వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -52
మల్లినాథుడు ప్రయోగించిన న్యాయ సూత్రాలు
సంస్కృతం లో న్యాయ సూత్రాలకు గొప్ప ప్రాభవం విలువ ఉన్నాయి .సామాన్య సంఘటనలలో ని అనుభవాలు వాటిలో కనిపిస్తాయి ముఖ్య సిద్ధాంతాలు సంఘటనలను తెలియజేయటం వలన వాటి ప్రభావం చాలా ప్రయోజన కరం గా ఉంటుంది .తన వ్యాఖ్యానాలతో మల్లినాథుడు అలాంటి సిద్ధాంతాలను చాలా ఉపయోగించాడు .తరల’’వ్యాఖ్యానం లో 10 సిద్ధాంతాలు మాత్రమే చెప్పాడు .ఇందులోకొన్ని ఆచూకీ (రిఫరెన్స్ )కోసం తెలుసుకొందాం .వీటి సహాయం తో మల్లినాథుడు తనదైన ప్రత్యేక చర్చను చాలా అర్ధవంతం చేశాడు .
1-నిమిత్తాన్తరం నైమిత్తికం –అంటే ఫలితంలేక ప్రభావం మరొక కారణం -2-ధర్మ కల్ప నతో వరం ధర్మ కల్ప నేతి -న్యాయాభిదాయా ఏవ -తాత్పర్యామ్ తర కల్పనం వరఇత్యభిప్రాయహ్ అంటే -గుణం లేక లక్షణాన్ని ఊహించటం ఒక విషయాన్నీ ఊహించటానికి ప్రాధాన్యమౌతుంది దీన్ని అనుసరించి ఉచ్చారణ అర్ధాన్ని ఊహించవచ్చు .-3-తదపి వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తిరీతి న్యాయేన -అంటే -ఇది కూడా సిద్దాంతం ప్రకారమే ఉంది -అందులోని ముఖ్య లక్షణాలు వివరణతో నే తెలుసుకోవచ్చు 4-జతుకాషు న్యాయహ్ -లక్కకు చెక్క కు ఉన్న విడదీయ లేని సంబంధం లాంటిది 5-అదగ్ధ దహన న్యాయ -బాగా మండుతున్నది -అంతకు ముందు మండనిది 6-బ్రాహ్మణాశ్రమణ న్యాయం -సన్యాసి ని కూడా పూర్వాశ్రమంలో బ్రాహ్మణుడే అంటారు.-7-దండ పూప న్యాయం -ఎలుక పిల్ల కర్రను తిన్నది అన్నట్లు -అది దానిపై ఉన్న రొట్టెను కూడా తిన్నట్లు చెప్పటం 8-కాకతాళీయం న్యాయం -కాకి తాటిపండుపై ఎక్కితే రాలి పోయినట్లు 9-తిల త0డుల న్యాయం – బియ్యం నువ్వులు కలిస్తే వాటిని తేలికగా వేరు చేసినట్లు 10-ఖలే కపోతన్యాయహ్ -నూర్పిడి ధాన్యం నుంచి పావురాలు ఒకే సారి ఎగిరినట్లు 11-పాన కరస న్యాయం- పానకం లోని వివిధ పదార్ధాల రుచి తెలియక వాటి మొత్తం రుచి తెలిసినట్లు .
ఒక్కోసారి మల్లినాథుడు రెందు శ్లోకాల మధ్య ఉన్న సంబంధాన్ని తర్వాతఉన్న శ్లోకం లోని పాదాలను ముందుపెట్టి తెలియ జేస్తాడు .ఈ విధానం వలన సంబంధ విషయం చాలా స్పష్టమౌతుంది ..దీన్ని కవి చెప్పి ఉండడు ..దీన్ని తంత్ర యుక్తిలో ‘’వూహ్యం ‘’అన్నారు.అంటే మినహాయింపు లేక ఊహ అని అర్ధం .-’’ఊహం నామ యది నిషిద్ధం గ్రంధే ప్రజాయా తర్క త్వేనోపదిశ్యతే-చరక సంహితా ‘’.ఈ టెక్నీక్ ను శాస్త్ర విషయం చర్చలో బాగా ఉపయోగించాడు ఇది మల్లినాథ వ్యాఖ్యానాలతో మహా ప్రాచుర్యం పొందింది .శ్లోకాలమధ్య ఉన్న సహజ సంబంధం ను వ్యాఖ్యాత చక్కగా తెలియ జేస్తాడు .ఇలా చెప్పటం లో వ్యాఖ్యాత యొక్క విశ్లేషణాత్మక ప్రతిభ వ్యక్తమౌతోంది .దీనితో గ్రంధం యొక్క ఏకత్వానికి ప్రత్యేక సన్నివేశానికి సరైన సంబంధం లభిస్తుంది .సంబంధం యెంత బలీయమైతే శ్లోకం అంత అందమై రాణిస్తుంది ..
