గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
201-పరాశర స్మ్రుతి ,పరాశర హోర గ్రంథ రచయిత -పరాశర మహర్షి
శక్తి మహర్షికుమారుడు ,వసిష్ఠర్షి మనవడు వ్యాసమహర్షికి తండ్రి పరాశర మహర్షి భార్య సత్యవతి .అద్వైత గురుపరంపరకు ఆద్యుడు . తండ్రి చిన్నప్పుడే చనిపోవటం తో పరాశరుడు తాత వశిష్ఠుని వద్ద పెరిగాడు ..పరాశర ఆశ్రమం పై జరిగిన దాడిలో ఆయన కాలు దెబ్బతిని కుంటివాడయ్యాడు .ఒకసారి దట్టమైన అడవిలో కుంటుకుంటూ నడుస్తుంటే అడవినక్కలు ఆయనపై పడి చంపేశాయని ఐతిహ్యం
ఋగ్వేదం లోఅగ్ని దేవుని స్తుతించే 1-65-73 మంత్రం .సోముని స్తుతించే 9-97 మంత్రం ద్రష్ట పరాశరామునియే -’’దేవో నా యహ సవితా సత్య మన్మా క్రత్వా నిపాతి విజనాని విశ్వా – పురు ప్రశస్తో అమతిర్న సత్యా ఆత్మేవ సేవో దిది షయ్యో భూత్ ‘’భావం -ఎవరు సూర్య దేవునిలా ,సత్యం తెలిసి చేతలు దాచి ప్రకృతిలాగా ఉంటాడో వాడు మార్పు చెందని మనసుతో ఆనంద సుఖాలను నిత్యం అనుభవిస్తాడు
పరాశర మహర్షి రుగ్వేద మంత్రం ద్రష్ట మాత్రమేకాదు ‘’పరాశర స్మ్రుతి ‘’,పరాశర సంహిత ‘’,జ్యోతిస్శాస్త్రమైన ‘’బృహత్ పరాశర హోరా ‘’,వృక్షాయుర్వేదం మొదలైన గ్రంధాలు రచించాడు .పరాశరుడు అంటే ‘’పరాశయణా తి పాపా తీత పరాశరః ‘’అంటే పరాశర ముని దర్శనం ,నామ స్మరణం సమస్త పాప క్షయకరం .పరాశర మహర్షికి దేవాలయాలు హిమాచలప్రదేశ్ లో మండి జిల్లా లో ,మిగిలిన చాలా చోట్ల ఉన్నాయి .
202-త్రిమూర్తుల తండ్రి -అత్రి మహర్షి
సప్త ర్షులలో అత్రి మహర్షి మొదటివాడు పతివ్రత అనసూయా దేవికి భర్త ..ఈ దంపతుల కుమారులే దత్తాత్రేయ దుర్వాస ,సోమా లు .అత్రిమహర్షి తపస్సుకు మెచ్చిన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా వారు తమకు సంతానంగా జన్మించాలని కోరాడు
ఋగ్వేదం లోని 5 వ మండల0 ఉన్న 87 మంత్రాల ద్రష్ట అత్రిముని .ఇవి అగ్ని ,ఇంద్ర ,విశ్వ దేవ,మిత్ర-వరుణ ,మరుత్తుల అశ్వినీ దేవతల స్తుతి మంత్రాలు . రెండేసి మంత్రాలు ఉషా ,సావిత్రి లనుద్దేశించినవి .వీటినన్నిటిని ‘’ఆత్రేయసం ‘’ అంటారు .రామాయణం లో సీతారామ లక్ష్మణులు అత్రిమహర్షి ఆశ్రమం సందర్శించి ఆశీస్సులు అందుకున్నారని తెలుసు .పురాణాలలో అత్రిపేరు సుప్రసిద్ధం వైఖానస ఆగమాలలో అత్రి ప్రాధాన్యం ఉంది ‘’.అత్రి సంహిత ‘’లో యోగ, నీతి ధర్మవిషయాలున్నాయి .ఇతరులకు అపకారం చేయకపోవటం బాధించకపోవటం దమము .ఉన్నదానితో కొంత ఇతరులకు సహాయం చేయటం దానము .అవతలివాడి దుఃఖాన్ని బాధను అర్ధం చేసుకొని సానుభూతి సహకారం అందించటం దయ
