గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
301-ఒరిస్సాలో గజపతుల కాలం లో వర్ధిల్లిన గీర్వాణం (1435-1568)
ఒరిస్సాలో సూర్య వంశ గజపతి చక్రవర్తుల కాలం1435-1466 వరకు పాలించిన కపిలేంద్ర దేవ చక్రవర్తి తో ప్రారంభమై 1497-1535 వరకు పాలన చేసిన గజపతి ప్రతాపరుద్ర దేవ వరకు ఉన్నా ,1559-1568వారివరకు పాలన చేసిన మొదటి ముకుంద దేవ్ వరకు కొనసాగింది .ఈ కాలం లోనే దేశం లోను ఒరిస్సా లో కూడా సాంస్కృతిక జాతీయ ఉద్యమం నడిచింది .సంస్కృత ఒరియా భాషలలో సాంఘిక ,మత సంబంధ గ్రంథాలెన్నో వెలువడ్డాయి .పుణ్య క్షేత్రాల ,అందులోని దేవీ దేవతల మహాత్మ్యాలతో ,పౌరాణిక సాహిత్యం తో గ్రంధాలు వచ్చాయి .అలంటి వాటిలో పురుషోత్తమ మహాత్మ్యం ,కపిల సంహిత ,నీలాద్రి మహోదయం ,ఏకామ్ర పురాణం ,ఏకామ్ర చంద్రిక ,ప్రాచీ మహాత్మ్యం ,విరాజ మహాత్మ్యం ముఖ్యమైనవి .ఈ కాలపు చక్రవర్తులు కేవలం పాలకులేకాక మహా కవులు కూడా. కవి పోషణ చేసినవారే .కావ్యాలు రాశారు రాయించి కృతికర్తలు భర్తలూ అయ్యారు .
గజపతి కపిలేంద్ర దేవ చక్రవర్తి గొప్ప నాయకుడేకాదు మంచి కవిపోషకుడుకూడా . స్వయం గా ‘’పరశురామ వ్యాయోగం ‘’అనే ఉప రూపకం రాశాడు .మొదటి అయిదు శ్లోకాలలో విష్ణు జగన్నాధ రుక్మిణి శ్రీకృష్ణ శివులను స్తుతించాడు .తరువాత శ్లోకాలలో తాను పరశురాముని అవతారంగా చెప్పుకున్నాడు .దీన్ని 1458 కి పూర్వం జగన్నాధ స్వామి ఉత్సవాలలో ప్రదర్శించేవారు .ఇందులో చక్రవర్తికి ఉన్న పరమత సహనం కూడా దృశ్యమానమవుతుంది .
కపిలేంద్రుని ఆస్థాన న్యాయాధిపతి నరసింగ మిశ్ర వాజ్ పేయి శంకరాచార్యుల అద్వైతమతానికి పునర్వైభవం తెచ్చి జగద్గురు శంకరాచార్యుల ‘’సంక్షేప శరీర ‘’గ్రంధానికి సంక్షేప శారీరిక వార్తిక ‘’రచించాడు . ఈ కవి కాశీ లో కొంతకాలముండి ‘’కాశీ మీమాంస ‘’రాశాడు కానీ అలభ్యం ఈయన మనవడు మృత్యుంజయ రాసిన శాస్త్ర గ్రంధం ‘’శుద్ధి ముక్తావళి ‘’దొరికింది .ఇతని తండ్రి జలేశ్వరుడు వేదం లో చెప్పబడిన హోమాది క్రియలపై ‘’జలేశ్వర పధ్ధతి ‘’రాశాడు .
1450 వాడైనకాళిదాస చయని కవి ప్రసిద్ధమైన శాస్త్ర గ్రంధం ‘’శుద్ధి చంద్రిక ‘’రాశాడు .ఇందులో శార్దూల విక్రీడితం లో రాసిన 25 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి .మృతుని శరీర శుద్ధి కోసం చేయాల్సిన విధులు చెప్పబడ్డాయి ‘
302-ముక్తి చింతామణి కర్త -గజపతి పురుషోత్తమ దేవ చక్రవర్తి (1466
గజపతి కపిలేంద్ర దేవుని కుమారుడు గజపతి పురుషోత్తమ దేవ చక్రవర్తి గొప్ప పోరాట యోధుడేకాక మహా కవి కూడా .ముక్తి చింతామణి ,గోపాలార్చన,విధి ,నామమాలిక ,దుర్గోత్సవ ,భువనేశ్వరి పూజా పల్లవ రాశాడు .ఇందులో ముక్తి చింతామణి 6 ప్రకారణాలున్న స్మృతి గ్రంధం దీనికి ఆధారం పురాణ ,తంత్ర శాస్త్రాలలో విషయాలే .రచనాకాలం 22-2-1767 .ఇందులో 15 వ శతాబ్దికి ముందున్న పూర్వపు పురాణ తాంత్రిక గ్రంధాలనన్నిటినీ పేర్కొన్నాడు .గోపాలాచార్చన విధిని నీలాద్రి మహోదయం అని అంటారు .పూజా విధి గోపాల పూజా విధి లలో జగన్నాధ స్వామి పూజా విధానాన్ని వివరించాడు .జగన్నాధుడు గోపాలకృష్ణుడే అని నిర్ధారించాడు .ఇవి ఒరిస్సా చరిత్రలో మైలు రాళ్లుగా నిలిచాయి .దుర్గోత్సవం అనేది ఇంకా అలభ్యమే .భువనేశ్వరి పూజా పల్లవం మాత్రం శాక్తేయం లోని తంత్ర శాస్త్రం .ఇందులో ఉన్నదాని ప్రకారం పురుషోత్తమదేవుడు తండ్రి కపిలేశ్వర దేవ కృష్ణా జిల్లా కొండపల్లి లో 1466 లో చనిపోయాక రాజ్యానికి చక్రవర్తి అయినట్లు తెలుస్తోంది .అప్పటికి ఇతను మైనర్ ,పెద్దకొడుకు కూడా కాదు .దురదృష్టవశాత్తు ఈ గ్రంధం అనేక కారణాలవలన ప్రచురితం కాలేదు .పురుషోత్తముడే రాసిన ‘’అభినవ వేణీ సంహారనాటకం ;;కూడా ముద్రణ పొందలేదు .
