వీక్లీ అమెరికా-9 (29-5-17 నుంచి 4-6-17 వరకు )
రుద్రాభిషేక వారం
29 సోమవారం ఉదయం మైనేనిగారు ఫోన్ చేసి ఆధునిక ప్రపంచ నిర్మాతలు విషయం మాట్లాడి కొన్ని మార్పులు చేయమంటే చేశాను … వారి బావమఱఁదిగారి భార్యతో మాట్లాడమని ఫోన్ నంబర్ ఇస్తే రాత్రి హాయ్ చెప్పాను …మంగళవారం ‘’వుమెన్ సెయింట్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ‘’కొంత చదివా ..దాసరి నారాయణ రావు మరణ వార్త విన్నాను .స్వర్గం నరకం తాతామనవడు తుగ్లక్ మేఘ సందేశం ,శివరంజని మాత్రమే నాకు నచ్చాయి మిగిలినవన్నీ ‘’పైత్య0 ‘’అనిపిస్తాయి .నటన బాగుంటుంది .డైలాగ్ డెలివరికూడా .మెసేజ్ లో ‘’సరిలేని దాసరి ‘’అని రాశాను ..మల్లినాథ సూరి 48 ,ఆపన్న హస్తాలు ,దివ్య ధామం రాశాను .. విజ్జి వాళ్లకు తెలిసినాయన సిద్ధిపేట వారు శ్రీ గ్రంధి హరి రాత్రి వచ్చి శనివారం సాయంత్రం వాళ్ళ ఇంట్లో బి టెక్ చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళబ్బాయి కి ఎంబి బి ఎస్ సీట్ సాధన కోసం రుద్రాభిషేకం చేస్తున్నామని ఆశీర్వదించి దగ్గరుండి అన్నీ చూడమని సంకల్పం పూజ విధానం వగైరా చేయించమని కోరాడు. సరే అన్నా .వచ్చి తీసుకు వెడతానన్నాడు .
బుధవారం ఉదయం శ్రీ ఎల్లాప్రగడ వారు కారీ నుంచి ఫోన్ చేసి మమ్మల్నిద్దర్నీ రైలులో కార్తీకి తీసుకు వెళ్లే ఏర్పాట్లు చేస్తానని ఆయన మేము రిట్రీట్ కు వెళ్లిన ఫయ టేవిల్ లో యూనివర్సిటీలో అకౌంట్స్ ప్రొఫెసర్ గా చేసి రిటైరయ్యానని ,చెప్పారు . ఫోన్ మా అమ్మాయికిస్తాను మాట్లాడుతుంది అని చెప్పి ఇచ్చాను .పిల్లలకు జూన్ 10 వరకు పరీక్షలని అవి అయ్యాక తానె మమ్మల్ని తీసుకు వస్తానని చెప్పగా ఆయన చాలా సంతోషించారు ..సూరి 48 ,లండన్ థియేటర్లు -1 అఘోరీ -1 రాశా .లేటెస్ట్ ఫ్యన్ బకెట్ 87 చూశా రాత్రి .
