గీర్వాణకవుల కవితాగీర్వాణం -3
322-ఆధునిక అస్సామ్ లో సంస్కృత రచనా వ్యాసంగం
అస్సాం సంస్కృత బోర్డు ముఖ్యమైన కొన్ని ప్రాచీన గ్రంధాలను పునర్ముద్రించింది కొత్తవాటిని ప్రచురించింది .ప్రయోగ రత్నమాల వ్యాకరణం ,దాని వ్యాఖ్యానంతో పునర్ముద్రించింది .కావ్యాదర్శను టీకా తాత్పర్యాలతో ముద్రించింది .ప్రాచ్య భారతి సంస్కృత పత్రికను ఆరునెలలకోసారి ప్రచురిస్తోంది .డా విశ్వనారాయణ శాస్త్రి సంపాదకత్వం లో యోగినీ తంత్ర ,కామాఖ్యా తంత్ర ల ను ఇంగ్లిష్ ఉపోద్ఘాతం తో ,కాళికాపురాణం ను ఆంగ్లానువాదం ఉపోద్ఘాతం తోను వెలువడ్డాయి .గౌహతి యుని వర్సిటీ సంస్కృత శాఖ తరచుగా పురాణాలు తంత్రాలపై సెమినార్లు నిర్వహించి పరిశోధనా పత్రాలను ముద్రిస్తోంది .సంస్కృత సాహిత్యం ఫిలాసఫీ దర్శనాలపై చాలామంది పరిశోధనలు చేసి పిహెచ్ డి పొందుతున్నారు .డా ఏం ఏం శర్మ సంపాదకత్వం లో సంస్కృత -అస్సామీ నిఘంటు నిర్మాణం కొనసాగుతోంది . విశ్వవాణి పరిషత్ లోనిరీసెర్చ్ విభాగం ‘16-17 శతాబ్దపు ‘’తీర్ధ కౌముది ‘’ని సమగ్రంగా ప్రచురించింది .అసోం వేదం విద్యాలయం యజుర్వేదాన్ని అస్సామీ అనువాదంతో ప్రచురించింది .సంస్కృత విద్యావేత్తలుగా గౌరవ పురస్కారాలు అందుకొన్నవారిలో ప్రొఫెసర్ రజినీకాంత దేవా శర్మ ,ఆచార్య మనోరంజన్ శాస్త్రి ,డా బిశ్వనారాయణ శాస్త్రి వంటి ప్రముఖులున్నారు .
ఆధునికకాలం లో కూడా అస్సాం సంస్కృతకవులుకావ్యాలు , ఖండకావ్యాలు ,స్తోత్రాలు ,ప్రశస్తులు ,నాటకాలు కల్పనా సాహిత్యం సృష్టిస్తూనే ఉన్నారు .అస్సామీ భాషా గ్రంధాలను సంస్కృతం లోకి అనువదిస్తూనే ఉన్నారు
323-జయమతి ఖండకావ్య కర్త -పండిత భావ దేవ భగవతి
పండిత భావ దేవ భగవతి జయమతి అనే ఖండ కావ్యం రాశాడు .పేరుకు ఇదిఖండకావ్యమేకాని చారిత్రాత్మక కావ్యం .భర్త ప్రాణాలను రక్షించటం కోసం భార్య భగవతి నరరూప రాక్షసుడైన రాజు చేత చిత్ర హింసలుపడి ప్రాణాలు కోల్పోయిన చారిత్రిక కథ
ఆశుకవిగా ప్రసిద్ధుడైన మహా మహోపాధ్యాయ ధీరేశ్శ్వరాచార్య తాను రాసిన సంస్కృత శ్లోకాలను ‘’వృత్తమంజరి ‘’అనే సంపుటిగా ప్రచురించాడు
324-భక్తి వివేకం పై వ్యాఖ్య రాసిన -పండిట్ జీవేశ్వర గోస్వామి
17 వ శతాబ్దం లో భక్తిపై వైకుంఠ నాథ భట్టాచార్య సమగ్రంగా రాసిన ‘’భక్తి వివేకం ‘’పై సమగ్ర వ్యాఖ్యానాన్ని పండిత జీవేశ్వర గోస్వామి రాశాడు .
