వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -35
ఏకావలి లో అలంకార చర్చ(చివరిభాగం )
పర్క్యాయోక్తి అలంకారం-పర్యాయోక్తి అలంకార నిర్వచనం లో విద్యాధరుడు పూర్తిగా అలంకార సర్వస్వాన్నే అనుసరించాడు -”గమ్యత్సా పి భంగ గ్య0త రేణాభి దానం పర్యోక్తం ”
ఈ అలంకారం తెలియాల్సిన దాన్ని ఏదో ఒక విధానం లో తెలియ జేస్తే పర్యాయోక్తి .అంటే ఫలం ,ప్రభావం ,ప్రయోజనం మొదలైనవి తెలియాల్సిన లేక గమ్యం కు కారణాలు అవుతాయి. దీనిపై మల్లినాథుని వ్యాఖ్యానం చాలా స్పష్టంగా ఉంది .-”యత్ర ప్రస్తుత కార్య కధనాత్ ప్రస్తుతమేవ కారణం గమ్యతే -తత్ర కార్యద్వారా కారణ స్యేవ పర్యాయేణ భంగ యంత రేణోక్త త్వాత్ పర్యాయోక్త మిత్యర్ధహ్ ”అన్నాడు
ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది -ఒకే వస్తువు వివరణగా సూచనగా ఎలా ఉంటుంది?కారణాన్ని సూచిస్తే ఫలిత0 ద్వారా తెలియ జేయవచ్చు కారణం కూడా సంబద్ధమైనదే అప్పుడు అది అప్రస్తుత ప్రశంస తో భేదిస్తుంది ..ఇక్కడ విద్యాధరుడు సూచింపబడిన అర్ధం లేక భావం బలవత్తరమైతే అప్పుడు అది ఒకరకమైన ధ్వని అని పిస్తుంది ”యత్ పునరిహకార్యస్యేవ వర్ణనం తత్కారణా పేక్ష యస్య చమత్కారాతిశయ కారిత్వాత్ ”(ధ్వన్యాలోక0 ) ఇక్కడ అతని వ్యాఖ్య ధ్వన్యాలోకం లోని వ్యాఖ్యను పోలి ఉంది కనుక మల్లినాథుడు ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పాడు .సంబద్ధమైన కారణం సంబద్ధమైన ఫలితాన్ని సూచిస్తే అది పర్యాయోక్తి అవుతుందన్నారు .అంటే ఫలితం కారణాన్ని మరొక విధంగా తెలియ జేస్తుంది .ఫలితం ద్వారా చెప్పబడే కారణం యొక్క వర్ణన ,సూటిగా వర్ణించినదానికంటే మరింత రమ్యంగా ఉంటుంది .
మల్లి నాధుడు కొన్ని అలంకారాలతో పోలికలు భేదాలు చర్చించి ఇదే విధంగా స్పష్టం చేశాడు .కొన్ని ఉదాహరణలు చూద్దాం –
విరోధ ,విశేషోక్తి అలంకారాల మధ్య తేడాలను వివరిస్తూ రెండు వస్తువులు ఒకే సమాన బలం తో ఒకదానికొకటి వ్యతిరేకంగా చెప్పబడితే అది విరోధా భాస అన్నాడు .విశేషోక్తి లో ఫలితం దాగి ఉండి కారణం లేకుండా అంగీకరింపబడకుండా ఉంటె విశేషోక్తి అవుతుంది .కానీ కారణం లేకుండా ఫలితం అంగీకరింపబడదు -”అతః ప్రతినియత్ బాధ్య బాధ్యక భావాపన్నో విరోధో విశేషోక్త్యో -విరోధాలంకారే తు విశేష భావాదుభయొహ్ పరస్పర బాధ క భావాపన్న ఇత్యనయోరపి భిన్న విషయత్వ మేవేత్యర్ధహ్ ”
ఇలాగే రూపకాన్ని ఉత్రేక్ష ,అతిశయోక్తి ల మధ్య భేదాన్ని కూడా ఇంత స్పష్టంగానూ వివరించాడు .ఈ రెండు బృందాలలో ఉన్న భేదం ఆరోప ,అధ్యారోపాల ఆధారంగా ఏర్పడినవే అన్నాడు .భేదం లేనిది వస్తువును మింగేసి అనుభవానికి వస్తే అధ్యవాస్యా అవుతుంది అలాంటి మింగుడు లేకపోతె ఆరోపణ అవుతుంది -”ఆరోపాన్యత్రాన్యస్యా వాపః -యధా ముఖం ఇత్యాన్న ముఖే చంద్రత్వస్య ఏతే నాద్యావశ్య మూలో త్ప్రేక్షా తిశయోక్తి భ్యాం భేదః -విషయని గరణేనా భేద-ప్రతిపత్తి రధ్యావసాయః -విషయాని ఘరానా మంత రేణా భేద ప్రతి పత్తి రారోప ఇత్యన్యో భేదాదితి”
”ఏకాదశ వివర్త రూపకాల”కు సమాసోక్తికి మధ్య ఉన్న ముఖ్య విలక్షణతనుమల్లినాథ సూరి వివరించిన విధానాన్ని డా త్రివేది ఎలా తెలియజేశాడా లాల్యే పండితుడు చెప్పాడు -”మొదటి దానిలో పోలిక చెప్పే విషయి విషయ0 పై ఆరోపింపబడి ఒక చోట చెప్పి వేరొక చోట సూచనగా ఉంటుంది అప్రస్తుతమైన విషయి ప్రస్తుతమైన విషయాన్ని తన ధై న రూపం లో రంగుల్లో తెలియ జేస్తుంది .రెండవదానిలో అప్రస్తుతం సామాన్య గుణం తో సూచింపబడి ప్రస్తుతాన్ని బలీయం చేయదు కానీ దాని వేరే మాటలతో ఆవిష్కరిస్తుంది .మరో రకంగా రూపకం లో విషయి ప్రస్తుతం పై ఆరోపించబడుతుంది .సమాసోక్తి లో అప్రస్తుతం యొక్క ప్రవర్తన ప్రస్తుతం పై ఆరోపింపబడి ”వ్యంజనమ్ ”కు కారణమవుతుంది .
