గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
255-శాసన లిపి పరిశోధకుడు -పద్మ భూషణ్ -వాసుదేవ విష్ణు మిరాశి(1893-1985 )
వాసుదేవ విష్ణు మిరాశీ 3-3-1893 న మహారాష్ట్ర రత్నగిరిజిల్లా దియోగఢ్ తాలూకా కువెల్ గ్రామం లో జన్మించాడు కొల్హాపూర్ లో ప్రాధమిక విద్య నేర్చి ,పూనా వెళ్లి డిగ్రీ తర్వాత సంస్కృతం లో 1917 లో డెక్కన్ కాలేజీ నుంచి మాస్టర్ డిగ్రీ అందుకొన్నాడు .బొంబాయి వెళ్లి ఎల్ఫీన్స్టన్ కాలేజీలో సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు . 1919 లో నాగపూర్ మారిస్ కాలేజీ లో సంస్కృత పీఠాధ్యక్షుడై 1942 లో ప్రిన్సిపాల్ గా ఎదిగి ,1947-50 కాలం లో అంరోతి లోని విదర్భ మహా విద్యాలయ ప్రిన్సిపాల్ చేశాడు . 1957 నుంచి 1966 వరకు నాగపూర్ యుని వర్సిటీలో ఆనరరీ ప్రొఫెసర్ ఫర్ యేన్షెన్ట్ కల్చర్ గా ,పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ ఇన్ హ్యుమానిటీస్ శాక్షాధ్యక్షుడుగా సేవలందించారు .
30 కి పైగా రీసెర్చ్ పేపర్లు ,275 కు పైగా ఇండాలజీ పేపర్లు వివిధ పత్రికలకు రాశాడు ;శాసన లిపి పరిశోధనలో తీవ్ర కృషి చేసి 1955 లో కాల్చురీ చేది వంశ రాజ్య పాలన ,1963 లో వాకాట రాజచరిత్ర ,1977 లో స్లి0హార శాసన విషయం ,శాతవాహన ,క్షాత్రప రాజుల చరిత్ర శాసనాలనాధారంగా వివరించాడు .ఇతర రచనలు ;;లిటరరీ అండ్ హిస్టారిక్ స్టడీస్ ఇన్ ఇండాలజీ ,కాళిదాస ,భవభూతి లపై గ్రంధాలు రాశాడు
శాసన పరిశోధనకు మిరాశీ వందలాది బహుమతులు పురస్కారాలు అందుకున్నాడు . 941 లో వైస్రాయ్ లార్డ్ లైన్ లిత్ గో ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదు ప్రదానం చేశాడు . 966 లో భారత రాష్ట్ర పతి శ్రీ రాధా కృష్ణన్ సంస్కృత సేవకు సర్టిఫికెట్ అందజేశారు . 1970 లో భారత ప్రభుత్వ ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ ఆనరరీ కరెస్పాండెంట్ అయ్యాడు .సాగర్ నాగపూర్ యూనివర్సిటీలు డిలిట్ ఇచ్చాయి . 951 లో న్యూయిస్కాటిక్ సొసైటీ కి జనరల్ ప్రెసిడెంట్ అయి ,ఫెలో షిప్ పొంది ,ఆలిండియా ఓరియంటల్ కాంగ్రెస్ ,ఇండియన్ హిస్టారికాంగ్రెస్ ప్రెసిడెంట్ అయి ,1973 లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అందుకొన్నాడు . 975 లో భారత ప్రభుత్వం మిరాశీ సేవలకు ‘’పద్మ భూషణ్ ‘’పురస్కారమందించి గౌరవించింది 3.-4-1985 న వాసుదేవ విష్ణు మిరాశీ 92 వ ఏట విష్ణు సాయుజ్యం పొందాడు ..
256-భారతీయ సౌందర్య శాస్త్రానికి వన్నెలు తీర్చిన –కాంతి చంద్ర పాండే (1920
అభినవ గుప్తుని రచనానువాదం చేసిన కాంతి చంద్ర పాండే భారతీయ సౌందర్య శాస్త్రానికి వన్నె చిన్నెలు తీర్చిదిద్దాడు .మూల అలంకార శాస్త్రాలపై కొత్త వెలుగులు కుమ్మరించాడు .వాటిలోని సారాంశాలను మజ్జిగ చిలికి వెన్న తీసిచేతిలోపెట్టినట్లు గా ఆంగ్లం లో రాశాడు .ఇవి పాస్చాత్య సౌందర్య శాస్త్రాలను ,భారతీయ సౌందర్య శాస్త్రాలను తులనాత్మకంగా పరిశీలించటానికి విస్తృతంగా తోడ్పడ్డాయి . ఈయన రచనలు -హిస్టారికల్ అండ్ ఫిలసాఫికల్ స్టడీ ఆఫ్ అభినవ గుప్త ,అవుట్ లైన్ హిస్టరీ ఆఫ్ శైవ ఫిలాసఫీ ,కంపా రేటివ్ ఏస్థెటిక్స్
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -21-6-17 -కాంప్-షార్లెట్-అమెరికా