ఇంగ్లాండ్ నాటక ప్రదర్శన ప్రపంచం -3(చివరిభాగం )
ఈ హోదాలు సగం చట్ట సంబంధ0గా సగం రహస్యంగా ఉండేవి .ఇవి సాంఘిక ఆర్ధిక అభి వృద్ధి పరిణామ సూచికలుగా ఉంటూనే గిల్డ్ ఆర్గనైజేషన్ ల లాగా ,స్వీయ నియంత్రణ సంప్రదాయం ఉన్నవిగా , కళాకారుడికి వ్యక్తి గతంగా తోడ్పడుతున్నట్లుగా ఉంటూనే కాపిటలిస్ట్ సంస్థల మూస నమూనాలుగా ఉండేవి . షేక్స్ పియర్ కంపెనీ ఒక జాయింట్ స్టాక్ కంపెనీ .ఇందులో వ్యక్తులు డబ్బు పెట్టుబడి పెడతారు ..షేక్స్పియర్ తెలివి తేటల్ని కాపిటల్ గా కూడా వాడుకొనేవాళ్ళు .కళాకారుల్ని నియమించుకొని ,తమ పెట్టు బడులపై లాభాలను సంపాదించుకొనే వారు .ఈ అభి వృద్ధి మార్పు వలన నటులు, ధియేటర్ కంపెనీలు సంప్రదాయ గిల్డ్ నిర్మాణ చట్రానికి వెలుపల ఉండి ,కొంత వరకు రాజరిక ఫ్యూడల్ వ్యవస్థ లో ,వారి కుటుంబ పరివార సంస్థలుగా యజమాని -సేవక పద్ధతిగా ఉండేవి .ఈ విపరీతమైన వింత ఆర్ధిక సాంఘిక స్వతంత్రత వలన ధియేటర్ కంపెనీలు ఇష్టారాజ్యంగా ,క్రమ పధ్ధతి లేకుండా , వికృత ప్రవర్తనలతో భయంకరంగా ,ప్రమాద భరితంగా తయారై చివరికి అనేక సాధికారిక సంస్థలేర్పడి లండన్ మెట్రో పాలిటన్ ,,మతపరమైన (ఎక్లస్టికల్ ) వ్యవస్థలు ,ఒక్కోసారి రాజాస్థానాలు కూడా వాటిని నియంత్రించలేక రద్దు చేయలేక చేతు లెత్తేయాల్సి వచ్చేది .
న్యూ సెన్స్ కు కారణమైనందువలన ధియేటర్ లలో రౌడీ మూకలు చెలరేగటం వాటి మధ్య పోరాటాలు ,విపరీతమైన ధ్వని కాలుష్యం ,అల్లరి ఆగడాలు జరగటం వలన ,వీటిని మూసేయాలని ప్రభుత్వాధికారులు భావించేవారు ..కానీ వీటికి రాజుగారి బామ్మర్ది లాంటి వాళ్ళ ఫుల్ సపోర్ట్ ఉండటం ,రాజకీయంగా ఎదురుదాడికి దిగటం ,సాంఘికంగా తిరుగుబాటుతనం తో ఏమీ చేయలేక చేతులు ముడుచుకు కూర్చోవాల్సి వచ్చింది ..