నా దారి తీరు -102 మేడూరులో ఉద్యోగం -3

నా  దారి తీరు -102

             మేడూరులో ఉద్యోగం -3
సీనియర్ గుమాస్తా వెంకటరామయ్య రిటైర్ అయ్యారు .ఆయన బదులు సమితినుంచి లోయ శంకరరావు అనే కుర్రాడు వచ్చాడు .చాకు .కాంగ్రెస్ నాయకులతో బాగా పరిచయమున్నవాడు .పని వేగం గా నిర్దుష్టంగా చేసేవాడు .జిల్లాపరిషత్ లో కూడా మంచి పరిచయాలుండటం తో పంపిన బిల్లులు కావాల్సిన ఆర్దర్లు త్వరగా సాంక్షనై  వచ్చేవి ..ఇద్దరు ముగ్గురు లెక్కలమేస్టార్లు బదిలీ అయి కొత్తవారు చేరుతుండటం తో ఇబ్బందిగా ఉండేది పదవతరగతి పిల్లల్ని పరీక్షకు తయారు చేయటం లో లెక్కల ప్రసాద్ బాధ్యత ఎక్కువయ్యింది అయినా చాలా సమర్ధంగా చేశాడు . లైబ్రరీ పై అంతస్తులో ఉండేది .చాలాపుస్తకాలు ఇక్కడే చదివాను . దానికి అనుబంధంగా హాలు ఉండేది .ఎవరైనా మేష్టారు సెలవు పెడితే ఎక్స్ట్రా వర్క్ గా పిల్లల్ని లై బ్రరీకి పంపి పుస్తకాలు మేగజైన్లు చదివించేవాళ్ళం .ఇది నేను రాకముందు నుంచే ఉంది . డ్రాయింగ్ మాస్టర్ కాటూరి ప్రసాద్ కాటూరు వాడు మాతో పాటే ఉయ్యూరు నుంచి వచ్చేవాడు మంచి ఆర్ట్ ఉన్నది. మరో మొహంజదారో నాటకం ,అక్కినేని ఆదుర్తి తీసిన ఆర్ట్ సినిమాలు సుడిగుండాలు ,మరోప్రపంచం  లకు సంభాషణా రచయిత మోదుకూరి జాన్సన్ దగ్గర పని చేసినవాడు పాటలు రాసేవాడు బాగా పాడేవాడు .జాన్సన్ తో తన అనుభవాలు చెప్పేవాడు ..ఈయనను ఎలా బాగా ఉపయోగించుకోవాలా అని ఆలోచిస్తున్నాను  .లైబ్రరీహాల్ లో గోడలమీద మంచి సూక్తులు ,పద్యాలు రాయించటం తో మొదలుపెట్టి భారత దేశం మాప్ వేయించి ,సైన్స్  రూమ్ లో మానవ శరీర బాగాలు  పీరియాడిక్ టేబుల్ వేయించి అతని కళను సద్వినియోగం చేయించాను ..
  ప్రతి సెక్షన్ వాళ్ళూ ఒక జాతీయ నాయకుని ఫోటో తమక్లాసు రూమ్ లో స్వంత   ఖర్చులతో క్లాస్ టీచర్ల సహకారం తో పెట్టించాను .సైన్స్ రూమ్ లో సైన్టిస్ట్ ల ఫోటోలు ,ట్యూబ్ లైట్ల అమరిక చేయించాను ..పెద్ద బావికి మోటారు ఉండేది ఆ నీరు కొబ్బరి చెట్లకు పారించటం ,గార్డెన్ లో కూరగాయలు పండించటం అవి వేలం వేసి డబ్బు జమ చేయటం ఉయ్యూరయ్యే చేసేవాడు . కొబ్బరి చెట్ల  పోషణ బాధ్యతా అతనిదే .స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే లను ఘనంగా నిర్వ హించేవాళ్ళం .ఆడపిల్లలు ఎక్కువమందిఉన్నా పాటలు పాడేవాళ్లు ఉండేవారుకాదు . పమిడిముక్కలలోడా కృష్ణారావు గారు మేడూరు వారే .ఆయన అక్కడ ఒక కాన్వెంట్ నడిపేవారు భార్య ప్రిన్సిపాల్. ఆయన్ను ఫంక్షన్ లకు పిలిస్తే వచ్చేవారు ..సంస్కారమున్న మనిషి .తెలుగు దేశం పార్టీలో పెద్ద లీడర్ కూడా . పమిడిముక్కల నుండి వచ్చే డ్రిల్ మాస్టారు రిటైరయ్యారు  ఆ సందర్భం గా స్టాఫ్ ఆయనకు సన్మానం చేసి వీడ్కోలు సభ నిర్వహించాము ఆయన ఆటలలో బాగా ఆడినవారికి బహుమతులు ఇవ్వటానికి కొంత డబ్బు ఫిక్సెడ్ డిపాజిట్ కు ఇచ్చారు .ఈ వ్యవహారం తెలుగు మేష్టారు చూసేవాడు . డ్రిల్ మాస్టారు చాలా సంతోషంగా మా అందరికీ పెద్ద పార్టీ కూడా ఇచ్చారు ..