303-బలభద్ర సంగ్రహ కర్త -రాజగురు బలభద్ర మిశ్ర (1466
గజపతి పురుషోత్తమ దేవ చక్రవర్తి ఆస్థాన రాజగురువు బలభద్ర మిశ్ర నరసింగ మిశ్ర కుమారుడు .భట్ట తంత్రాలలో నిధి .అద్భుతమైన 3 స్మృతులు రాశాడు .ఇవే అద్వైత చింతామణి ,శారీరక సార-పురుషోత్తమ స్మ్రుతి ,బలభద్ర సంగ్రహం .బలభద్ర సంగ్రహం తరువాత కవుల చేత విస్తృతంగా పేర్కొన బడింది
304-ప్రౌఢ ప్రతాప మార్తాండ కర్త -గజపతి ప్రతాప రుద్రదేవ1497-1535)
గజపతి పురుషోత్తమ దేవుని కుమారుడు గజపతి ప్రతాప రుద్ర దేవ్ కళా సంస్కృతులను బహువిధాల వర్ధిల్ల జేసినవాడు .ఎందరో సంస్కృత కవులకు విద్యా వేత్తలకు ఆశ్రయమిచ్చి కావ్య రచన చేయించినవాడేకాక తానూ గొప్పకవే .సరస్వతి విలాసం ‘’అనే గ్రంధాన్ని రాశాడు ఇదికాక ప్రతాప మార్తాండ లేక ప్రౌఢ ప్రతాప మార్తాండ ,నిర్ణయం సంగ్రహం ,కౌతుక చింతామణి కర్త కూడా .వీటిలో రెండవది కాశీకి చెందిన రామ కృష్ణ భట్టు సమకూర్చిన గ్రంధం ఈకవి ఈ రాజు ఆస్థానకవి -పండిత శిరోమణి బిరుదాంకితుడు కూడా . ఈ బిరుదును ప్రతాప మార్తాండం ను పరిశీలించి మెచ్చి రాజగురువు బలభద్ర మిశ్ర అందజేశాడు . 5ఉల్లాసాల సరస్వతి విలాసాన్ని ఆంధ్ర దేశ పండితకవి ప్రతాపరుద్రుని ఆస్థానకవి లక్ష్మీధర పండితుడు సేకరించిన గ్రంధం . ప్రకాశాలతో ఉన్న ప్రౌఢ ప్రతాప మార్తాండం ధర్మ శాస్త్ర రచన .మాధవ భట్టు కుమారుడు రామకృష్ణ భట్టు సేకరణ ఇది రాజుగారిపేర చలామణి చేశాడు .కౌతుక చింతామణి 5 దీప్తులతో ఉన్న చిత్ర బంధ ,చేతబడులు కావ్యం 1520 రచన .నిర్ణయం సంగ్రహం ఇంకా దొరకలేదు .
305-హరి హర చతురంగ యుద్ధ తంత్ర కర్త -రాజగురు గోదావరశర్మ (1515
బలభద్ర మిశ్ర కుమారుడు రాజగురు గోదావర శర్మ ,గజపతి ప్రతాప రుద్రా దేవ చక్రవర్తి ఆస్థాన గురువు , మంత్రి . మిశ్ర తండ్రిలాగానే గొప్ప తంత్ర శాస్త్ర పండితకవి .గోదావర వర్ధన,కవి పుంగవ ,పండిత రాజ బిరుదులున్నవాడు ,జయ చింతామణి ,ఆచార చింతామణి కర్త .యుద్ధ తంత్రం పై ‘’హరిహర చతురంగ ‘’గ్రంధం రాశాడు .దీని ఆధారంగా ఈ కవి ‘’అద్వైత దర్పణం ,అధికార దర్పణం ,నీతి చింతామణి ,ఆచార చింతామణి ,నీతి కల్పలత మొదలైన గ్రంధాలు కూడా రాసినట్లు తెలుస్తోంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-17-కాంప్-షార్లెట్-అమెరికా
—