ఇంగ్లాండ్ నాటక ప్రదర్శన ప్రపంచం -1
అనేక శతాబ్దాలపాటు ఇంగ్లాండ్ నాటక ప్రదర్శన లాభ పేక్ష లేకుండానే జరిగింది .క్రాఫ్ట్ గిల్డ్ లనేవి మత సంబంధ నాటకాలను మిస్టరీ నాటకాలను ఆడించేవి .ఉత్సవాలలో స్కూళ్లు ,కాలేజీ యూనివర్సిటీలలో క్లాసికల్ ,నియోక్లాసికల్ డ్రామాలను లాటిన్ ,ఇంగ్లీష్ భాషలలో విద్యా0శాలలో భాగంగా ప్రదర్శించేవారు .ఈ రూపాల్లో నాటకం బాగా స్థిరపడి జనామోదం పొందింది .దీనికి విరుద్ధంగా ప్రొఫెషనల్ థియేటర్లు సంఘం లో బలపడ్డాయి నాటక కంపెనీలు సంచారం చేస్తూ ,ఖాళీ ప్రదేశాలలో ,అరిష్టాక్రసి వారి విశాల మైన హాళ్లలో,టౌన్ స్క్వేర్ లలో ,అతిధి గృహాలలో ,జాతరలలో ,బహిరంగ ప్రదేశాలలో ప్రదర్శించేవారు ఆదాయం స్పాన్సర్లు ,పెట్రన్ల సహకారాన్నిబట్టి మారుతూ ఉండేది . ఆనాటి నటులు దేశ ద్రిమ్మరులకంటే కాస్త నయం .కానీ తరచుగా అరెస్ట్ అవుతూ బహిష్కరింపబడుతూ ఉండేవారు .
1560-1570 మధ్యకాలం లో ఇంగ్లీష్ వృత్తి నాటక శాలలు క్రమంగా గౌరవ స్థానం పొందాయి . నాటకం పై మోజున్న డబ్బున్న మారాజులైన లార్డ్ అడ్మిరల్ ,లార్డ్ చెంబర్లేన్ వంటి అరిస్టోక్రాట్లు నాటక కంపెనీలను తమ అధీనం లోకి తెచ్చుకొని ,నటులను వారి ఇంటిమనుషులుగా చూసుకునేవారు .కనుక నటులు సంచారులుగా ఉండి ,అరెస్ట్ అయి ఇల్లు లేని వారుగా ఉండే బాధ తప్పింది కూడు గుడ్డా నీడా ,అజమాయిషీ లభించాయినటులకు . తర్వాత శాశ్వత నాటక శాలలు అంటే ధియేట్టర్లు నిర్మించబడి ,కంపెనీలకునిర్వహణ బాధ్యత ఇచ్చి ప్రదర్శనకు టికెట్ పెట్టి డబ్బు వసూలు చేసుకొనే సౌకర్యం కలిగింది ,
షేక్స్పియర్ జీవనాధారం ,ఆయన అద్భుత ప్రయోగ ప్రక్రియ ,వాటిల్లో ఆయన భాగస్వామ్యం ,ఆచరణాత్మక విధానం ,శిల్ప నైపుణ్యం అంతా ఇక్కడే ప్రదర్శితమైంది .వృత్తినాటక శాలలు ప్రదర్శనకు డబ్బు వసూలు చేయాలా వద్దా అనే దానిపైన అధికారం కలిగిఉండేవి ..వారి మనోభావాలకు విరుద్ధంగా కంపెనీలు ప్రవర్తించే వీలు ఉండేదికాదు .నటులకు సరైన పారితోషికం ఇచ్చే వారుకాదు .దుస్తులు అంటే కాస్ట్యూమ్స్ వడ్డీ వ్యాపారుల పరమయ్యేవి .కనుక ప్రొఫెషనల్ ధియేటర్ అనేది నామమాత్రంగా పేరుగా మిగిలింది .అందుకని 1560-70 కాల0లో ఆర్ధికావసరం ప్రాధాన్యత పొంది,పబ్లిక్ లేక బహిరంగ నాటక ప్రదర్శన శాల ల (యాంఫి ధియేటర్ )