ముక్తక కవుల మాదిరిగా కాకుండా మహా కావ్య కవులు గ్రంధం లోని విషయ ఐక్యతకు మిక్కిలి ప్రాధాన్యమిస్తారు .వారి మనసులోని అభిప్రాయాలను మల్లినాథుని వంటి మహా వ్యాఖ్యాన కర్తలు గ్రహించి లోకానికి తెలియజేస్తారు .ఇది బాగా అర్ధమవటానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం –
కిరాతార్జునీయం లో శత్రువులతో వ్యవహరించాల్సిన ముఖ్య విధానం గురించి చర్చ ఉంది అప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నమైంది .యుద్ధ రీతి ప్రాముఖ్యత సాధికారత ఏమిటి ?మనువు కూడా శత్రువులతో యుద్ధాన్ని నివారించుకోవటం మంచిద న్నాడు .తర్వాత శ్లోకం లో యుద్ధ రీతి లేక వీరత్వం గురించి కవి చెప్పాడు ..కనుక ఈ సందర్భం లో ఈ రెండు శ్లోకాలను కలిపి అర్ధం చెప్పాలి మొదటి దానిలో ప్రశ్న రెండవదానిలో సమాధానం ఉందన్నమాట .ఈ సంబంధాన్ని మల్లినాథుడు ప్రశ్నను ముందుపెట్టి సమాధానం తర్వాత చెప్పాడు -’’నను సామ్నేవ సిద్దౌకిమ్ క్షత్రేణ యధా హ్ మనుహ్ – సామ్నదానేన భేదేన సమస్తై రథవా పృథక్ -విజేతుం ప్రయాతేతా రీన్న యుద్ధేన కదాచన ఇతి ‘’.వీరపురుషుడు ఎవరిపైనా ఆధారపడరాదు అనిభావం -’’నహి తేజస్వినః పరాయట వృత్తిత్వం యుక్తం -మనువచనం త్వశూ రవిషయమితి భావః ‘’ .అదే సర్గ లో యుధిష్ఠిరుడు ఒక ఆలోచనాత్మక విషయాన్ని ప్రతిపాదించాడు – ఒక్కోసారి యుద్ధం లో వీరుడు విఫలుడైనా అతని పరాక్రమం కొని యాడ బడుతుంది .ఈ రెండిటిని మల్లినాథుడు చక్కగా అతికించాడు -’’ఏవం విమృశ్య కుర్వతో దేవాదన ర్యాగ మోపి న కశ్చిద పరాధ ఇత్యాహ ‘’మల్లినాథుడు వివరిస్తూ -’’దేవి కేషు పురుస్యాను పాల భ్యత్వా దితి భావః -యయాహ కామాంధకః -యంతు సమ్య గూపక్రాంతం కార్య మేతి విపర్యయం -పురుషత్వ నుపాలమ్యో దేవతరిత పౌరుషహ -ఇతి ‘’
శిశుపాల వధలో రాజ విధానాల చర్చ ఉంది .నిర్లక్యం లేక ప్రమాదం రాజు కు క్షమించరాని విషయం .మరి జాగ్రత్త ఉన్న రాజు లక్షణాలు ఏమిటి ?దీన్ని సమాధానంగా రెండవ శ్లోకంతో లంకె పెట్టి చెప్పాడు . జాగ్రత్తగల రాజు అంటే తెలివి తేటలే ఆయుధంగా గలవాడు ,మంత్రివర్గం శరీరంగా అత్యున్నత గోప్యనీయత శక్తివంతమైన కవచంగా కలవాడు అని చెప్పాడు -బుద్ధి సత్వహ్ శస్త్రహ్ ప్రకృత్యంగే ధన సంవృతి కంచుకః ;’’.
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-17 -కాంప్-షార్లెట్-అమెరికా ;
—