గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
241- పంచాంగం రాసిన -పండిత ఆనంద శాస్త్రి (1940
కాశ్మీర దేశం లో పంచాంగం రాసి కాశ్మీర్ పండుగలను ఉత్సవాలను జన నుండి అంత్యేష్ఠివరకు జరపాల్సిన కర్మకాండలు రచించటమేకాక ఆడియో కేస్ట్స్ గా తెచ్చిన ఘనత పండిత ఆనంద శాస్త్రి ది .ఆయన రాసిన పంచాంగం అత్యంత నిర్దుష్టమైనదిగా ప్రశస్తి పొందింది .ఆయన రచించిన ‘’విజయేశ్వర జంత్రి ‘’బాగా ప్రచారమైంది .కాశ్మీర్ పండిట్లను అక్కడినుంచి తరిమేసే ప్రయత్నం విస్తృతంగా జరుగుతున్నప్పుడు ఆయన వారు ఎక్కడ ఉన్నా అవలంభించాల్సిన విధులన్నీ ఇందులో పొందు పరచాడు .అదే ఇప్పుడు వారికి కరదీపికగా నిలిచింది . 1989లో పండితులను కాశ్మీర్ నుంచి బయటికి నెట్టి వేస్తున్న సందర్భం లో ఆయన తీవ్రంగా ఆలోచించి పండితులు ప్రవాసం లోకూడా అను సారించాల్సిన విధి విధానాలు ఇందులో రాశాడు .ఆడియో కేస్ట్లు కరపత్రాలు అందుబాటులోకి తెచ్చాడు సంప్రదాయం అవిచ్చిన్నంగా కొనసాగాలన్న ఆయన తపన అత్యంత శ్లాఘనీయం .కర్మకాండ దీపికా ,శివరాత్రిపూజ ,శాండీయ ,అంతిమ సంస్కారం జన్మదిన పూజ లు కాశ్మీర్ పండితులకు ప్రవాసం లో గొప్ప మార్గ దర్శకాలైనాయి .శాస్త్రి పంచస్తవి భవాని సహస్ర నామం ,మహిమాపార్ ,భగవద్గీత లల్లేశ్వరి వాక్యాలపై తన స్వరం తో తెచ్చిన ఆడియో కేసెట్లు ప్రతి పండిత కుటుంబం లోనూ మారు మోగుతాయి .కాశ్మీరీ భాష ను నేర్వటం మాట్లాడటం రాయటం మరిస్తే జరిగే అనర్ధాన్ని ఎలుగెత్తి చాటి భాషను కాపాడుకోవాల్సిన అవసరాన్ని చెప్పాడు శారదా లిపి ని సంస్కరించి ఆధునికతర పండిట్లకోసం ‘’శారదా ప్రయిమర్ ‘రాసిన భాషా సంస్కృతీ అభిమాని
కాశ్మీర పండిత సంప్రదాయానికి నిలువెత్తు దర్పణంపండిత ఆనంద శాస్త్రి .వేషధారణలో భాషలో కాశ్మీర పండితుని లక్షణాలన్నీ కొటొచ్చినట్లు కనిపిస్తాయి .పండిత వస్త్ర ధారణను ‘’ఫెరేన్ ‘’అంటారు ’.తలపై టర్బన్ ఉంటుంది .ఆయన ఇంట్లో చదువుకొనే ,రాసుకొనే గదికూడా సంప్రదాయానికి మచ్చు తునకగా ఉంటుంది .బీరువాలు షెల్ఫ్లులు కుర్చీలు సోఫాలు ఉండవు .కింద కూర్చుని రాసుకొనే వ్రాత బల్ల మాత్రమే ఉంటుంది .ఆయన దిన చర్య అత్యంత క్రమ బద్ధంగా ఉంటుంది .అయన ముఖం లో వేద విజ్ఞాన జ్యోతి దర్శన మిస్తుంది .కనులలో కాంతి మిరుమిట్లు గొలుపుతుంది .ఆయనతో మాట్లాడటమే గొప్ప ఎడ్యుకేషన్ . ఇంత గొప్ప పండితుని జీవిత వివరాలు తెలియకపోవటం విచారకరమే
242- భవానీ నామ సహస్ర స్తుతి కర్త -జానకీనాధ కౌల్ (కమల్ )(1914