ఇంగ్లా0డ్ లో అంతర్యుద్ధ కాలం వరకు ధియేటర్ వ్యతిరేక శక్తులు వాటిని మూసేయించటానికి అశక్తులై నారు దీనికి కారణాలు – పర్య వీక్షణకు తగిన సిబ్బంది లేకపోవటం ,పోలీస్ బలగం తగినంత లేకపోవటం టెన్షన్లు ,ఏజెన్సీల మధ్య విపరీతమైన పగా ,ప్రతీకారాలు ,చెక్ చేయటానికి దారిలో గాడిలో పెట్టటానికి తగిన మార్గ దర్శకాలు ,లేకపోవటం .మరొక ముఖ్యకారణం ధియేటర్ ల తిరుగు లేని పాప్యులారిటీ ..ఏ కార్యక్రమాన్ని నియంత్రించాల్సి వచ్చినా అవి రోమన్ చక్రవర్తుlలు సర్కస్ లను పరిమితం చేసి ప్రయత్నాలు చేయటం ,ట్యూడర్ స్టువర్ట్ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో లేకపోవటం ,సాంఘికంగా భిన్నాలక్షణాలుండటం స్త్రీలకూ కూడా అవకాశాలు వచ్చాయి .పబ్లిక్ వినోద ప్రాబల్యాన్ని ఈ కాలం లో తక్కువగా అంచనా వేశారు .కానీ నిజానికి జాతరలు ఉత్సవాలు సెలవులు ,ఆటలు ,క్రీడలు ఆధునిక కవాతు ప్రదర్శనలు ,అసహజ (ఫ్రీక్ )ప్రదర్శనలు ,వీధి ప్రదర్శనలు ,అన్నీ విపరీతమై పోయాయి కాని ,ధియేటర్ మాత్రం తరచుగా విస్తృతమైన వినోదంగా అన్ని తరగతులవారికి ఆలంబనం, అందుబాటు అయింది .ఈ విషయం లో అది పరిమాణం లో అది కల్పించిన భయం కోపాలకు సహాయ కారి అయింది .
1562-16 42 కాలపు ఇంగ్లా0డ్ ధియేటర్ ను’’ ఎర్లీ మోడరన్ ఇంగ్లిష్ ధియేటర్’’లేక’’ ఎలిజబెథెన్ ధియేటర్ ‘’ లేక ‘’ఇంగ్లీష్రినైసెన్స్ ధియేటర్ ‘’ అన్నారు .వీటిలోని షేక్స్పియర్ క్రిస్టఫర్ మార్లో ,బెంజాన్సన్ నాటకాలు ఆడారు.బ్లాంక్ వర్స్ లో ఉన్న’’గోర్బో డక్ ‘’అనే ఇంగ్లీష్ నాటకాన్ని మొదట ప్రదర్శించారు .ఇంగ్లా0డ్ కు వెలుపలే ధియేటర్ జీవితం గడిచింది .కారణం సిటీలో ధియేటర్ ను నిషేధించారుకనుక .ఇంగ్లిష్ నాటకకంపెనీలు జర్మనీ ,డెన్మార్క్ లలో పర్యటించి అక్కడ కూడా నాటకాలు ఆడేవారు .మొదటి పర్మనెంట్ ధియేటర్ రెండుచోట్ల ఉండేవి .సత్రాలలో ఉన్న ప్రదేశాలలో ,,రాజాస్థానాలని ఇన్స్ లో అంటే ఇన్నర్ టెంపుల్స్ లో .