1-6-17 .గురువారం ఉదయం అప్పారావు గారు వస్తే మా అమ్మాయి మమ్మల్ని గుంటూరాయన ఇంటికి తీసుకు వెళ్ళింది .పుట్టపర్తి ఆయన తల్లికి జబ్బుగా ఉందని తెలిస్తే వెళ్లిపోయారని చెప్పాడు .కనీసం లోపలి రమ్మని లేదు .డిక్కీ లో అంటే గారేజ్ బయట కుర్చీలేసి కూచోపెట్టి తన సోది వాయించాడు .నాకు చిర్రెత్తుకొచ్చింది .ఒక్కమాట కూడా వినలేదు పాపం అప్పారావు గారు బలయ్యారు .పావు గంట తర్వాత వెడదామని నేను ముందు బయల్దేరితే ఆయన కూడా వచ్చారు .ఎలా వెడతారు అని కూడా గుంటూరు పశువు -ల డాక్టర్ అడగలేదు .మా ఇంటికి దగ్గరే అయినా ,మేమిద్దరం నడిచి దారి తప్పి దారిలో ఒక ఇల్లు రిపేర్ చేస్తున్నఅమెరికన్ అతనిని రిక్వెస్ట్ చేస్తే చాలా సంతోషంగా కారు లో తీసుకు వచ్చి ఇంటి దగ్గర దింపాడు .ఎంతో కృతజ్ఞత చెప్పుకున్నాం . ఇద్దరం చెమటలు కార్చాం మా అమ్మాయి అప్పారావుగార్ని వాళ్ళ అమ్మాయి గారింట్లో దింపి వచ్చింది . సాయంత్రం గుంటూరు మరో అడ్డాడ దగ్గరాయన్ను వెంటేసుకొని వాకింగ్ లో మా ఇంటికి వచ్చి వెళ్ళాడు .పొడి పొడిగా మాట్లాడి పంపేశాను .సూరి 49 అఘోరీ 2 ధియేటర్ 2 రాశా
ఎల్ బి శ్రీరామ్ ఇంటర్వ్యూ
రాత్రి యు ట్యూబ్ లో నాటక రచయితా డైరెక్టర్ అనేక అవార్డుల విన్నర్ సినీ డైలాగ్ రచయిత 400 సినిమాల హాస్య, కేరక్టర్ నటుడు ఎల్ బి శ్రీరామ్ ఇంటర్వ్యూ చూశా .అద్భుత అనిపించింది .7 గురు అన్నదమ్ములలో 6 వవాడు శ్రీరామ్ .పెద్దన్న మిగిలినవాళ్ళల్లో ఒక్కొక్కరిని హైదరాబాద్ తీసుకు వెళ్లి చదివించి ప్రయోజకులను చేశాడని ,తానూ 22 ఏళ్ళు నాటక రచయితగా ప్రొడ్యూసర్గా డైరెక్టర్ గా మంచి పేరు పొందానని తమనాటకాలు ఏ పోటీకి వెళ్లినా బహుమతి రాకుండా ఉండలేదని ,తనకు ,తనికెళ్ళ భరణి నాటకాలకు విపరీతమైన పోటీ అని తమకు ఫస్ట్ ప్రయి జ్ వస్తే అతని సంస్థకు సెకండ్ లేకపోతె అటూ ఇటూ మారేవి .కాని మధ్యలో ఏ ఒక్క సంస్థకూ మొదటి లేక రెండు బహుమతులు వచ్చేవికావని చెప్పాడు .నాటక రంగం లో తన గురువు శ్రీ దేశిరాజు హనుమంతరావు గారని తమ కుటుంబ సభ్యులందరూ నటులవటం వలన తమ కుటుంబాన్ని ‘’మినీ సురభి ‘’కుటుంబం అనేవారని ఆత ను చెబుతుంటే కన్ను ఆర్పకుండా అతన్నీ చూడాలని పించింది .ఆకళ్ళల్లో స్వచ్ఛత నిజాయితీ నిర్భీకత ఆముఖం లో వర్చస్సు నన్ను బాగా ఆకర్షించాయి .
నాటక రంగం ఆకర్షణ తగ్గిపోగా శ్రీరామ్ తమ్ముడు అన్నకున్న తపన జ్వాల ఆగి పోకూడదని ప్రోత్సహించి మద్రాస్ పంపి ఖర్చులన్నీ తానె పెట్టుకొని ఆతర్వాత కుటుంబాన్ని అక్కడికి చేర్చి ,ఆఖర్చులూ తానె రెండేళ్లు భరించి నిల దొ క్కు కొనేట్లు చేశాడని .,ఆశపెట్టుకున్న కోట శ్రీనివాసరావు ఏ సహాయమూ చేయలేదని ఉద్యోగి నటుడు విద్యాసాగర్ తనను ఆదరించి ప్రోత్సహించి దారి హుపాడని ఇలా తన పెద్దన్న తన తమ్ముడు నిస్వార్ధంగా ఆలోచించబట్టి వాళ్ళేమీ పెద్ద ఉద్యోగస్ట్లుకాకపోయినా కుటుంబాలను ఆదు కొని పైకి తెచ్చినవారని ఎంతో కృతజ్ఞతగా చెప్పాడు .ఈ వి వి సత్యనారాయణ వి వి వినాయక్ తనను సినిమాలలో ఉన్నత స్థితికి తెచ్చారని డైలాగ్ రైటర్ గా నే సినీ అరంగేట్రం చేశానని దానికోసమే వచ్చానని భగవంతుని దయవల్ల సాధ్యమై తన రచనా శక్తి చూపగలిగానని ఎవరికిందా ‘’ఘోస్ట్ రచయిత ‘’గా పని చేయలేదని తర్వాత నటించటం ప్రారంభించి అందులోనూ వెరైటీ డైలాగ్ డెలివరీ పండించానని చెప్పాడు
మిధునం కిరికిరి .
