నా దారి తీరు -104 మేడూరు నుండి అద్దాడకు బదిలీ

నా దారి తీరు -104

మేడూరు నుండి అద్దాడకు బదిలీ
 మేడూరు వదలాలననే కోరికకు మరో బలమైన కారణం ఒకటి ఉంది ఇది నూజి వీడు  డివిజన్ పరిధిలో ఉంది .కానీ డివిజన్ లో ఎక్కడా భాష సైన్స్ విషయాలలో అభి వృద్ధి  స్కూల్  కాంప్లెక్స్  ఓరియెంటేషన్ మొదలైనవి ఎక్కడా జరగలేదు .ఒక్కసారి మాత్రం బాలానందం మేష్టారు అని పిలువబడే డా ముసునూరు వెంకటేశ్వరరావు అనే హెడ్మాష్టర్ ఇంగిలీషు లెక్చరర్ ,ప్రిన్సిపాల్ గారి మేనల్లుడు శ్రీ విష్ణుదాసు గారు తాడంకి హై స్కూల్  లో  ఇంగ్లీష్   టీచింగ్ పై ట్రెయినింగ్ క్లాస్ నిర్వహించారు ఆయనతో అదే మొదటి పరిచయం తరువాత ఆయన నూజివీడు స్కూల్ లో సోషల్ మే స్టర్ అవటం మంచి బాడ్ మింటన్ ,వాలీ బాల్  ప్లేయర్ అవటం తో గ్రిగ్ స్పోర్ట్స్ లో కలిసేవాళ్ళం .
  కానీ  గుడివాడ డివిజన్ లో శ్రీమతి ఇందీవరం గారనే ఆమె ఉపవిద్యా శాఖాధికారి గా చాలా మంచి పనులు చేస్తున్నారని ,ఎన్నో విషయాలలో ఆ డివిజన్ ను ముందుకు తీసుకు వెడుతున్నారని    సృజనకు మంచి ప్రోత్సాహమిస్తున్నారని తరచూ ఉపాధ్యాయులతో హెడ్ మాస్టర్లతో సమావేశాలు నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దుతున్నారని హెడ్మాస్టర్స్ కాన్ఫరెన్స్ లోను ,స్పాట్ వాల్యూ యేషన్    లోను తోటి హెడ్మాస్టర్లు టీచర్స్ చెప్పగా వినేవాడిని అందుకని యాక్టివిటీ ఎక్కువగా ఉండే ఆ డివిజన్ లో ఉయ్యూరుకు దగ్గర స్కూల్ కు  వెడితే బాగుంటుంది అనిపించింది .
  జులైనెలలో నూజివీడు డివిజన్ ఉపవిద్యాశాఖాధికారి గా ఎవరో కొత్త ఆవిడ వచ్చిందని ,ఆవిడ అదేనెలలో మేడూరు స్కూల్ ఇన్స్పెక్షన్ కు రావాలని అనుకొంటున్నారని తెలిసింది .ఇక్కడ కూడా ఇన్స్పెక్షన్ జరిగి రెండేళ్లు దాటింది .కనుక స్టాఫ్ ను సమావేశ పరచి ఇన్స్పెక్షన్ కు సిద్ధమౌదామా అని అడిగాను . ఎకాడమిక్ ఇయర్ ప్రారంభమే కనుక త్వరగా అయిపోతే అందరికీ మంచిదని అనుకున్నాం .అయిన ఖర్చు అంతా టీచర్ల జీతాల ఆధారంగా లెక్కవేసి కట్టుకోవాలని నిర్ణయించాం  లెసన్ ప్లాన చార్టులు మోడళ్ళు  అలంకరణ  వగైరాలతో సిద్ధమవమని చెప్పి గుమాస్తా శ0 కరరావు ను నూజివీడు పంపించి ఆవిడతో మా స్కూల్ స్పెక్షన్ కు సిద్ధమేనని చెప్పించాను .ఆవిడా సంతోషంగా ఒప్పుకుని షెడ్యూల్   పంపారు .డేట్స్ జ్ఞాపకం లేవు కానీ రెండు రోజుల ఇన్స్పెక్షన్ . దీనికి చుట్టు  ప్రక్కల హై స్కూల్స్ నుంచి  సబ్జెక్ట్  ఎక్సపర్ట్ లనూ వ్రాతపూర్వకం గా పిలిపించాం .స్కూల్ రికార్డ్ లన్నీ పకడ్బందీ చేయించా .సైన్స్ లో గేమ్స్ లో పనికి రాని  ఆర్టికల్స్ ను తీసెయ్యటానికి రైటాఫ్ లిస్ట్ లు తయారు  చేయించాను   వీటిని డి వై యి ఓ అంగీకరించి సర్టిఫై చేస్తేనే తొలగించాలి ఒక్కోటి మూడు కాయీలు తయారు చేయాలి
