శ్రీ రమణ భగవాన్ సన్నిధి
శ్రీ రమణ భగవాన్ సన్నిధి ఒక అరుదైన విచిత్ర అనుభూతి .ఇలాంటి అనుభూతి వేరే చోట ఎక్కడా లభించదు ..ఆయన మౌన సందేశానికి హృదయకమలాలు వికశించి జ్ఞాన బాండాగారం తెరుచుకొంటుంది .ఆయన ఆత్మ ఆశ్రమ మంతా కిరణ ప్రసారం వెదజల్లుతుంది ..ఆయన ముందు కూర్చుంటే చాలు మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇట్టె లభిస్తాయి ..దక్షిణామూర్తి లాగా ఆయన మౌన వ్యాఖ్యాన పరబ్రహ్మ .ఆయన సందర్శనం లో మనం ‘’సవికల్ప సమాద్ధి ‘’పొందుతాం ..’’రమణ మహర్షి భౌతిక గురు మూర్తికారు ..మహా గొప్ప పవిత్రమైన మూర్తి ఇంతటి అరుదైన వ్యక్తి ఒక శతాబ్దకాలం లో భారత దేశం లో జన్మించలేదు ‘’అన్నారు మన రాష్ట్రపతి డా రాధాకృష్ణన్ ..ఆయన్ను ఒక్కసారి చూస్తే చాలు మన హృదయాలు ప్రక్షాళనమై పవిత్రవంతాలవుతాయి .
శ్రీ రమణ మహర్షిది ఒకటే ప్రశ్న -’’నేను ఎవరిని ?’’అది వేసుకొంటే సాధకునికి ఆత్మ జ్ఞానం కలుగుతుంది ఈ విధానం ప్రాచ్య పాశ్చాత్త్య విధానం లో ఉన్నా ,దీనిని మళ్ళీ తెరపైకి తెచ్చినవారు ఆయనే ..వేదాంత తత్త్వం లోని దంతా ఆయన ఆచరణ సాధ్యం చేసుకొన్నారు .ఒకరకంగా చెప్పాలంటే ‘’ఇలియడ్ ను ఒక్క మాటలో చెప్పారు అంటాడు స్వామిరామా .తనను తాను తెలుసుకున్నవాడికి విశ్వమంతా తెలుస్తుంది .ఇదే అద్భుత చిన్న సూక్ష్మ విధానం ఆత్మ జ్ఞానానికి .దీనినే అన్ని తత్వ శాస్త్రాలు చెప్పాయి ..
నాలుగు రోజులు తన బృందం తో రమణా శ్రమం లో ఆధ్యాత్మిక అనుభూతిలో గడిపాక నాసిక్ కు తిరిగొచ్చి ,తాను ఉన్న శంకరా చార్య పదవిని విసర్జించేయాలనే గట్టి ఆలోచన మనసులో స్థిరపడింది .ఆచార్య పదవిలో క్షణం తీరిక లేకుండా వచ్చిమీద పడే జనాల బాధ తో భారంగా బోరింగ్ గా భావించాడు .అరుణాచలం లో రమణ మహర్షి దర్శనం తో ఆ లోపలి అగ్నికి ఆజ్యం పోసినట్లయింది ‘’త్యజించు అనుకొన్నది సాధించు ‘’అనేది మనసు హృదయాలలో మారు మోగిపోతోంది ..నాశిక్ లో ఉన్నకాలం మరీ ఇబ్బంది కలిగించింది ..పీఠం త్యజించి బాధ్యతలన్నీ వదిలేసి పారి పోవటం ఆంత తేలికైన విషయం కాదు ..కానీ ఒక రోజు వచ్చి ఆ పనే చేయించింది .నాశిక్ వదిలి ఒక్కసారిగా మళ్ళీ హిమాలయాలకు వెళ్లి పోయాడు . .
ఎవరూ వేరొకరికి జ్ఞాన ప్రకాశం కలిగించలేరు అనిపించింది .యోగులు మాత్రం ప్రేరణ కలిగించి అంతర్బలాన్ని కలిగించగలరు .అది లేక పోతే ఆత్మ జ్ఞానం సాధించటం అసాధ్యం . .ఇవాళ్టి కాలం లో మార్గ దర్శనం చేసే వారు కనిపించటం లేదు .మనకు ప్రేరణ కలిగించి దారి చూపేవారు లేరు .అందుకే ఆత్మజ్ఞానం అందుకోవటం కష్టమౌతోంది .కనుక మహర్షులు ,యోగులు ప్రేరణకు మూలాలై ఆత్మజ్ఞానఉద్దీ పకులౌతారు అని పించింది స్వామిరామాకు
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-17 -కాంప్ -షార్లెట్-అమెరికా