మేడూరులో ఎల్ ఐసీ ఏజెంట్ ఒకాయన ఉండేవాడు మంచివాడు చిన్నతరగతులకు ట్యూషన్ చెప్పేవాడు .మేడూరు పోస్ట్ మాస్టారు బాగా సహకరించేవాడు . అప్పుడు పబ్లిక్ పరీక్ష  ఆన్సర్ పేపర్లు పోస్టాఫీస్ ద్వారా ఎవరికి అంటే ఏ సెంటర్ కి పంపమంటే ఆ సెంటర్ కు పంపేవాళ్ళం ఇక్కడ పోస్ట్ మధ్యాహ్నం 2 కు క్లోజ్ .ఈ లోపల బండిల్ తయారుకాకపోతే మర్నాడు పోస్టులో పంపేవాడు ..నాకు అనుమానం వచ్చేది . నేను అక్కడినుంచి వచ్చాక డబ్బు బాగా తినేశాడని ఆరోపణవచ్చి ,రుజువై సస్పెండ య్యాడు .అతనికొడుకు అప్పుడు బడిలో చదివే వాడు తర్వాత అనేక ఉద్యోగాలు చేసి ప్రస్తుతం బెజవాడ  వన్ టౌన్ పోస్టాఫీజు లో పని చేస్తూ అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు
      వార్షికోత్సవం జరపటానికి అన్నితరగతులవారికి వక్తృత్వ వ్యాస రచన క్విజ్ పోటీలు నిర్వహించాం .ప్రతి క్లాసులో ఎక్కువ శాతం హాజరున్న వారికీ ,సంచాయికలో ఎక్కువ డబ్బు పొదుపు చేసినవారికి  పైతరగతులలో  క్రింది తరగతులలో   మంచి క్రమశిక్షణతో మెలగినవారికి ఉత్తమ విద్యార్థి పురస్కారం ఇచ్చాము ఆటలు క్రీడలలో పోటీలు పెట్టి జూనియర్స్ ,సీనియర్స్ కు వేరుగా ,అలానే ఉపాధ్యాయుల మధ్య బాడ్ మింటన్ వాలీ బాల్ పోటీలు పెట్టి వారికీ బహుమతులు ఇచ్చాము .క్రీడా విషయాలన్నీ డ్రిల్ మేష్టారు సుబ్బారావు గారే చూసేవాడు .వార్షి కోత్సవానికి మేడూరు వాసి రేడియోలో పాడీ  పంట నిర్వాహకులు యలమంచిలి హనుమంతరావు గారిని ఆహ్వానించాం ..వారు స్ఫూర్తి  దాయక ప్రసంగం చేశారు .ఎందరో దాతలు ఫిక్సెడ్ డిపాజిట్లు చేశారు ..ఆ  వడ్డీ  డబ్బులు బాంక్ నుంచి తీసి ఎవరికోసం నిర్దేశింప బడిందో వార్షికోత్సవం రోజున అంద  జేయటం అలవాటు అలానే చేసాం .ప్రతి తరగతిలో  ఫస్ట్  సెకండ్ థర్డ్  వచ్చినవారికి మంచి విలువైన పుస్తకాలు కొని బహూకరించాం
   పద వ తరగతి పబ్లిక్ పరీక్షలు దగ్గర కోస్తున్నాయి .హయగ్రీవం గారు హెడ్ మాస్టర్ గా ఉండగా ఉయ్యూరునుంచి మేము వాచర్లుగా వచ్చాము .అంతా యమా డి ప్లిన్ గా కనిపించేది .కానీ కాపీలు తెగ కొట్టేవాళ్ళు .ఎప్పుడూ వీళ్ళ పాస్  శాతం 80పైన ఉండేది నేను డేగ చూపుతో అన్నీ కనిపెట్టి లాగేసి అక్రమం జరక్కుండా చూశాను నా రూమ్ లో కానీ అందరూ అలా ఉండరు . ఆ ఏడు కఠినంగా మేస్టార్లు అందరం  ఒకే మాటమీద ఉండటం తో శాతం 50 కి పడిపోయింది .వాపు తప్ప బలుపుకాదు ఇప్పుడు  నేనే పరీక్ష నిర్వహించాలి .కనుక అతి జాగ్రత్తగా ఉన్నాను .శంకర రావు ను కూడా లైన్ లో పెట్టాల్సి వచ్చింది . ఇక్కడికి ఆగినపర్రు విద్యార్థులు కూడా వచ్చి పరీక్ష రాశారు .ఆ మేస్టార్లు వాచర్లుగా వచ్చారు వారిని మేడూరు పిల్లలున్న రూమ్ లకు వేయాలి అందులో ఒక సైన్స్ మేష్టారు బాగా ట్యూషన్లు చెప్పేవాడు .ఆయన చాలా లూజుగా ఉన్నట్లు మొదటి రోజే గమనించి అత్య0త  జాగ్రత్తగా ఉండి”  రేకాడ ”కుండా చేశాను పరీక్ష హాలులోకి ప్రవేశించేముందే అందర్నీ పూర్తిగా చెక్ చేసి పంపేవాళ్ళం నేనూ డిపార్ట్ మెంట్ ఆఫీసరూ అయినా ”ఎక్కడో ”దాచి దొరికి పోయేవారు .