గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
248-కాతంత్ర ,చంద్ర ,కలాప వ్యాకరణ విధాన నిధి -పండిత దీనా నాధ్ యక్ష (1921
పండిత దీనానాధ యక్ష12-6-1921న కాశ్మీర్ లో పండిత కుటుంబం లో జన్మించి పంజాబ్ యుని వర్సిటీ నుంచి సంస్కృత శాస్త్రి డిగ్రీ పొంది ,ఆకాలపు మహోన్నత సంస్కృత విద్యా వేత్తలతో గాఢ సాన్నిహి త్యం సాధించి స్థానిక పాఠశాలలో కర్మ కాండ నేర్చి ,పండిట్ రామ్ జూ కోకిలూ , పండిట్ రఘునాధ కోకిలూ ల వద్ద వ్యాకరణం అభ్యసించి పండిత కేశవ భట్ జ్యోతిష దగ్గర జ్యోతిషం నేర్చి ,పండిట్ పరశురామ్ శాస్త్రి పండిట్ కాకారాంశాస్త్రిల దగ్గర అడ్వాంస్డ్ సంస్కృతం వ్యాకరణాలలో నిష్ణాతుడై ,పండిట్ ఆనంద కాక్ , ,పండిట్ నాధ్ రామ్ శాస్త్రిల సమక్షం లో న్యాయ శాస్త్రం కావ్య శాస్త్రం నేర్చి శాస్త్రి డిగ్రీ అందుకున్నాడు .సంస్కృత భాషా సాహిత్యాలపై అమేయ మైన పట్టు సాధించి కాశ్మీర్ రాజ్య శాస్త్ర శిరో భూషణుడయ్యాడు
1945 లో సంస్కృత రీసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ లో కాపీయిస్ట్ గా చేరి ,1976 లో హెడ్ పండిట్ గా రిటైరయ్యాడు .తాను చేరినప్పుడు 213 మాత్రమే ఉన్న సంస్కృత గ్రంథ వ్రాత ప్రతులను 5000 వరకు తన నిత్య పరిశోధనా కృషివలన చేర్చి కీర్తి పొందాడు .ఇక్కడే తన సంపాదకత్వం లో రామ చంద్ర సూరి రచన ప్రభావతి ప్రద్యుమ్న సంస్కృత నాటకం,సుఖానంద జాదూ కృతి శివ సూత్ర వివరణ ,వాసుదేవకవి రాసిన శివ సూత్రవివరణ మంసారాం మోంగా కృతి స్వతంత్ర దీపికా ,నీలకంఠుని భవ చూడామణి ,క్షేమరాజకృతి శివ సూత్ర విమర్శిని ,విద్యాకంఠుని తంత్ర గ్రంధం భావ చూడామణి ,ఈశ్వర కౌల్ కాశ్మీర్ దుర్భిక్షం పై రాసిన ‘’దుర్భిక్షితా దరుదయ మొదలైన అమూల్య గ్రంధాలను లోకానికి అందించాడు .లెక్కకు మించి విమర్శనా వ్యాసాలను సంస్కృత హిందీ ,ఇంగ్లిష్ లలో రాసి ప్రచురించిన నిత్య పరిశీలనా శీలి .రీసెర్చ్ సెంటర్ ప్రచురించి లైబ్రరీకి అందజేసిన వ్రాత ప్రతుల కేటలాగ్ కు సహ సంపాదకత్వం వహించాడు
తర్వాత స్ట్రాల్ ఏషియన్ స్టడీస్ కేంద్రానికి రీసెర్చ్ అసోసియేట్ గా ఐదేళ్లు సేవ లందించాడు .పిమ్మట ఆర్కీలాజికల్ డిపార్ట్ మెంట్ లో ఒక ఏడాది పనిచేశాడు .భారత ప్రభుత్వ సంస్కృత సంస్థాన్ లో ఐదేళ్లు పనిచేసి తన విద్వత్ కు తగిన ‘’శాస్త్ర చూడామణి ‘’ఫెలోషిప్ పొందాడు .ఇంతటి సాహిత్య పిపాసి తనఇంటి లైబ్రరీలో సేకరించి భద్ర పరచుకున్న 9 వేల ప్రచురణ గ్రంధాలను ,500 ల అపూర్వ అత్యంత విలువైన సంస్కృత గ్రంథ వ్రాత ప్రతులను వదిలేసి 1990 లో ఉగ్రవాదుల దాడులకు భయపడి ప్రవాసానికి పారిపోవాల్సిన దుస్థితి కలిగింది . ఆ కాశ్మీర శారదా మాత ఎంత గా దుఖిచిందో ఊహ కు అందరాని విషయం.
