గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
219-సన్మతి తర్క గ్రంథ కర్త -సిద్ధసేన దివాకరుడు (500-600 )
క్రీశ .-600 మధ్య బ్రాహ్మణకుటుంబం లో జన్మించినజైన సంస్కృత పండితుడు సిద్ధ సేన దివాకరుని గురువు వృద్దవాది .ఒక సారి గురువుతో తనకు ప్రాకృత భాషలో ఉన్న జైన గ్రంథాలన్నీ సంస్కృతం లోకి మార్చాలని ఉందని చెప్పగా ప్రాయశ్చిత్తంగా దేశం లోని జైన దేవాలయాలనన్నిటిని 12 ఏళ్లపాటు సందర్శించి రమ్మని ఆజ్ఞాపించాడు .అలా తిరుగుతూ ఉజ్జయిని లోని లింగ దేవాలయం చేరి కాళ్ళు లింగం పైన పెట్టి గుడిలో పడుకున్నాడు .భక్తులు ఫిర్యాదు చేయగా విక్రమాదిత్య మహా రాజు సిద్ధసేనుడినిచేసిన పాపానికి జైలులోపెట్టి కొరడాలతో కొట్టించాడు .గొప్ప మంత్రకారుడైన దివాకరుడు ఆ దెబ్బలు తనకు తగలకుండా రాణి కి తగిలేట్లు చేశాడు .దీనికి ఆశ్చర్యపడిన రాజు వదిలేయగా ఆగదిలో లింగాన్ని చేతులతో పీకేసి పార్శ్వ నాధ విగ్రహాన్ని దాని స్థానం లో ప్రతిష్టించాడు
జైనం లోని ‘’అనేకత్వ వాదం ‘’కు విశ్లేషణగా సిద్ధసేన దివాకర ‘’సన్మతి తర్కప్రకారణ ‘’రాశాడు .ఏడు గా ఉన్న జైన న్యాయాలను 1-ద్రవ్య శిక్షా న్యాయం 2-పర్యాయ శిక్షా న్యాయం అనే రెండుగా కుదించాడు .అసిత్వాన్ని నమ్మేవారు మొదటివిభాగానికి అది అశాశ్వతం అని నమ్మేవారు రెండవ దానికి చెందుతారు .తర్వాత ఈ రెండిటిని భారతీయ తత్వ శాస్త్రాలకు అనుసంధించాడు .సిద్ధ సేనుడు ఇదేకాక న్యాయావతారం కళ్యాణ మందిర స్తోత్రం కూడా రాశాడు ,
సన్మతి తర్కానికి స్వే తాంబర జైనా చార్య ‘’అభయ దేవుడు ‘’తత్వ బోధ విధాయిని ‘’వ్యాఖ్యానం రాశాడు .యితడు ప్రద్యుమ్న సూరి శిష్యుడు .సిద్ధసేనుని గ్రంధం అసలు పేరు ‘’సమ్మతి తర్క .ఇది ప్రాకృత భాషాపదం అందుకని ‘’సన్మతి తర్క ప్రకరణం ‘’అని తర్వాత సన్మతి తర్క ‘’అని వ్రాశాడు .ఆర్యా వృత్తం లో సంస్కృత శ్లోకాలలో ఈ గ్రంధం ఉన్నది .కొన్ని అనుష్టుప్ ,ఉపజాతి లను కూడా వాడాడు .ఉపోద్ఘాతం లో 166 శ్లోకాలున్నాయి .ప్రపంచసార లాగా మూడు భాగాల గ్రంధం .మూడు అధ్యాయాలను కాండాలు అన్నాడు వాటిలోని విషయం వివరణ ముందు చెప్పలేదు .రెండవది న్యాయకాండ మూడవది జీవ కాండ .సన్మతిలోని ప్రతిదానిని సుత్త అని గాధలను కూడా అదేపేరుతో చెప్పాడు .అనేకాంత ,ఏకాంత వాదాలపై విస్తృత చర్చ చేశాడు .ఆయన రాసిన ద్వా త్రి0సి కాలను ‘’ద్వా ‘’అనే పేర్కొనితన జీవిత వివరాలు వివరాలు రాశాడు
సిద్ధసేనుడు జైన బ్రాహ్మణుడు వేదం శాస్త్రాలను మహా యాన బౌద్దాన్నిముఖ్యంగా ఆజీవక సిద్ధాంతాన్ని బాగా అధ్యయనం చేశాడు .దయా దాక్షిణ్యాలున్నవాడు .ప్రతిదానిని నిశిత పరిశీలనం తో చూసే దృష్టి ఉన్నవాడు .తర్కం తో దేనినైనా అర్ధం చేసుకునేవాడు కుదరకపోతే విశ్వాసాన్ని అనుసరించాడు .అనేకమందిరాజులతో తత్వ వేత్తలతో గాఢమైన అనుబంధం ఉన్నవాడు .మహా జ్ఞాని -జీనియస్ గా గుర్తింపు పొందాడు .గొప్ప సృజన శీలి .మహా వీరుని అనుసరించటానికి కారణం విశ్వాసమేకాక అందులోని తర్క విధానం అని చెప్పాడు