నాకు తెలియని ఇంకో విషయం కూడా ఎల్బీ చెప్పాడు -హాస్యరచయిత శ్రీరమణ రాసిన మిధునం కథను తనికెళ్ళ భరణి డైరెక్ట్ చేసిన సినిమాలో మొదట అందులోని ముసలాయన పాత్రకు తననే భరణి ఎంపిక చేశాడని నువ్వే చేయమని శ్రీరామ్ అంటే కాదు నువ్వు చేస్తేనే ఆ పాత్ర పండుతుంది అని నిర్మొహమాటంగా చెప్పాడని స్క్రీన్ ప్లే కూడా తనతోనే రాయించాడని ,లక్ష వత్తులు వెలిగించే సీను లో వాళ్ళందరూ అన్ని వత్తులు ఒక దానిలోనే పెట్టి వెలిగిద్దామని అంటే అలా బాగుండదు విడి గా ప్రమిదల్లో పెట్టి వెలిగిస్తే శోభ వస్తుందని కన్విన్స్ చేసి మార్పించానని ,అందులో తనపాత్ర తనభార్య చనిపోయే ముంది ‘’పాహి పాహి పాహి ‘’అనే వేదపనస ఘన పనసలో చదువుతుందని ,దాన్ని సుస్వరంగా ఉచ్ఛరించటానికి తాను హైదరాబాద్ ఏ ఎస్ రావు నగర్ లో ఉన్న తన తండ్రిగారి శిష్యుడైన ఘనాపాటీ వద్ద నెల రోజులు నేర్చుకున్నానని , సినిమాలో ఆపాత్ర ఆంగ్లం లో కూడా మాట్లాడుతుందని అందుకని అందులోనూ ఏ దోషాలూ లేకుండా ఉండాటానికి ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లిష్ ప్రొఫెసర్ వద్ద నెల రోజులు శిక్షణ పొందానని ,సినిమాను వాళ్ళు వేసవి లో తీద్దామని ప్లాను వేస్తె ఆ కధకు సరైన వాతావరణం కావాలంటే వింటర్లో ప్రకృతి మధ్య తీయాలని సూచించానని సరే అంటూనే కాలయాపన చేశారని ,తాను మిధునం పై ముఖ్యపాత్ర కోసం ఒక్క ఏడాది విపరీతంగా కష్టపడ్డానని చెప్పాడు .తనకు జోడీ అయిన హీరోయిన్ కోసం వెదకటం లో కాలం గడిచి పోయిందని రెండు సార్లు నిర్మాతలు మారిపోవుటటం ,లక్ష్మిని లేడీ కేరక్టర్ గా ఎన్నిక చేయటంజరిగిందని , భరణికి మాత్రం పురుషపాత్ర నేను చేస్తేనే బాగుంటుంది అనిఉన్నా ప్రొడ్యూసర్ల ఒత్తిడి కి లక్ష్మికి తాను తగనని భావించి బాలు ను పెట్టుకొన్నారని ఇది తన జీవితం లో అత్యంత చేదు ఘటన అని చెప్పాడు తనకు అడ్వాంసు గా చాలా పెద్ద మొత్తమే ముందుగానే ఇచ్చారని దాన్ని మొత్తం తిరిగి ఇచ్చేసి చేతులు దులుపుకొని బయటికి వచ్చేశానని చెప్పాడు .