రెడ్ లయన్ అనే మొదటి పెర్మనెంట్ ధియేటర్ 1567 లో ఏర్పడి మూన్నాళ్ళ ముచ్చటగా ముగిసింది . 1576 లో ‘’ది ధియేటర్ ‘’అనే శాశ్వత ధియేటర్ ఏర్పడి లాభాలు బాగా గుంజింది .తర్వాత వచ్చిన థియేటర్లు బాగా ప్రాచుర్యం పొంది థామస్ మిడిల్టన్ రాసిన ‘’ఏ గేమ్ ఆఫ్ చెస్ ;;నాటకం తొమ్మిది ప్రదర్శనలతర్వాత అందులో ఆ కాలపు రాజకీయం ఉందని నిషేధించారు . 1592 లో రోజ్ ధియేటర్ లో’’ లార్డ్ స్ట్రేంజర్స్ మెన్ ‘’నాటకం ఫిబ్రవరి 19 నుంచి జూన్ 23 వరకు వారానికి 6 ప్రదర్శనలతో విజయ వంతంగా ఆడారు .ఇక్కడే 23 విభిన్ననాటకాలు ప్రదర్శించారు .స్పానిష్ ట్రాజెడీ ‘’హీరోనీమా-1 ‘’నాటకం 15 సార్లు ఆడారు .ఏ నాటకాన్నీ రెండు రోజులు మించి ఆడేవారుకాదు .ఎడ్వార్డ్ అలీన్ అనే ముఖ్య నటుడికి విశ్రాంతి ఉండేదికాదు .అందరూ మగాళ్లే .ఆడేవారు .ఆడవేషాలను ఆడాలసెంట్ బాయ్స్ ఆడ దుస్తులతో నటించేవారు .నాటక రచయితలూ ఆక్స్ ఫర్డ్ లోనో ,కేం బ్రిడ్జ్ లోనో చదివిన విద్యావంతులు షేక్స్పియర్ బెన్ జాన్సన్ లు దేనికి విరుద్ధంగా స్వీయ ప్రతిభతో నాటకాలు రాసి పండించారు .ఈకాలం లో రాయబడిన నాటకాలు చాలా కాలగర్భం లో కలిసిపోగా కేవలం 600 మాత్రమే మిగిలాయి
నాటకరచయితలకు రాసేకాలం లో ఇంక్రిమెంట్ లు ఇచ్చేవారు .ప్రదర్శన రోజున వచ్చిన డబ్బులో కొంత ముట్ట చెప్పేవారు వారికి ఓనర్షిప్ హక్కు లేదు ,షేక్స్పియర్ బెంజాన్సన్ లు కూడా నటించేవారు.దుస్తులు ప్రదర్శన మార్పులు చేర్పులకు ప్రచురణ ల విషయం లో నాటక కర్తకు బాధ్యత హక్కు లేమీ ఇచ్చేవారు కాదు . 1600 లో హెన్స్లీడేవి అనే నటుడికి రోజుకు 7 డాలర్లు ఇచ్చేవారు . 1630 లో రిచర్డ్ బ్లూమ్ కు ఏడాదికి 3 నాటకాలు రాసే ఒప్పందం సాలిస్బరీ కోర్ట్ ధియేటర్ తో కుదిరిందికాని దాన్ని నెరవేర్చలేక పోయాడు .షేక్స్ పియర్ ఒక్కడే జాక్ పాట్ కొట్టాడు 20 ఏళ్ళు 40 ఏకాంకికలు రాసి డబ్బు బాగా సంపాదించాడు .ఆయన నటుడుగా ,షేర్ హోల్డర్ గా ఫైన్సార్ గా కూడా రాణించాడు.. బెంజాన్సన్ఆ నాటి సాంఘిక రాజకీయవిషయాలపై నాటకాలు రాసి సొమ్ము చేసుకున్నాడు .జార్జి పీలే ,రాబర్ట్ గ్రీన్ లు ఫైనాషియల్ సక్సెస్ సాధిస్తే ,ఫిలిప్ మాసింజెర్ డబ్బురాక పేదరికం లో కుంగి పోయాడు .
ఇలా మూడు నాటకాలు ఆరు ప్రదర్శనలతో వర్ధిల్లిన రినైజెన్స్ ధియేటర్ ప్యూరిటన్ ఉద్యమం 1642లోని ,మొదటి సివిల్ వార్ సమయం లో పార్లమెంట్ లో అధికారం లో ఉన్న ప్యూరిటన్ పార్లమెంటేరియన్ పార్టీ దేశం లో జరుగుతున్న వీధిపోరాటాలు అల్లర్లు ఆగడాలు ఊరేగింపులు విసిగిపోయి ధియేటర్ లను నిషేధించింది .దీనితో రినైసెన్స్ నాటక థియేటర్లు మూతబడి ఆశకానికి సమాప్తి పలికాయి .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-6-17 -కాంప్-షార్లెట్ -అమెరికా