325-శాక్త దర్శన కర్త -పండిత చక్నేశ్వర భట్టాచార్య
పండిట్ చక్ణేశ్వర భట్టాచార్య ‘’శాక్త దర్శన0 ‘’రాశాడు .శక్తి ఆరాధనే సర్వ శ్రేష్టం అని ఇందులో తెలియజేశాడు
326-పతాకామ్నాయ కర్త -ఆచార్య మనోరంజన్ శాస్త్రి
ఆచార్య మనోరంజన్ శాస్త్రి పతాకామ్న్యాయం రచించాడు దీనితోపాటు భారత జాతీయ పతాకం పై సంస్కృతం లో వ్యాఖ్యానం రాశాడు .ప్రకామ కామ రూపం ‘’ అనే ఖండకావ్యాన్ని ప్రాచీన అస్సామ్ కు పేరైన కామరూప వైభవాన్ని రచించాడు .అకాలపు చారిత్రాత్మక సంఘటనలను కవితాత్మకంగా వర్ణించాడు .ఉత్తాంక భాష్యం ‘’అనే నాటిక కూడా రాశాడు
327-శ్రీకృష్ణ లీల కావ్య కర్త -పండిట్ వైకుంఠ నాథ చక్రవర్తి
పండిత వైకుంఠ నాథ చక్రవర్తి శ్రీ కృష్ణునిపై శ్రీ కృష్ణలీలలు సంస్కృతం లో రాశాడు .
328-అవినాశి నవలాకారుడు-డా.విశ్వనారాయణ శాస్త్రి –
డా విశ్వనారాయణ శాస్త్రి ‘’అవినాశి ‘’అనే చారిత్రాత్మక నవల రాశాడు .ఈ కథ 7 వశతాబ్దిలో భాస్కర వర్మ కు దేవదాశీ కి మధ్యజరిగిన ప్రేమకథ .చివరికి భాస్కర వర్మకు హర్ష వర్ధనునికి స్నేహం కుదురుతుంది ఈనవలకు సాహిత్య అకాడెమి భారతీయ భాషా పరిషత్ ,ఉత్తర ప్రదేశ్ సంస్కృత అకాడెమీలు పురస్కారాలను అందజేశాయి . ఈకవి రచించిన చిన్నకథలు ,కథలూ ‘’హృదయ సంవాద చయనం ‘’సంపుటిగా వచ్చింది
329-వ్యంజనా ప్రపంచ సమీక్ష కర్త -డా.ముకుంద మాధవ శర్మ
డా ముకుంద మాధవ శర్మఅనే ప్రముఖ సంస్కృత కవి విమర్శకుడు ,సంగీతకారుడు
‘’వ్యంజనా ప్రపంచ సమీక్ష ‘’ను డి లిట్ పరిశోధనా గ్రంథం గా వెలువరించాడు
330- బౌద్ధ వేదాంత పరిశోధనకర్త -డా కాళీ ప్రసాద్ సిన్హా
డా కాళీ ప్రసాద్ సిన్హా బౌద్ధ తత్త్వం పై గొప్ప పరిశోధన చేసి రచన చేశాడు
కొన్ని ప్రాంతీయ రచనలుకూడా సంస్కృతం లోకి తర్జుమా అయ్యాయి .రవీంద్రుని గీతాంజలి ని కామినీ కుమార అధికారి సంస్కృతం లోకి అనువదించాడు .ఆచార్య మనోరంజనశాస్త్రి కేతకీ కావ్యాన్ని రఘునాథ చౌదరి ,,నవమల్లిక ను పండిట్ బిపిన్ చంద్ర గోస్వామి సంస్కృతంలోకి అనువాదం చేశారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-6-17 -కాంప్-షార్లెట్-అమెరికా ,