కమల్ కలం పేరుగా రచనలు చేసిన జానకీనాధ కౌల్ శ్రీనగర్ లో 1914 లో జన్మించాడు .సంస్కృత కాశ్మీరీ ఆంగ్లలలో అనేక సుప్రసిద్ధ రచనలు చేశాడు .చిన్నప్పుడే తలిదండ్రులను కోల్పోయి అనాథఅయి ,బడికి వెళ్లి చదువుకొనే స్థితిలేక స్త్రీ సంక్షేమ శాఖలో కొద్దికాలం పని చేసి పొట్టపోసుకొని ,30 వాత టీచర్ గా డి .ఎ .వి .ఇన్స్టి ట్యూట్ లో పనిచేసి ,జూనియర్ లెక్చరర్ అయి ,క్రమంగా సంస్కృతం లో బి ఏ, ఏం ఏ ప్రభాకర డిగ్రీలు పొంది ,శ్రీనగర్ లో పరమానంద రీసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ లో రీసెర్చ్ ఆఫీసర్ గా చేరి శ్రీరామ కృష్ణ ఆశ్రమ పత్రికకు సంపాదకుడై విశిష్ట సేవలు అందించాడు
ఆధ్యాత్మిక విషయాలలో ఆరితేరి ,తనకున్న విశిష్ట సంస్కృత విజ్ఞానంతో శైవ శాక్తేయాలను తంత్ర విద్యా శాస్త్రాన్ని అధ్యయనం చేసి అసలైన జిజ్ఞాసువు భక్తుడై స్వామి రామ తీర్ధ రాసిన గ్రంధాలు చదివి కవి గా తన సత్తా చాటాడు .నీల కంఠ పండితుని ఆశ్రయం లో భగవద్ గీతాధ్యయనం చేసి శంకర ,శంకరానంద భాష్యాలు జీర్ణం చేసుకొని నీలకంఠ ప్రభుత్వ సర్వీస్ నుంచి రిటరయి ఋషీకేశ్ చేరి స్వామి శివానంద గా సన్యాసం దీక్ష పొంది అక్కడ శివానందాశ్రమమం నెలకొల్పాడు .వెళ్లేముందు శాస్త్రిని మరొక గొప్పపండితుడు స్వామి లక్ష్మణ జూ కు అప్పగించివెళ్ళాడు .స్వామి మహాసమాధి చెందాక ఆయన జీవితం పై అనేక వ్యాసాలూ భ క్తి గీతాలు చాలా పత్రికలకు రాశాడు
లక్ష్మణ జూ తో ఉన్న గాఢ అనుబంధం వలన ఆధ్యాత్మికత మరింతగా పెరిగి సంస్కృత ఆంగ్లాలో భక్తి కవిత్వం పారించాడు .అవి వివిధ జర్నల్స్ లో పరుచురితమైనాయి .తర్వాత కాశ్మీర శైవం పా అభిరుచి కలిగి దాని ఆవిర్భావం గురించి పరిశోధన చేసి రాయటమేకాక అనేక శైవ గ్రంధాలకు వ్యాఖ్యానాలు రాశాడు .ప్రాణాయామ ,ధ్యానాలపై పుస్తకాలు రాశాడు ..ఆశ్రమానికి దగ్గర లో ఉన్న ఈషాబీర్ నుండి ‘’విద్యారణ్య పంచదశి ‘’అభ్యసించాడు .సృజనకర్త గా వ్యాఖ్యానకర్తగా అనువాదకునిగా కౌల్ ప్రజ్ఞ అసాధారణమై భాసించింది .జీవితం మొదట్లో పొందిన కస్టాలు మరచిపోయి జీవితాలకు ఉపయోగపడే అద్భుత రచనలు చేశాడు .ఆయన కవిత ‘’శివ శంకర సాంబు ‘’బాగా ప్రసిద్ధమైంది
జానకీ నాధా కౌల్ ప్రతిభాసర్వస్వ0 గా ఆయన రాసిన ‘’భవానీ నామ సహస్ర స్తుతి ‘’,ని భావిస్తారు ఇది ఇంగ్లిష్ ,హిందీలలోకి అనువాదం పొందింది .దీనికి వ్యాఖ్యానమూ రాశాడు ..రెండవది ‘’శివ సూత్రం విమర్శ ‘’అనే హిందిగ్రంధం 3 పంచస్తవి కి ఆంగ్లానువాదం వ్యాఖ్యానం రాశాడు .కౌల్ గ్రంథ రచనకు రామకృష్ణ మతం అధిపతి స్వామి రంగనాథానంద ప్రశంసించారు
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-6-17 కాంప్-షార్లెట్ -అమెరికా
పండిట్ కౌల్ పండిట్ ఆనంద శాస్త్రి
—