ఈ ద్వాత్రి0శిక లు సంస్కృతం లో ఉన్నా అత్యున్నత తత్వ సారంగా ఉంటాయి .అలంకారాలతో పరిపుష్టమైన శైలీ విన్యాసం తో భాసిస్తాయి .కాళిదాసుని వైదర్భీ రీతి ఉంది .వీటిలో 17 రకాల ఛందస్సులను వాడాడు ఇందులోని 1 నుంచి 5 ,11 ,21 ఉన్న 7 కూడా స్తుతులు 6,8 విశ్లేషణాత్మకమైనవి .మిగిలినవి వేదాంత త త్వ బోదకాలు సమంత భద్రుని స్వ యం భూ స్తోత్రం లో ముందుమాట స్వయం భూ చివరిమాట సమంత భద్ర ఉన్నట్లే ఈ ద్వా లలో కూడా మొదట స్వయంభు చివర సిద్ధ సేన ఉంటుంది .మూడవ దానిలో లో మహావీరుని ‘’పురుషోత్తమ ‘’అన్నాడు 4 వ ద్వా ను ‘’వైతాళీయ ఛందస్సులో రాశాడు .ఇది కుమారసంభవం 4 రఘువంశం 8 సర్గలను గుర్తుకు తెస్తుంది .మొత్తం మీద ఈ అన్ని ద్వాలలో మహావీర స్తోత్రమే దర్శనమిస్తుంది .ఈ విషయాలన్నీ ‘’సన్మతి తర్క ‘’ ఉపోద్ఘాతం లో శ్రీ సుఖ లాల్ శ్రీ బేచార్ దాస్ లు విస్తృత పరిశోధన చేసి ఆంగ్లంలో రాసిన విషయాలు .సిద్ధ సేన దివాకరుని సన్మతి తర్కం లో ఒక శ్లోకం చూద్దాం –
1-సిద్ధం సిద్ధాత్సాగం థాసా భగవోపమఅవగయాసాం-కుసుమయావి సాసగం జినాసం భావ జిఘాంసః ‘’ భావం -జనులు బోధించిన ద్వేష అనురాగాలను జయించాలన్న భావాలు ఉత్కృష్టమైనవి .ఏవ్ ఆ మాటేగాం లో నడిచేవారికి రక్షకాలు అనతత్వాన్ని కాదన్నవారికి ఇవే సమాధానాలు .
220-పార్శ్వ నాధ చరిత్ర రాసిన -సాగర చంద్ర (1252-1276 )
నేమి చంద్ర శిష్యుడు మాణిక్య చంద్ర గురువు అయిన సాగర చంద్ర పార్శ్వనాధ చరిత్ర ,కావ్య ప్రకాశం సంకేతం రాశాడు ఇతనిని సాగరేందు అని గుణసాగరుని గురువని అంటారు
221-యతి జీ తక వ్రుత్తి కర్త -సాధురత్న సూరి-(1456 )
1456 లో యతి జీ తక వృత్తి రాసిన సాధురత్న సూరి దేవ సుందర సూరి శిష్యుడు.ఉపోద్ఘాతం లో ‘’జినరత్న గుణి క్షమా శ్రమనుడు ‘’సంక్షిప్త జీతకల్ప రచయిత అని చెప్పాడు .సోమప్రభ దీన్ని పెంచి రాస్తే సోమతిలకుఁడు వ్యాఖ్య రాశాడు .దేవ సుభద్రుని శిష్యుడని యతి జీత కల్ప వృత్తి కర్త అని రాశాడు
222-సాంబ పంచాశిక కర్త -సాంబ
సూర్య స్తోత్రం అనే సాంబ పంచాశిక రాసిన సాంబ సూర్య ద్వాదశార్య ,సూర్య సప్తార్యలకూ కర్త
223-సింహ తిలక సూరి (1345-1395 )
ధర్మ ప్రభ సూరి శిష్యుడు ,మహేంద్ర ప్రభ గురువు అయిన సింహ తిలక సూరి అంచలగచ్ఛ ఆశ్రమవాసి .అంచల గచ్ఛ పత్రావళి ఉన్నదానిప్రకారం 1345లో పుట్టి ,1352లో దీక్ష పొంది 1371లో ఆచార్యుడై 1393 లో గచ్ఛ నాయకుడై 1395 లో చనిపోయాడు .
224-ఉపమితాభవ ప్రపంచ కర్త-సిద్ధ ఋషి (950
962 లో ఉపమితాభవ ప్రపంచ రాసిన సిద్ధ ఋషి తన గురుపరంపరను -సురాచార్య దెల్లమహా త్తార ,దుర్గాస్వామి ముసద్దర్శి శిద్దర్శి గా పేర్కొన్నాడు .దీక్షా గురువు గర్గుడు
225-వ్రి హాతి క్షేత్ర సమాస వృత్తి కర్త -సిద్ధ సూరి (1170)
యూకేశ గచ్ఛకు చెందిన ఈకవి 1192 లో వ్రిహాతి క్షేత్ర సమాస వృత్తి రాశాడు .యూకేశాపురీయా గచ్చలోని గురువులు కక్క సూరి ,సిద్ధ సూరి ,దేవ గుప్త సూరి.గురువు సోదరుడుయశోదేవ ఈగ్రంధానికి విషయం వివరణ అందించాడు .సిద్ధ సూరి కక్క సూరి శిష్యుడు దేవ గుప్త సూరికి గురువు
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-14-6-17-కాంప్-షార్లెట్-అమెరికా
—