షార్లెట్ లో 55 వ శ్రీ సుందరకాండ పారాయణ ,శ్రీ హనుమజ్జయంతి
వైశాఖ బహుళ దశమి 21-5-17 ఆదివారం శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా షార్లెట్ లో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో 17-5-17 బుధవారం నుండి 21-5-17 ఆదివారం వరకు ఉదయం 7-30 గం నుండి 9-30 గం వరకు 5 రోజులు నా 55 వ శ్రీ సుదరకాండ పారాయణ ,నిత్యం శ్రీ సువర్చలా0జనేయస్వామి వారలకు అష్టోత్తర సహస్రనామ పూజ శ్రీ సువర్చలాన్జనేయ శతక పఠన0 నిర్వహింప బడుతుంది .
21-5-17 ఆదివారం శ్రీ హనుమజ్జయంతి నాడు ఉదయం 9-30 నుండి 11గం వరకు మంత్ర సహిత ,తంత్ర రహితంగా సంకల్ప భూశుద్ధి ,విష్వక్సేనారాధన ,పుణ్యాహ ,బ్రహ్మాద్యస్ట దిక్పాలక ,నవగ్రహ పూజ ,రక్షాబంధన ,కన్యావరణ మధుపర్క ,మంగళాష్టక ,చూర్ణికా ,మహా సంకల్ప ,ప్రవర అక్షతారోపణ లతో శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారల శాంతికళ్యాణం మా దంపతులచే నిర్వహింపబడుతుంది ,
గబ్బిట దుర్గా ప్రసాద్ -13-5-17 -షార్లెట్ -అమెరికా
—