వీక్లీ అమెరికా -6-మనవడు సంకల్ప్ ఏం ఎస్ గ్రాడ్యుయేషన్ వారం

వీక్లీ  అమెరికా -6-మనవడు సంకల్ప్ ఏం ఎస్ గ్రాడ్యుయేషన్  వారం

                  8-5-17నుండి 14-5-17 వరకు
 ఈనెల 6 వ తేదీకి అమెరికావచ్చి నెల , 7 వ తేదీకి షార్లెట్ వచ్చి నెలా అయింది . 8 వ తేదీ సోమవారం ఫిష్ బుక్ లో పద్మశ్రీ పోతుకూచి సాంబశివరావు గారు అంతకు ముందు రోజు డా మాదిరాజు రామ లింగేశ్వరరావు గారు పలకరించారు .మైనేని గారుపంపిన వెనిగళ్ల కోమలగారి అనువాద రచన ”కాళరాత్రి ”చేరింది ..రెండుపూటలా నడక .సాయంత్రం మా అమ్మాయి ఆఫీసు నుంచి వచ్చేసరికి భోజనాలు చేసి సిద్ధంగా ఉంటె” బలి” కి తీసుకు వెళ్ళింది హాలు అరగంట ప్రయాణ దూరం .టికెట్ పెద్దవాళ్లకు 17, పిల్లలకు 11 డాలర్లు .మొత్తం 75 బొక్క .నాకు ఒక్క అంగుళం కూడా నచ్చలేదు .రొయ్యలమీసాల నాజర్ ను చూస్తే డోకు వచ్చింది .ప్రభాస్ డైలాగ్ పల్లెటూరి బైతు మాటలాగా చాలా రఫ్ గా ఉంది . బాగ్రౌండ్ సంగీతం గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది .  సంగీతం పాటలూ అసలు నచ్చలేదు . రాణా  శెభాష్ అనిపించాడు . ఈ కధకు అన్నికోట్లు కుమ్మరించటం పరమ దండగ . దీనికంటే శాతకర్ణి వెయ్యి రె ట్లు ,పూర్వపు శోభన్ బాబు ”వీరాభిమన్యు ”పదివేల రేట్లు నయం సినిమా నుంచిరాగానే ఒక కవిత గీకాను  –”డబ్బు -టైము  -బుర్ర-మనసు -విశ్రాంతి -వినోదం -వివేకం -విచక్షణ -విజ్ఞానం -సెల్యులాయిడ్ ఇలా” బహు ”బలి-బాహు బలి . ఇది నా  అభిప్రాయం .చూసేవాళ్ళనీ కనకవర్షం కురిపించేవారినీ ఏమీ అనలేను .ఒక్కటి మాత్రం నిజం అసలు ఏమీ లేని కథను అంత భారీ ఖర్చుతో తీసి రెట్టింపు పైగా డబ్బు 15 00 కోట్లు పిండటం రాజమౌళి వ్యాపార దక్షతకు నిదర్శనం
  మనవళ్లు స్కూల్ ట్రిప్ లో మంగళవారం కొలంబియా వెళ్లి సాయంత్రానికి వచ్చారు . మధ్యాహ్నం ఏమీ తోచక ”మీ గొట్టం”-యూ ట్యూబ్ తిరగేస్తుంటే ఆకెళ్ళ రాసి డైరెక్ట్ చేసిన పద్యనాటకం ”అల్లసాని పెద్దన ”కనిపిస్తే పెట్టాను అద్భుతం అని పించింది .”బలికి బలైన” మనసు ఆనంద తాండవమే చేసింది మనసంతా ఆర్ద్రత తో నిండిపోయింది  పర్గెషన్ అంటారే అది జరిగి తేలికపడింది బుర్ర  హాయిగా ఊపిరి పీల్చుకున్నాను . తర్వాత ఆకెళ్ళ తో ఇంటర్వ్యూ చూశాను .చాలాహుందాగా ,నిజాయితీగా వినయం గా ఆత్మ విశ్వాసం గా చెప్పారాయన .