కాశ్మీరు పండితులు పాణిని నుంచి అందరూ గొప్ప వ్యాకరణ వేత్తలు ,ఆ సంప్రదాయాన్ని అవిచ్చిన్నంగా కొనసాగించిన అపార పాణినీ మూర్తులు .పండిత దీనా నాధా యక్ష అపూర్వ వ్యాకరణ సంప్రదాయాలైన కాతంత్ర ,చంద్ర, కల్ప విధానాలపై సాధికారత సాధించాడు .కాశ్మీర్ సంస్కృతీ వేదాంతం హిస్టరీ జాగ్రఫీ లంటే ఆయనకు మహా ప్రాణం .ఆయన ప్రసంగాలలో ,వ్రాతలలో తరచుగా రాజతరంగిణి, నీల కంఠ మత శ్లోకాలను ఉల్లేఖించేవాడు .పతంజలి మహా భాష్యాన్ని చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు .ఆయన సంస్కృత రచన భవభూతి బాణ ,శ్రీ హర్షుల శైలి ఉంటుంది .వ్యాకరణ మంటే కీకారణ్యమే .అందులోకి ప్రవేశం దుర్లభమనిపిస్తుంది .దాన్ని బోధించటమూ కష్టమైన పనే .దాన్ని అత్యంత సులభంగా కరతలామలకం గా బోధించే నేర్పుఉన్నవాడు పండిట్ దీనానాధా యక్ష .తాను ఈ బోధనా శైలిని ప్రముఖ కాశ్మీర్ కవి సాహిబ్ కౌలా నుంచి నేర్చుకున్నానని కృతజ్ఞతగా చెప్పుకున్నాడు .
లైబ్రరీలోని మేక్ బెత్ నాటకం చదివి ఆంగ్లం పై దృష్టిపడి ,ఆంగ్ల సాహిత్యాధ్యయనం చేసి షేక్స్పియర్ సాహిత్యాన్ని అంతటినీ సంస్కృతీకరించిన విద్యా వేత్త .ఆంగ్లాన్ని సంస్కృతం ద్వారా నేర్చిన మహాజ్ఞాని .సాంప్రదాయ పండితుడైన భావాలలో ఆధునికత ,శాస్త్రీయత ఉన్నవాడు .కాశ్మీర్ శైవం లోని క్రమ సిద్ధాంతాన్ని ఎందరో విద్యార్థులకు బోధించి రీసెర్చ్ కు గైడ్ గా ఉన్నాడు ‘’.ఇండియన్ కావ్య లిటరేచర్ ‘’రచయితఏ కె వార్డ ర్ తో కలిసి పనిచేశాడు .ఆయన కాశ్మీర్ శారదామాత దివ్య కంఠా భరణం .
249- ప్రౌఢ లేఖక్ –పండిట్ దామోదర్ (1870)
కాశ్మీర్ మహారాజా’’ మదర్సా ‘’ ముఖ్య ఉపాధ్యాయుడైన సాహెబ్ రామ్ కుమారుడు దామోదర్ సంస్కృతం లో .మహా మేధావి సూక్ష్మగ్రాహి మహా వక్త వ్రాయసగాడు గా ప్రసిద్ధి చెందాడు .వ్యాకరణ న్యాయ శైవాలలో అఖండ పాండిత్యమున్నవాడు .సంస్కృత కావ్యాలను ఆయన శ్రావ్యమైన కంఠం తో గానం చేస్తూ వ్యాఖ్యానిస్తుంటే శ్రోతలకు పరవశం కలిగేది .మంచికవి అయిన దామోదర్ రాజతరంగిణిని కొనసాగించి పూర్తి చేయలేకపోయాడు . ‘’లేఖా సాహిత్యాన్ని ‘’సుసంపన్నం చేసి ‘’ప్రౌఢ లేఖక్ ;;గా గుర్తింపు పొందాడు .శ్రీహర్ష ,బాణ ,సుబంధు కావ్య మాధుర్యాన్ని జుర్రి అందరకు జున్నులాగా పంచిపెట్టిన వాడు .కాశ్మీర పండిత విద్యావేత్తగా గుర్తింపుపొందారు .ఈయన సోదరుడు దయారామ్ హిస్టరీ జాగ్రఫీలలో నిధి .బూలర్ దామోదర్ ప్రజ్ఞను ప్రశంసిస్తూ “produce Sanskrit prose or verse alike from the sleeve of his garment.”అన్నాడు .నీలమాత పురాణం ఆహటాయసం రాజా తరంగిణి లలోని చారిత్రిక భౌగోళిక విషయాలను అతి సునాయాసంగా అందరకు అర్ధమయ్యే రీతిలో రాశాడు .పండిట్ దామోదర్ చాలాకాలం బ్రతికి ఉంటెకల్హణుడు రాసిన రాజతరంగిణి ఇతని రచనతో పూర్తి అయి ఉండేదని అరుల్ స్టెయిన్ అభిప్రాయం పడుతూ ‘’”Had Pandit Damodar been spared to complete it, his work would have shown that Kalhana could have found generations past no worthier successor.”అన్నాడు .