   మొదటి రాజు ఇన్స్పెక్షన్  కు ఆమె గుమాస్తా  తో సహా నూజి వీడు నుండివచ్చారు .రాగానే ఫార్మాలిటీ ప్రకారం కాఫీ టిఫిన్ ఆమెకూ గుమాస్తాకు పానెల్ మెంబర్లకు ఏర్పాటు చేయించాం అందరూ సంతృప్తిగా తిని మొదలు పెట్టారు కొబ్బరి చెట్లున్నాయికనుక ఆరగా ఆరగా కొబ్బరి బొండాలు కొట్టించితాగ్గించాం ..మధ్యాహ్న భోజనాలూ శుస్టుగా నే ఏర్పాటు చేయించాం కడుపు నిండా తిన్నారు .ఆ సగం క్లాసుల ఇన్స్పెక్షన్ అయింది . డ్రిల్లు  తో సహా అన్నీ చూశారామె .రికార్డ్ లన్నీ గుమాస్తా చూశాడు .ఆతను సరే నంటే ఆమె ఫైనల్ సంతకం పెడతారు .లాగ్ బుక్ విజిటర్స్ బుక్ అకౌంట్ బుక్స్ అన్నీ చూసి రామమోహనరావు గారి విగ్రహ ప్రతిష్టాపనకు మురిసిపోయారామె .సాయంత్రం మళ్ళీ నూజి వీడు వెళ్లినట్లు గుర్తు .
  రెండవ రోజు న మిగిలిన క్లాసులు సబ్ జెక్ట్ లు చూడటం పూర్తి అయింది మర్యాదలన్నీ మామూలే  .ఆమె పేరు గుర్తులేదుకాని కొంచెం నల్లగా పట్టు చీరెలో కుదిమట్టంగా చిరునవ్వుతో ఉన్నారు క్రిస్టియన్ .పేరు మనపేరు లానే ఉన్నగుర్తు .
  రెండవ రోజు పని పూర్తి అవగానే సాయంత్రం  స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేశాను ఆమె సమక్షం లో .ముందుగా పానెల్ మెంబర్లు తాము టీచర్స్ విషయం లో సబ్ జెక్ట్ బోధనా విషయం లో గమనించిన విషయాలు చెప్పారు సూచనలు ఉంటె సూచించారు .చివరికి డెప్యూటీ ఎడ్యుకేషనల్  ఆఫీసర్ అయిన ఆమె మాట్లాడుతూ స్కూల్ అన్ని విధాలా అభి వృద్ధిలో ఉందని ఇన్నిరకాల ఈవెంట్స్ తానూ పని చేసివచ్చిన ఏలూరు లోకూడా చూడలేదని హెడ్ మాస్టారు చాలా విషయాలలో ముందుండి సహచరులను నడిపిస్తున్నారని ,స్టాఫ్ సహకారం అత్యద్భుతమని ,అకౌంట్స్ చాలా పెర్ ఫెక్ట్ గా ఉన్నాయని  హెడ్ మాస్టారి కృషికి జిల్లావ్యాప్తంగా గుర్తింపు వచ్చేట్లు చేస్తానని ,ఇంత మంచి స్కూల్ ను విజిట్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఇక ఎక్కడికి వెళ్లినా మేడూరు హై స్కూల్ ను మోడల్ గ పెట్టుకొని హెడ్ మాస్టర్లకు టీచర్లకు చెబుతానని మహా ఆనందంగా తెలిపారు చప్పట్లు మోగించారు అందరూ  ఆవిడకు శాలువా ఒక జ్ఞాపిక స్కూల్ తరఫున బహూకరించిన జ్ఞాపకం . గుమాస్తా మామూలు మామూలే . రెండురోజుల్లో ఏడాదిభారం ఒక్క సారిగా తీరి పోయినందుకు అందరూ రిలీఫ్ పొందాం .