బెజవాడ బుక్ ఎక్సిబిషన్ లో ఈ జనవరి 10 తేదీ సాయంత్రం రచయితలతో సమావేశం ఉందని తప్పక రమ్మని నాకు శ్రీ పూర్ణ చాంద్ ఫోన్ చేసి చెప్పగా వెళ్లాను .అక్కడే మొదటి సారిగా ఆకెళ్ళ ను చూశాను తనను గురించిన పరిచయం లో ఆయన బాగా తనను ఆవిష్కరించుకొన్నారు .తన కదా నవల నాటక సినీ సాహిత్య కృషిని 15 నిమిషాలలో చెప్పేశారు .నేనూ తర్వాత నా గురించి చెప్పాను . మా ఇద్దరితోపాటు మరో పాతిక మందికి మాట్లాడే అవకాశానిచ్చి ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ డి విజయభాస్కర్ బుక్ ఎక్సిబిషన్ సొసైటీ అధ్యక్షులు శ్రీ బాబ్జీ ,కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్య దర్శులు శ్రీ గుత్తికొండ  సుబ్బారావు డా జి వి పూర్ణ చ0ద్ మొదలైన పెద్దల సమక్షం లో సన్మానం చేశారు . ఇవన్నీ గుర్తుకు వచ్చాయి .
  కోమలగారు ఇంగిలీషు లో రాసుకున్న ”మై లైఫ్ ”పుస్తకాన్ని పంపిస్తున్నట్లు గోపాలకృష్ణ గారి నుంచి మెయిల్ వచ్చింది మర్నాడే అందింది . బుధవారం సాయంత్రం గుంటూరు కు చెందిన రిటైర్డ్ పశువుల డాక్టర్ శ్రీ తాళ్ళూరి వెంకట ,పుట్టపర్తి  నివాసి ,బిల్డర్ శ్రీ సూరపనేని నారాయణప్ప గార్లు ఇంటికి వచ్చారు శతకత్రయం ఇద్దరికీ ఇచ్చాను .తరచూ కలుసుకొందామనుకొన్నాం .
  గురువారం కిరణ్ ప్రభ  ఆకేళ్లతో  తో చేసిన ఇంటర్వ్యూ ఆమని ఇంటర్వ్యూ చూసాం .రమణ ,చరణ్ ,భవానిగారు మంకు శ్రీను గార్లతో ఫోన్ లో మాట్లాడాము
12-వ తేదీ శుక్రవారం మా పెద్దమనవడు చి సంకల్ప్ అంటే  మా పెద్దబ్బాయిశాస్త్రి కొడుకు ఎంఎస్ .కోర్స్ పూర్తయిన సందర్భంగా షార్లెట్ యూని వర్సిటీ  లో జరిగిన గ్రాడ్యుయేషన్ కు మేమిద్దరం మా అమ్మాయి వెళ్లాం . సుమారు 45 నిమిషాల ప్రయాణం .మధ్యాహ్నం సరిగ్గా ఒంటిగంటకు ప్రారంభమైంది .ముందు  బాండ్  వాయిద్యం తర్వాత ఛాన్సలర్ ఫిలిప్ ఎల్ డూబోస్  ప్రసంగం ,తర్వాత బోర్డు ఆఫ్ ట్రస్టీ మాటలు ,దానివెనుక కొంతమంది ప్రముఖుల ఉపన్యాసాలు జరిగాయి ..హామిల్టన్  సెంటర్ హాల్ లో లో జరిగిన ఈ జరిమానికి వేలాది తలిదండ్రులు గాలరీలనిండా కూర్చుని నుంచొని వీక్షించారు వారందరి ఆనందం  వర్ణనాతీతము .ముందుగా డాక్టరేట్ లకు మెడలో పతకంవేసి  సర్టిఫికెట్ ఇచ్చారు . ఆతర్వాత ఏం ఎస్ వాళ్లకు వరుసగా షేక్ హాండ్ లతో సరిపుచ్చారు .ఆతర్వాత బాచెలర్స్ కు .ఇదంతా రెండుంబావు గంటలలో అత్యంత క్రమశిక్షణతో వేడుకగా జరిగింది ..