ఆ ఏడాది ఏం ఆర్ ఓ కూడా విజిటింగ్ కు వచ్చేవాడు డిపార్ట్ మెంట్ వాళ్ళుకాక .చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు . రెండుమూడుసార్లు విజిట్ కు వచ్చాడు నాకు సంతోషంగా ఉండేది .పరీక్షలన్నీ బాగానే జరిగాయి అనుకొన్నసమయం లో చివరి పరీక్ష సోషల్ -2 లో యెంత జాగ్రత్తపడ్డా ఒక మేడూరు కుర్రాడే కాపీ తీసి పట్టుబడి సస్పెన్డ్ అయ్యాడు .నెత్తీ నోరూ కొట్టుకుంటూనే ఉన్నా0 అందరం .ఇదొక లోపం తప్ప అంతా  సవ్యంగా జరిగింది   ,
  అలాగే ఏడవతరగతి పరీక్షలూ నిష్పక్షపాతంగా జరిపాను . ఇలా కఠినంగా ఉండటం సర్పంచ్ కి ఇష్టం లేదన్నట్లు వార్తలు విన్నాను ఎవరికోసమో పనిచేయం కదా మన ఆత్మా తృప్తికే డ్యూటీ . మేడూరు లో పని చేస్తుండగానే మా పెద్దబ్బాయి శాస్త్రికి చి సౌ ములగలేటి   సమతకు వివాహం జరిగింది .ఆ అమ్మాయి మా ఇంటికి పెద్దకోడలు .చలాకీ గా ఉండేది అలాంటి అమ్మాయి కోడలుగా రావాలని అనుకొన్నాం .అలాగే ఆ అమ్మాయి చాలా బాధ్యతగా ఉంటుంది అన్నివిషయాలలో . మేడూరు స్టాఫ్ అందరూ బెజవాడ వచ్చారు పెళ్ళికి . ఇక్కడ ఉండగానే మ్యూజిక్ వాల్ క్లాక్ కొన్నాం బెజవాడ వెళ్లి . హెడ్ మాస్టార్ల లిస్ట్ ఉన్న బోర్డు లు ,ఏడు ,పది  పాస్    శాతం  ఫాస్ట్ వచ్చిన వారిపేర్లు రాయించాను .స్కూల్ యెట్ ఏ గ్లాన్స్ కూడా
    మేడూరి రామమోహనరావు గారు అనే యలమంచిలి రామమోహన రావు  గారు బాడీనిర్మాత వితరణ శీలి  జూన్ నాటికి మరణించి సంవత్సరం అవుతోందని ,ఆయన విగ్రహ ప్రతిష్టాపన చేయాలని స్టాఫ్ లో ఆలోచన వచ్చింది .బాగుంది అని ముందు స్టాఫ్ మెంబర్లు చందాలు వేసుకొని మిగిలినవారి వద్ద వసూలు చేయాలని నిర్ణయించాను నేను వెయ్యి నూట పదహార్లు వేశాను ,అలాగే జీతం బట్టి లేక వారిష్టం ప్రకారం చందాలు వేశారు . దీనికి రసీదు పుస్తకాలు వేయించాం .సర్పంచ్ వగైరాలూ బాగా సహకరించాం .అయితే విగ్రహం తయారు చేసేదెవరు అనేది ప్రశ్న అయింది ఎవరికీ ఏమీ తెలియదన్నారు .అప్పుడు తెనాలిలో అక్కలమంగయ్య అనే ఆయన కొడుకు బాగా చేస్తాడని ఒక సారి వెళ్లి కనుక్కోమని చెప్పాను దీనికి సుబ్బారావు లాబ్ అసిస్టెంట్ ప్రసాద్ స్టాఫ్ సెక్రెటరీలకు బాధ్యత అప్పగించాం వాళ్ళు వెళ్ళిమాట్లాడి చేస్తానని అనగానే అడ్వాంస్ ఇచ్చారు . కొంత షేప్ వచ్చాక మళ్ళీ చూసి రమ్మని పంపాము బాగా నే వచ్చింది అన్నారు ఫోటోలు తీయించి వారి కుటుంబ సభ్యులకు చూపించి వారి ఆమోదమూ పొందాం .మేడూరులో పని చేసి వెళ్లినవారందరికీ ముందుగానే ఆహ్వానపత్రాలు పంపాము అందులో ఆయనపై అభిమానం ఉన్నవారందరూ డబ్బులు పంపారు కంచు విగ్రహం చాలా ఖరీదు అని భావించి బస్ట్ సైజు తో తేలిక విగ్రహానికి ఆర్డర్ ఇచ్చాము .విగ్రహం జూన్ 10 నాటికి అందజేయాలని చెప్పాం సరేనన్నాడు శిల్పి .
         సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-5-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.