టు కిల్ ఏ మేకింగ్ బర్ద్ నవలలో విఖ్యాతమైన -హార్పర్ లీ
అమెరికాలోని అలబామా రాష్ట్రం లో మన్రోవిల్ లో 28-4-1926 లో జన్మించిన నెల్లీ హార్పర్ లీ అక్కడే ఎక్కువ కాలం గడిపిహార్పర్ లీ కలం పేరుతొ రచనలు చేసింది తల్లి గృహిణి .తండ్రి న్యూస్ పేపర్ ఎడిటర్ ,అలబామా స్టేట్ లెజిస్లేచర్ మెంబర్ .లీ లాయర్ అయి తెల్లవాడిని చంపారని అభియోగం మోపబడిన ఇద్దరు నల్లవారి తరఫున వాదించింది .అయినా కేసు ఓడిపోయి తండ్రీ కొడుకు అయినా ఆ దోషులు ఉరి తీయ బడ్డారు తనకుటుంబం ,చుట్టూ ప్రక్కలవారినీ బాగా గమనిస్తూ రచనలు చేసేది అలీస్ ఫించ్ లీ ,లూయీ లీ కాన్నర్ ఎడ్విన్ లీ అనే మూడు పుస్తకాలను 1911 నుంచి 1951 లోపు రాసింది
మన్రో కౌంటీ హై స్కూల్ లో చేరి ఆంగ్ల సాహిత్యం పై అభిమాని అయింది గ్రాడ్యుయేట్ అయి మాంట్ గోమరి లోని హాంటింగ్డన్ మహిళా కాలేజీ చేరి తర్వాత తస్కలూసా లోని అలబామా యూనివర్సిటీ కి బదిలీ అయి లా చాలాకాలం చదివి యూనివర్సిటీ న్యూస్ పేపర్ లో రచనలు చేస్తూ డిగ్రీ మాత్రం పూర్తి చేయలేదు 1948 లోలండన్ ఆక్స్ ఫర్డ్ ,యూనివర్సిటీలో యూరోపియన్ నాగరికత పై జరిగిన సమ్మర్ క్లాస్ లకు హాజరైంది .కానీ దీనివలన ఫలితాంకనపడక మళ్ళీ లా కోర్సులో చేరింది
1949 లో న్యూయార్క్ చేరి ఎయిర్ లైన్ రిజర్వేషన్ ఏజెంట్ అయి ఖాళీ సమయం లో ఫిక్షన్ రాసింది .అనేక పెద్ద కథలు రాసి పేరు తెచ్చుకున్నది .అప్పుడే ఆమెకు స్నేహితుడు ఒకాయన ఒక సంవత్సర జీతాన్ని పంపి క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఆ కాలం లో కావలసినంత రచన చేసుకోమని రాశాడు 31 ఏళ్ళవయసులో 1957 లో ”గో సెట్ ఏ వాచ్ మన్ ”నవల రాసి ఏజెంట్ ద్వారా పబ్లిషర్ కు పంపింది .జె బి లిప్పిన్ కాట్ ఆ రచన చదివి అందులో ప్రతివాక్యం లో జీవం ఉందని పొగిడికొన్నాడు కానీ మెస్ హోహఫ్ కు నచ్చక ఎప్పటికప్పుడు మార్పులూ చేర్పులూ చేస్తూనే ఉండి చివరకు ”టు కిల్ ఏ మాకింగ్ బర్ద్ ”నవలగా రెండేళ్ల తర్వాత బయట పడింది ఈ నవలపై ఆమె I never expected any sort of success with Mockingbird. I was hoping for a quick and merciful death at the hands of the reviewers but, at the same time, I sort of hoped someone would like it enough to give me encouragement. Public encouragement. I hoped for a little, as I said, but I got rather a whole lot, and in some ways this was just about as frightening as the quick, merciful death I’d expected.