మా మనవడు సంకల్ప్ ”డేటా సైన్స్ అండ్ బిజినెస్ ఎనలిటిక్స్ ”లో ఏం ఎస్ చేశాడిక్కడ  మా అమ్మాయి వాళ్ళున్న షార్లెట్ లోని యూ ని వర్సిటీ ఆఫ్ షార్లెట్ లో సీట్ వస్తే డిసెంబరు26 న  2015   హైదరాబాద్ నుంచి  బయల్దేరి వచ్చి ఇందులో చేరాడు .సుమారు ఒకటిన్నర ఏడాది చదువుతో పూర్తయింది కోర్స్ చివరి పరీక్ష ఈ నెల 10 న జరిగింది .అదికూడా పాసయ్యాక సర్టిఫికెట్ ఇస్తారు .మనకు డిగ్రీ పాసయ్యాక  కాంవో కేషన్ జరిపి సర్టిఫికెట్ ఇవ్వటం అలవాటు    మనకు భిన్నం ఇది . ఏం ఎస్ ఇక్కడ చేసిన వారిలో ఆంద్ర ప్ప్రదేశ్ కు చెందినవాళ్లు మా వాడితో సహా దాదాపు 25 మంది ఉన్నారు
   మా అల్లుడు ఫ్లారిడాలోని నోవా యూని వర్సిటీ నుండి ఆన్ లైన్ ఏం ఎస్ చేశాడు   మేము మొదటిసారి2002 లో  అమెరికాకు టెక్సాస్ రాష్ట్రం హూస్టన్ కు మా పెద్ద మనవడుఅంటే అమ్మాయి పెద్దకొడుకు శ్రీకేత్ పుట్టిన మూడు నెలలకు వచ్చాము అప్పుడు  మా అల్లుడి ఏం ఎస్ గ్రాడ్యుయేషన్ కోసం మేమిద్దరం మా అమ్మాయి అల్లుడు మనవడు హూస్టన్ నుంచి ఫ్లయిట్ లో లాడర్ డేల్  కు వెళ్లి అక్కడ హోటల్ లో రూమ్ తీసుకొని మర్నాడు జరిగిన గ్రాడ్యుయేషన్ లో పాల్గొన్నాం .మియామీలో డాల్ఫీన్ సర్కస్ చూసాం . ఇలా అల్లుడి ,మనవాడి గ్రాడ్యుయేషన్ లలో పాల్గొనే అవకాశం వచ్చి ఆనందంగా ఉంది మాకు .
  .ఇప్పుడు ఈ యూని వర్సిటీ గురించి కొన్ని విషయాలు తెలుసుకొందాం . 1000 ఎకరాల విస్తీర్ణం లో ఇది వ్యాపించి ఉంది .అన్ని కోర్సులూ ఉన్నాయి రైల్వే స్టేషన్ కూడా కాంపస్ లోకి వచ్చింది .జూన్ లో ప్రారంభమవుతుంది .ఈ  వర్సిటీ   కి
’49 ERS”అనే నిక్ నేమ్  అనే మారు పేరుంది .దీనికి కారణం 1949 సంవత్సరం యొక్క ప్రాధాన్యమే .ఒకప్పుడు ఆఫ్ -కాంపస్ గా ప్రారంభమైన యూని  వర్సిటీ 1949  లో మూత పడి మరణం చెంది ఉండాల్సింది అప్పుడు” బొన్నే  కోన్ ”అనే వితరణ శీలి  ఆమె బృందమూకలిసి నార్త్ కరోలీనా లెజిస్లేచర్ ను షార్లెట్ లో ఉన్నత విద్యలకోసం శాశ్వత  వ్యవస్థ ఉండాలని చెప్పి ఒప్పించి దాని ఆమోదంతో షార్లెట్ కాలేజీని 1949 లో స్థాపించారు ..అంతేకాకుండా ఈ యూని  వర్సిటీ 49 నంబరు హైవే మీద ఉండటం మరో ప్రాముఖ్యమైన విషయం ..అంతే కాదు అమెరికాలోని నార్త్ కరోలీనాలోని షార్లెట్ లో బంగారు గనులు బాగా ఉన్నాయి .కాలిఫోర్నియాలో ”గోల్డ్ రష్”కంటే ముందే ఇక్కడ బంగారు గనుల త్రవ్వకం జరిగింది .