వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -36
ఏకావాలి పైవ్యాఖ్యానం లో మల్లినాథుని ప్రత్యేకతలు
ఇప్పటిదాకా మనం అలంకారాలపై మల్లినాథుని వ్యాఖ్యలను పరిశీలించాక ఆయనలోని సునిశిత , సూక్ష్మ పరిశీలానా దృష్టికి ఆశ్చర్య చకితులమవుతాం ..ఇప్పుడు ఏకావళిపై సూరి రాసిన తరళ వ్యాఖ్యానం లోని కొన్ని ముఖ్యాంశాలను తెలుసుకొందాం . ఆయన పాండిత్యగరిమ ,పారదర్శకత వ్యాఖ్యానం లో ప్రస్ఫు ట మై అబ్బురపడతాం .వ్యాకరణ సిద్ధాంతాలపై ఆయనకున్న ప్రస్ఫు ట అవగాహనకు ఆశ్చర్య పడతాం
తరళ వ్యాఖ్యానం లో అతి సూక్ష్మ కీలక భావనలను ఆయన అతి సునాయాసం గా అత్యంత స్పష్టంగా వివరించాడు .క్రియ యొక్క ప్రాముఖ్యత ఒక పదం లోలేక సమ్మేళనం లో ముఖ్యంగా కానీ గౌణంగాకాని కానీ సహాయకారిగా ఉంటె క్రియను సంభావించని లోపం వలన అది ప్రాముఖ్యత చెందుతుంది దీన్నే అవిధేయతా విదేయాంశ అన్నాడు .తద్ధితాలలో లోకూడా ఇలాంటి లోపమే ఉంటుంది .దీనికి ఆపవాదు ఉదాహరణ ఇస్తూ ,క్రియ యొక్క ప్రధాన స్వభావం కొన్ని విభక్తులలో లోపం కాదు నరసింహ భారతి లో భారతి యొక్క ప్రాధాన్యత తద్ధితమైన నరసింహ వలన తగ్గలేదు అని చెప్పాడు .-”నరసింహీ భారతీత్యుక్తే నరసింహ సంబంధ భారతీ పరత్వం ప్రతీయతే న తు నరసింహ పరత్వం ప్రకృత్యార్ధ ప్రాధాన్యక్కారేణ ప్రత్యయేన్ స్వార్ధ ప్రాధాన్య ప్రకాశనా దిత్యర్ధహ్ ”
మల్లినాథుడు మరో ఉదాహరణ ఇచ్చాడు .వైశ్వ దేవిక్ ఆమీక్షా ” అంటే పెరుగు మజ్జిగ మిశ్రమం వైశ్వ దేవికి నైవేద్యం అని అర్ధం .ఇక్కడ ఆమీక్ష అనేది ఒక ప్రత్యేక పదార్ధం దేవునికి నైవేద్యగా తయారు చేయటం .ఇది తద్ధితమైన అన్ ను వైశ్వ దేవి ని బలీయం చేసింది -నరసింహ భారతి లో భారతి నరసింహ శబ్దానికి సమందించి నట్లుగా . దీన్ని మల్లినాథుడు ఇలా వివరించాడు -”విభక్తిరహి ప్రతిపాడుకాదుత్పన్నా తదర్థస్య విశేషతః సామాన్యతో వా సంబంధం బోధయ0 తీ న తస్య విధేయస్య ప్రాధాన్యం తాత్పర్య విషయతారూప0 తిరోధతే -తద్ధితస్తు తస్యేదామితి తత్సంబంధ న్య ర్ధాంతరే విహితస్యే వ ప్రాధాన్యం గమయనన్ ప్రకృత్యార్ధ ప్రాధాన్యం వ్యాహన్తీ త్వన్యాయ వ్యతిరేకా భ్యామ వగమ్యత ఇత్యర్ధహ్ ”
మూలానికి విభక్తి తగిలిస్తే అది దానికి సామాన్యంగా కానీ ప్రత్యేకంగా కానీ సంబందాన్నిస్తుంది తాత్పర్యం లో భేదం రాదు తద్ధితమ్ కనుక తస్య ఇదం తో కలిస్తే ప్రాధానమైనదాని ప్రత్యేకత తెలుపుతుంది .ఇవి దన్తమ్కు రుణాత్మక చర్చలద్వారా సాధించాలి నరసింహ భారతిలో భారతి ప్రధానమై నరసింహకు విశేశార్ధాన్నిచ్చింది దీన్ని మల్లినాథుని వృత్తి లో స్పష్టంగా వివరించాడు -”అక్లాండం ముఖం చంద్ర ఇతి ప్రయోగే శబ్దాదన్య దాత్వేపి విశేష్య ముఖ చంద్ర గతోక్త ర్ష హేతు త్వె న తద్ది శేషణ యో సకలంకత్వా కళంకాన్వయో ర్వి ధేయత్వాత్ ప్రాధాన్యం తాత్పర్య విషయత్వ రూపం వివేప్యయో రముఖ చంద్రయో నృ దామన్యో రప్రదాన్యం చార్యా సిధ్య నృవాద సమ ర్య రూపాదవగమ్యతా ఇత్యర్ధహ్ -వృత్తో తు నైవం ”
ముఖం కళంకరహితం .చంద్రుడు కళంక సహితుడు .కనుక ముఖం చంద్రునికంటే ప్రకాశయానం .ఇది విద్యానువాదం వలన బలీయమైంది .నరసింహస్య బదులు నరసింహి అని ఉంటె విశేషణం క్రియగా భాసించదు .ఈ విధంగా మల్లినాథుని తరళ వ్యాఖ్యానం లో కీలక భావనలపై అతి సంక్షిప్త స్పష్ట నిర్వచనాలున్నాయి .ఈ నిర్వచనాలు ఏకావలికి రాసిన వృత్తి లోనూ కనిపిస్తాయి .కొద్దీ తేడా ఉంటుంది వివరణలో .వృత్తిని వక్రీకరించకుండా నిర్వచనాలను మరింత సరళం చేసి పునర్మించాడు .
తరువాత ఒకసారి” పాకం ”లో మునుగుదాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
—