203-ఋగ్వేద మంత్రం ద్రష్ట -కశ్యప మహర్షి
సప్తర్హులలో ఒకరైన కశ్యప మహర్షి ఋగ్వేదం 8, 9, 10 మండలాల్లో చాలా మంత్రాలకు ద్రష్ట .బృహదారణ్యకోపనిషత్ లో 2-2-4 లో వశిష్ఠ ,విశ్వామిత్ర ,జమదగ్ని ,భరద్వాజ ,గౌతమ మునులతోపాటు కశ్యప ముని ప్రస్తావన ఉంది
204-అష్టా వక్ర గీత కర్త -అష్టావక్రమహర్షి -(బిసి 500-400 )
‘’అష్టావక్ర గీత ‘’జనక మహారాజు ఆస్థానం లో అష్టావక్ర మహర్షికి .జనక మహారాజు కు మధ్య జరిగిన అద్వైత విషయం చర్చ .ఇందులో 20 అధ్యాయాలున్నాయి .అవి సాక్షి ,ఆశ్చర్యం ,ఆత్మా ద్వైత ,సర్వమాత్మా ,లయ ,ప్రకృతేహ్ పరా ,శాంటా ,మోక్ష ,నిర్వేద ,వైరాగ్య ,చిద్రూప ,స్వభావ ,యథాసుఖం ,ఈశ్వర ,తత్త్వం ,స్వాస్థ్యము ,కైవల్య ,జీవన్ముక్తి ,స్వమహిమ ,ఆకి0చభావం.
8 రకాల అంగ వైకల్యం ఉన్నవాడు అష్టావక్రుడు .మాతామహుడు అరుణి .తాతవద్దే అతని తల్లి సుజాత తండ్రి కహోదలు కొడుకు కూడా వేద విద్య నేర్చారు అష్టావక్రుడు తల్లిగర్భం లో ఉండగానే తాత గారు చదివే వేద మంత్రాలు విని స్వరం తో సహా చక్కగా పలకటం నేర్చుకున్నాడు .ఒక రోజు తండ్రి కహోదుడు వేద మంత్రాన్ని అపస్వరం తో పలుకుతూ ఉంటె గర్భస్థ శిశువైన అష్టావక్రుడు దాన్ని సరిచేసి సరైన స్వరం తో పలికాడు ఆగ్రహోదగ్రుడైన తండ్రి పుట్టే కొడుకుని అష్ట వంకరలతో పుట్టాలని శపించాడు .అలా పుట్టినవాడే అష్టా వక్రుడు .మహాజ్ఞాన సంపన్నుడైన అష్టావక్రుడు గొప్ప మహర్షి అయ్యాడు .అద్వైత భావజాలాన్నిఅష్టావక్ర సంహిత లేక అష్టావక్ర గీతలో పొందుపరిచాడు .అష్టావక్ర గీతలో ఒకటి రెండు శ్లోకాలు చూద్దాం –
కధం జ్ఞాన మవాప్నోతి కధం ముక్తిర్భవిష్య తి -వైరాగ్యం చ కధం ప్రాప్త మేతత్ బ్రూహి మామ ప్రభో ‘’
2-ముక్తి మిచ్ఛన్తి కేతత్ విషయాన్ వివశ్వరన్ క్షమా ర్జవర – యశో సస్త్వం పోష్యమావజ ‘’
అష్టావక్రుడు తండ్రితో ఒకసారి జనక సభకు వెళ్లి అక్కడ అద్వైత చర్చలను చూసి వారిమీ రాదనీ చెప్పాడు నువ్వు చెప్పగలవా అంటే చెప్పగలనని ,అయితే తాను ఉండే చోటుకు వస్తే చెబుతానన్నారు .అలాగేనని అరణ్యం లో ఆయన ఉండే చోటును వెతుక్కుంటూ వెళ్ళాడు జనకుడు .దూరంగా ఆయన్ను చూడగానే గుర్రం కాలు పైకెత్తిఆగి పోయింది .అప్పుడు అదే భంగిమలో ఉన్న జనకునికి ఆత్మ బోధ చేశాడని ఒక కథ ఉంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-6-17-కాంప్-షార్లెట్-అమెరికా