ఇవన్నీ కలిసి వచ్చేట్లుగా యూని వర్సిటీ కాంపస్ లో” కాటో  కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్” , అండ్ కాలేజ్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ప్లాజ”ప్రాంగణం లో కూర్చుని పళ్లెం లో బంగారు రజను ను నీటితో శుద్ధి చేస్తున్నట్లున్న ఒక బంగారు గని కార్మికుని బ్రాన్జ్ విగ్రహాన్నిఏర్పాటు చేశారు .ఇది ఈ ప్రాంతం  గోల్డ్ మైనింగ్  సెంటర్ అనే చారిత్రిక సత్యాన్ని ,అదీకాక  ,1949 సంవత్సరం  ఈ యూనివర్సిటీ   అభివృద్ధిని నాటకీయంగా  మలుపు తిప్పిన సంవత్సరమని గుర్తు చేస్తుంది .ఆ స్టాథ్యూ లో జీవకళ ఉట్టిపడుతుంది . దీని ఫోటో కింద జమ చేశాను చూడండి  .యూని వర్సిటీ చరిత్రను ఇంతగా మలుపుతిప్పిన బొన్నీ  కోన్ అనే మహిళా మాణిక్యం గురించి తెలుసుకోకపోతే చరిత్ర క్షమించదు .
  బొన్నీ ఇ .కోన్ 1907 లో లో జన్మించింది  1946 నుంచి ఈ యూనివర్సిటీ సంస్థాపకురాలు.ఇక్కడే టీచర్ గా పని చేసి ,1947 లో షార్లెట్ సెంటర్ ఆఫ్ ది  యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలీనా కు డైరెక్టర్ అయి0ది . ఈ సంస్థ మూతపడి చనిపోయే స్థితిలో ఉంటె కోన్ లెజిస్లేచర్ ను ఒప్పించి 1949 లో షార్లెట్ కాలేజీ స్థాపనతో  జీవింపజేసి  దానికి ప్రెసిడెంట్ గా ఉన్నది . 1963 లో రాష్ట్ర ప్రభుత్వ ఆసరాతో  1963లో 4 ఏళ్ళు వికసించింది . 1965   లో కాలేజీని యూని వర్సిటీ స్థాయికి తీసుకురావటానికి తీవ్రం గా కృషి చేసి సఫలమనోరధురాలైంది కోన్ ..అప్పుడామె స్తూడెంట్ ఎఫైర్స్ కు వైస్ ఛాన్సలర్ గా సేవ ప్రారంభించి రిటైర్ అయ్యేదాకా ఉంది 8-3-2003 న బొన్నీ కోన్ శాశ్వతయోగా ఈ లోకానికి దూరమైంది .తనజీవితాన్ని త్యాగం చేసి ప్రాణం పోసి ప్రాణాధికంగా ఆరాధించిన  యూనివర్సిటీ కాంపస్ లో 2004 స్ప్రింగ్ లో కోన్  భౌతిక శరీరాన్ని ఖననం చేశారు . కానీ ఆమె ఆత్మ ఈ  యూని వర్సిటీ లో నే పరిభ్రమిస్తూ వివిధ సంక్షేమకార్యక్రమాలను అభి వృద్ధినీ చూస్తూ సంతృప్తి చెందుతూ ఉంటుందని భావిస్తారు
  ఈ యూనివర్సిటీ మొదటి చాన్సలర్ డీన్ డబ్ల్యు కొల్వర్డ్ . 1966 లో ఈ పదవిలో చేరి 12  ఏళ్ళు పనిచేసి ఇందులో అనేక కాలేజీలు హాస్టళ్లు ,కట్టించి గ్రాడ్యుయేట్ వర్క్ ప్రారంభించి దీర్ఘకాలిక ప్రణాళిక అమలు చేశాడు ఆయన కృషితోనే యూనివర్సిటీ రీసెర్చ్ పార్క్ ,యూనివర్సిటీ అర్బన్ ఇన్ ష్టి ట్యూట్ లు ఏర్పడి అర్బన్ వాతావరణమున్న షార్లెట్ విద్యార్థులకు బహుముఖాలుగా తోడ్పడ్డాయి ..ఈయన 1913 లో జన్మించి 2007 లో మరణించాడు.
