గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
306-భక్తి వైభవ మహా కావ్య కర్త -కవి డిండిమ జీవ దేవాచార్య (!475
1475 కు చెందిన కవి డిండిమ దేవాచార్య రాజగురు త్రిలోచన రత్నావళి కుమారుడు .ఒరిస్సా గజపతి ప్రతాప రుద్ర దేవ చక్రవర్తి సైన్యాధ్యక్షుడే కాక ,రాజగురువు ,సంస్కృత విద్యావేత్త మహాకవి .భాగవత దశమస్కంధం ఆధారంగా ‘’భక్తి భాగవత మహా కావ్యం ‘’రాశాడు .ఇది 32 కాండల లో 3 వేల శ్లో కాల కావ్యం . ఛందో వైవిధ్యం పాటించాడు .తన కృష్ణ భక్తి కి నిదర్శనం గ 9 అంకాల ‘’భక్తి వైభవ నాటకం ‘’రాశాడు .దీన్ని జగన్నాధ స్వామి డోలా యాత్ర సందర్భంగా రాశాడు .మహా భారత కథ ఆధారంగా ఉత్సాహ వతి అనే చిన్ననాటకాన్ని రాశాడు . ఈ రూపకాన్ని జగన్నాధ స్వామి శిలాస్తంభ మందిరం లో వసంతకాలోత్సవాలలో ప్రదర్శించేవారు .తన విద్వత్తుకు గుర్తుగా కవి డిండిమ ,కవిరాజ ,శ్రీమద్భాగవత ,పరమాచార్య వంటి సార్ధక బిరుదులూ పొందాడు .
ఈ కవి రాసిన భక్తి వైభవ నాటక కవిత్వ వైభవాన్ని మెచ్చుకొన్న ప్రతాపరుద్ర గజపతి కవికి 8 బంగారు వింజామరలతో ,ఒక బంగారు గొడుగు తో ఘనమైన సత్కారం చేసి నభూతో అనిపించాడు . 307- భారతామృత మహా కావ్యకర్త -కవి చంద్రాచార్య దివాకర మిశ్ర (1464
కవి చంద్రాచార్య దివాకర మిశ్ర వైద్యేశ్వర ,ముక్తాదేవి కుమారుడు .భారత దేశం లోనే వ్రేళ్ళ మీద లెక్కింపదగిన సంస్కృత విద్వా0సు లలో ఒకడు గా గుర్తింపు పొందాడు .షట్ దర్శనాలపై షట్ శాస్త్రాలపై సాధికారమున్న మహా మేధావి పండిత విద్వాంసుడైన కవి .అనాది మిశ్ర రాసిన ‘’మణిమాల ‘’నాటిక ను చదివితే ఈ కవి వారసులు ముకుంద మిశ్ర ,శత0జీవ మిశ్ర అనాది మిశ్ర అందరూ మహా కవులే శాస్త్ర వేత్తలే నని తెలుస్తుంది .దివాకర మిశ్ర 9 అద్భుత రచనలు చేశాడు .
మహా భారతం ఆధారంగా ‘’భారతామృత మహా కావ్యం ‘’రాశాడు కానీ అందులో 40 వ కాండం లోని 93 శ్లోకాల వరకే దక్కాయి .శల్యవధ అసంపూర్తిగా ఆగిపోయింది . కనుక కావ్యం 48 లేక 50 కాండాల గ్రంధం అని పిస్తుంది .దొరికిన వ్రాతప్రతిలో 3338 శ్లోకాలు వివిధ ఛందస్సులలో కనిపిస్తాయి .శ్రీహర్షుడు నైషధ చరిత్రలో తన వంశావళి గురించి చెప్పుకున్నట్లు ఈ కవి కూడా తన చరిత్రను పొందు పరచాడు . ఇతని రెండవ రచన ‘’లక్షణాదర్శ మహాకావ్యం ‘’భట్టికవి రచనపోలి ఉంటుంది . 4 కాండాలు మాత్రమే లభించాయి .భారతం లోని పాండవ చరిత్ర ఇది .అభినవ గెట గోవిందం కూడా ఈకవి రచనే కానీ గజపతి పురుషోత్తమ దేవుని పేరా చెలామణి లో ఉంది .ఈకవి శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానం లో కూడా ఉన్నాడు.
308-శ్రీ కృష్ణ భక్తి కల్పలత ఫల కర్త -జగన్నాధ దాసు (1491-1550 .),
భగ బంధ దాస ,పద్మావతిలా కుమారుడు జగన్నాధ దాసు సంస్కృత ఒరియా భాషలలో మహా పాండిత్యమున్నవాడు ఆయన ఒ రియాలో రాసిన ‘’భాగవతం ;ఒరిస్సా ప్రజలందరి ఇంటి పారాయణ గ్రంథమైంది .సంస్కృతం లో 8 ,ఒరియాలో 12 రచనలు చేశాడు . అందులో సంస్కృతం లో రాసిన నీలాద్రి శతకం ,ఉపాసన శతకం శ్రీకృష్ణ భక్తికల్ప లతా ఫలం ,నిత్యా గుప్త చూడామణి బాగా ప్రసిద్ధమైనాయి
309-ప్రాయశ్చిత్త మనోహర కర్త -మురారి మిశ్ర (1550 )
కహ్ను మిశ్ర కుమారుడు మురారి మిశ్ర గొప్ప సంస్కృత ,శాస్త్ర నిధి .ధర్మ శాస్త్రం గా ‘’ప్రాయశ్చిత్త మనోహరం ‘’రాశాడు .ఇది బాగా ప్రచారం లో ఉంది .
310-దశగ్రీవ వద్ద మహా కావ్య కర్త -కవీంద్ర మార్కండేయ మిశ్ర ( (1497-1535 .
మంగళ దేవ కుమారుడు మార్కండేయ మిశ్ర ప్రతాపరుద్రుని సమకాలికుడు .20 కాండల దశగ్రీవ వధ మహాకావ్యం 1500 లో రాశాడు .ప్రాకృత సర్వస్వము 1565 లో రాశాడు .మహాకావ్యం ఉపోద్ఘాతం లో తనను కవి రాజా చక్రవర్తి అంటారని చెప్పుకొన్నాడు .సర్వస్వము లో మాత్రం కవీంద్రునిగా మాత్రమే చెప్పుకొన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-17- కాంప్-షార్లెట్-అమెరికా
—