మల్లినాథుడు ఆపహ్నుతి ,వ్యాజోక్తి లమధ్య విలక్షణాలనూ క్షుణ్ణంగా పరిశీలించి చెప్పాడు ..పోలిక దాగి ఉంటె ఆపహ్నుతి . దాగి ఉన్నదాన్ని పోలికతో చెబితే వ్యాజోక్తి .-”యత్రాహ్నవ ముఖేన సాదృశ్యం ప్రతిపాద్యతే తత్రాపహ్నవః -యాత్ర సాదృస్యోప జీవనే నాపహ్నవః క్రియతే తత్ర వ్యా జోక్తిః ”(ఏకావాలి ).తుల్య యోగితా విషయం లో మల్లినాథుని వివరణ సూటిగా సుత్తి లేకుండా ఉంది .దీన్ని పట్టికలో ఇలా చూఅచ్చు
ఔ పమ్య గర్భాలంకారః
|
పదార్ధ గతః వాక్యార్ధ గతః ,
– |
సమాసపూర్వకం వ్యాస పూర్వకం
దీపకః తుల్య యోగితా
పోలిక దాగ్గిఉన్నా ధ్వనికి అవకాశం లేదు సూచింపబడిన భావం సూటిగా అర్ధాన్ని బలీయం చేసి అది ప్రాధాన్యం కోల్పోయి అపరాఅంగికమై గూనీ భూత వ్యంగ్యం లో ఒక అరకం అవుతుంది మరో చోట దీపకం తుల్య యోగితాల ప్రధాన లక్షణ భేదం వివరణ ఉంది సమాన లక్షణం ప్రాకృతానికి కానీ అప్రకృతానికి కానీ సమీపం లో ఉంటుంది .
సూరి దృష్టాంత ,నిదర్శనాలంకారాలమధ్య భేద లక్షణాలన్నీ అదే స్ఫూర్తి తో చెప్పాడు .రెండు వాక్యాలు రెండు విభిన్న భావాలను సంబంధం లేనివాటిని చెబితే దృష్టాంతం .రెండువాక్యాలు ఒకే భావాన్ని విధి మొదలైన ఆదేశాలతో చెబితే అర్థవాదం తో ఉంటె నిదర్శనాలంకారం -”యత్ర పరస్పర నిరపేక్షా ర్ధ త్వేన వాక్యార్ధ భేదస్తత్ర దృష్టాంత -యాత్ర సాపేక్షార్ధత్వే న విద్యర్ధ వాదయోరివ వాక్యయో రేఖ వాక్యతా తత్ర నిదర్శనేతి భేదః
అలంకారాలతో సూక్షం భేదాలను మల్లినాథుడు గమనించాడు -”ప్రత్యాయ్యప్రత్యాయక భావోనుమానం -సమర్ధ సమర్ధకా భావే నిరపేక్ష యో తతస్టే న హేతుర్వేర్యార్దంతరన్యాసః -కేవలం సామాన్యయోహ్ కేవలావ శేష యోర్వా నిరపేక్షయోరేవ హేతు త్వే దృష్టాంత -కార్యకారణా రూపవాక్యార్ధ యోస్తు సాపేక్షార్హే తుత్వే వాక్యార్ధ హేతుకం కావ్యలింగమితి ”అని స్పష్టపరచాడు
నిరూపించింది ,నిరూపించబడినదానిమధ్య సంబంధం ఉంటె అనుమానాలంకారం .కారణం ఒక సామాన్యం తో విశేషం విశేషం తో సామాన్యం సమర్ధిస్తే అర్ధాంతరన్యాసం .సామాన్య విశేష వాక్యాలు భావాలు వేరుగా స్వతంత్రంగా ఉంటె దృష్టాంతాలంకారం .రెండువాక్యాలలోని భావం కార్య కారణాలు గా ఉంటె కావ్యలింగాలంకారం అవుతుంది అని సందేహ రహితంగా ఏకావాలి లోని అలంకార చర్చలో వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి వివరించాడని త్రివేదీ తెలియజేసినట్లుడా పి .జి .లాల్యే పండితుడు మనకు చెప్పాడు . ఇంతటితో అలంకార చందన చర్చ కు సమాప్తి పలికి ఏకావాలి పై మల్లినాథుని వ్యాఖ్యానం లోని ముఖ్య విషయాలను తరువాత తెలుసుకొందాం .
అన్నమయ్య జయంతి శుభాకంక్షలతో
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా