గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 139-బ్రహ్మవాదిని -గార్గి వాచహ్నవి (క్రీ.పూ. 700)
ప్రాచీన తత్వవేత్త గార్గి పేరు వేదసాహిత్యం లో కూడా ప్రసిద్ధమైనది .ఆమెకాలం క్రీ పూ 700 గా భావిస్తారు వేదాలను అత్యంత సహజంగా వివరించి చెప్పే నేర్పున్న మహిళా బ్రహ్మవాదిని అని గార్గి ని గౌరవంగా సంబోధిస్తారు బృహదారణ్యక ఉపనిషత్ లో ఆరు ఎనిమిది అనువాకాలో ఆమె పేరు ప్రత్యేక్ష మౌతుంది .విదేహ రాజు జనకుని ఆస్థానం లో జరిగిన ‘’బ్రహ్మ యజ్ఞ ‘’చర్చలో గార్గి యాజ్ఞవల్క్యునితో సవాలు చేసి నిలిచింది .గార్గి ఋగ్వేదం లో చాలా సంహితలు దర్శించినట్లు ఉన్నది .హిందూ ధర్మాన్ని మనసా వాచా అనుసరించిన మహోత్కృష్ట మహిళ గార్గి
గర్గ వంశానికి చెందిన వాచహ్నుని కుమార్తె గార్గి .తండ్రి గార్గి వాచాహ్నవి అని పేరుపెట్టారు .బాల్యం నుండి అసమాన మేధస్సుతో వేదం వేదాంగ విషయాలను నేర్చి ఆనాటి సమాజం లో ఉకృష్ట మహిళగా విరాజిల్లింది .ఉపనిషత్తులలో గార్గి ,,వాడవ ప్రతిహేయి ,,సులభ మైత్రేయి పేర్లు తరచుగా కనిపిస్తాయి .ప్రాచీన మహిళా విద్యావేత్తల పేర్లలో వీరు ముగ్గురు పేర్లే ముందు చెబుతారు వేద విద్యా మహిళా త్రయం గా వీరిని పేర్కొన వచ్చు . అశ్వలాయన గృహ్య సూత్రాలలో ,కూడా గార్గి పేరు తరచుగా కనిపిస్తుంది .కుండలిని మేల్కొల్పి బ్రహ్మజ్ఞానంతో ఆత్మజ్ఞానంపొందిన మహిళా మాణిక్యం గార్గి
.విద్యా వ్యాప్తికి గార్గి సేవలు నిరుపమానం .జనకమహారాజు రాజా సూయ యాగం చేసి దేశం లోని మహర్షులను రాజులను ఆహ్వానించి తానూ బ్రహ్మజ్ఞాని కనుక ఇందరు మహానుభావులు తన ఆస్థానానికి రావటం లో పరవశించి బ్రహ్మ జ్ఞాన చర్చను అందరి సమక్షం లో నిర్వ హించాలని భావించాడు .గెలుపొందినవారికి 1000 గోవులను ఒక్కో ఆవు కొమ్ములకు 10 గ్రాముల బంగారాన్ని తగిలించి కానుకగా ఇస్తానని చాటాడు .ఇలా కుండలిని మేల్కొల్పి ఆత్మజ్ఞానం సాధించిన బహు శాస్త్ర వేద నుపనిషత్ నిధి యాజ్ఞవల్క్యుడు కూడా ఉన్నాడు .తనతో వాదం లో ఎవరూ జయించలేరన్న ధీమాతో గెలుపుతనదేనని భావించి ఆ సహస్ర గోగణాన్ని తన ఆశ్రమానికి తోలుకు వెళ్ళవలసినదిగా శిష్యుడు సం శ్రవుడిని ఆదేశించాడు .అక్కడున్న చాలామంది వాదం లేకుండా యాజ్ఞవల్క్యుడు ఇలా ‘’ప్రయిజ్ మని ‘’ తీసుకు వెళ్ళటం ఇష్టం లేకపోయినా వాదించే దమ్ములేక గమ్మునుండి పోయారు .చివరికి గార్గి తో ఎనిమిది మంది జనకుని పురోహితుడు అశ్వ లుడు ,ఆర్తభాగుడు ,భూ జ్యుడు ,ఉషష్ఠ ఉద్దాలకుడు ,గార్గి ,మాత్రమే మిగిలారు .ఉద్దాలకుడు వాదం ప్రారంచాడు .చివరికి గార్గి యాజ్ఞవలయునిగొప్ప తనాన్ని ఆధిక్యాన్ని సవాలు చేసి నిరూపించుకోమన్నది .ఆమె ఆధిభౌతిక విషయాలపై ప్రశ్నలు సంధించింది పర్యావరణం పై ప్రశ్నలు కురిపించింది .ప్రపంచమంతా నీటిపై ముందుకు వెనకకూ అల్లబడిందంటారుకదా ఈ ముందువెనుకలు దేని పై ఆధారపడ్డాయి ?వాళ్ళిద్దరి సంభాషణ ఇలా జరిగింది -గాలిమీద అన్నది గార్గి గాలి దీనిపై ఆధారం ? మధ్యనున్న ప్రదేశం పైన .అందులోని ప్రదేశాలు ?గాంధర్వ లోకంపైనా అని గార్గి సమాధానం బృహదారణ్యక ఉపనిషత్ లోకూడా ఉంది .అలాగే గార్గి సూర్య ,చంద్ర ఇంద్ర ప్రజాపతులపై ప్రశ్నలు అడిగింది .యజ్ఞవాల్యుని గార్గి ఆకాశంపైన ఏమి ఉంది భూమిక్రింద ఏముంది గతం వర్తమానం భవిష్యత్తు అంటే ఏమిటి , వీటినికలిపే పడుగూపేకల నేత ఏమిటి ?అని ప్రశ్నిస్తే యాజ్ఞవల్క్యుడు -’’అంతరిక్షం ‘’అని సమాధానం చెప్పాడు .సంతృప్తిపడక గార్గి చివరగా బ్రహ్మం అంటే ఏమిటి అని అడిగితె .సమాధానంగా ఇంతకంటే ముందుకు వెళ్ళటం మంచిదికాదని వెడితే ఆమె మానసిక స్థితి దెబ్బతింటుందని చెప్పి వాదాన్ని ముగించాడు .ఈ ఆకస్మిక ముగింపు ఆమెకు నచ్చక ‘పోయినా యాజ్ఞవల్క్యుని అపార మేథా సంపత్తిని మెచ్చి అక్కడి బ్రహ్మవేత్తలతో ‘’మీరందరూ యాజ్ఞవల్క్యుని బ్రహ్మజ్ఞానానికి తలవంచవలసిందే .అందులో ఆయన్ను ఓడించగలిగే వాడు లేడు ‘’అని చెప్పింది
గార్గికి ఉన్న ఆత్మజ్ఞాన విషయాలు చాందోగ్యోపనిషత్ లో కూడా దర్శనమిస్తాయి .యాజ్ఞవల్క్య గార్గి సంవాదం ‘’యోగ -యాజ్ఞవల్క్య ‘’గ్రంధంగా వెలువడింది . జనక మహా రాజు ఆస్థానం లోని నవరత్నాలలో గార్గి ఒకరై విశేషస్థానం పొందింది
140-అద్వైత వేదాంతిని -సులభ మైత్రేయి (క్రీ;పూ 700)
