గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
281-వసంతోత్సవం మహా కావ్య కర్త -హాలాధర మిశ్ర (1623-1647)
ఒరిస్సా ఖుర్దా సంస్థాన రాజు గజపతి నరసింహ దేవకాలం లో హలధర మిశ్ర గొప్ప సంస్కృత కవి గా గుర్తింపబడ్డాడు ఈయన ‘’వసంతోత్సవ మహాకావ్యం ‘’’’సంగీత కల్పలత ‘’గ్రంధాలు రాశాడు .వసంతోత్సవకావ్యం 22 కాండాలతో వైశాఖ శుద్ధ విదియ నాడు రాజు నరసింహ దేవప్రారంభించిన పూరీ జగన్నాధ రధోత్సవ వర్ణన ఉన్నకావ్యం . కావ్య ప్రారంభం లో గజపతి వంశ సంస్థాపక రాజు గజపతి రామ చంద్ర దేవుని నుంచి ప్రస్తుత రాజు నరసింహ దేవ వరకు వంశ చరిత్ర చెప్పాడూకవి .ఇదికాక ‘’హలధర కారిక ‘’వ్యాకరణ గ్రంధం రాశాడు ,సద్బ్రాహ్మణ వంశం లో శంభుకార మిశ్రాకు కొడుకు , కృష్ణదాసు కవితో పోటీగా సంగీత కల్ప లత సంగీత గ్రంధం కూడా రాశాడు .దీనిలో 17 స్తభకాలున్నాయి ,ఈయన రాసిన మరొక గ్రంధం ‘’హలధర ప్రకాశం ‘’లో వాననగర హరిచందన ,,హీనంగ భీమా,మదుపుర నరేంద్ర , అనంగ భ్రమర్దర్ ,గజపతి ముకుంద ,గజపతి రామ చంద్ర దేవ్ గజపతి ప్రతాపరుద్ర దేవ,మేనకాదీ కానల పఠమహాదీ అనే కొందరు కొత్తకవులను పేర్కొన్నాడు .
282-హరినాయక రత్నమాల కర్త -హరినాయక
హరినాయక రత్నమాల ,విషన్ ప్రకాశ ప్రబంధ కర్త హరినాయక ఒరిస్సా సంస్కృతకవులలో మేలైనవాడు .గజపతి నారాయణ దేవుని సంగీత నారాయణ లో 17 సార్లు ఈ కవిని ఉటంకించాడు కనుక హరినాయక ఆ నాటి ఒరిస్సా ప్రముఖ సంగీత కర్తలలో ఒకడని భావించాలి .
283-సంగీత నారాయణ కర్త -గజపతి నారాయణ దేవ(1650)
17 వ శతాబ్ది ఒరిస్సా నేలిన పార్ల క్షేముండి రాజ వంశానికి చెందిన ప్రఖ్యాత మహారాజు గజపతి నారాయణ దేవ చిరస్మరణీయమైన సంగీత గ్రంధం ‘’సంగీత నారాయణ ‘’రచించాడు దీనికి ఒరిస్సాలోని కాక ఆంద్ర ,బెంగాల్ కర్నాటకాది రాష్ట్రాలలో కూడా బాగా ప్రాచుర్యం ఉంది .ఈ రాజు ‘’అలంకార చంద్రిక ‘’కూడా రాశాడు .సంగీత నారాయణ లో భారతీయ సంగీత నాటక పిత ప్రసిద్ధ ఆలంకారికులైన భరత ముని ని ప్రస్తుతించి మిగిలిన అలంకారికులనూ మెచ్చుకున్నాడు .ఇతని తండ్రి పద్మనాభ దేవ.
284-యానక భాగవత మహాకావ్య కర్త -కవితారత్న పురుషోత్తమ మిశ్రా (1606-1680 )
నారాయణ గజపతి గురువు కవితారత్న పురుషోత్తమ మిశ్రా శాండిల్య గోత్రీకుడు ‘’యానక భాగవత మహా కావ్యం రచించాడు . నీలాద్రి శతకం ,సుబంత, ప్రదీపిక,అనర్ఘ రాఘవ నాటక టీకా ,రామచంద్ర ప్రబంధం ,తాళ శనిగ్రహం వంటి రచనలెన్నో చేశాడు . 1606 జన్మించి 1680 లో చనిపోయాడు .