స్థాపన అవసరం కలిగింది .పరిశోధనా ఫలితంగా ప్రముఖమైన షేక్స్ పియర్ నాటకాలను ప్రదర్శించినలండన్ లోని ” గ్లొబ్ ధియేటర్ ” ,క్రిస్టోఫర్ మార్లే నాటకాలు కొన్నిఇతర షేక్స్పియర్ నాటకాలను ప్రదర్శించిన” రోజ్ ధియేటర్ ”లు పూర్వపు 1567నాటి రెడ్ లయన్ ధియేటరే ..ఆర్కియాలజీ సర్వే ప్రకారం గ్లోబు ,రోజు థియేటర్లు బహుకోణీయంగా 14 నుంచి 24 వేదికలుగా బహు అంతస్తులతో 75 నుంచి 100 అడుగుల వ్యాసం తో ఎత్తుగా ఉండి ,పాక్షికంగా కప్పబడిన వెనుకభాగం (థ్రస్ట్ ) తో పే ట్రన్లు నుంచునే వీలుగా(గ్రౌండింగ్స్ ) పైన కప్పబడిన గాలరీ తో సుమారు 2 500 మంది ప్రేక్షకులు కూర్చునే వీలుగా బహిరంగ నాటక శాలలుగా ఉండేవి .
ఈ థియేటర్లు సామాన్యంగా ఏ రోజైనా సగం మంది తో నిండిఉండేవి .నాటకాన్ని గూర్చి బాగా ప్రచారం చేసినా పా0 ఫ్లెట్లు వేసి పంచిపెట్టినా సెలవు రోజుల్లో నైనా జనం బాగా హాజరయ్యేవారుపూర్వపు స్టువర్ట్ ,తర్వాతి ట్యూడర్ లాతోకలిపి లండన్ మెట్రోపాలిటన్ జనాభాలక్షా యాభై వేలనుంచి రెండున్నర లక్షలదాకా ఉండేది .వీరిలో వారానికి కనీసం 15 వేలమంది నాటకానికి హాజరయ్యేవారు .అంటే జనాభాలో పది శాతం హాజరన్నమాట ప్రేక్షక ఆదరణ కోరికలపై నాటకాలను మార్చేవారు 1595 లో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు లార్డ్ అడ్మిరల్ జనం కనీసం విభిన్నమైన 18 నాటకాలను 28 సార్లు ప్రదర్శించేవారు
సహజ సిద్ధ కాంతి తోనే ఈ ధియేటర్ లకు వెలుగు అందజేసేవారు .ప్రదర్శనలు మిట్ట మధ్యాహ్నం 12 లేక మధ్యాహ్నం 2 కు మొదలుపెట్టి నాన్ స్టాప్ గా 3 గంటలు ఆడేవారు .చివరలో ఒక తమాషా ఊపు కుదుపులేక ఫెన్సింగ్ ప్రదర్శన ,లేక నాటక సంబంధం లేని ప్రదర్శనతో ముగింపు పలికేవారు .వాతావరణ పరిస్తతులనను సారించి ఈ ఆరుబయట నాటకశాలలు నడిచేవి .ఆదివారం తో సహా ప్రతి రోజూ ప్రదర్శన ఉండేది .ఈస్టర్ పండుగకు 45 రోజులముందు ,ప్లేగు వ్యాధివచ్చినప్పుడు ,ఒక్కోసారి వేసవిలో కోర్టులు సమావేశం కానప్పుడు లండన్ లోని ధనిక సంపన్న భూస్వాములు అధిక సంఖ్య లో లండన్ లో ఉండనప్పుడు ప్రదర్శనలు ఉండేవికావు . సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
—