వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -49
మల్లినాథుని వ్యాఖ్యాన విధానం -1
మల్లినాథ సూరిని మహా వ్యాఖ్యాన చక్రవర్తి అని ,అద్భుత టీకాకారుడని భావిస్తారు .సంస్కృత సృజన గ్రంధాల వివరణను టీకా అంటారు .ఇది ‘’టిక్ ‘’ధాతు జన్యం .-’’టీకా వా ఆత్మ సోట్ టీకతే ఆటీ కిష్ట -టీకా స్త్రీ -టీక్యతే గ్రంధార్ధనాయ ‘’—విషమ పద వ్యాఖ్య రూపే గ్రంథ భేదే -వాచస్పత్య కోశా .హేమ చంద్రుడు ఈ ధాతువును గతికి చిహ్నంగా భావించాడు -’’టీకా గతో సమయత్యర్ధన్ టీకా సుగమానాం విషమాణాం చ నిరంతరం వ్యాఖ్యా యస్మామ్ సా తదా -అభిధాన చింతామణి ‘’టీకా పదానికి పర్యాయ పదాలు చాలా ఉన్నాయి .-’’నిరుక్తం ,భాష్యం ,వ్యాఖ్యా ,వార్తికం ,అవచూర్ణం ,వివరణం ,టిప్పణి ,ఫవికకా . డా పిఎన్ .ద్వివేది –కాళిదాస కీ కృతియొమ్ పర మల్లినాథ కీ టీకాయోమ్ కా విమర్శ ‘’ద్వివేది ఈ పాదాలన్నిటికి వివరణలు చెప్పాడు ’ .టీకా పదానికి మూలం బ్రాహ్మణాలలో ఉందని చెప్పి టీకా ,భాష్యా లపై కొన్ని వ్యాఖ్యలను అందజేశాడు . ఈ సందర్భం లో డా శ్రీమతి పెంధార్కర్ పేర్కొన్న టీకా లను పునరుత్పత్తి చేసి తెలిపాడు ఈ లిస్ట్ పెరిగింది ..వీటిలో ఒకదానితో ఒకటి కలిసేవి కూడా ఉన్నాయి ‘’శృంఖలా టీకా ,శాస్త్రీయ టీకా ,తులనాత్మక టీకా వ్యవస్థాపిక టీకా ,అనుగామినీ టీకా ,స్వతంత్ర టీకా ,వ్యాపక టీకా ,రసగ్రహణాత్మిక టీకా’’.
మల్లినాథుని వ్యాఖ్యానాలు రెండవ ,మూడవ నాలుగవ ,ఏడవ ,ఎనిమిదవ విభాగాలకు చెందిన లక్షణాలు కలవి . ఇందులో ఎనిమిదవది నిర్వచనానికి దగ్గరలో ఉన్నది .మల్లినాథుడు టీకా ను యెంత తక్కువగా వీలయితే అంత తక్కువగా చెప్పాడు .అనేక గ్రంథాలనుండి తన వ్యాఖ్యానాన్ని సమర్ధించే వాటిని ఉదాహరిసంచాడు .ఆయన అతి విస్తృత జ్ఞాన్నాన్ని సంగ్రహావలోకనం ఇదివరకే చేశా0 .ఇప్పుడు కొన్ని ముఖ్య సిద్ధాంతాలను గురించి మాత్రమే తెలుసుకొందాం ..సాధారణంగా ప్రతి వ్యాఖ్యాత పాఠాన్ని సంక్షిప్తం చేసి దానికి న్యాయం చేకూర్చి ,అభినందించి ,అందులో కవి ప్రయోగించిన పదాలు పదబంధాలు మెచ్చుకొంటాడు ..మల్లినాథుడు పెద్దగా కొరుకుడు పడనీ గ్రహణ సాధ్యం కాని పంచ మహాకావ్యాలను వ్యాఖ్యానాలు రాయటానికి ఎంచుకున్నాడు .సూటిగా స్పష్టార్ధాలను అనేక పద్ధతులలో తెలిపాడు .ఆయనకున్న అపారజ్ఞానం క్రమపద్ధతిలో వాటిని వ్యాఖ్యానించటానికి బహువిధాలుగా తోడ్పడింది ..ఆ క్రమ విధాలేమిటో ,అందులో ని ప్రత్యేకతలేమిటో ,ఆయన ఖచ్చితత్వాన్ని ,నుడి సౌందర్యానికి అవి ఎలా దర్పణాలుగా భాసించాయో తెలుసుకొందాం . ’’పద చ్చే దః పదార్ధ శ్చ వాక్య యోజనా -ఆక్షేపశ్చ సమాధానం వ్యాఖ్యానం షడ్విధమ్ విదుః -సర్వ తంత్ర సిద్ధాంత లక్షణ సంగ్రహం ‘’
1-పదాలు సంయుక్తంగా కాక ఏకపదాలైతే మల్లినాథుడు మొదటగా దాని పర్యాయ పదాలు చెప్పి ,వాటికి ఆధారాలను ఉదహరించాడు .-తతో రఘురభాష్యాన్ సూర్య ఇవ శరైర్బాణై రాస్త్రేహ్ కిరణోరివ –కిరణో సమయు రవా 0శు గభస్తి ధృణి దృశ్యయహ్ ఇత్యమరం ‘’
2- సంక్లిష్టపదాల విషయం లో ముందు ఆ పదాన్ని చెప్పి ,తర్వాత వివరణలేక పర్యాయ పదాలను ఇచ్చాడు -’’ప్రతి ప క్ష జన్మాన్ ‘’ను ప్రతి పక్షా శ్శ్రస్త్రోహ్ జన్మ యస్యాం భూర్భి ర్యమభూమి రవిషయః నిర్భీక ఇత్యర్ధహ్ ‘’
3-సంక్లిష్ట పదాన్ని వ్యాకరణ పద్ధతిలో విడగొట్టి దాని భాగాలను వేరు చేసి వాటి విభక్తి ప్రత్యయాలను ప్రత్యేకంగా తెలిపాడు . అవ్యయీ భావ ,నిత్యసమాసాల విషయం లో మినహాయింపు ఇచ్చి వాటిని వేరుగా పరిష్కరించాడు .దీని వలన ఒక ప్రత్యేక సంక్లిష్టపదం కవి ఎందుకు వేయాల్సి వచ్చిందో వివరించేవాడు .వెంటనే పర్యాయ పదాలు చెప్పేవాడు .నైషధం లో -భాఖండశ కరీరతాం సూర్య కులాంకురత్వం ఉజ్జ్వల వేణ్య కూరత్వం చ (దధత్ అతి తేజశ్వీ )ద్వౌ వంశో కూలమకర కర్తీ వంశా0కురే కరీ రాజ్వీ ఇతి చామరేహ్ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-6-17- కాంప్ -షార్లెట్ -అమెరికా
—