285-మనోహారిణి టీక కర్త – కవిరత్న నారాయణ మిశ్ర
మహా మేధావి .కావ్యనాటక అలంకార సంగీత నిధి కవితారత్ననారాయణ మిశ్ర కవితారత్న పురుషోత్తమ మిశ్ర కుమారుడే .హరీశ దూతకు మనోహారిణి టీకారాశాడు .ఇదే ఆగ్రంధానికి మొట్టమొదటి టీకా .దీనికి ఒరిస్సా బెంగాల్ లలో మంచి గిరాకీ ఉంది .సంగీత నారాయణ కర్త నారాయణ మిశ్ర అని ,కానీ రాజు గజపతి నారాయణ దేవుని పేరు పెట్టాడని లోకం లో ప్రచారం ఉంది
286-గంగ వంశాను చరిత కర్త -వాసుదేవ రధ్ సోమజతి (1761-1770
వాసుదేవ రధ్ సోమజతి గంగ వంశాను చరితం కావ్యాన్ని 1771-1770 మధ్య రాశాడు .దీనికి చారిత్రిక ,సాహిత్య ప్రశస్తి లభించింది .ఇది కళింగ గంగుల రాజుల చరిత్ర
287 -లీలా కావ్యాల విజృంభణ (17 వ శతాబ్దం )
17 వ శతాబ్దం లో ఒరిస్సాలో లీలాకావ్యాలు మూడు పూలు ఆరుకాయలు లాగా వర్ధిల్లాయి .అన్నీ మృదుమధుర రసబంధురాలే . దాదాపు అన్నీ రాధా కృష్ణ లీలా విలాసాలే .అగ్నిచ్చిద పండితుడు శ్రీకృష్ణ లీలామృతం ,నిత్యానంద ముకుంద విలాస ,రఘోత్తమ తీర్ధ ,హరే కృష్ణ కవిరాజ్ రాధా విలాసం రాశారు .కౌండిన్య గోత్రీకుడైన నిత్యానందుడు శివ పార్వతి లీలావిలాసం కూడా రాశాడు .నవ దుర్గ రాజ్య పాలకుడు గదాధర మాంధాత ప్రాపు ఉన్నకవి .ఈ రాజు లాడుకేశ్వర శివ భక్తుడు .ఇతని శ్రీ కృష్ణ లీలామృతం గీత గోవిందానికి అనుకరణ 8 సర్గలున్నకావ్యం .ఖండవల్లి రాజు వనమాలి జగదేవ్ ఆస్థానం లో ఉండగా రాశాడు .గదాధర ,వనమాలీ రాజులిద్దరూ 18 శతాబ్ది ప్రారంభకాలం వారు .
288- మణి మాల నాటక కర్త – ఆదికవి (1713
.గొప్ప నాటకకర్తగా వనమాలి కి పేరుంది . ‘’హరి భక్తి సుధాకర రూపకం ‘’కర్త ,దీన బంధు మిశ్ర ,, రసగోష్ఠి రూపకకర్త అనాదికవి ఒరిస్సాలోని ఖండవల్లి రాజు వనమాలి ఆస్థాన కవులే .వనమాలి రాసిన మణిమాల నాటకం లో ని 51 వ అంకం లో బోయి వంశరాజు ఖుర్దా పాలకుడు గజపతి వీరకేసరి దేవగురించి ఉంది .అనాదికవి 18 శతాబ్ది పూర్వార్ధం వాడు .యితడు భారద్వాజ గోత్రీకుడని తండ్రి ముదిత మాధవ గీతికావ్యకర్త శతంజీవ అని మణిమాల నాటక ఉపోద్ఘాతం లో ఉంది .
289-సమృద్ధ మాధవ నాటక కర్త -కవి భూషణ గోవిందసమంతరాయ్ (1750
ఒరిస్సాలోని బంకిరాష్ట్ర ఖుర్దా రాజ్య పాలకుడు వీర కిషోర్ దేవ్ ఆస్థానకవి కవిభూషణ గోవిందాసమంతరాయ్ 18 శతాబ్దం వాడు .గౌడీయ వైష్ణవ మత అనుయాయి .’’సమృద్ధ మాధవ నాటకం ‘’గీత గోవిందం మాదిరిగా ,రూప గోస్వామి నాటకం విదగ్ధా మాధవానికి అనుకరణగా రాశాడు .గొప్ప సంస్కృత విద్వా0సు డైన ఈకవి మరెన్నో రచనలు చేసి ఉంటాడు .కానీ సూరి సర్వస్వము వీర సర్వస్వము అనే మరి రెండుగ్రంధాలు మాత్రమే లభ్యమైనాయి
290-వ్రజ విలాస కర్త -కవి చంద్ర కమల లోచన ఖడ్గ రాయ్ (19 శతాబ్దం
వ్రజ విలాస కర్త -కవి చంద్ర కమల లోచన ఖడ్గ రాయ్ ,కవి భూషణ గోవింద సమంతరాయ్ మనవడు .సంగీత చింతామణి రాశాడు . గీత ముకుందం ను గీత గోవిందానికి అనుకరణగా రాశాడు .ఇవికాక వ్రజ యువ విలాస ,భగవత్ లీలా విలాసం రాశాడు .వ్రజ విలాసం 17 సర్గల కావ్యం .రాధా గోపిక కృష్ణుల లీలా విలాసమే ఇది .ఖుర్దా రోడ్ సంస్థానకవి .నాగపూర్ రాజు భోంస్లే ఆశ్రితుడుకూడా .లీలా చింతామణి వ్రాతప్రతిని మహా మహోపాధ్యాయ సదాశివ మిశ్ర అనే ప్రముఖ సంస్కృత పండితుడు పూరీ లో గుర్తించి వెలికి తీసి ముద్రించాడు . 1500 శ్లోకాల గ్రంధం . భాగవతానికి వ్యాఖ్యానమే .కవి భారద్వాజ గోత్రీకుడైన ఒరియా బ్రాహ్మణుడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-6-17-కాంప్-షార్లెట్ -అమెరికా
—