మహాన్యాస పూర్వక శ్రీ రుద్రాబిషేకం ,శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం
27-6-17 మంగళవారం షార్లెట్ లో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో మా దంపతులచేత ఉదయం 7-30 నుండి 10 గంటలవరకు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వార్లకు అష్టోత్తర సహస్రనామార్చన అనంతరం ‘’పంచాగ రుద్ర పంచముఖ ధ్యాన ,న్యాస పూర్వక సంపుటీ కరణ ,దశాంగ రౌద్రీకరణ షోడశాంగ రౌద్రీకరణ,ఆత్మరక్షాయుక్త శివసంకల్ప ,పురుషసూక్త అష్టాంగ ప్రణమ్య రుద్రార్చన స్నానాది ప్రయోగ ,దశశాంతి ,సామ్రాజ్య పట్టాభిషేక సమేత మహన్యాస పూర్వక శ్రీ రుద్రాభిషేకం ,అనంతరం శివ అష్టోత్తర ,సహస్ర నామ అర్చన ,బిల్వాష్టోత్తర పూజ నిర్వహింపబడును ..
ఉదయం 10 గం నుండి 12 -30 వరకు నవగ్ర అష్టోత్తర పూజలతో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం, స్వామివార్లకు అశోత్తర సహస్ర నామ పూజ జరుప బడును .
గబ్బిట దుర్గా ప్రసాద్ -షార్లెట్ -అమెరికా