గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
231-పుష్పదంత భూత బలి ఆచార్యుల -శతఖండాగమం(క్రీ. శ 160 )
క్రీశ160 లో దిగంబర జైనమతానికి చెందిన ఆచార్యులు పుష్పదంతుడు భూతబలి ‘’శతఖండాగమం ‘’రాశారు .దీన్ని మహాకర్మ ప్రభూత అంటారు .రెండవదైన ‘’పూర్వాగమం ‘’ను ఆగ్రయ నియ అంటారు .ఇది 6 భాగాల ఉద్గ్రంధం దీనికి ఆచార్య వీరసేనుడు780 లోరెండు వ్యాఖ్యలు -మొదటిదానిపై దావ టీకా రెండవదానిపై మహాధావ టీకా రాశాడు .అయిదవ పూర్వాగ మంలేక జ్ఞాన ప్రవాదం పై గుణధరా చార్య ‘’కశ్య పహుద్ ‘’రాశాడు .వీరసేనుడు ,శిష్యుడు జైన సేనుడు దీనికి వ్యాఖ్యను 780 లో రాశారు
232- సమయ సార కర్త – ఆచార్య కుంద కుంద (క్రీశ. 100 )
క్రీశ 1 వ శతాబ్దిలో ఆచార్య కుంద కుంద ఆత్మ తత్త్వం పై ‘’సమయ సార’’గ్రంధాన్ని ,సుశిక్షిత న్యాయం పై ‘’నియమసార ‘’పంచాస్తికా సార గ్రంధాలు రచించాడు.
233-గొమ్మట సారకర్త -నేమి చంద్ర (క్రీశ.1000 )
క్రీ శ 10 వ శతాబ్దం లో ఆచార్య నేమి చంద్ర 1 ద్రవ్య సంగ్రహ 2 గొమ్మట సార అనే జీవ కాండ ,కర్మకాండ లకు సంబంధించిన గ్రంధాలు రాశాడు .ఇవికాక త్రిలోక సార ,లబ్ధిసార క్షిపణ సార గ్రంధాలూ రాశాడు .జైనాచార్యులలోనేమిసార కు అగ్రాసనాధిపత్యం ఉన్నది .ఈయనకే ‘’సిద్ధాంత చక్రవర్తి ‘’అనే పేరుంది .చాముండరాయ కు గురువు . నేమి ఆచార్యకు కర్ణాటకలో షిమోగా లో నగర్ తాలూకా పద్మావతి దేవాలయం లో ఒక శాసనం విగ్రహం ఉన్నాయి .చాముండ రాయ కోరికపై నేమిచంద్రాచార్య జైనమత ముఖ్య ఆచార్యుల జీవిత చరిత్రలను ‘’గొమ్మట సార’’గా రాశాడు . 3-3-980 లో జరిగిన గోమఠేశ్వర విగ్రహ అభిషేక కార్యక్రమం లో నేమి ఆచార్య పాల్గొన్నాడు .ఈయన రచన ద్రవ్య సంగ్రహం జైనులకు అతి పవిత్ర గ్రంధం .తిలోయ ప్రణతి ఆధారంగా త్రిలోక సారం రాశాడు .పైన చెప్పినవే కాక ‘’ప్రతిష్ఠిత పదం ‘’,ప్రతిష్ఠిత తిలకం ‘’కూడా నేమి ఆచార్య రచించాడు.
234-జైన నియుక్తి గ్రంథ రచయిత -భద్ర బాహు (బిసి 300 )
జైనాచార్యులలో చిట్టచివరి ‘’సూత్ర కేవలి ‘’అంటే జైన గ్రంధాలనన్నిటిని కంఠతా బట్టినవాడు గా భద్ర బాహు ఆచార్యకు పేరుంది .ఈ గ్రంధాలపై ఆయన రాసిన వ్యాఖ్యానాలు ‘’నియుక్తి ‘’పేరుతొ పిలువబడుతున్నాయి .న్యాయసంబంధ కేసుల విషయాలపై ‘’సంహిత ‘’రాశాడు .మొదటి శతాబ్దం లో ఉమాస్వాతిరాసిన ‘’తత్వార్ధఆగమ సూత్రం’’, లో జైనానికి సంబంధించిన ప్రాధమిక విషయాలున్నాయి 8 వశతాబ్దికి చెందిన హరిభద్రుడు ‘’యోగ ద్రుష్టి సముచ్చయం ‘’రచించాడు.
235-12 జైన ఆగమాలు రచించిన’’జైన చిరంజీవి ‘’ -సుధర్మ స్వామి (బిసి 607-507 )
జైన మహావీరునికి 5 వ గణదారుడు క్రీపూ 607-507 కు చెందిన సుధర్మ స్వామి .క్రీపూ 615 లో ఆత్మజ్ఞానం పొంది 507 లో నూరవ ఏట నిర్వాణం చెందాడు . జైన చిరంజీవులలో సుధర్మ స్వామి చివరివాడుగా భావిస్తారు .ఈయనతర్వాత జంబుస్వామి ఉత్తరాధికారి అయ్యాడు .సుధర్మ స్వామి మహా వీరుని బోధలను 12 భాగాలైన జైన ఆగమాలుగా రచించాడు .శిష్యుడు జంబుస్వామి అడిగిన ప్రశ్నలకు సుధర్మస్వామి చెప్పిన సమాధానాల ‘’ప్రశ్నోత్తరావళి ‘’అన్నమాట .ఇవి ఆద్యంతాలు లేని సత్యం యొక్క విషయం విచారణ ఇది .మహావీరుని చివరి శిష్యుడే సుధర్మ స్వామి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-6-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
సుధర్మ స్వామి
—