  పామర్రులో నాతోపాటు సైన్స్ అసిస్టెంట్ గా పని చేసి కాటూరు హెడ్ మాస్టర్ గ ఉన్న పామర్రు నేటివ్ శ్రీ నందిపాటి  .వీరారెడ్డి గారు ఉయ్యూరు దగ్గర కాటూరు హెచ్ ఏం గా ఉన్నారు .అయన రోజూ పామఱ్ఱునుంచి ఉయ్యూరువచ్చి,మళ్ళీ అక్కడినుంచి బస్ లో కాటూరువెళ్ళాలి .కలిసినప్పుడల్లా కష్టంగా ఉందనే వారు .మంచి హాస్యప్రియత్వం తో ఎప్పుడూ నోట్లో క్రేన్ వక్కపొడితో ఉండేవారు .ఆయనతో మాట్లాడటం సరదా గా ఉండేది నాకు సీనియర్ . ఆయన అడ్డాడ ,అడ్డాడలో పనిచేస్తున్న వీర0 కిలాకు నేటివ్ రామారావుగారు  నేనూ ముగ్గురం ట్రయాంగిల్ లింక్ తో రిక్వెస్ట్ పెట్టుకొని  ట్రాన్స్ఫర్ అవుదామని ఒక సారి ఆలోచన వచ్చింది .అప్పటికి రెడ్డిగారికి రెండేళ్లు మాత్రమే ఉంది రిటైర్ అవటానికి .కనుక ఆయన ఈలోగా బదిలీ ఎందుకు  కాటూరులోనే హాయిగా రిటైరవుతాన్న అభి ప్రాయం చెప్పారు .కనుక ఇక కుదరదు అనుకొన్నాను .    ఆగస్టు మొదటివారం లో ఒక ఆదివారం రోజు ఉదయమే రామారావు గారు మాఇంటికి వచ్చి మేమిద్దరం మ్యూచువల్ పెట్టుకొని తాను  మేడూరుకు  నేను అద్దాడకూ బదిలీ అవుదాం ఇష్టమేనా అని అడిగారు .వెదక బోయిన తీగ కాలికే తగిలినట్లయింది .అంతే ఇక ఆలోచించకుండా సరేనని ,బదిలీ అయ్యేదాకా ఎవరికీ తెలియరాదని అత్యంత సీక్రెసీ మెయింటేన్ చేయాలని  ఈ బదిలీ నేనేమీ ప్రయత్నం చేయనని ఎవరినీ కలవనని రూపాయి కూడా చేతి చమురు వదిలించుకోనని  అన్నీ ఆయనే చేయించి ఆర్డర్ తెస్తే ఓకే అనీ చెప్పాను .అన్ని హామీలు అయ్యాక రిక్వెస్ట్ మ్యూచువల్ లెటర్ ఇచ్చాను . మేడూరు వచ్చి ఏడాదిపైన మూడు నెలలే అయింది మళ్ళీ నన్ను మార్చరుఅని లోపల ఉంది .కానీ కొ0డకు వెంట్రకకట్టాం కదా  .అయితే మంచిది అవకపోయినా మంచిదే .
