ఏసు క్రీస్తు కాశ్మీర్ లో కొంతకాలం ఉండి వెళ్లాడా ?
అవును .ఉండే వెళ్ళాడు అని తపస్సు చేశాడని ”ది అన్ నోన్ లైఫ్ ఆఫ్ జీసెస్ క్రైస్ట్ ”అనే గ్రంధం లో రాయబడి ఉంది . .అక్కడే 14 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఒక ప్రార్ధనా మందిరం లో టిబెట్ భాషలో రాయబడి భద్రపరచబడిన వ్రాతప్రతి లో ఈ విషయం ఉందని కాశ్మీర్ లో ప్రచారం లో ఉంది ..తర్వాత దీన్ని ఒక రష్యన్ రచయిత రష్యన్ భాషలోకి అనువదిస్తే తర్వాత ఇంగ్లీష్ లోకి పైన చెప్పిన పేరుతో అనువదించారు . ఇక్కడి హిమాలయ ప్రాంతవాసులందరూ యేసు ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేశాడనే నమ్ముతారు .కాదని ఎవరూ అనలేరు . దీనికి కారణాలు 3 ఉన్నాయని అక్కడి గైడ్ లు తెలియజేస్తారు . -జీసెస్ ధరించిన దుస్తులు అచ్చంగా కాశ్మీరీలు ధరించిన దుస్తువులవంటివే .-2-ఆయన జుట్టు శైలి కూడా కాశ్మీరీ శై లే .-3-ఆయన ప్రదర్శించిన మహిమలు అచ్చంగా కాశ్మీర్ లోని తంత్ర విద్యా మహిమలే .
జీసెస్ తన 13 వ ఏటా ఆసియా మైనర్ ను వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడని ,ఎక్కడికి వెళ్లిందీ ఎవరికీ తెలియదని ,కానీ ఆయన కాశ్మీర్ లోయకు వచ్చి 30 వ ఏడు దాకా అంటే 17 ఏళ్ళు ఉండిపోయాడానన్నది యదార్ధమని భావిస్తారు ..జీసెస్ తపస్సు చేసినట్లు చెప్పబడే ఒక చిన్న ప్రార్ధనామందిరం ఎత్తైన పర్వతం మీద కనిపిస్తుంది .దీనినే యేసు ప్రార్ధనామందిరం అంటారు . ఇది కాదనలేని యదార్ధం అని స్వామి రామా కూడా అన్నాడు .కాశ్మీర్ లోఒక చోటు నుంచే జీసస్ స్వర్గానికి వెళ్లాడని ,అక్కడ సమాధి నిర్మించబడి ఉన్న ప్రదేశాన్ని ”రోజా బాల్ ”అంటారని అంటే గౌరవ సమాధి (అనర్డ్ టుంబు )అని అర్ధమని ,దీన్ని క్రైస్తవు లు మహమ్మదీయులు కూడా నమ్ముతారని అంటారు .
కాశ్మీర్ శైవానికి జీవగడ్డ .ఎన్నో శైవాగమ గ్రంధాలు ఇక్కడివే .కానీ ఇంకా చాలా గ్రంధాలు వెలుగు లోకి రాలేదని రామా అంటాడు వీటిని అర్ధం చేసుకోవటానికి అందులో బహు నిష్ణాతులైన పండితుల సహాయం కావాల్సిందే వీటిలోని తాత్వికభావం ఏమిటి ?.ఆత్మ ,మనసు శరీరం ,విశ్వం లోని సత్యం యొక్క అన్ని స్థాయిలు ప్రాధమిక స్పందన లేక యాదృచ్చిక కంపనం యొక్క అవతారాలే ..ఈ గ్రంధాలలో మూల విషయం ”శక్తిపాతం ”దీనివలన నిద్రాణమై ఉన్న శక్తి జాగృతమవుతుంది . అమరనాధ్ ఆలయం కాశ్మీర్ లో ప్రసిద్ధ మైనది .ఇక్కడ విశేషం ఒక గుహలో ఏర్పడే మంచు శివ లింగం .ఆలయం వేసవిలో దర్శిస్తారు అప్పుడు ఆలయం లో రెండు తెల్లని పావురాల జంట దర్శనమిచ్చి ఆశ్చర్య పరుస్తాయి .అమరనాధ గుహలో శివుడు పార్వతికి సృష్టి రహస్యాన్ని అమరత్వాన్ని గురించి బోధించాడని అక్కడే ఉన్న జంట తెల్లపావురాల జంట దాన్నివిని మోక్షం పొందాయని ,అందుకే అవి ఎప్పుడూ ఆ గుహలోనే ఉంటాయని ఐతిహ్యం .ఈ జంటను దర్శించిన భక్తులు కూడా మోక్షం పొందుతారని అంటారు .కొందరి కధనం ప్రకారం అమరనాధ గుహ తెరవబడినపుడే ఈ తెల్లపావురాలజంట స్వామి దర్శనం కోసం వచ్చి ఇక్కడే ఉండిపోతాయని .