ఇందులో శ్రీరామ్ నిజాయితీ ఆ కద పట్ల ఉన్న తపన అర్ధమయింది .ఎవరిపైనా ఆయన నెపం వేయక పోవటం నన్ను ఆశ్చర్యపరచింది . నేను మిధునం సినిమాపై రివ్యూ రాసిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది .బాలు ఆపాత్రలో ఒక ”బండ ఆరవాయన” లాగా ఉన్నాడుకాని శ్రీరమణ సృష్టించిన తెలుగాయన లాగా లేడన్నాను శ్రీరామ్ వేసి ఉంటె ఆపాత్ర నూటికి వెయ్యి శాతం తెలుగు దనం తెలుగు తేజం ఉట్టిపడేది . బాలు లక్ష్మి లు’’ అరవ మొగుడు అచ్చతెలుగు పెళ్లాలు’’గా ఉన్నారు .ఈ మనోబాధతో గాయపడిన హృదయం తో తాను మిధునం సినిమా ఇప్పటి వరకు చూడనే లేదని చూసి అవతలివారిపై ఈర్ష్య ద్వేష అసూయలు పెంచుకోవటం తనకు నచ్చని పని కనుక చూడలేదని నిజాయితీగా చెప్పాడు మిధునం సినిమా లో ఇంతమలుపు ఉన్నదని మొదటి సారిగా ఎల్బీ ఇంటర్వ్యూ వల్లనే నాకు తెలిసింది .అందుకే ఇంత తపన పడి రాశా .
2-6-17 గురువారం మధ్యాహ్నం టివి నటుడు వినోద్ బాల ఇంటర్వ్యూ చూశా .అతనిది మరీ వింత పరిస్థితి బుల్లి తెరకు ఒక వెలుగు తెచ్చినవాడు .రామ్ గోపాల్ వర్మ హాండిచ్చాడని చెప్పాడు .నాకు ఇతని నటన బాగా ఇష్టం
మైనేనిగారుపంపిన నీల్ డి గ్రాసీ రచన ‘’ఆస్ట్రో ఫిజిక్స్ ఫర్ పీపుల్ ఇన్ ఏ హర్రీ ‘’పుస్తకం చేరింది .చదవటం మొదలుపెట్టా బాగుంది .. గబ్బిట మాణిక్య శాస్త్రికి పూరీలోని జగన్నాధ సంస్కృత విశ్వ విద్యాలయం లో అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ గా ప్రమోషన్ వచ్చినట్లు మెయిల్ రాస్తే సంతోషించి ఆశీర్వ దించా .శుక్రవారం సూరి 50 ధియేటర్ 3 రాశా .మా మనవడు చి భువన్ సెంట్రల్ సిలబస్ టెన్త్ క్లాస్ పరీక్షలో 9..4 /10 మార్కులతో పాసయ్యాడని తెలిసింది . వీడి అన్న సంకల్ప్ కు అమెరికాలో 4-6-18 వరకు ఉండి పని చేయటానికి వర్క్ పర్మిట్ వచ్చింది . కొంత టెన్షన్ తగ్గింది .. కాలిఫోర్నియాలోని మా మేనల్లుడు శాస్త్రి ‘’లఘు పూజా విధానం ‘’పంపమంటే పంపాను .