  ప్రాస్తుతం ఛాన్సలర్ ఫిలిప్ ఎల్. డుబోయిస్
  శనివారం సాయంత్రం కాకినాడ వాసి  రిటైర్డ్ ఎస్ బి ఐ .ఉద్యోగి పుట్టపర్తి ప్రస్తుత నివాసి శ్రీ అప్పారావుగారు మా ఇంటికి వచ్చారు .ఆయన పూర్తిగా సత్యసాయి భక్తులు . అక్కడే సేవలో గడుపుతారు మన శతకాలిచ్చాను మా అమ్మాయికి బాగా పరిచయం  ఆయన్ను కారులో వారి అబ్బాయి ఇంట్లో దింపివచ్చాము . .మా మనవడు చి హర్షకు 20015 ఆగస్టు లో యాక్సిడెంట్ అయిందని తెలిసి మా అమ్మాయి ఉండ లేక ఆగలేక  ఆగమేఘాలమీద మర్నాడే  బాయల్దేరి ఇండియావచ్చి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి రాగానే ఆయన కాకినాడ నుంచి ఫోన్ చేశారట మా అమ్మాయికి .ఆయన మనసు మంచిది గొప్ప సాయి భక్తులు కనుక  సెంటిమెంట్ గా ఫీలయి మా హర్షకు ఏమీ కాదు గండ0  నుంచి బయట పడతాడు అని గట్టిగా నమ్మానని  చెప్పింది చెపుతుందిఎప్పుడూ .
  మా అమ్మాయి గొల్లపూడికాలం చూడమని చెబితే కొన్ని చూశా చాలా బాగా ఉన్నాయి .ఆయనలాగా విషయాన్ని  కరెంట్ టాపిక్  ను అంత అర్ధవంతంగా సుత్తిలేకుండా సూటిగా నిష్పక్షపాతంగా చెప్పే వాడు లేదని నా నమ్మకం ఆయన హావ భావాలు  ఊగటాలు స్ట్రెస్సులు ,ఊనికలు ఒత్తి చెప్పటాలు నాకు భలే ఇష్టం .ఆకెళ్ళ గొల్లపూడి గురించి నేను చూసినవి మైనేనిగారిని చూడమని రాస్తే చూసి చాలా ఎంజాయ్ చేశానని రాశారు . . రాత్రి చంద్ర మోహన్ ఇంటర్వ్యూ చూసాం నిష్పక్షపాతంగా చెప్పాడు .
  14 ఆదివారం ఉదయం మల్లినాథ 40 రాశా .మధ్యాహ్నం  సంగీత గురువు శ్రీ రామాచారి గారి ఇంటర్వ్యూ యూ ట్యూబ్ లో చూశా.అద్భుతం .ఆయన ఎంత ఉదారంగా స్వచ్చంద సేవ చేస్తున్నారో తెలిస్తే చలించి పోతాం అందరూ కూడాల్సిందే  మధ్యాహ్నం” కాళ రాత్రి ”చదివేశాను బాగుంది . ఇదొక్కటే ఈవారం చదివిన పుస్తకం ..మరిన్ని విషయాలు వచ్చే వీక్లీ  లో .
ఫోటోలు జత చేశాను చూడండి
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-5-17-కాంప్-షార్లెట్ -అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.