— Harper Lee, quoted in Newquist, 1964[14]
అని తన నిర్వేదాన్ని తెలియ బరచింది .రచయితా పబ్లిషర్ లమధ్య అనేక సార్లు చర్చలు జరిగేవి మార్పులకు ఆమె సుముఖంగా లేకపోతె వాళ్ళు చాలాబాగా నచ్చ చెప్పేవారు అలా ఆ నవల తుది రూపానికి చేరి1960 లో ప్రచురణ పొందింది .అమ్మకాలు జోరుగా సాగి బెస్ట్ సెల్లర్ అయిపులిటీజర్ బహుమతి పొందింది . 1999
లో లైబ్రరీజర్నేల్ ఆ నవలను ”ఈ శతాబ్దపు ఉత్తమ నవల ”అని ఎన్నికద్వారా తేల్చింది ఇదిఒక రకం గా ఆమె జీవిత చరిత్రే .పూర్తి యదార్ధ సంఘటనల తోనే రాసింది అందుకే జీవత్వం తో తొణికిసలాడింది
తర్వాత కాన్సాస్ లోని హొల్కొంబ్ కు వెళ్లి అక్కడ ఒకకుటుంబ హత్య విషయాన్ని శోధించి ”ఇన్ కోల్డ్ బ్లడ్ ”నవలారాసి 1966 లో అచ్చేసింది — మాకింగ్ బర్ద్ ప్రచురణతర్వాత 2016 లో చనిపోయే దాకా బహిరంగ సమావేశాలలో పాల్గొనటం కానీ ఇంటర్వ్యూలు ఇవ్వటం కానీ లీ చేయనే లేదు .ది లాన్గ్ గుడ్ బై నవల రాస్తూ కాలక్షేపం చేసింది దీన్ని ముద్రించలేదు .అలాగే అలబామా మర్డరర్ పై రాసినా అదీ నచ్చక అచ్చు వేయలేదు మాకింగ్ బర్ద్ సినిమా తీశారు దానికి అకాడెమి అవార్డు వచ్చింది ..నవలను ఇంట గొప్పగా ఇంతకూ ముందెవ్వరూ సినిమా కధగా మలచలేదు ”అని రాసింది .నటుడు గ్రెగరీ పెక్ తోను ఆతనికుటుంబం తోను లీ కుటుంబం చివరిదాకా స్నేహ సంబంధాలు కొనసాగించారు మన బాలీవుడ్ నటుడు దేవానంద్ ను గ్రెగరీ పెక్ అనేవారు పెక్ కు ఆస్కార్ అవార్డు ఆటి కస్ ఫించ్ పాత్రకు ఇచ్చారు 1966 లో ప్రెసిడెంట్ జాన్సన్ లీ ను ”నేషనల్ కౌన్సిల్ ఆన్ ది ఆర్ట్స్ ”కు ఎంపిక చేశాడు 1910 లో ప్రెసిడెంట్ ఒబామా ”నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్స్ ”అంద జేశాడు 2013 లో హార్పర్ లీ తన నవల మాకింగ్ బర్ద్ కాపీ హక్కులను స్వాధీనం చేయమని తన ఏజెంట్ అల్లుడిపై కోర్ట్ లో దావా వేసింది ఇరుపక్షాల వాదనలు విని జడ్జి రాజీ కుదిర్చి పరిష్కరించాడు 2014 లో మన్రో హైకోర్టు లో మ్యూజియం తనకు తెలియకుండా అనుమతి లేకుండా తననవలా ప్రదర్శన చేస్తోందనివ్యాజ్యం వేసింది
2015 లో ”గో సెట్ ఏ వాచ్ మన్ ”నవల ప్రచురణకు కోర్ట్ అనుమతించింది 89 ఏళ్ళవయసులో 19-2-2016 న హార్పర్ లీ మరణించింది .రెండే రెండునావాలాలు అయిదే అయిదు వ్యాసాలూ మాత్రమే రాసినా హార్పర్ లీ అమెరికా సాహిత్యం లో గొప్ప నవలాకారిణిగా గుర్తింపు పొందింది