాననేవాడు .అక్కడెందుకు పాములమయం ఇక్కడున్న బడి ని బాగు చేసి కొత్తది కట్టించు అని తల్లి చెబితే ముందర ఎలిమెంటరీ స్కూల్ కట్టించాడు .తర్వాత తల్లికోరికపై హైస్కూల్ కట్టించి ఆమెపేరుపెట్టించాడు .ప్రశాంతి మందిరం కట్టించినతర్వాత బాబా అక్కడే ఉండేవారు తల్లిదండ్రులు గ్రామం లోనే ఉండేవారు అందరు అప్పుడు రాగి సంకటే  తినేవారు . ప్రజలుసాయి గురించి చెడుమాటలు అంటూటే భరించ లేక కొడుక్కి చెబితే అప్పుడు అందర్నీ మందిరం లోనే ఉండే ఏర్పాటు చేశారు .ఒకసారి ప్రిన్సిపాల్ గోకక్ ఒక పిల్లాడు మందిరం లో అనేక పనులు చేసి ఆలస్యంగా వెడితే పంపించేశాడు వాడు ఏడుస్తూ కూర్చుంటే తానూ ప్రిన్సిపాల్ కు ఖాళీ ఉన్న సమయం లో వెళ్లి ”సారూ !మీ కన్నీ తెలుసు బిడ్డడు పను లన్నీ చేసి రావటం మూలాన కుసుసింత లేటుగా వచ్చిండు .తొ లి తప్పు కాయండి ”అని బతిమాలి ఆయన్ను ఒప్పించి కుర్రాడు వెళ్లేట్లు చేసిన మాతృమూర్తి అన్నాడు సత్య .తల్లి దండ్రులను తాతగారిని వీలున్నప్పుడల్లా వెళ్లి అంతకు ముందు చూసివచ్చేవారు సాయి .ఒక సారి తల్లికి తీవ్రంగా జ్వరం వచ్చి భరించలేక పోతుంటే సాయి వచ్చిమందు వేసి తగ్గించారట అప్పుడు ఆమెకు నమ్మకం కలిగిందట బాబా దైవ స్వరూపం అని . అలాగే చివరి సారి 19 72 లో ”స్వామీ స్వామీ ”అని కలవరించిందట వెంటనే ఆమె ముందు ఉన్నారట బాబా ”నాయనా నువ్వెవరవో నాకు ఎరుక పరచావు ధన్యోస్మి ”అంటూ చేతులు పట్టుకొని బాబా తల్లి ఈశ్వరమ్మగారు మరణించారని సత్య ప్రసంగం పూర్తి చేశాడు ఆసాంతం చాలా క్రమ పద్ధతిలో వివరించగా  అందరు  కరతాళ ధ్వనులతో అభినందించారు .
  తర్వాత 4-15 నుంచి నాలుగు ప్రదర్శనలు నిర్వహించారు .అందరూ పిల్లలే . వినాయక షణ్ముఖ ఈశ్వర రామ కృష్ణ సరస్వతి లక్ష్మి షిర్డీబాబ సత్యసాయి వేషాలతో మంచి దుస్తులు అలంకారాలు ఆయుధాలతో అలంకరించిన కుర్చీలలో కూర్చుని దేవతలంతా ఒక్కటే అనే భావాన్ని కలిగించారు .సాయి సర్వదేవతా స్వరూపుడు అనే భావం కలిగించారు దీనికి మంచి ట్రెయినింగ్ ఇచ్చి ,తీర్చి దిద్దిన లేడీ టీచర్ మానిని అభినందనీయురాలు డెకరేషన్ తో సహా అన్నీ ఆమె సమకూర్చింది తలిదండ్రులు వస్త్రాలు సమకూర్చారు .కాన్సెప్ట్ బాగుంది .పిల్లలతో తాము ఎందుకు ఏ పాత్ర వేసింది తెరమీద చెప్పగా చూపించి వైవిధ్యం కలిపించారు  .తర్వాత రీ సైక్లింగ్ విధానం పై నలుగురు ఆడపిల్లలు వివరించారు  చిలక పలుకుల్లా ఉన్నాయి ఫీల్ రాలేదని పించింది ..మూడోది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోబాటు బాబా కాన్ఫిడెన్స్ కూడా ఉండాలన్న ధీరీ తో పిల్లలే రాసి ప్రదర్శించింది బాగానే ఉంది అందరూ బాగానే చేశారు .చివరిదైన నాలుగవది సత్య సాయి జియోపార్దీ ”.దీనిని హిందూ సెంటర్ లో తెలుగు నేర్పే టీచరూ  పిల్లల డాక్టర్  మంచి డాన్స్ టీచర్ అయినా సాయి కృష్ణ అనే ఆవిడ నేతృత్వం లో ప్రదర్శించారు .ఇందులో మా మనవాళ్ళు అశుతోష్ ,పీయూష్ లు కూడా ఉన్నారు ఇంటి దగ్గర ఏ వేషం వేస్తున్నార్రా అని అడిగితె ”సీక్రెట్ ”అక్కడే చూడాలి అన్నారు అంతటి సీక్రెసీ ని బృందం అంతా మెయిన్ న్టైన్ చేసింది.ఇది సాయిబాబా జీవితం పై క్విజ్ ప్రోగ్రామ్ . చిన్న ప్రశ్నలే తేలికైనవే .ప్రేక్షకులకే   సరైన సమాధానం చెబితే బాబా ఫోటో బహుమతిగా ఇచ్చారు తమాషా ఏమిటట ఇన్నేళ్ళుగా సాయి సెంటర్ నడిపేవాళ్లు ఆయనపై ఎన్నో ప్రసంగాలు విన్నవాళ్ళు కూడా ఆయన ఎప్పుడు ఏనెల ఏ తేదీ ఏ వారం పుట్టారని అడిగితె కరెక్ట్ సమాధానం చెప్పక పోవటం వింత అనిపించింది
  దీనితర్వాత మళ్ళీ ఒక అరగంట భజన .
  సాయంత్రం 6 నుంచి స్నాక్స్ టీ  ఏర్పాటు .ఎవరికి వారు తమకు చేతనయింది ఇంటి దగ్గర చేసుకొచ్చి ఇక్కడ అందరూ తినే ఏర్పాటు చేశారు .ఒక తెలుగమ్మాయి పుట్టినరోజు నిన్నయితే ఇవాళ అందరి సమక్షం లో”ఎగ్ లెస్  బర్త్ డే కేక్ ”కోయించి అందరికి పెట్టించారు.ఇదికాక రసగుల్లాలు పునుగులు ,మిరపకాయ బజ్జీ ,మరొక శ్వీటు ,పిజ్జాలు ,అటుకుల పులిహోర కర్బూజకాయ ముక్కలు, మరమరాలు, కాఫీ, టీ లతో అందరూ సుష్టుగా లాగించారు .అంతా  అయ్యేసరికి రాత్రి ఏడు అయింది .ఇంటికి వచ్చేసరికి ఏడున్నర . ఈ ఫోటోలు పెట్టి ఇదంతా రాసేసరికి రాత్రి 10 .. ఇంతటితో ఈ వారానికి స్వస్తి .
 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.