అమరనాధ స్వామి దర్శనానికి 25 ఏళ్ళ వయసులో ఉన్న ఒక యువ యోగి ప్రతి సంవత్సరం వస్తాడాని స్వామి రామ తెలిపాడు ఆయనతో మాట్లాడాడు కూడా ఆయన పూర్ణ ప్రజ్ఞుడని రామా అన్నాడు .శరీరం పై ఒక్క అంగోస్త్రం తప్ప ఆయనవద్ద ఏమీ ఉండవట .ఆయన చెంపలు కెమ్పుల్లా ప్ర కాశించేవన్నాడు ..యోగ శాస్త్రం లో మహా నిష్ణాతుడు . నడిచే ఎంతదూరమైనా కాలికి ఏ ఆచ్చాదనా లేకుండా హిమాలయాలలో తిరుగుతాడు . 12 వేల అడుగుల ఎత్తువరకూ నడిచే వెడతాడు .చలి ఆయన్ను ఏమీ బాధించదు .ఈ యువ సన్యాసిని అక్కడివారు ”బాల భగవాన్ ”అంటారు. ఆయనకు ఇవేమీ పట్టవు నిత్య సంచారి. రామాగురువు బెంగాలీ బాబా ఈయనకు తెలుసు .కొంతకాలం ఆయన వద్ద ఉన్నాడుకూడా .కళ్ళు చికిలించకుండా కనీసం 10 గంటలు కూర్చోగలడు .యోగ సాధనలో ఆయన సుమారు మూడు అడుగుల ఎత్తుకు గాలిలో లేవగలడు . స్వామిరామా ఆయన్ను దీన్ని గురించి ప్రశ్నిస్తే ”ఇది ఆధ్యాతిక సాధన కాదు .ప్రాణాయామం లో ఉన్నతస్థాయి సాధన బంధనాలు ఛేదన మాత్రమే .బరువుకు ద్రవ్యరాశికి మధ్య భేదం తెలిసిన వారెవరైనా దీన్ని సాధించవచ్చు .కానీ చాలాకాలం సాధన చేయాల్సి ఉంటుంది ”అని చెప్పాడు .
ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటని స్వామి రామా ప్రశ్నిస్తే బాల భగవాన్ ”ఇంద్రియాలు పూర్తిగా వశం చేసుకొని ,ప్రపంచ దృష్టినుంచి వాటిని దూరం చేసుకొ0టే ఇంద్రియ అవగాహన మనసులో యే రకమైన ప్రతిబింబాలను కలిపించలేదు .అంటే అప్పుడు మనసు ఏకాగ్ర చిత్తమవుతుంది .ఎప్పుడైతే ఆలోచన ప్రభావం అణగారిపోతుందో మనసు సమతా స్థితి పొంది ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది .సత్వ గుణం తోనే దీన్ని సాధించగలం ధ్యానం,విషయవాసనా రాహిత్యం రెండు ముఖ్య సాధనాలు .జీవితాన్ని ఒక క్రమ విధానం లో నడపాలి .మధ్యలో బుద్ధి , గుడ్డి నమ్మకాలు పెడదారులు పట్టిస్తాయి జాగ్రత్తపడాలి .ఈ రెండూ కూడా గొప్ప శక్తులే కానీ ముందు వాటి గురించి సంపూర్ణ జ్ఞానం సంపాదించాలి .తర్వాత విశ్లేషించి సరైన మార్గాన సాధన చేయాలి .అన్నిటికీ మార్గ దర్శి అంతశ్చే తన మాత్రమే అంటారు అంటే అంటారు దృష్టి మాత్రమే .కనిపించేదంతా యదార్ధం కాదు సత్యం వీటి వెనక దాగి ఉంది దాన్ని తెలుసుకోవాలి .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-26-5-17- కాంప్-షార్లెట్-అమెరికా .
—