రుద్రాభిషేకం
3- 6-17 శనివారం ఉదయం ఆస్ట్రో ఫిజిక్స్ కొంత చదివా .సాయంత్రం4-30కి శ్రీ హరి గారు వచ్చి కారులో మా ఇద్దర్ని వాళ్ళ ఇంటికి రుద్రాభిషేకానికి తీసుకు వెళ్లారు . పూజ మొదలు పెట్టేసరికి 5 30 అయింది గణపతి అష్టోత్తర పూజ చేయించి శి భవానీ శంకర దేవుల ఆవాహన అష్టోత్తర పూజ చేయించి లఘున్యాసంచదివి 11 సార్లు రుద్రాభిషేకం శ్రీహరి శ్రీమతి విజయ దంపతుల చేత ప్రారంభించాను మా అల్లుడు అవధాని వద్ద దాదాపు ఏడాది కాలం ఇంటి వద్ద వేదం నేర్చుకున్న 6 గురు నమక చమకాలు చక్కని స్వరం తో సామూహికంగా పలికి నిండు దనం తెచ్చారు . పండ్ల రసం పాలు తేనే చక్కర కొబ్బరి నీళ్లతో ఘనంగా అభిషేకం జరిగింది నేను కూడా నా స్పటిక లింగాన్ని విష్ణుపాదాలను సాలగ్రామాలు ఆ0జ నేయస్వామి విగ్రహాన్ని శ్రీచక్రాన్ని పూజలో పెట్టి అభిషేకం వీటికీ చేయించాను . వచ్చినవారంరి చేత అభిషేకం చేయించారు . అభిషేకజలాన్ని వేరే పాత్రలో తీయించి అన్నిటినీ కడిగించి అష్టోత్తర శతనామాలు లలితఅష్టోత్తరం చేయించి నైవేద్యం హారతి మంత్రం పుష్పం ఉద్వాసన లతో కార్యక్రమాన్ని రాత్రి 9 గంటలకు ముగించాము .తర్వాత ఒక అరగంట భజన చేశారు .ఆ పిమ్మట భోజనాలు .సుమారు 80 మందిదాకా వచ్చారు . చపాతి పూరీకూరా ఇడ్లీ లు శ్వీటు వెజ్ బిర్యాని ,పప్పు ,కూర ,వాంగీ బాత్ సాంబారు ,,మాంగో ఐస్ క్రీమ్ .నాకు పెద్దగా తినాలనిపించక తినలేక పోయాను . అందరు భోజనాలు చేసేసరికి రాత్రి 10 30 అయింది .నేను సాయ0కాలం వాళ్ళ ఇంటికి వెళ్ళగానే శ్రీ సువర్చలేశ్వర శతకం హరిగారికి అందజేశాను ..
కార్య క్రమం అవగానే చాలామంది ‘’అంకుల్ చాలా బాగా చేయించారు ‘’అని అన్నారు చిరునవ్వే నా సమాధానం . నా స్పీడ్ కు కుర్రకారు ఆశ్చర్య పోయారు . నాకు శ్రీహరి దంపతులు ‘’ఘనమైన తాంబూలం ‘’ఇచ్చి వాళ్ళబ్బాయితో సహా మా ఇద్దరికీ పాదాభి వందనం చేసి ఆశీస్సులు అందుకొన్నారు . కొందరు దగ్గరకొచ్చి నమస్కారాలు పెట్టి వెళ్లారు .హరి దంపతులు చాలా ఆనందించారు సంతృప్తి చెందారు అదే కావలసింది వారి శ్రద్ధ భక్తులే దీనికి కారణం .పవన్ కారులో మేమందరం బయల్దేరి అప్పారావుగారిని వారింటివద్ద డ్రాప్ చేసి మమ్మల్ని మా ఇంటిదగ్గర దింపి పవన్ ‘’పుష్పక విమానం ‘’తనఇంటికి తన కుటుంబంతో చేరింది .రాత్రి 11 దాటింది . అప్పారావుగారు మా పెద్ద మేనల్లుడు అశోక్ తోపాటు సిద్ధిపేట స్టేట్ బాంక్ లో పనిచేసినట్లు ఈ రోజే ఆయన ,పవన్ మాట్లాడుకొంటుంటే తెలిసింది . .తెల్లవారుజామున 3- 30 కే మెలకువ వస్తే లేచి మైనేనిగారి మెయిల్స్ కు సమాధానం రాసి యు ట్యూబ్ లో సూర్య స్తుతి పెట్టుకొని మాగన్నుగా వింటూ నిద్రలోకి జారుకున్నాను .
4-6-17 ఆదివారం -మల్లినాథ 52 రాశా రాత్రి కొద్దిగా వర్షం పడింది . ఉదయ0 బాగానే ఎండ వచ్చింది .వీక్లీ -9 సాయంత్రం రాశా .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్-4-6-17- కాంప్-షార్లెట్ -అమెరికా