250-పాదేయ శతక కర్త -డా. రామ్ కరణ్ శర్మ(1927
ప్రఖ్యాత సంస్కృత విద్యావేత్త ,కవి డా రామ్ కరణ్ శర్మ 20-3-1927లో బీహార్ లోని శరన్ జిల్లా శివపురిలో జన్మించాడు .పాట్నా యూనివర్సిటీనుంచి సంస్కృత ఏం ఏ డిగ్రీ బీహార్ సంస్కృత సంస్థనుంచి సాహిత్యాచార్య వేదాంత శాస్త్రి న్యాయ వ్యాకరణ శాస్త్రి బిరుదుల0దు కొన్నాడు .అమెరికాలోని కాలిఫోర్నియా యుని వర్సిటీనుండి పిహెడి పొంది ప్రొఫెసర్ ఏం బి ఎమెన్యు తో కలిసిపనిచేశాడు .చికాగో కొలంబియా కాలిఫోర్నియా వర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్ .2006 లో ఢిల్లీ లో స్థిరపడ్డాడు
శర్మ సంస్కృతాంధ్రాలలో చాలా రచనలు చేశాడు .సంస్కృతం లో ‘’సంధ్య ‘’కవితా సంపుటి ,పాధేయ శతకం ,వీణ నవలలుగా రాయిసా ,సీమ లు రాశాడు భారతీయ కావ్యాలు వైద్య గ్రంధాలు ,పురాణాలను అనువదించాడు వందలాది రీసెర్చ్ పేపర్లు రాసి ప్రచురించాడు . ఆంగ్లం లో ‘’ఎలిమెంట్స్ ఆఫ్ పోయెట్రీ ఇన్ మహా భారత ‘’అనే గ్రంధం రాసి భారతం ఉపమా రూపకాలంకారాలను విశ్లేషించాడు .పణిక్కర్ రాసిన ‘’యాంథాలజి ఆఫ్ మిడీవల్ ఇండియన్ లిటరేచర్,శివ సహస్రనామ శతకం శివ సుకీయం గగనావని, చరక సంహిత మొదలైన వాటికి సంపాదకత్వం వహించి వెలువరించాడు .సంస్కృతం పై అనేక అంతజాతీయ సెమినార్లు నిర్వహించాడు . 1889 లో సాహిత్య అకాడెమీ అవార్డు ,భారతీయ భాషా పరిషత్ అవార్డు ,ఢిల్లీ సంస్కృత అకాడెమీ అవార్డు , 2005 లో కృష్ణకాంత హాండీకి అవార్డును ప్రధాని మన్మోహన్ సింగ్ నుండి పొందాడు .ఈ అవార్డు అందుకున్న రెండవ అరుదైన వ్యక్తి రామ్ కరణ్ శర్మ .రాయల్ ఏషియన్ సొసైటీ ఫెలో .అమెరికన్ ఓరియంటల్ సొసైటీ మెంబర్ .బీహార్ ప్రభుత్వ సివిల్ సర్వీస్ లో ఉద్యోగించి అనేక ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలనుండి లెక్కలేనన్ని పురస్కారాలందుకొన్న సాహితీమూర్తి శర్మ
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-6-17 -కాంప్-షార్లెట్-అమెరికా
dr. ramkaran sharma పండిట్ దీనానాధా యక్ష
—