మైత్రి మహర్షి పుత్రిక సులభ మైత్రేయిగా అశ్వలాయన గృహ్య సూత్రాలలో మైత్రేయి పేరు కనిపిస్తుంది . కాలం క్రీపూ 700. గృహ్య సూత్రాలలో కూడా వేదకాలపు మహిళలతో మైత్రేయి పేరు కనిపిస్తుంది .తండ్రి విదేహ రాజ్య రాజధాని మిథిలలో జనక మహారాజు ఆస్థాన మంత్రిగా ఉండేవాడు . బృహదారణ్యక ఉపనిషత్ లో మైత్రేయి యాజ్ఞవల్క్యుని భార్యగా చెప్పబడింది.ఆయన రెండవ భార్య కాత్యాయని .మహాభారతం లో మాత్రం మైత్రేయి అవివాహిత గానే చెప్పబడింది .జనకునికి బ్రహ్మజ్ఞానం బోధించి జీవితాంతం యోగినిగా ఉండి పోయిందని ఉంది .సంస్కృత సాహిత్యం ఆమెను బ్రహ్మవాదిని అన్నది .కాత్యాయనితో యాజ్ఞవల్క్య మహర్షి సంసార జీవితాన్ని అనుభవిస్తుంటే మైత్రేయి బ్రహ్మజ్ఞానం తో ఆత్మజ్ఞానం సాధించింది
ఋగ్వేదం లో 10 మంత్రాలను మైత్రేయి దర్శించినట్లు చెప్పబడింది . బృహదార ణ్యక ఉపనిషత్ లో మైత్రేయి యాజ్ఞవల్క్య సంవాదం ఉన్నది ..ఆత్మనుంచి ప్రేమ జనించి ఆత్మ స్వభావం బ్రహ్మం లను చర్చించి ఈ రెంటి ఐక్యతను తెలియ జేయటమే ఇందు లోని సారాంశం .ఇదే అద్వైత సిద్ధాంతం .మైత్రేయి యాజ్ఞవల్క్య సంవాదం రెండు భాగాలగ్రంధం మాధ్యమ దిన , కాణ్వ సిదాంతాలుగా కొద్దిమార్పులతో మారింది
యాజ్ఞవల్క్యుడు బ్రహ్మ చర్య గృహస్థ ,వానప్రస్థాశ్రమాల జీవితానుభవం తర్వాత ముసలితనం లో సన్యాసాశ్రమం సవీకరించాలని భావించి భార్య మైత్రేయిని పిలిచి తనకున్న ఆస్తిని చెరిసగంగా ఇద్దరు భార్యలకు ఇస్తానన్నాడు .మైత్రేయి తనకు న శ్వరమైన మైన ధనం కంటే అశ్వరమైన మోక్షం కావాలని చెప్పింది .అప్పుడు మైత్రేయి యాజ్ఞవల్క్యుల మధ్య జరిగిన సంవాదం ఇలా నడిచింది -స్వామీ !ప్రపంచం లోసంపదంతా నాకు చెందితే నాకు మోక్షం వస్తుందా ?అని అడిగింది .లేదు ‘’అని చెప్పి మోక్షానికి ధనం తో సంబంధం లేదన్నాడు యాజ్ఞ వల్క్యుడు .అశాశ్వతమైన దానికోసం నాకు ప్రాకులాటలేదు శాశ్వతమైన ముక్తి కావాలంటే మార్గం చెప్పండి ?అడిగింది .సంతోషించిన భర్త భార్య మైత్రేయికి ఆత్మజ్ఞానం బోధించి నిరంతరం మననం చేయమన్నాడు
బృహదారణ్యక ఉపనిషత్ లోని ఈ సంవాదానికి అబ్బురపడిన శంకరాచారా దానికి చక్కని భాష్యం రచించారు .మైత్రేయి యాజ్ఞవల్క్యసంవాదం పై సురేశ్వరాచార్యులు ‘’వార్తికం ‘’రాశారు ..ఢిల్లీలో మైత్రేయి పేరిట ఒక విద్యాలయం తమిళనాడులో ‘’మైత్రేయి వేదిక్ విలేజ్ ‘’అనే రిట్రీట్ ప్రదేశం ఉన్నాయి ..
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-6-17-కాంప్-షార్లెట్ -అమెరికా