  రామారావు కు జిల్లాపరిషత్ లో పలుకుబడి ఉపయోగించి మా ఇద్దరి మ్యూచువల్ ట్రాన్స్ ఫార్ ఆర్డర్ వారం రోజుల్లో వచ్చేట్లు చేశాడు . ఈ వార్త తెలిసి స్కూల్ స్టాఫ్ గగ్గోలు పెట్టింది . అంతాబాగానే ఉందిగా ఇన్ని మంచి పనులు చేసి అందరిచేతా ప్రశ0సలు పొంది ఇప్పుడు ఎవరికీ కనీసం రామమోహనరావుగారి అబ్బాయికి గారికి కూడా చెప్పకుండా వెళ్లి పోవటం ఏమిటి అన్నారు .సర్పంచ్ గారికి రామారావు గారు రావటం ఇష్టం లేదు .మీరుఊ  అంటే  నిమిషాలమీద ఆర్డర్ కాన్సిల్ చేయిస్తారు అన్నారు . ఆయన వచ్చి ఆ మాటే అన్నారు. నేను శాంతంగా ”రామారావు మేడూరుకు దగ్గర వాడు .మీ అందరికి పరిచర్యమున్నవాడు . అడ్డాడలో  ఐదారేళ్లు  పనిచేసి రోజూ  ప్రయాణం చేయలేక నన్ను అడిగితె నాకు మేడూరైనా అడ్డాడ అయినా ఒక్కటేకదా ఆయనకు కొంత ఉపశమనం కదా అని ఒప్పుకున్నాను” అని తప్పుకున్నాను . ఆర్డర్ వచ్చిన మర్నాడు సాయంత్రమే వీడ్కోలు పార్టీ ఏర్పాటు చేశారు .అందరూ ఆధారంగా మాట్లాడారు నా గురించి . ఇక గుడ్ బై చెప్పి వచ్చేశాను . ఇది ఆగస్టు 13 వ తేదీ అనిగుర్తు . జాయింగ్ టైం రిక్వెస్ట్ ట్రాన్స్ ఫర్ కు ఉండదు  .కనుక వెంటనే  అడ్డాడ లో మర్నాడు  ఉదయమే చేరాలి . సాయంత్రం ఇంటికి వచ్చేదాకా మా ఇంట్లో కూడా ఎవరికీ తెలియదు .  పామర్రులో సైన్స్  మాస్టర్ గా పని చేస్తున్నప్పుడు టెన్త్ క్లాస్ పరీక్షలకు అద్దాడకు ఇన్విజిలేటర్ గా వెళ్లాను .శ్రీ మిక్కిలి నేని వెంకటేశ్వరరావు గారు హెడ్ మాస్టారు .మంచి బిల్డింగులు లాబ్ ,ఆటస్థలం చిన్న స్కూలు . అంతకు మించి నాకు దాని గురించి తెలీదు .హెడ్మాస్టారు చాలా క్రమశిక్షణతో పరీక్షలు నిర్వహించటం బాగా గుర్తు .స్టాఫ్ ఎవరెవరున్నారో  కూడా తెలీదు .అలాంటి స్కూల్ లో చేరబోతున్నానన్నమాట . .ఏమైతే నేమి గుడివాడ డివిజన్ స్కూల్ లో పని చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది    ఇది నా రెండవ మ్యూచువల్ ట్రాన్స్ ఫర్  .ఒకసారి అనుకోకుండా ఉయ్యూరునుంచి గన్నవరం హై స్కూల్ కు దసరా సెలవల్లో మార్చారు .మాంచి వరదల భీభత్సం .బుడమేరుపొంగి బస్సులు నడవటం లేదు .  బెజవాడ వెళ్లి అక్కడినుంచి గన్నవరం వెళ్లి జాయినయ్యాను .ఒకవారం పని చేశాక నాకు ముందుపనిచేసిన కృష్ణ పామర్రు వెళ్లి ఉండలేక రిక్వెస్ట్ మ్యూచువల్ అడిగితె ఇచ్చా నేను పామర్రుకు ఆత ను గన్నవరానికి వెళ్లాం .అప్పుడూ ప్రయత్నమంతా కృష్ణదే .  దసరా సెలవల తర్వాత గట్టిగా పది రోజులు కూడా గన్నవరం లో పని చేయకుండానే నాకిష్టమైన పామర్రు వచ్చాను .     

             సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.